Home Features Research బిపి ఉందా మీకు, అయితే కాలు మీద కాలేసి కూర్చోకండి, ఎందుకంటే…

Research బిపి ఉందా మీకు, అయితే కాలు మీద కాలేసి కూర్చోకండి, ఎందుకంటే…

265
0
వాడికేమయ్యా కాలు మీద కాలేసుకుని దర్జాగా బతుకుతున్నాడంటుంటారు.అంటే కాలుమీద కాలేసుకుని కూర్చోవడం దర్జాకు, అధికారానికి, దర్పానికి సింబల్ అన్న మాట. కాలుమీద కాలేసు కూర్చోవడానికి అర్హతులు కూడా ఉన్నాయి. మనకంటే పెద్ద వాళ్ల దగ్గిర మనం కాలు మీద కాలేసుకునికూర్చోం.అంతేకాదు, ఒక వేళ కూర్చున్నా, అవతలి వాళ్లు దీన్ని అఫెన్సివ్ గా తీసుకుంటారు.
ఒక వేళ మనం ఎవరిదగ్గరియినా కాలు మీద కాలేసి కూర్చుంటే ఇద్దరు సమానులయి ఉండాలి. చనువుయినా ఎక్కువగా ఉండాలి. లేకపోతే, కాలుమీద కాలేసుకూర్చోవడం అనుమతించరు. ఇక మహిళలకు ఈ విషయంలో అన్యాయమే జరుగుతుంది. వాళ్లు కాలు మీద కాలేసుకుని కూర్చోవడాన్ని మన వాళ్లు అనుమతించరు.
మనం కూర్చున్నపుడు శరీరం తనంతకు తానే కంఫర్టబుల్ పొటిషన్ తీసుకుంటుంది. అప్పటికది కంఫర్టబుల్ అనిపించినా దాని వల్ల నష్టాలున్నాయని ఇపుడు పరిశోధనల్లో తేలిసింది.
సాధారణంగా కాలు మీద కాలేసుకుని కూర్చోవడం అందరికీ అలవాటే. ఆఫీసులో పనిచేస్తున్నపుడు,డైనింగ్ టేబుల్ దగ్గిర కూర్చున్నపుడు, బస్లుల్లో రైళ్లలో ప్రయాణిస్తున్నపుడు, మనకు తెలియకుండా మనం కూలు మీద కాలేసుకుని కూర్చుంటాం. ఇది కొందరికి నచ్చదు. ఇది కల్చరల్ వ్యవహారం.
అయితే దీని వెనక సైన్సు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Journal of Clinical Nursing లో వచ్చిన అధ్యయనం ప్రకారం మోకాళ్ల మీద కాలేసుకుని కూర్చుంటే బ్రడ్ ప్రెజర్ (బిపి) పెరగడం కనపించింది. అదే కింది వైపు కాళ్ల మీద కాళ్లేసుకుని కూర్చుంటే (అంటేచీలమండ దగ్గిర ) ఎలాంటి మార్పులేదు. ఇలాగే Journal of Hypertension లో వచ్చిన మరొక పరిశోధన ప్రకారం మోకాలు మీద   కాలేసి కూర్చోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరగడం ఇంకా ఎక్కువయిందని మరొక సారి తేలింది.అంతేకాదు, ఈ పెరుగుదల బిపి ఉన్నవారిలో మరీ ఎక్కువగా ఉంది.
ఇది గమనించారా?
మీరెపుడు బిపి పరీక్ష చేయించుకుంటున్నపుడు డాక్టర్ మిమ్మల్ని కాలుమీద కాలేసి కాకుండా రెండు పాదాలు భూమి ఆన్చి కూర్చోమనే చెబుతాడు. దీనికి కారణం క్రాస్ లెగ్స్ కూర్చున్నపుడు బిపి పెరిగి, మీ ఒరిజినల్ బిపి రాదు. అందుకే డాక్టర్లు రెండుపాదాలు మొత్తం భూమిని తాకుతూ ఉండేలా, చేయి టేబుల్ మీద పెట్టి కూర్చోమని చెబుతారు.

ఈ రెండు పరిశోధనలే కాంకుడా మరిన్ని పరిశోధనలు కూడా కాలుమీదకాలేసి కూర్చోవడమనేది దర్జా కాదు, దర్పం కాదు బిపి పెంచే అలవాటుని రుజువు చేశాయి. ఇస్తాంబుల్ లోని ఒక హైపర్ టెన్షన్ క్లినిక్ లో జరిగిన బిపి మెజర్ మెంట్స్ గురించి బిబిసి రాసింది. ఇక్కడ కాలు మీద కాలేసి కూర్చుని బిపి రీడింగ్ తీసినపుడు బిపి పెరిగింది. అయితే,మూడు నిమిషాల తర్వాత నార్మల్ గా కూర్చోబెట్టి బిపి  టెస్ట్ చేసినపుడు బిపి నార్మల్ గా ఉంది.అంటే మోకాలు మీద కాలేసి కూర్చున్నపుడు బిపిపెరుగుతూ ఉందని ప్రపంచవ్యాపితంగా జరిగిన పరిశోధనల్లో తేలింది.

అందువల్ల చాలా సేపు ఇలా కాలు మీద కాలేసి దర్జాగా కూర్చోవడం మానుకోవాలని పరిశోధకుులు చెబుతున్నారు.

కొద్దిగా  బిపి పెరగడం నార్మల్ మనిషికి నష్టం కలిగించకపోవచ్చుగాని, ఇప్పటికే బిపి చికిత్సలో ఉన్నవాళ్ళకి ఇది మంచిదికాదని డాక్టర్లు చెబుతున్నారు.

ఈ పరిశోధనలో మూఢనమ్మకాలు కూడా బట్టబయలయ్యాయి. కాలు మీద కాలేసి కూర్చుంటే వెరికోస్ వెయిన్స్ అనే జబ్బు వస్తుందని ప్రచారంలో ఉంది. వెరికోస్ వెయిన్స్ అంటే రక్తనాళాలు ఉబ్బి కాళ్లమీద బ్లూ రంగులో చారల్లా కనిపిస్తూ ఉంటాయి. దీర్థకాలం కూర్చుని లేదా నిలబడి పనిచేసే వాళ్లలో ఈ జబ్బు వస్తుంది కాని, కాలుమీద కాలేసి కూర్చోవడం వల్ల రాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరొక విషయం,ముఖ్యమయిన కూడా ఏమిటంటే…గర్భిణీ స్త్రీలు కాలు మీద కాలేసి కూర్చోరాదని కూడా పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల యాంకిల్ (చీలమండ) వాయడం, కాళ్లలో క్రాంప్స్ రావడం జరగుతుందని వారు చెబుతున్నారు.
ఇలా కాలుమీద కాలేసి కూర్చున్నపుడు బిపి ఎందుకు పెరుగుతుంది?
కాలు మీద కాలేసి ‘దర్జా’గా కూర్చున్నపుడు రక్తం గుండెవైపు పాకడం జరుగుంది. దీని వల్ల గుండు ఎక్కవ వేగంగా రక్తాన్ని బయటకు పంప్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పటికే బిపి ఉన్నవాళ్లు ఎక్కువ సేపు కాలు మీద కాలు వేసి కూర్చోరాదు. అలా కూర్చంటే రక్త ప్రసరణ అటంకం ఏర్పడి డీప్ వెయిన్ త్రాంబోసిస్ (DVT అనే పరిస్థతి వస్తుంది. డివిటి అంటే బాగా లోతున కండరాల్లో ఉండే వెయిన్స్ లో రక్తం గడ్టకట్టడం (క్లాట్ ) అన్నమాట.ఇది సాధారణంగా కాళ్లలో, మోకాలి దగ్గిర, పెల్విస్ దగ్గిర వస్తూ ఉంటుంది. సాధారణంగా దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే చాలా సమస్యలు తీసుకొస్తుంది.