Home Features మిడిల్ క్లాస్ రొమాన్స్ లో మత్తు గమ్మత్తు నింపిన బాలివుడ్ ‘బాసు’

మిడిల్ క్లాస్ రొమాన్స్ లో మత్తు గమ్మత్తు నింపిన బాలివుడ్ ‘బాసు’

501
0
Basu Chatterjee
(Ahmed Sheriff)
70 దశకం లో బాలీ వుడ్ ధ్యాస మొత్తం, భావావేశాలూ, ట్రాజెడీ, చేజులూ, వినూత్నమైన పోరాటాలూనూతనమైన విలెనీ.  “యాంగ్రీ యంగ్ మన్” అమితాబ్ బచ్చన్ చుట్టూర తిరుగుతున్న బాలివుడ్.
ఈ చిత్రాలు సాధారణ జీవిత పరిధికి మించినవి. ఈ కథలన్నీ నిజజీవిత కాన్వాసు కంటే ఎన్నో రెట్లు  విశాలమైన కాన్వాసుల మీద చిత్రించే కథలు.  వీటినే “లార్జర్ దేన్ లైఫ్” కథలనొచ్చూ. జంజీర్,  షోలే, దీవార్, జమీర్, డాన్ మొదలైన చిత్రాలు గుర్తు వుండే వుంటాయి. 
ఆ టైం లో ప్రపంచ  సినిమా రంగాన్ని అవలోకిస్తూ “సినిమా అనేదే స్వయాన ఒక భాష” అన్నాడు ఒక కొత్త  సినిమాకి తన భాష, శైలీ తొ పురుడుపోస్తున్న ఒక దర్శకుడు. ఈ దర్శకుడు, సినిమాలకి కొత్త భాషనూ, కొత్త శైలినీ అందించాడు, తన కలలతో చిత్రాలు నిర్మించాడు. ఆయన సినిమాలో  మీరూ  ఉన్నారు, కావాలంటే చూసుకోండన్నాడు. నిజం ఆయన సినిమాలో 1970 దశకం నాటి కుర్రకారు కనిపించాారు. వాళ్ల రొమాన్స్ కనిపించింది. ఆఫ్ కోర్స్ వీళ్లంతా ఇపుడు గ్రాండ్ పాదర్సయిపోయిఉంటారను కోండి. సినిమాలని నాటి మధ్య తరగతి ప్రేమనగర్, పొదిరిల్లులాాగా మార్చిన వాడు ఆడైరెక్టర్ . ఆయనే బాసూ చటర్జీ. నిన్న కన్నుమూాశారు. 

కరోనా చికిత్స కాస్ట్లీ, అవాక్కయిన సుప్రీంకోర్టు, ఫీజు తగ్గే మార్గమేది?

బాసూ చటర్జీ సినిమాలూ చూస్తున్నపుడు మనల్ని మనం చూసుకుంటున్నట్లుంటుంది. దాదాపు, బాసూ చటర్జీ  సినిమాలన్నీ పట్టణ వాతావరణంలో వున్న మధ్యతరగతి కుటుంబీకుల  ప్రేమా, పేళ్ళి నిర్ణయాలు, నిజ జీవితంలో వీళ్ళు ఎదుర్కొనే సమస్యల మధ్య అంతర్లీనంగా కదలాడే కామెడీ సన్నివేశాలతో  మనసుకు ప్రశాంతత కల్గిస్తాయి.హృదయాన్ని తెలికపరుస్తాయి “అవును కదా?” అని చిరు నవ్వు నవ్వుకునేలా చేస్తాయి. ఇదొక లైట్ వెయిట్ రొమాంటిక్ కామెడీ జెనర్. తేలికైన కామెడీ సన్నివేశాల్తో  హాయిగా హుశారుగా, మత్తుగా,గమ్మత్తుగా  సాగిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలు మంచి మంచుకురిసే వేళలో పొగలు సెగులు కక్కుతున్న  పొద్దుటి ఫిల్టర్  కాఫీ లాంటి సినిమాలు.  
ఈ సినిమాల నిండా మధ్య తరగతి మనుషులకు అనువైన చాయ్ హొటళ్ళ లో సంభాషణలూ, బస్ స్టాప్ ప్రేమలూ, బస్సులూ , లోకల్ ట్రెయిన్ ప్రయాణాల్లో గుబాళించే ప్రేమలూ తారస పడతాయి. సినిమాలు తెలికగాా ఉంటాయి. జీవితాన్ని తెలికపరుస్తాయి. ఆ అందమయిన జీవితాన్ని గడుపుతున్నందుకు గర్వపడేలా చేస్తాయి. బాసు చటర్జీ సినిమా కళ్లకి, మెదడు, వొంటికి భారమనిపించదు.
రజనీ గంధా సినిమాలో:
ఢిల్లీ లో కాలేజీ చదువుతున్న దీప, బ్యాంకు ఉద్యోగి సంజయ్ చాలా కాలంగా స్నేహితులు. దీప సంజయ్ ని పెళ్ళి చేసుకునే ఆలోచనలో వుంటుంది. సంజయ్ మంచివాడే కానీ, ఎక్కువగా మాటలాడటం, పనుల పట్ల అశ్రద్ధ, దినచర్య లో పంక్చువాలిటీ లేకపోవడం (ముఖ్యంగా దీప ను కలిసే విషయం లో) లాటి అలవాట్లు, ఆమె అతణ్ణి పెళ్ళి చేసుకుందామనే నిర్ణయాన్ని ఊగిసలాటలో ఉంచుతుంటాయి.  ఇదిలా వుండగా ఒక రోజు ఆమె కు ముంబై లో ఒక ఉద్యోగానికి ఇంటర్వూ వస్తుంది.  ఈ ఇంటర్వూ రీత్యా కొన్ని చేదు అనుభవాల వల్ల తాను దూరంగా వుంచిన తన తొలి ప్రేమ, నవీన్ ను ఆమె మళ్ళీ కలవాల్సి వస్తుంది. నవీన్, సంజయ్  ప్రవృత్తుల్లో భిన్న ధ్రువాలు.  

*తెలుగు సినిమాల్లో మోటివేషనల్ పాటలు, జీవిత పాఠాలు

*‘పక్క ఇంటి అమ్మాయి’ని అంతా మర్చిపోయారు!

క్రమశిక్షణ తో కూడిన నవీన్ ప్రవర్తన హుందాగా వుంటుంది, ముంబై లో దీప వున్నంత కాలం ఆమెకు చేదోడు వాదోడు గా వుండటం, ఆమె పట్ల శ్రధ్ధ వహించడం,  దీప లో నవీన్ పట్ల తిరిగి ప్రేమను రగిలిస్తాయి.  ఢిల్లీ తిరిగి వచ్చిన తరువాత, నవీనే తన నిజమైన ప్రేమేమో అని ఆమె అనుకుంటున్నప్పుడు, సంజయ్ ఆమె ఇంటికి వచ్చి, తనకు ప్రమోషన్ వచ్చిందని చెబుతాడు.  అప్పుడామె గతాన్ని మరిచి పోయి సంజయ్ ని పెళ్ళాడాలనే నిర్ణయం తీసుకుంటుంది. 
మన్ను భండారి రాసిన రెండు పేజీల కథ “యహి సచ్ హై” (ఇదే నిజం) ను రెండు గంటల సినిమా స్క్రిప్ట్ గా మలిచాడు బాసూ చటర్జీ
దీపను కలవడం ఆలస్యమైన ప్రతీసారీ, సంజయ్ ఆమెకు   “రజనీ గంధ” పువ్వుల గుత్తిని ఇస్తూ వుంటాడు. ఇదే సినిమా శీర్షిక. సినిమా చేవ్రాలు (సిగ్నేచర్).

రిషి కపూర్ ‘బాబీ’ హీరో ఎలా అయ్యాడంటే…*

మొదట ఈ చిత్రాన్ని శశి కపూర్, షర్మిలా టాగోర్, అమితాబ్ బచ్చన్ ని పెట్టి తీయాలనుకున్నారు. తరువాత దృష్టి బెంగాలీ నటుల మీదికి మళ్ళింది, చివరికి అమోల్ పాలే కర్, విద్యా సిన్హా లతో తీసారు.  
విద్యాసిన్హా కు ఈ చిత్రం మొదటి చిత్రమైతే, అమోల్ పాలేకర్ కు ఇది మొదటి హిందీ చిత్రం. దీనికి ముందు అమోల్ పాలెకర్ రెండు మరాఠి చిత్రాలో నటించాడు.
ఈ సినిమా “ఎదురుగా వున్నదే వాస్తవం” అనే భావనను బలపరుస్తుంది. ఈ సినిమాలో, సంక్లిష్టమైన సన్నివేశాలూ, విలన్లూ, ఒళ్ళు గగుర్పొడిచే పోరాటాలు ఏవీ లేవు. చివరికి ప్రేక్షకులను ఉర్రూతలూగించే  క్లైమాక్సు కూడా లేదు. అయితేనేం, సినిమా చూసిన ప్రేక్షకులందరూ ప్రశాంత మైన మనసుతో, ఒక మంచి కాఫీ తాగిన ఫీలింగు తో హాయిగా థియేటర్ బైటికి వస్తారు.
చోటిసి  బాత్ (ఒక చిన్న మాట) సినిమాలో,  అరుణ్ ప్రదీప్ (అమోల్ పాలేకర్)  ఆత్మ విశ్వాసం  కొరవడిన ఒక బిడియస్తుడు ఇతడు ఒక రోజు  బస్ స్టాపు లో ప్రభా నారాయణ్ (విద్యా సిన్హా) అనే అమ్మాయిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఈ విషయం ఆమెకు చెప్పే ధైర్యం లేక, చెబితే ఏమవుతుందో అనే భయం తో ప్రతి రొజూ ఆమెను దూరం నించి వెంబడిస్తూ వుంటాడు.

Like this story? Share it with a friend!

ఆమె అతడి బిడియాన్నీ, భయాన్ని రహస్యంగా ఆస్వాదిస్తూ, అతడే ముందడుగు వేయాలని చూస్తూ వుంటుంది.   ఇదిలా వుండగా, ప్రభ కు సహ ఉద్యోగి అయిన నగేష్ శాస్త్రి  (అస్రాని) వీరిద్దరి మధ్య వస్తాడు. లోకజ్ఞానం లో, సంఘం లో మెలిగాల్సిన తీరు తెన్నుల విషయాల్లో, ఆత్మ విశ్వాసం లో , చలాకీ తనం లో అరుణ్ భూమి అయితే నగేష్ ఆకాశం. ఇతని రాక తో మరింత కృంగి పోయిన అరుణ్ చివరికి ఖండాలా లో వుండే కల్నల్ నగేంద్రనాథ్ విల్ఫ్రెడ్ సింగ్ (అశొక్ కుమార్) సహాయం తో  సంఘం లో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మెలగాలిఅన్న విషయాలు నేర్చుకుని తన  అత్మ విశ్వాసాన్ని పెంచుకుని, చివరికి ప్రభ ప్రేమను పొందుతాడు.
వీడేమ్ విలన్ అనుకుంటారు
ఈ సినిమాలో అస్రాని విలన్. అతడి వద్ద కత్తులూ, తుపాకులూ వుండవు, మందీ మార్బలమూ, మర్దర్లూ వుండవు. అయినా అతణ్ణి ఓడించడానికి హీరో ఎన్నో అవస్థలు పడవల్సి వస్తుంది, ఈ అవస్థల దృష్ట్యా సృస్ష్టించ బడ్డ సన్నివేశాలే మనకు నవ్వు తెప్పిస్తాయి. నగేష్ వద్ద ఒక స్కూటర్ వుంటుంది. నగేష్ తో పాటు ప్రభ ఆ స్కూటర్ మీద వెళుతూ వుంటుంది. ఇది భరించలేక ప్రభ కు లిఫ్ట్ ఇవ్వడానికి అరుణ్ ఒక పాత మోటార్ సైకిలు కొంటాడు. అది పెట్టే అవస్థలు భరించలేక దాన్ని నష్టానికి అమ్ముకుంటాడు. ఇలాంటి చిన్న చిన్న సాధారణమైన విషయాల్తో సినిమా మనో రంజకంగా సాగుతుంది. ఈ సినిమాలో కొన్ని నూతనత్వాలూ వున్నాయి. అరుణ్ ఒక రోజు సినిమాకి వెళతాడు (ఒంటరి గానే). ఇదొక సినిమాలో సినిమా సన్నివేశం. సినిమాలో “జానె మన్ జానె మన్ తెరే దో నయన్…” అనే ఒక పాట వస్తుంది.
ఈ పాటను తెర మీద ధర్మేంద్ర, హేమ మాలిని అభినయిస్తారు. మొదట్లో పాటను అస్వాదిస్తున్న అరుణ్ కి హేమమాలిని స్థానం లో విద్య సిన్హా కనపడుతుంది. కొంచం సేపు పాట ధర్మెంద్ర, విద్యా సిన్హా ల మధ్య సాగుతుంది. ఈ సమయం లో అరుణ్ చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతాడు. అంతలో మళ్ళీ ధర్మేద్ర స్థానం లో తానొస్తాడు. అప్పుడు మళ్ళీ అతని ముఖ కవళికలు  మారతాయి, మొఖం లో సంతోషం వెల్లి విరిస్తుంది. చివరికి పాట అమోల్ పాలేకర్, విద్యా సిన్హా లతో ముగుస్తుంది. ఇటువంటి నూతనత్వాలను ప్రజలు బాగా ఆస్వాదిస్తారు. ఇంకొ సన్నివేశం లో   అమితాబ్ బచన్ (అమితాబ్ బచన్ గానే, జమీర్ సినిమాలోని గెటప్ తో ) అశోక్ కుమార్ వద్ద సలహా తీసుకో డానికి వచ్చినపుడు అరుణ్  చూసి, ఒక మహా నటుడిని చూశాను అని ఫీల్ అవుతాడు. ఈ సినిమా లో బస్ స్టాపుల్లో జమీర్ వాల్ పోస్టర్లు కనిపిస్తాయి.
తన సినిమాలకు అమాయకమైన ముఖాలతో సీదా, సాదా గ వుండే నటీనటులు అమోల్ పాలేకర్, విద్యా సిన్హా, జరీనా వహాబ్ లకు ప్రాముఖ్యం ఇచ్చినా, అ నాటి స్టార్ నటులైన రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, దేవానంద్ చిత్రా లకు కూడా దర్శకత్వం వహించాడు బాసూ చటర్జీ .
బాసూ చటర్జీ సినిమాల్లో సన్నివేశాలూ , దైలాగులూ, మన్సుకు హత్తుకునే సున్నితమైన కామెడీ ఒక ఎత్తు అయితే, ఆయన సినిమాల్లో సంగీతం మరో ఎత్తు. అలసి సొలసిన మనసులకి హాయిని గొలిపే సంగీతం ఎంతో సేద దీరుస్తుంది. బాసు చటర్జీ సినిమాల్లో సంగీతానికి చాలా ప్రాముఖ్యత వుండేది. ఆ పాటలు నిజంగా అమృత తుల్యం. సలీల్ చౌదరి సంగీతం వహించిన “రజని గంధా” టైటిల్ సాంగ్ వింటున్నంత సేపు మనుషులు మైమరిచిపోతారనడం లో సందేహం లేదు. అలా పాడింది లతా మంగేష్కర్ ఈ పాటను.

ఇదే సినిమాలో ముకేష్ పాడిన “కయి బార్ యుహి దేఖా హై…” అనే పాట ఆ సంవత్సరం ముకేష్ కు ఉత్తమ గాయకుడి గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ తెచ్చి పెట్టింది.
రవీంద్ర జైన్ రచించి సంగీతం వహించిన “చిత్ చోర్” పాటల్ని ఎవరైనా మరువ గలరా? జేసుదాస్, హేమలత పాడిన ఈ సినిమా పాటలు సూపర్ హిట్ పాటలు. “గొరి తెర గావ్ బడా ప్యారా..మై తొ గయా హారా….” అనే జేసుదాస్ గీతం ఆ రోజుల్లో ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే.
వీధిలో ఫ్లూట్ లు, బొమ్మ వయోలిన్లు అమ్మేవాడి దగ్గర్నించి, చిన్న పెద్దా బేధం లేకుండా అందరి నోళ్ళలో ఇదే పాట. ఈ పాట వల్లే జేసుదాస్ సామాన్య ప్రజానీకానికి తెలిశాడంటే అతిశయోక్తి కాదేమో. ఈ పాట తో ఉత్తమ గాయకుడు (1976) నేషనల్ ఫిల్మ్ అవార్డు ను పొందాడు జేసుదాస్.
“తుజొ మెరె సుర్ మె…” పాటకు గాను హేమలత ఉత్తమ గాయని (1976) ఫిల్మ్ ఫేర్ అవర్డును పొందింది.
“ఖట్టా మీఠా” సినిమాలో రాజేష్ రోషన్ సంగీత దర్శకత్వం వహించి, కిశోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడిన “థోడా హై, థోడేకి జరూరత్ హై…” అనే పాట ఒక మధురానుభూతి. ఇలా బాసు చటర్జీ సినిమాల్లోని పాటలూ సంగీతం గురించి రాస్తూ పోతే అదే ఒక పెద్ద వ్యాసం అవుతుంది.
మొట్ట మొదట బాసూ చటర్జీ, 1966 లో వచ్చిన రాజ్ కపూర్ సినిమా “తీస్రీ కసం” కి బాసు భట్టాచార్య తో కలిసి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 
తరువాత కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వాలను చేపట్టి, చోటిసి బాత్ (1975), చిత్చోర్ (1976), రజనీగంధా (1974), పియా క ఘర్ (1972), ఖట్టా మీఠా  లాటి అనేక మనో రంజకమైన సినిమాలూ సృష్టించి ఒక వినూత్న దర్శకుడిగా ప్రజల గుండెల్లో నిలిచి పోయాడు. (1930 – 2020). జూన్ నెల నాలుగో తారికున 90 యేళ్ళ వయసులో, చివరి శ్వాస తీసుకున్న ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ..

 

(Ahmed Sheriff is a Hyderabad based poet and movie buff. He can be contacted at:csahmedsheriff@gmail.com; Mobile  9849310610)