తెలంగాణలో కరోనా కేసుల జోరు, టెస్ట్ ధర రు. 5వేలు పైనే

తెలంగాణలో గతంలో ఎపుడు లేనంతగా  ఈరోజు  143 పొజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇదొక రికార్డు. లాక్ డౌన్ సడలిస్తుంటే, కరోనాటు కట్లు తెంచుకుని పాకుతూన్నది.  రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3290 కేసులు నమోదు అయ్యాయి. ఇక జిహచ్ ఎం సి పరిధిలో 116 మందికి కోరోనా సోకింది.  అదే విధంగా ఈరోజు గతంలో ఎపుడూ లేనంగా  8మంది మృతి చెందారు. రాష్ట్ంలో  మొత్తం 113మంది ఇప్పటివరకు కరోనా కు బలయ్యారు.
ఇవ్వాళ 40మంది డిశ్చార్జ్ అయ్యాక లాక్ డౌన్ ఎత్తేయక ముందు కొత్త కేసులకంటే డిశ్చార్జఅయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉండింది. ఇపుడు పరిస్థితి తారుమారవుతున్నది. మొత్తం 1627 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు కూడా బాగా పెరిగిపోయాయాయి. ఈరోజుకి రాష్ట్రంలో 1550 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మిగతా కేసులన్నీ రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మెడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల్ జిల్లాల నుంచి వచ్చాయి. తమాషా ఏంటే ఈ కేసులన్నీ లోకల్ గా వచ్చినవే. వలసల కూలీల నుంచి వచ్చిన కేసుల నిల్ అని ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటీన్ పేర్కొంది.

ఇది ఇలాా ఉంటే హైదరాబాద్ కోవిడ్ పరీక్షలు మంచి బిజినెస్ గామారింది. గుర్తించబడిన డయాగ్నోష్టిక్ సెంటర్లు రు. 5100 దాకా వసూలు చేస్తున్నాయి. నిజానికి ఐసిఎం ఆర్  రు. 4500 లుగా ధర నిర్ణయించింది. అయితే, ఇదే చాలా ఎక్కువ అని  చాలా రాష్ట్రాలకు చాలా తక్కువ ధరలు నిర్ణయించాయి. నిజానికి కర్నాటక ప్రభుత్వం అక్కడ టెస్ట్ ధరని రు. 2500 నిర్ణయించింది. అయితే, హైదరాబాద్ లో ప్రభుత్వం అదుపులేకపోవడంతో ధర రు. 5000 దాటింది. అయితే, కరోనా అనుమానం రాగానే ఇంటిల్లి పాదేకాకుండా ఇరుగుపొరుగు కూడా  ఆందోళన చెందుతారకాబట్టి, ముందు టెస్టు చేయించుకుని హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకోవాలనుకుంటున్నారు. దీనితో ఎలాంటి రోగ లక్షణాలు లేకపోయినా అనుమానం వస్తే చాలు టెస్టులకు పరిగెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం  మాత్రం  రోగలక్షణాలు లేకపోతే, పరీక్షలు చేయడం మానేసింది. అంతెందుకు తమకు పరీక్షలుచేయడం లేదని  ఉస్మానియా మెడికోలే  గగ్గోలు పెడుతున్నారని ఈ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
ఈ లెక్కన కరోనా భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకే వదిలేసిందని అనుకోవాలి.