లాక్ డౌన్ విధించకుండా, ప్రపంచంలో కరోనాను అదుపు చేసిన దేశమేది?

(TTN Desk)
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రపంచదేశాలన్నీ పడరాని పాట్లుపడుతున్నాయి. కోవిడ్ -19 అంటు వ్యాధి కాబట్టి, ప్రజలంతా బయటతిరిగి, ఒకరినొకరు తగలి, ఒకరి శ్వాస మరొకరు పీల్చి, కరోనావైరస్ వ్యాప్తి చేస్తారని భయంతో ప్రపంచంలో ప్రభుత్వాలన్నీ జనతా కర్ఫ్యూలు, లాక్ డౌనలు విధించాయి.
రోడ్లమీద మనుషులు లెవరు తిరగకుండా పోలీసులను రంగంలోకి దించాయి. రోడ్లమీద కనబడితే చాలా, పోలీసులు లాఠీ ఝళిపిస్తున్నారు. చాలా చోట్ల ఈ లాక్ డౌన్ చాలా చాలా వికార స్థాయికి చేరుకుంది.
దినకూలీలు ఉపాధి కోల్పోయారు. హోటళ్లు, కాఫీ షాపులు మాల్స్ మూత పడ్డాయి. సినిమా హాళ్లు లేవు, బార్లు లేవు, మార్కెట్లు లేవు. నిత్యావసర సరుకులను మాత్రం ఒక నిర్ణీత సమయంలో  అనుమతిస్తున్నారు. అయినా, ప్రజలు రోడ్ల  మీదకు వస్తున్నారు. అయినా  సరే కరోనా వ్యాప్తి జరుగుతూనే ఉంది. అమెరికా కరోనా మరణాలతో తలకిందులవుతూ ఉంది. ఇక ఇటలీ చెప్పాల్సిన పనిలేదు. అక్కడ మృతదహాలను దహనం చేయడానికి సైన్యాన్ని రంగంలోకి దించాల్సి వచ్చింది.
ఇలాంటపుడు ప్రపంచంలో ఒకే ఒక్క దేశం, భయంకరంగా కరోనా వైరస్ బారిన పడినా, వైరస్ వ్యాప్తి నివారించేందుకు లాక్ డౌన్ ప్రకటించలేదు. కాఫి షాపులు మూయలేదు. కాఫీషాపుల వ్యాపారం పడిపోయిన మాట నిజమేకాదని అవయితే తెరిచే ఉన్నాయి.  రెస్టారంట్లు పనిచేస్తున్నాయి.ఆన్ డిమాండ్ డెలివరీ బిజినెస్ ఆకాశాన్నంటుంది. ఇంతకీ దేశమేదో తెలుసా?
అదే సౌత్ కొరియా 
ఈదేశంలో కరోనా అదుపులోకి వచ్చింది.రోజూ వందల్లో  పెరిగి దేశాన్ని, ప్రపంచాన్ని భయపెట్టిన దక్షిణ కొరియాలో ఇపుడు పాజిటివ్ కేసులు పదుల్లోకి పడిపోయాయి. మరణాలు అగిపోయాయి. ఆసుప్రతుల్లో చేరి జబ్బు నయంచేసుకుని ఇంటికి వెళ్లిపోతున్న వారి సంఖ్య ఎక్కువయింది. అమెరికా, యూరో, రష్యాలు.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సతమతమవుతూ ఉంటే, మా అనుభవంతో మీకు సాయం చేస్తామని సౌత్ కొరియా ప్రపంచదేశాలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది.
సౌత్ కొరియా  కరోనాను ఎలా అదుపు చేసింది?
సరిగ్గా నెల రోజుల కిందట సౌత్ కొరియా ఉపద్రవం చేరువలో ఉంది. అపుడు క్రిస్టియన్ జాతి తెలివితక్కువ తనం వల్ల ఈ దేశంలో వైరస్ వచ్చి, ఎంతవరకువ్యాపించిందంటే చైనా తర్వాత తీవ్రమయినదేశమయింది.రోజూ ఇన్ ఫెక్షన్ పెరిగిపోతూ ఉంది. ఫిబ్రవరి 20నాటికి రోజు వారీ కేసులు 909 కి చేరాయి. ఇపుడు కొరియా చైనా తర్వాతి స్థానం నుంచి పదో స్థానానికి మెరుగపడింది. అక్కడ ఆరోగ్య వ్యవస్థ మీద ఎలాంటి వత్తిడి పడకుండా జాగ్రత్త చర్యలతో కొరియా కరోనాను అదుపు చేసింది. ప్రపంచమంతా దీనిని కీర్తిస్తూఉంది.
ఇపుడు సౌత్ కోరియా కరోనా మృతుల సంఖ్య ఒక శాతం కంటే తక్కువే. శుక్రవారానికి దేశంలో కరోనా కేసులు కేవలం 9,392 మరణాలు 139 అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ ఇన్ ఫర్మేషన్ వెల్లడించింది.
విచిత్రమేమిటంటే, చైనా, యూరోపియన్ భారత్ ల లాగా దేశ వ్యాపితంగాని, రాష్ట్రాలలో గాని, చివరకు పట్టణాలలో గాని లాక్ డౌన్ విధించకుండానే సౌత్ కొరియా దీనిని సాధించింది.
‘ కరోనా మీద యుద్ధానికి ఉపయోగించిన మా పద్దతులు విజయవంతమయ్యాయి,’ అని ప్రధాని చుంగ్ ష్యే-క్యూన్ (Chung Se-Kyun) విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విలేకరుల సమావేశాన్ని కూడా కట్టుదిట్టంగా సూక్ష్మక్రిమి సంహారిణితో శుభ్రం చేసినట్లు బయోహజార్డ్ గేర్ ధరించిన అధికారి ఒకరు చెప్పారు.
సౌత్ కొరియా అనుసరించిన పధ్దతులు నాలుగు రకాలని ప్రధాని చుంగ్ చెప్పారు. 1. స్పీడ్, 2, పారదర్శకత (Transparency), 3. ఇన్నొవేషన్ 4. స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొనడం (voluntary civic participation)
స్పీడ్ అంటే టెస్ట్ చేసి రోగనిర్ధారణ చేయడంలో తమ దేశం శరవేగంగా పనిచేసిందని ఆయన చెప్పారు. రోజుకు పదివేల పరీక్షలు చేశారు. ఒక్కొక్క రోజు 20 వేల పరీక్షలు కూడా చేసే వారు. రోగ లక్షణాలు కనిపించిన వాళ్లంతా స్వచ్ఛందగా పరీక్షలు వచ్చేలా ప్రోత్సహించారు. తర్వాత చికిత్స, ఇన్ ఫెక్షన్ ఉంటే చికిత్స ఉచితం. ఆదేశంలో ఇప్పటిదాకా 376,961 పరీక్షలు నిర్వహించింది. ఈ విషయంల ఇదే నెంబర్ వన్. పరీక్షలు, వెంటనే చికిత్స ఉండటంలో రోజు వచ్చే ఇన్ ఫెక్షన్ కేసుల వందల వేల నుంచి పదుల్లోకి పడ్డాయి.
WHO ప్రమాణాల ప్రకారం టెస్టికిట్స్, స్వాబ్ టు బ్లడ్ టెస్ట్స్ తయారు చేసేందుకు అనేక కంపెనీలు ముందుకు వచ్చాయి. ఎక్కడ చూసినా టెస్ట్ సెంటర్లు వెలిశాయి. చివరకు టెస్ట్ చేయించుకునే వాడికి, చేసే వాటికి కూడా అంటుకోకుండా ఉండే డ్రైవ్ త్రూ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు.
ఈ పరీక్షలు ఆసుపత్రులలో కాకుండా బయట వాక్ -ఇన్ టెస్ట్స్ గా నిర్వహించారు. గతంలో సార్స్, MERS అనుభవాల దృష్ట్యా ఆసుపత్రులలో ఉండే ఇతర రోగులకు వ్యాధి అంటుకోకుండా ఉండేందుకు పరీక్షలను బయట నిర్వహించారు. గవర్నమెంట్ ట్రైనింగ్ సెంటర్లను క్వారంటైన్ సెంటర్లు గా మార్చారు. మైల్డ్ గా రోగలక్షణాలు కన్పించిన వారినంతా గృహనిర్బంధంలో ఉంచి స్మార్ట్ ఫోన్ లతోనే మానిటర్ చేశారు.
మెడికల్ సిబ్బంది, స్థానిక ప్రభుత్వాల సిబ్బంది, ఆర్మీ, స్వచ్ఛంద సేవకులు మొత్తం కరోనా కంట్రోల్ కోసం రంగంలోకి దిగారు.
ప్రతి అడ్డమైనా మార్గంలో కరోనా సమాచారం ప్రచారం కాకుండా కేవలం రెండు సార్లు, పొద్దున సాయంకాలం ప్రభుత్వం మాత్రమే కరోనాసమాచారం అందిస్తుంది. కొరియాలో స్మార్ట్ ఫోన్ వాడకం (Smart phone penetration ) చాలా ఎక్కువ కాబట్టి వాటిని జాగ్రత్త ఉపయోగించి అనుమానితులను పట్టుకోలిగారు.
అంతేకాదు,జిపిఎస్ డేటా, స్మార్ట్ ఫోన్ డేటా, క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్స్, సిసిటివి ఫుటేజ్ లతో పాటు డేటా డిటెక్టివ్ లను కూడా ఉపయోగించి వైరస్ సోకిన వారు కదలికల ఆచూకి కనిపెట్టి, పట్టుకోవడం మొదలుపెట్టారు. వీటితోపాటు విదేశీయులను దేశంలోని అననుమతించడం నిషేధించారు.
సివిక్ పార్టిసిపేషన్ లో కొరియా విజయవంతమయింది. సోషల్ డిస్టాన్సింగ్, సెల్ఫ్ క్వారంటైన్, తరచూ చేతులు కడుక్కోవడం, ముఖానికి మాస్కులు ధరించడంలో ప్రజలను బాగా ఎజుకేట్ చేశారు. ఇదే సమయంలో ప్రొఫెసర్లు కూడా ప్రజలకోసం ఆన్ లైన్ ఉపన్యాసాలిచ్చే వారు. ఇదంతా జరుగుతున్నపుడు సియోల్ లో ప్రజా జీవితం యధావిధిగా కొనసాగింంది. ఎలాంటి లాక్ డౌన్ లేదు.
పబ్లి క్ ప్లేస్ లలో ధర్మ ల్ కెమెరాలు పెట్టి టెంపరేచర్ కొలవడం మొదలపెట్టారు. ఎందుకంటే కోవిడ్-19 మొదటి లక్షణం జర్వమే. జర్వం కనిపించగానే పరీక్షలు, చికిత్స ఆటోమాటిక్ జరిగిపోయేవి.
అన్నిదేశాలకంటే సౌత్ కొరియాలో మాస్క్ లు ధరించడం ఎక్కువ. ఎందుకంటే, ఇక్కడ పొల్యూషన్ నివారించేందుకు ప్రజలు ఎపుడూ మాస్కులు ధరిస్తూనే ఉంటారు. అందువల్ల ఈ విషయంల్ ప్రజలను పెద్దగా అప్రమత్తం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. మాస్కులు కొనాలంటే ఐడికార్డు చూపాల్సి వుంటుంది. అందువల్ల ఎక్కువ కొనడం, దాచడం సాధ్యం కాదు.
మేం మొత్తానికి పెద్దమంటలను ఆర్పేశాం. ఇపుడు నిప్పులను ఆర్పే క్రమంలో ఉన్నామని ప్రధాని చెప్పారు. కొరియా స్కూళ్లను కాలేజీలను మూసేసింది. అయితే, ఏప్రిల్ అరునుంచి వాటిని తెరిచే ప్రయత్నాలు చేస్తూ ఉందని Asiatimes రాసింది. పూర్తి వివారలు కావాంటే ఇక్కడ చదవండి.