Home Features తొలి వ్యాక్సిన్ కనిపెట్టి 2 శతాబ్దాలు దాటింది, అదెలా జరిగిందో తెలుసా?

తొలి వ్యాక్సిన్ కనిపెట్టి 2 శతాబ్దాలు దాటింది, అదెలా జరిగిందో తెలుసా?

780
0
Edward Jenner( Pic credits: researchgate.net
ప్రపంచదేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు పరుగుతీస్తున్నాయి. వ్యాక్సిన్ వస్తే కరోనానుంచి ప్రపంచానికి విముక్తి లేదు. మందులతో కరోనాను నయం చేసిన మనచుట్టూరు కరోనా వైరస్ తిరుగుతూనే ఉంటుంది. అవకాశంవచ్చిని పుడు దాడి చేస్తూనే ఉంటుంది. అందువల్ల వ్యాక్సిన్ కొనుగొని యూనివర్సల్ వ్యాక్సినేషన్ ద్వారా మనుషులందరికి వ్యాక్సిన్ ఇచ్చాక ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) “కరోనాను తరిమేశాం” అని చెప్పేదాకా కరోనా ఎపుడూ ఎక్కడో ఒకచోట దాడిచేస్తూనే ఉంటుంది. ప్రాణాలు హరిస్తూనే ఉంటుంది. అందుకే వ్యాక్సిన్ కోసం అంతో ఇంతో సాంకేతింగా అభివృద్ధి చెందిన దేశాల్నీ రేయింబగళ్లు కష్టిస్తున్నాయి. ఇందులో హైదరాబాద్ కూడా చేరిందని మూడు రోజులు కిందట ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.
అయితే, ఇలాంటి వ్యాక్సిన్ చరిత్రలో మే నెలకు చాలా ప్రాముఖ్యం ఉంది. మొట్టమొదటి వ్యాక్సిన్ తయారయి రెండు శతాబ్దలయింది. 1796, మే 14న మొట్టమొదటి సారి వ్యాక్సిన్ ను మనిషికి ఎక్కించారు. ఈ వ్యాక్సిన్ ను తయారుచేసి ప్రయోగించిన డాక్టర్ పేరు ఎడ్వర్డ్ జెనెర్ (Edward Jenner). జనెర్ పుట్టింది మే 17,1749న.
ఆరోజుల్లో స్మాల్ పాక్స్ (మశూచి) అనేది ప్రమాదరకమయిన జబ్బు. ఈ జబ్బు వల్ల యూరోప్ లో యేటా నాలుగు లక్ష లమంది దాకా చనిపోయేవారు. ఎవరైనా బతికి బట్టకడితే అందులో మూడో వంత మందికి కళ్లు పోయేవి. ముఖంమీద  మానిన మశూచి మచ్చలు మాసిపోయేవి కాదు. శరీరమంతా స్పోటకపు పుండ్లతో ఈ రోగం కనిపించే ది కాబట్టి దీనిని speckled monster (పుండ్ల భూతం) అని పిలిచేవారు. లండన్ ఈ బబ్బుతోచనిపోయే వారు రోగుల్లో 80 శాతం ఉంటే బెర్లిన్ లో 98 శాతం దాకా ఉండేవారని రికార్డులు చెబుతున్నాయి.
Smallpox in India (1970s) (WHO picture)
మశూచి వచ్చినపుడు శరీరం మీద బొబ్బల్లాగా చిన్ని చిన్న పుండ్లు వస్తాయియ.  చిన్నపుండ్ల ని Small pokes (స్మాల్ పోక్స్) అని పిలిచే వారు. poke అంటే లోపల రసి ఉండి పైకి బొబ్బల్లా గ కనిపించే సంచి లాంటి మచ్చలు. అందువల్ ఈ జబ్బుని కూడా Small Pokes అని పిలిచే శారు. అందే Smallpox అయింది తర్వాత. ఈ Smallpox కి ముందు variola (వేరియోలా)అని పేరు ప్రచారంలో ఉండింది. ఈ పేరు పెట్టింది ఎపుడో క్రీ.శ 570ల నాటి స్విజర్లాండ్ కు చెందిన బిషప్ మేరియస్ ఎవెంకీస్. ఈ మాట గ్రీక్ నుంచి వచ్చింది. గ్రీక్ భాషలో వేరస్ (Varus) అంటే చర్మం మీది మచ్చ అని అర్థం.
ఒక సారి మశూచి వచ్చాక, వారి లో రోగ నిరోధక శక్తి పెరిగి రెండో సారి రాకపోవడం అనేది ఈ జబ్బు లక్షణం. మశూచి ఎక్కడ పుట్టిందో  ఎవరికి తెలియదు. దీనిని క్రీస్తుకు పూర్వమే గమనించారు. అయితే, ఈ జబ్బుకు రకరకాల వైద్యాలు చేసినా ఎపుడూ నయం కాలేదు. వ్యాక్సినేషన్ (vaccination) కనిపెట్టాకే ఈ జబ్బు ను అదుపు చేయడం సాధ్యమయింది.ఇప్పటి కరోనా సాంకేతికాభివృద్ధి వాణిజ్యం పెరుగడం వల్ల ప్రపంమంత వారాలలో వ్యాపించింది. క్రీస్తుకు పూర్వం నుంచి కూడా ప్రపంచదేశాల మధ్య వాణిజ్యం నడుస్తూ ఉండింది. నాగరికత వ్యాప్తి, సాాంకేతికాభివృద్ధి  వాణిజ్యం వ్యాప్తి కారణంగా మశూచి కూడా ప్రపంచంతా వ్యాపించింది.

ఈ స్ట్రోరీ మీ ఫ్రెండ్స్ కిీ నచ్చుతుందనుకుంటున్నారా? అయితే, షేర్ చేయండి

ఈ మాట inoculare (ఇనాక్యులేర్ ) అనే లాటిన్ మాట నుంచి వచ్చింది. రోగి పుళ్ల నుంచి సేకరించిన రసిని రోగం లేని వ్యక్తి చర్మంలోకి చొప్పించడమే ఇనాక్యులేషన్. టీకామందును,అంటే వ్యాక్సిన్ ను ఒక ముళ్ల బిళ్లు ఉన్న పొడవాటి కడ్డీతో చర్మం మీద గుచ్చి వైరస్ చర్మంలోకి పోయే లా చేసే వాళ్లు. ఈ పద్ధతినే ఇనాక్యులేషన్ viriolation అని కూడా పిలుస్తారు. 18 శతాబ్దం పూర్వార్ధంలో చాలా దేశాలలో ఈ పద్ధతి అమలులోకి వచ్చింది.
ఇది కనిపెట్టిన తర్వాత ఆఫ్రికాదేశాలతో పాటు ఇండియా, చైనాలలోనే ఎక్కువగా ఇచ్చారు. ఆ రోజుల్లో ఇది చాలా సంపన్నులకే అందుబాటులో ఉండేది. ఇది కొంతవరక మశూచి మరణాలను తగ్గించిన మశూచి పాండెమిక్ కాకుండా అడ్డుకోలేకపోయింది.  ఈ పద్దతిలో మశూచి పుండ్ల నుంచి ఒక కడ్డీ సాయంతో రసిని తీసి రోగంలోని వారికి ఎక్కిస్తే రోగం రాదనుకునే వారు. అయితే, ఇలా చేసినందువల్ల మశూచి వచ్చి ఇతరులకు వ్యాపించేది. అంతేకాదు, ఈ పద్ధతితో సిఫిలిస్ వంటి ప్రమాదరమయిన జబ్బులు కూడా వ్యాపించేవి. అందువల పాత ఇనాక్యులషన్ పద్ధతి ప్రమాదకమని తేలిసింది.ఇలాంటి మశూచికి నాటు వైద్యంసాగుతున్న రోజులలో ఎడ్వర్డ్ జెనెర్ రంగం మీద వచ్చారు.
ఎడ్వర్డ్ జెనెర్ రంగ ప్రవేశం
జెనెర్ తండ్రి రెవరెండ్ స్టీఫెన్ జెనెర్. చిన్నపుడు తల్లితండ్రులు చనిపోవడంతో ఆయన పెద్దన ఇంట్లో పెరిగాడు. స్కూల్లో ఉన్నపుడే ఆయనకు సైన్స్ మీద, ప్రకృతి మీద మక్కువ పెరిగింది. అందుకే 13వ యేటనే బ్రిస్టల్ లోని ఒక నాటువైద్యుడి దగ్గిర అసిస్టెంటు గా చేరారు. అక్కడ పనిచేస్తున్నపుడు ఆయన ఒక ఆసక్తికరమయిన విషయం ఒక పాలమ్మాయి  (milkmaid) చెప్పగా విన్నాడు. ‘నాకెప్పటికీ స్మాల్ పాక్స్ రాదు. ఎందుకంటే, నాకొక సారి కౌపాక్స్ వచ్చింది. ఇక  ఆ వికారపు స్పోటకపుమచ్చల వికారం ముఖం నాకుండదు.’ (I shall have smallpox for I have had cowpox. I shall never have an ungly polkmarked face) ఆరోజుల్లో ప్రజల్లో కూడా ఇదే నమ్మకం ఉండింది. ఒకసారి cowpox వ్యాధి సోకిన వారికి smallplx రోగం రాదు అని నమ్మేవాళ్లు.
1764లో జెనెర్ జార్జ్ హార్విక్ అనే డాక్టర్ దగ్గిరకు మారాడు. అక్కడే ఆయన అనేక శస్త్ర చికిత్స విధానాలను కూడా నేర్చుకున్నాడు. 21 వయేట హార్విక్ దగ్గిర అప్రెంటిషిప్ పూర్తి చేసుకున్నాడు. తర్వాత లండన్ వెళ్లి జాన్ హంటర్ అనే డాక్టర్ దగ్గిర విద్యార్థిగా చేరాడు. హంటర్ సెయింట్ జార్జెస్ హాస్పిటలో వైద్యశాస్త్రబోధించే వాడు. వాళ్లి ద్దరి మధ్య అపుడు మొదలైన స్నేహం 1793లో జెన్నెర్ చనిపోయేదాకా కొనసాగింది జెనెర్ అనేక విషయాల మీద ఆసక్తి ఉండేది. జెనెర్ కి హంటర్ దగ్గిర నుంచి ఎనలేని ప్రోత్సాహం లభించింది.  హంటర్ ఎపుడూ ఆయన ఒకటే సలహా ఇచ్చావాడు, ఎపుడూ ఆలోచించస్తూ కూచోవడమెందుకు? ఒక ప్రయోగం చేసి చూడు అనేది ఆ సలహా. “Why think(ie speculate)-why not try the experiment?”

ఆయన కకూ పక్షి వేరే పక్షి గూటిలో గుడ్డపెట్టి పిల్లలను పొదిగించే విషయాన్ని సహజంగా పరిశీలించి రాసిన పత్రానికి చాలా పేరొచ్చింది. దీనితోనే ఆయన రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికయ్యారు.

హంటర్ దగ్గిర పనిచేస్తున్నపుడు ఆయన శస్త్ర చికిత్సకు సంబంధించిన అనేక ప్రయోగాలు చేశాడు.హంటర్ దగ్గిర రెండేళ్లు పనిచేసి జెనెర్ బెర్క్ లీ కి వచ్చి వైద్యం చేయడం మొదలు పెట్టారు. అపుడే ఆయన స్మాల్ పాక్స్ జబ్బుకు చికిత్స ఏమిటనేదాని గురించి ఆలోచించాడు. ఈ ఆలోచనలోనే మశూచి జబ్బును ప్రపంచంనుంచి తరిమేసే బృహత్తర కార్యక్రమానికి పునాది వేసింది.
ఆ రోజుల్లో కౌపాక్స్ కూడా ఎక్కువగానే ఉంది. కౌపాక్స్ అంటే అవు పొదుగుల మీద కనిపించే మశూచి వంటి జబ్బు. ఇది మనుషులకూ సోకుతూ ఉండేది. ముఖ్యంగా పాలపితికే అమ్మాయిల్లో ఎక్కువగా వచ్చేంది.  కౌపాక్స్ వచ్చిన వారికి స్మాల్ పాక్స్ రాకపోవడం అరోజుల్లో గమనించారు. ఇందులోనే స్మాల్ పాక్స్ కు విరుగుడు ఉందని ఆయనకు తట్టింది.
కౌపాక్స్ అనేది మశూచిని అడ్డుకోవడమేకాదు, ఈ కౌపాక్స్ ను ఒకరినుంచి మరొకరికి అంటించి వాళ్లకి కౌపాక్స్, మశూచి రాకుండా నివారించవచ్చని అనుకున్నాడు.
Milkmaid (courtesy: NCBI)
దీనికోసం 1796 మే నెలలో ఒక ప్రయోగం చేశారు. ఈ ప్రయోగానికి సరా నెల్మ్స్ అనే అమ్మాయి ని, జేమ్స్ ఫిప్స్ అనే ఎనిమిదేండ్ల బాలుని ఎంచుకున్నాడు.  సరా చేతులనిండా కౌపాక్స్ పోసింది. పుండ్లువచ్చాయి. 1796 మే 14, న ఈ పుండ్లనుంచి రసిని సేకరించి, జేమ్స్ ఫిప్స్ కి ఎక్కించాడు (inoculation). ఫిప్స్ కి మొదట కొద్దిగా జ్వరం వచ్చింది, చంకలో ఇబ్బంది అనిపించింది. 9 రోజుల ద్వారా జలుబు చేసింది. ఆకలి చచ్చిపోయింది.
ఆశ్చర్యంగా ఆ మరుసటి రోజు ఫిప్స్ హుశారెక్కాడు. కొద్దిగా ఆయన పరిస్థితి మెరుగుపడింది. జూలై నెలలో ఫిప్స్ కి జెనెర్ మరొక సారి ఇనాక్యులేట్ చేశాడు.ఈ సారి స్మాల్ పాక్స్ తాజా పుండ్లనుంచి సేకరించిన రసిని ఎక్కించాడు. అతనికి స్మాల్ పాక్స్ జబ్బు సోకలేదు. దీనితో ఫిప్స్ లో మశూచికి రక్షణ తయారయిందని జెనెర్ ఒక నిర్ణయానికి వచ్చాడు.
Cow ని లాటిన్ లో vacca అంటారు. అలాగే Cow Pox ని vaccinia అని పిలిచారు. ఈ సంప్రదాయాన్ని బట్టి జెనెర్ తను మశూచికి చేసిన వైద్య విధానాన్ని వ్యాక్సినేషన్ (vaccination)అని పిలిచాడు.
తన ప్రయోగం విజయవంతమయ్యాక మరింత విస్తృతంగా ట్రయల్స్ చేసేందుకు జెనెర్ లండన్ వెళ్లాడు. మూడు నెలల దాకా వలంటీర్లెవరూ దొరకలేదు. అయితే, మెల్లిగా లండన్ వ్యాక్సినేషన్ కు గుర్తింపు వచ్చింది. 1799 లో జార్జ్ పియర్సన్, విలియం వుడ్ విల్ లు తమ పేషంట్ల వ్యాక్సిన్ ప్రయోగించేందుకు అంగీకరించారు. తర్వాత జెనెర్ తనే జాతీయ స్థాయిలో వ్యాక్సిన్ ప్రయోగించిన సర్వే  చేశాడు. పరీక్షలు విజయవంతమయ్యాయి. దీనితర్వాత వ్యాక్సినేషన్ యూరోప్ అంతా వ్యాపించింది.
మానవ జాతి చరిత్రలో అంతవరకు రోగాలకు చికిత్స మాత్రమే చేసేవారు. అయితే, సామాజిక రోగ నివారణ అనేది లేదు. ఈ కాన్సెప్ట్ జెనెర్ వ్యాక్సినేషన్ తో నే మొదలయింది. అందుకే ఆయనను Father of vaccine అంటారు.
తమాషా ఏమిటంటే… జెనెర్ జీవిత కాలంలో ఈ వ్యాక్సినేన్ ధియరీని ఎవరూ పట్టించుకోలేదు. ఇందులో ఏమీలేదని తీసి పడేశారు.1797లో తన ప్రయోగం గురించి వివరంగా రాసి రాయల్ సొసైటీకి ఒక రీసెర్చ్ పేపర్  పంపించాడు.ఆ పేపర్ ను వాళ్లు తిరస్కరించారు. 1798లో జెనెర్ మరికొన్ని కేసుల మీద ఇలాగే ప్రయోగం చేసి సొంతంగా ఒక బుక్ లెట్ అచ్చేశాడు. దీని పేరు An Inquiry into the Causes and Effects of the Variolae Vaccinae, a disease discovered in some of the western counties of England, particularly Gloucestershire and Known by the Name of Cow Pox. చివరకు ఆయన సొంతంగా అచ్చేసిన మూడు బాగాల Inquiry మీద కూడా వైద్య ప్రపంచంలో భిన్నాభిప్రాయాలు వెలువడ్దాయి. అదీ సంగతి.

(Edward Jenner Feature Picture Credits researchgate.net)