అందరికీ శుభవార్త… బరువు తగ్గేందుకు చిట్కా కనిపెట్టిన NRI శాస్త్రవేత్త

ఈ మధ్య కాలంలో బరువు తగ్గాలనుకోవడమనేది జాతీయ సమస్య అయిపోయింది. బరువు తగ్గేందుకు చేయని ప్రయత్నమంటూ ఉండదు.ఎక్సర్ సైజలు, డైటింగ్, నాన్ వెజ్ మానేయడం,యోగా… ఇలా ఎన్ని కష్టాలో.నాలుగు కిలలో బరువు తగ్గేందుకు ఎన్నిరకాలుగా ఈ శరీరాన్నిరాచిరంపాన పెడుతుంటారో లెక్కేలేదు. ఇక ఈ కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు.
మీ బరువును  అసరాగా తీసుకుని రకరకాల హాఫ్ వైద్యులు, నాటు వైద్యులు సోషల్ మీడియాలో తెగ పుట్టుకొచ్చారు. పచ్చికాయకూరలు  తినండి, వేపుళ్లు మానండి, కేవలం మాంసమే తినండి, ప్రోటీన్లే తినండి, కార్బొహైడ్రేట్లు నిషేధించండి, నూనె వద్దనే వాల్లు, నెయ్యని నిషేధించే వాళ్లు..  ఇలా రకరకాల క్యాంపెయిన్లతో ప్రజలను హడలకొడుతుంటారు.
ఇంకొక సైడు నుంచి నోటికొచ్చిన సలహాలన్నీ ఆయుర్వేదం పేరుచెప్పి, ప్రకృతి వైద్యం చెప్పి మన ప్రాణాలు తోడేస్తుంటారు.
నెలరోజుల్లో పదికిలోలు తగ్గే మార్గానికి తమ దగ్గిర  ట్యాబ్లెట్లున్నాయని కొందరు, పసరుపూత ఉందని ఇంకొందరు. నడుముకు బెల్టు ఉందని, అదని ఇదని మనల్ని సతాయించే వాళ్లు మరికొందరు.
బరువు తగ్గాలనుకుంటున్నవాళ్లకు, తిండిమీద ఎలాంటి భయంపెట్టుకోకుండా ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్లకు అమెరికాకు చెందిన భారతీయ సంతతి శాస్త్రవేత్త ఇపుడు  శుభవార్త చెబుతున్నాడు.
ఇది చవకయింది, పాటించేందుకు సుళువయింది. ప్రయోగాలలో రుజువయింది. అందుకే అంతా పాటించండంటున్నాడు. నిజానికిది మనం  వాళ్లు తరచూ పాటించే ఉపవాసమే. ఇది అనాదిగా వస్తూ ఉంది. ఉపవాసాలుండటం హిందూ సంప్రదాయం లోనే కాదు, దాదాపు ప్రపంచంలోని అన్ని మతాల్లో ఉంది. చాలా హిందూ పండుగల్లో  ఉపవాసం పాటిస్తారు.సాధారణంగా పండగ రోజు దేవుడికి నైవేద్యం పెట్టేదాకా ఖాళీ కడుపుతోనే ఉంటారు. ముస్లిం  రంజాన్ ఉపవాసాలు చాలా పాపులర్. రంజాన్ ఉపవాసాల వల్ల ఆరోగ్యం బాగవుతుందని కూడా రీసెర్చ్ లో తేలింది. ఆ రీసెర్చ్ పేపర్ ఇక్కడ ఉంది చదవండి.  ఇక్కడా చదవండి.
అసలు విషయం ఇది…
ఆహారమేదయినా సరే ఒక పద్ధతిప్రకారం తీసుకుంటే ఇంత శ్రమలేకుండా బరువు తగ్గవచ్చంటున్నారు సచ్చిదానంద పాండ. ఆహారం తీసుకునే పద్దతి మెటాబాలిక్ సిండ్రోమ్ నుంచి ఎలా రక్ష ణ కల్పిస్తూందో పాండా తన సహచరులతో కలసి పరిశోధన చేశారు. వారి పరిశోధనా పత్రం Cell Metabolism లో అచ్చయింది.
పాండా పరిశోధన ప్రకారం ఒక నిర్ణీత సమయంలో మాత్రం కార్యక్రమాల నుంచి ముగించేయాలి. అతర్వాత ఆరోజు మళ్లీ ముట్టుకోరాదు. కాకుంటే మంచినీళ్లు తాగవచ్చు. దీనిని ఈ శాస్త్రవేత్తలు టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ (Time-Restricted Eating TRE) అని పిలిచారు.
\ఇందులో వున్న రహస్యం… మనిషి శరీరంలోకనిపించకుండా పని చేసే బయలాజికల్ క్లాక్ అనేది ఒకటుంటుంది. దీనికి తగ్గట్టు ఆహారం తీసుకుంటే మిమ్మల్ని ఆరోగ్యం గా ఉంచే పని అదే చూసుకుటుంది. శరీరం శక్తి (ఎనర్జీ)ని వినియోగించుకుకోవడానికి , బయలాజికల్ క్లాక్ కు సంబంధం ఉందని కనుగొనడం ఈ అమెరికా సాల్క్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తల పరిశోధన గొప్పదనం.
ఈ ఫలితాలు Ten- Hour Restricted Eating Reduces Weight, Blood Pressure and Atherogenic Lipids in Patients with Metabolic Syndrome అనే శీర్షిక తో సెల్ మెటబాలిజమ్ లో 2019డిసెంబర్ నెల సంచికలో అచ్చయ్యాయి.
మరింత లోతుగా…
పదమూడు మంది పురుషుల మీద, ఆరుగురు మహిళల మీద వీరు టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ ప్రయోగాలు నిర్వహించారు. వీళ్లందరికి తాము తినేదేదయిన ఉంటే పది గంటల వ్యవధిలోనే తినేయమని చెప్పారు. అంటే తర్వాత 14 గంటల పాటు ఏవీ తీసుకోరాదని అర్థం. అపుడు నీళ్ల మాత్రమే తీసుకోవచ్చు. మరొక విధంగా చెబితే జీర్ణ వ్యవస్థకి 14 గంటల విరామం ఇస్తున్నారన్నమాట.
ఈ ప్రయోగం లో పాల్గొన్నవారంతా మెటబాలిక్ సిండ్రోమ్ (Metabolic Syndrome) లక్షణాలున్నవారు.మెటబాలిక్ సిండ్రోమో అంటే హై ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, హై బ్లడ్ ప్రెజర్, హై ట్రై గ్లిజరైడ్స్, లో గుడ్ కొలెస్టరాల్, అబ్డామినల్ ఒబెసిటీ ఉన్నవారు.అంటే వాళ్లకి డయాబెటిస్, గుండెజబ్బులొచ్చే రిస్క్ ఎక్కువ గా ఉన్నవారని అర్థం. సాధారణంగా మనలో ఎక్కువ మంది ఈ క్యాటగిరిలోనే ఉంటారు.
పన్నెండు వారాల పాటు వీళ్ల చేత నిర్ణీత సమయానికి కట్టుబడి భోజనం (TRE) చేయమన్నారు. తర్వాత ఫలితాలు చూస్తే ఆశ్చర్యంగా ప్రతి ఒక్కరూ 3 శాతం బరువు తగ్గారు. అబ్డామినల్ ఫ్యాట్ తగ్గింది. చాలామంది కొలెస్టరాల్ తగ్గింది. బ్లడ్ ప్రెజర్, ఫాస్టింగ్ షుగర్ కూడా తగ్గాయి.
ఈ విధానం ఏమాత్రం ఇబ్బందికరమయింది కాదు. భోజనం చేస్తున్నపుడల్లా క్యాలరీలు చూసుకుంటూ ఆందోళన చెందాల్సిన అవసరం లేని సులభమయిన, అందరీకీ ఆచరణ సాధ్యమయిన ఆహార నియమం.
“Time-Restricted Eating is a simpler, easier dietary intervention to practice than counting calories during each meal, సాల్క్ ఇన్ స్టిట్యూట్ రెగ్యులేటరీ బయాలజీ విభాగానికి చెందిన పాండా చెప్పారు.
ప్రయోగాల్లో పాల్గొన్న వారంతా టిఆర్ఇ ని కచ్చితంగా పాటించారని ఆయన చెప్పారు.
అయిదేళ్ల కిందట కూడా పాండా అండ్ కో బృందం ఎలుకల మీద 12 నుంచి 16గంట ఉపవాసంతో ఈ ప్రయోగాలు చేశారు. తీసుకునే ఆహారం మీద ఆంక్షలేవీ పెట్టలేదు. అపుడు కూడా ఎలుకల్లో ఒబెసిటీ తగ్గడం, కోలెస్టరాల్ సమస్య మెరుగుపడటం జరిగింది. తర్వాత మనుషుల మీద ప్రయోగాలు చేసి అవేఫలితాలు సాధించారు.
ఇదేలా జరిగింది?
పది గంటల వ్యవధిలో తినడం తాగడం పూర్తి చేసేస్తే మిగిలిన 14 గంటల సమయంలో శరీరం విశ్రాంతి తీసుకుంటుంది.మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి కోలుకుటుందని ఈ పరిశోధనంలో పాల్గొన్న మరొకరు ఎమైలీ మనూజియన్ చెప్పారు. మన శరీరంలోని బయలాజికల్ రిథమ్ కు వీలుగా ఆహారం తీసుకునే విధానాన్ని కంట్రోల్ చేయడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ తో ఉన్న వారిలో ఆరోగ్యాన్ని మెరుగుపర్చవచ్చేమే చూడాలన్నది తమ పరిశోధణ లక్ష్యమని ఆమె చెప్పారు.అది నెరవేరడం కనిపించిందిన ఆమె చెప్పారు.
అయితే, తమ పరిశోధనల్లో ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నా, ఈ టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ (TRE)విధానం పాటించాలనుకునే వాళ్లొక సారి తమ డాక్టర్ ను కూడా సంప్రదిస్తే మంచిదని ఈ శాస్త్ర వేత్తలు సలహా ఇస్తున్నారు…
ఇక పాండా గురించి…
సచ్చిదానంద పాండా ఒడిషాకు చెందిన వ్యక్తి. ఆయన ఒదిషా యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ లో చదివారు. తర్వాత అమెరికా క్యాలిఫోర్నియాలోని ది స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో డాక్టరేట్ చేశారు. ఇపుడు సాల్క్ ఇన్ స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ లో పని చేస్తున్నారు. ఈ పద్దతి బరువు తగ్గడానికి , బిపి నియంత్రించడానికి చాలా సమర్థవంతమయిన, చవకయిన మార్గమని పాండా చెప్పారు.