Home Features కోరోనా కాలంలో షడ్రసాల గురించి మాట్లాడుకోవలసిందే…

కోరోనా కాలంలో షడ్రసాల గురించి మాట్లాడుకోవలసిందే…

188
0
(*కురాడి చంద్రశేఖర కల్కూర)
మిత్ర బాంధవులందరికి శార్వరినామ్ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము యుగాది పచ్చడి షడ్రుచులు మమ్ములను సంతుష్ట పరచకపోవడమేగాక, సంకష్టములొ పెట్టింది. 
భారత దేశములొ మాత్రమే ఐదు వేల రకాల సస్యాహార పదార్థములు వాడకలొ ఉన్నాయని కొన్ని పరిశొధనలలొ తేలింది. ఇందులొ కొన్ని రుచులను మాత్రమే కలిపి ప్రతిరొజూ ఆహారాన్ని సేవిస్తూ ఉంటాము. ఈ రుచులన్నిటిని మన పూర్వికులు ఆరు రకాలుగా విభజించినారు. అవే షడ్రుచులు.

ఈ షడ్రుచులను ప్రతి రోజూ భుజిస్తూ ఉంటాము. ఐనా యుగాది పచ్చిడికి అదెందుకో ప్రత్యేకత. ఈ సంవత్సరాది.  పండుగనాడే షడ్రుచుల పదార్థాన్ని సాంకేతింగా స్వీకరించి జీవితమ్ అన్ని రుచుల మేళవింపు అని జ్ఞాపకమ్ తెచ్చుకొంటాము. ఉదాత్త  భావనలు (Sentiments) నిండా కలిగియున్న ఏకైక పదార్థము ఉగాది పచ్చడి. అది కూడా ఈ సంవత్సరం ఛేదు అనుభవాన్ని తెచ్చి పెట్టింది. 
మానవుడు చంద్రమండలానికి పయనించాడు. చాంద్రాయణం సప్ఫలీకృతమైంది.  ఇతర గ్రహాలకు దారి కనుగొనే ప్రయత్నములో ఉన్నాడు. ఉత్తర ధృవాన్ని పరిశోధిస్తున్నాడు. ఇంకా ఎన్నెన్నోఅన్వేషణలు, పరిశోధనలు సాహస కార్యాలకు పూనుకుంటున్నాడు. అయినా మానవ శరీరము అబేధ్యముగానే ఉన్నది. మానవ జాతి ఉన్నంతవరకు శరీరం విస్మయము అగోచరముగానూ, పరిశోధనకు పూర్తిగా అందకుండా మిగిలి పొతుంది. 

Think your friends would be interested? Share this story!

అలెగ్జాండర్  ప్రపంచాన్ని జయించడానికి ముప్పైమూడవ సంవత్సరములోనే బయలుదేరాడు.  మలేరియా జ్వరముతొ క్రిీ. పూ.323 లో చనిపోయాడు.
క్రీ.శ.1897 అగస్ట్ నెలలో, హైదరాబాద్ బేగంపేటలొని ఒక మిలిటరి డేరాలొ శోధించి, దొమకాటువల్ల మలేరియా వస్తుందని సర్ రొనాల్డ్ రొస్  కనుగొంటె, 1902 లొ ఆయనకు నొబెల్ బహుమానం ఇచ్చారు. కుక్క కాటుకు లూయిస్ పాశ్చర్  1885-86 లొ మందులు కనుగొన్నాడు. టయిఫొయిడ్, న్యూమోనియాకు, అలెక్షాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ 1928 లోనే కనుగొన్నప్పటికి, , 1942లొ, విజయవంతమైన ప్రయోగం జరిగింది. 1945 లొ ఆయనను నొబెల్ బహుమానంతొ సత్కరించారు.
సంక్రమిత రోగాలైన అమ్మవారు, కలేరా, ప్లెగ్ వంటి వాటిని ఇంచు, మించు గెలిచినట్లే.  అంటు వ్యాధులపించుకొన్న క్షయ, కుష్టు వ్యాదుల రూపు మాపక పోయినా, అంతటి భీకర స్థితిలొ లేవు. సకాలములొ వైద్యకీయ సూచనలు, సలహాలౌ పాటిస్తె సంపూర్ణముగా నయమవుతున్నాయి. 
 క్యాన్సర్, ఎచ్.ఐ.వి. వంటి ప్రమాదకర రోగాలు ఇంకా చికిత్సా విధానాలకు  అదుపులకు రాక ముందెే ప్రపంచాన్ని కబళించడానికి మహామ్మారి తయారైంది ఈ కారొనావైరస్, (COVID-19). ఈ రోగ కారణాల గురించి, ఉహా పోహాలేగాని, నిజ నిర్ధారణ లేదు. కచితమైన అభిప్రాయానికి రావడానికి ముందు, రోగాల చికిత్స అరిగట్టడం మేలు (Prevention is better than cure) అనేది వైద్య శాస్త్రం ప్రారంభమయినప్పటి నుండి వినపడుతున్న నానుడి .
ప్రస్తుతం కొరోనా రోగాన్ని అరిగట్టడానికి పలు  విధానాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలవరకూ మనుకు అహర్నిశలు భోధిస్తూనే ఉన్నారు. ఈ సూత్రాలను శిరసా, తు.చ తప్పకుండా పాటించడం తప్ప, వేరు మార్గాలు లేవని ప్రధాన మంత్రి మొదలు, ఆరోగ్యాధికారులవరకూ ప్రతి ఒక్కరూ, మళ్లీ మళ్లీ వేడుకొంటున్నారు.
ఇక్కడ ఒక మాట చెప్పాలి, మన దేశములో తీసుకొన్నంత ముందు జాగ్రత చర్య కరోనా నివారణకు, ప్రపంచంలోని ఏ ఇతర ఏ దేశమూ తీసుకొలేదంటె అతిశయోక్తి కాదు. 25 డిగ్రీలకంటె తక్కువ వాతావరణం ఉండే ప్రదేశాలలొ మాత్రమే కోరోనా రోగాణువు ప్రభావం ఉంటుందని అభిప్రాయం.
చైనాలొ ఈ రోగం ఉద్భవించింది.  ప్రపంచానికి పాకింది. ఇటలీ, మొదలైన అభివృద్ధిజెందిన ఐరోపా దేశాలు రోగతీవ్రతతో  తనకలాడుతూ ఉంటే, వేలాది మంది మృత్యువాతకు గురియవుతుంటె, అభివృద్ధి పథములొనే ఉన్న మనదగ్గర రోగం  బాధితులు, ఐదు వందల లోపలే. చావు పదికి అటు, ఇటు. హిమాలయాలలో ఉన్న, చైనా సరిహద్దు రాష్ట్రాలలొ ఈ నాటికీ, (మార్చి, 28,2020) ఉష్ణోగ్రతం 20 డిగ్రీలసెంటిగ్రేడ్  లోపే. ఇంతవరకు మాంసాహారులకు మాత్రమే ఈ రొగం సొకింది అంటున్నారు. ఎంతవరకునిజమో తెలియదు. ఏమైనా సరే మాంసాహారులు, చాలా జాగ్రతగా, ఆరోగ్య, శుచిత్వ సూత్రాలను పాటిస్తూ వారి ఆహార అలవాట్లను పాటించండం వారికే మేలు.  
  ఏ ప్రణాళికైనా దీర్హకాలిక (Long term) మరియు స్వల్ప  కాలికముగా (Short term) ఉంటాయి.   స్వల్ప  కాలిక నివారణ  చర్యలను    పైన చెప్పినట్లు, ప్రభుత్వ  యంత్రాంగం ప్రకటిస్తూనె ఉంది.  దీర్ఘ కాలిక పరిహారం ఇప్పుడే కనుగొలేక పోవచ్చు. అయినా, సస్యాహారం, శుభ్రత, స్వచ్ఛతవంటి గాంధేయ మార్గాలు దీనికి తోడునీడ అన్నది అవివాస్పదం.
 భగవంతుని సృష్ఠిలొని ప్రతి జీవరాశికి తనదైన ఒక స్వభావంతో ఉంటుంది.  మానవుడు ఇతర జంతువులకంటే విభిన్నమైన లక్షణాలు కలిగిన వాడు. ఆహార వ్యవహారాలలో తనదైన శైలిలొ వ్యవహరిస్తాడు.  ప్రపంచములొ ఏ మూల ఉన్నాఇతర జంతువులకు వాటిదైన ఆహార పద్దతులున్నాయి. కాని మనిషి తన ఆహర పద్థతులను   సర్దుకొని ఎక్కడ ఉంటే అక్కడ పద్దతికి అనుకూలముగా అలవాటు పడుతాడు. ఇతర జంతువులు  తమ తమ ఆహారము ఎక్కడ దొరకుతుందొ అక్కడికే వలస వెళ్ళతాయి. మృగాలయం (zoo) లొ ఉన్న జంతువులను కూడా వాటి స్వాభావికమైన ఆహరాలతోనె పోషించడము ఆనవాయితి. ఉదాహరణకు, ఏనుగు. అంత పెద్ద జీవి సస్యాహరి.  చూడడానికి మనిషికి, మనిషికి ముఖ చాయలొ వ్యత్యాసము కనిపించినప్పిటికి అందరికి ఒకటే రకమైన అవయవాలు, అంగాంగములు. ఈ లక్షణాలైతే  అన్ని జీవ రాశులకు ఉన్నాయి.
ఒక విస్మయమేమంటె మనిషి ప్రపంచములొ ఎక్కడ నివసించి ఉన్నా ఏ ఆహారాన్ని సేవించినా అందరి అన్ని దైహిక లక్షణాలు ఒకేరకంగా ఉండడాన్ని గమనిస్తాము.  చైనా వాళ్ళు బొద్దిం, కప్ప, తేలు, పాము లాంటి అన్ని రకాల జంతువులను ఒండి/పచ్చిగా తింటారట.ఐతే ఒక విశిష్టత ఏమంటే,   వారిది, గాంధీ, బర్నార్డ్ షా వంటి సస్యాహారులది, భూమధ్య రేఖ చుట్టూ ఉన్న ఆఫ్రికా మనిషిది, ఊత్తర ధ్రువములొని ఎస్కిమోలది దైహిక తాపం,(Body temperature 98.4* F) రక్తపు పోటు,(Blood pressure 90-140) రక్తములొని చక్కెర అంశము,(Blood sugar level 90 – 120) రక్త సమూహాలు (Blood groups A+, A-, O, O+. B, C etc.) మొదలైనవి ఒకే ప్రమాణాలలొ  ఊండటం.
పసి పిల్లలనుండి  వయస్సు పైబడే వరకు ఈ ప్రమాణాలలొ  వయస్సును బట్టి కొంత తేడా ఉండవచ్చుగాక, రక్త సమూహాలు మరియు దైహిక తాపము ఒక్కటె. శరీరానికి దేశానికి, కాలానికి సర్దుకుపొయె ఈ  అద్భుతమైన శక్తిని చేకూర్చెేది కూడా మేము తినే ఆహారమె. దీనిని వైద్యకీయ పరిభాషలొ acclimatisation (సర్దుకు  పోవడం)  అంటారు.   
            మన పెద్దలు, మనం సేవించె ఆహారాన్ని రుచిని పట్టి ఆరు విధాలుగానూ, గుణాలను బట్టి మూడు విధాలుగానూ విభజించియున్నారు. రుచులు- తీపు, చేదు, ఒగరు, కారము, ఉప్పు, పులుపు. గుణాలను బట్టి  సాత్విక, రాజస, తామస లక్షణలన్నారు. ప్రపంచములోని ఎ మూల ఏ ఆహారాన్ని సేవించినా అవన్ని ఈ ఆరు రుచులకు మూడు గుణాలకు లొబడి ఉండాలి.
అది సృష్టి కర్త యొక్క ఆదేశము. మానవ శరీరము  ఒక అసాధారణమైన అభేధ్యమైన అత్యంత గురుతరమైన క్రమశిక్సణ గల్గిన, స్వయమ్ పరిపూర్ణత కలిగిన  యంత్రము. దీనికి ఇంధనము, ముడి సరకు మేము సేవించె ఆహరము. మానవ శరీరము అనె యంత్రానికి ఆహారము మరియు ముడిసరుకు షడ్రాసాలైనప్పుడు ఉత్పత్తి కూడా ఒకే మాదిరిగా ఉండాలి కదా మరి! అవే శరీర స్తితిగతులు. 
 భగవద్గీతలొ 17వ అధ్యాయములొ శ్రీకృష్ణ భగవానుడు సాత్విక. రాజస మరియు తామస  ఆహారల గుణ లక్షణాలు, శరీరము పై వాటి ప్ర భావముగురించి వివరించియున్నాడు. ఋషులు, మునులు, తపష్యలు, సన్యాసులు, సాధువులు సాత్విక ఆహారాన్నిసేవించాలి. అందుకే వారికి, మాంసము, ఉల్లిగడ్డలు, ఉల్లిపాయ, దుంపలు,మెరపకాయ వంటి కార పదార్థాలు వర్జ్యమ్.  క్షత్రియ రోషావేషముతొ వ్యవహరించాలి. అందుకే వారు క్షణికమైన    రాజస ఆహారాన్ని సేవించాలి. కాయ కష్టము చేసేవారు, కొవ్వు ఎక్కువ గలిగిన తామస ఆహారానికి అలవాటైయుంటారు. 
హితభొదకులు ఆహార సేవనా విధానాన్ని గురించి మూడు నియమాలు పాటించమన్నారు;
 हित बूक  హిత బుక్- కాలము, వయస్సు, ప్రదేశములను బట్టి శరీరానికి హితమైన ఆహారమ్; నోటికి మాత్రమే కాదు.
मित बुक మిత బుక్ – మితమైన ఆహారమ్.
काल बुक. కాల బుక్ – సకాలానికి ఋతు ధర్మాన్ని పాటించి ఆహారము. 
పై మూడు అంశాలలో ఒక్కొక్కదానికి వ్యాఖ్యానాలు, వివరణ ప్రత్యెేకముగా అవసరం. 
       పప్పే పస బాపలకును,
       ఉప్పే పస రుచులుకెల్ల, ఉవిదలకెల్ల
       కొప్పే పస, దంతములకు, 
       కప్పే పస కుందవరపు కవిచౌడప్పా
            ఎంత సహజమైన మాట. మన యుక్త వయస్సు బ్రహ్మాచారిని/అమ్మాయిలను, వారి తల్లి తండ్రులను “పప్పన్నము ఎప్ఫు డు పెడ్తారండి” అనడము ఆనవాయితి. కడంగోడ్ శంకర భట్ట అని ఒక ప్రసిద్ధ కన్నడ కవి కుమార్తె ఒకనాడు “నాన్న ఈ రొజు అమ్మ బయట. ఒంట నేనె చేసినాను. రుచిగా ఉన్నదా?” అని అడిగిందట. హాస్య చతురతకు  పెరొందిన భట్ట్ గారు “అమ్మ నా భాద్యతను గుర్తు తెస్తున్నావు. ఈ నాటినుండె మంచి సంబంధాలు  వెతుకుతాను” అని సమాధానము ఇచ్చారట. దేహ రక్షణకు మూల కారణమైన ఆహారానికి అప్పుడున్న ప్రాశస్త్యమది. ఇప్పుడే మేంటారు, “నా కూతురు వంట మనిషిగా ఒకరింటికి పొదు. ఆమె ’educated’.  లక్షలు సంపాదిస్తుంది. హోటెళ్లు ఎందుకొరకు?”.  ఎంత శుచిత్వముగలిగిన  హోటెలు అయినా అక్కడి తిను బండారాలు అతిగా సేవించడమువల్ల కొన్ని నయము కాలేని బాధలకు లొను కావడము తథ్యము.
సందర్భానుసార  నిమిత్తము హోటేలు మరియు  రుచికమైనది హితకరమైనది కాక పొయినా కాలానికి దొరకిన ఆహారాన్ని సేవించడము అవసరము. అయితెే అదే పనిగా ‘హొటెల్ మే ఖానా అయితెే, హొస్పిటల్ మే సొనా’ తప్పదు.  
అలాగె ఎవరిగో ఎక్కడొ పరిశొధనలొ మంచిది అని తేలిన ఆహారాన్ని ఇతర దేశాలలొ సేవించడము ఎంతవరకు భావ్యమో మనం ఆలొచించాలి. నోటికి రుచియైనది ఉండవచ్చు. శరీరానికి హితమా అనెేే ఆలోచన కూడా ఊండాలి. అకలిగొన్నప్పుడు అతిగా తినడం, మరి ఆకలి చచ్చెేంతవరకు ఉపవాసమ్ ఉండడమూ రెండూ ప్రమాదకరమే!. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశమ్ పంతులుగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలోనూ, దారిన కారు ఆపి పచ్చి జొన్న కంకుళ్ళు, వేరు శెనుగ, ఉలవలు, మినపలు, కందులు వంటిని తను తింటూ,  సిబ్బందికి “ఓరె! ఆకలిని చంపకూడదురా. మహాపాపము. తన కడుపికి ద్రోహము యొసగువాడు పరమ ద్రోహి. ఆ ద్రొహానికి ఒడిగట్టను. మీరు కూడా తిన్నండ్రా” అనే వారట. (ఆ రొజుల్లొ ముఖ్యమంత్రి గారికి ఇన్ని హంగామాలు లెేకుండా చాలా పరిమితమైన వ్యక్తిగత సిబ్బంది, సాంకేతిక రక్షణ వలయం, ఒక కారు మాత్రమె ఉండెేది.) 
           “శరీరమాద్యం ఖలు ధర్మ సాధనమ్” (शरीरमध्ये खलु धर्म साधनम.) అన్నాడు కాళిదాసు. ఏ సాధనకైనా శరీరమే మూలము. శరీరము సహకరించకపొతె మనస్సు మరియు మెదడు నిష్క్రియమ్ కావడం సహజము. అందువల్ల ఆహరము సేవించడములొ నిర్లక్షం ఉండరాదు. 
కర్నూలు సర్వజన ఆసుపత్రి విశ్రాంత నిర్దేశకులు డా. బి.సి. రాయ్ పురస్కార గ్రహిత, కీ.శే. ఆచార్య డా. న్యాపతి రామచంద్ర రావుగారు ఒక సూక్తి వినపిస్తూ ఉండెవారు. “Spirit is willing. Flesh is weak.” (ఉత్తేజము ఉన్నది. కండరాలు  బలహీనంగా ఉన్నవి.)
                    ఐదు వేల రకాల సాంప్రదాయిక సస్యాహారముల ఒంటకాలు మన  దేశములొ వాడకలొ ఉన్నట్లు పైనా పేర్కొన్నాను. ఈ వంటకాలను, రాష్ట్ర, ప్రాంత, కుల, మత, శాఖోపశాఖలను బట్టి సేవించడము గమనార్హమ్. ఉదాహారణకు తెలుగు  క్షత్రియుల ఇండ్లలో  అల్లుడు వస్తె పూత రేఖలు చేసి తీరాలి. మాధ్వ బ్రాహ్మణులకు బిసిబెళె బాత్ మరియు మండిగెయే పరమార్థము. రాయలసీమలొ హొళిగల్/భక్ష్యాలు  మరి కోస్తాలొ బొబ్బట్లు పెద్ద పండుగలకు శ్రేష్టమ్. కాకినాడ ఖాజాలు, బందర్ లడ్డు, రాయలసీమ పప్పు, హైదరాబాద్ బగర్ బైంగన్.  ఆయా కాలానికి, ఆయా ప్రాంతానికి వాతావరణాన్ని బట్టి  పంటలు పండడము ప్రకృతి సహజము. మానవులు  ప్రకృతి నియమాన్ని పాటించాలి.  దానికి విరోధముగా వ్యవహరించడము ఆరోగ్యానికి ముప్పు. ఉదాహరణకు దక్కన్  ఫీఠభూమిలో(మరాఠ్వాడా,  ఉత్తర కర్ణాటక, తెలంగాణ, మరియు రాయలసీమ ప్రాంతములు) పండిన మిరపకాయిలొ ఉన్నంత కారము కర్ణాటకలొని శీతల ప్రాంతములొ పండిన జనప్రియమైన బ్యాడగి (హావేరి జిల్లా) మెరపకాయిలొ  ఊండదు. అమేరికాలొని పండె మెరుపకాయిలొ అసలె కారముండదు. కారము ఎక్కువగా తిన్నప్పుడు మంచినీళ్ళు ఎక్కువగా తాగుతాము. దానివల్ల శరీరము చల్లబడడానికి అవకాశముగలుగుతుంది. శీతల ప్రదేశాలలొ నీళ్ళవాడకం తక్కువగా ఉంటుంది. అమెరికాలొ అసలె నీళ్ళు త్రాగె అలవాటు లేదు.  పశ్చిమ కోస్తా ప్రాంతమంతటా ( కేరళ, కొస్తా కర్ణాటక, గోవా, కోంకణ కొస్తా,) కొబ్బరి నూనెతొ ఒంటలు ఒండుతారు. భొజనానికి వాడుతారు, వంటలొ కూడా, పప్పు తక్కువ, కొబ్బరి ఎక్కువ ఉంటుంది. అక్కడి వాతావరణములొ ఎక్కువ చమట పోస్తుంది. చమటలొ కొవ్వునష్టమవుతుంది.  శరీరానికి పరిమిత కొవ్వు అవసరం. నష్టమైనది కొబ్బరి వాడకద్వారా పూరైస్తారు.   Doctor cures. Nature heals. ఏర్ కండీషన్ యుగములొ అన్ని తారు మారు. 
                “తక్రాంతె భొజనమ్. భొజనాంతె ఫలము” (तक्रांते भॊजनम. भॊजनांते फलम) అన్నది ఆర్యోక్తి. పెరుగుతొ భొజనమ్ పూర్తి. భొజనము తరువాత పండు. దీనిని సుప్రసిధ్ద భారత ఆంగ్ల రచయిత ఆర్.కె.నారాయణ్ ప్రపంచీకరించినారు. “South Indian meal is incomplete without curd or buttermilk”. (పెరుగు లేక మజ్జిగ లేనిదే దక్షిణ భారతమ్ భోజనమ్ అసంపూర్ణము).  పచ్చి కూరగాయిలు దేహానికి మంచివి. ఆకు కూరలు ఇంకా మేలు. పండ్ళు కూరగాయలామె ఇంటిదగ్గరికి తెస్తుంది. అవి ఖరిదు ఎక్కువ అని, పావ్లా, అర్ధ రూపాయి బేరం చేసి, వాపాసు పంపుతాము.
ఆమె ఘర్మ జలానికి ఖరీదు కట్టగలమా? ఖరీదు కట్టగల  వైద్యులకు వందల రుసుము చెల్లిస్తాము. వేల రూపాయిల మందులు కొంటాము. ఆస్పత్రులకు లక్షలు  బిల్లులు కట్టుతాము.   రోజుకొక ఆపిల్ పండు వైద్యులను మైళ్ల దూరమ్ ఉంచుతుంది (One apple a day, keeps doctors mails away.) సామెత. మనమ్  ప్రకృతి నియమానికి విరుద్ధంగా మార్చుకొన్న అలవాట్లన్నీ ఆరొగ్యానికి హానికరమైనవని తెలిసి నా వాటిని వదులుకోం. బదలుగా ఈత/సిరి సాపలు వాడెవాళ్ళని, కంబళ్ళపై పడుకొనెే వారిని, జొన్న రొట్టె తినే వారిని అనాగరకులు, కాలమ్ చెల్లినవారు, (Outdated), అవిద్యావంతులు (uneducated) అనెే ముద్రతొ ఎక్కిరిస్తాము.  ఖాదీ ఉద్యమములొ గాడిచర్ల హరిసర్వొత్తమ రావుగారు చెప్పెవారంట “We experience three variation in weather conditions; hot, hotter and hottest. Khaddar is the most suitable cloth; wear it with pride. (మనమ్ వాతావరణమును మూడంచెలుగా అనుభవిస్తాము; ఉష్ణము, అతి ఉష్ణము మరియు సహనాతీత ఉష్ణము. ఖద్దర్ అనువైన బట్టలు. గర్వముతొ వాటిని ధరించండి.) అందరూ మన వాతావరణానికి అనువైన మన గ్రామములొ పండిన కూరగాయల వంటకాలు సేవించి  చెనెత బట్టలు వాడితె రైతుల ఆత్మహత్యలను కూడా అరికట్టవచ్చు కదా మరి. 
 అందుకే గదా, నవ రసాల సాహిత్య రచనలతో రాయలవారిని మెప్పించడము అలనాటి చరిత్రయితే, రస రమ్య కావ్యం రాయమని రాయలవాఅరు అడిగినఫ్ఫుడు తెలుగువారిని ఐదు శతాబ్ధాలాకు పైగా అలరించిన  ఆంధ్ర కవితా పితామహ అనిపించుకొన్న పెద్దనామాత్యుడి వంటి పెద్ద మనిషే
 “నిరుపహతి స్థలంబు రమణీప్రియ దూతిక తెచ్చి యిచ్చుక 
ప్పురవిడెమాత్మకింపైన భోజనముయ్యెల మంచమెప్పుత
ప్పరయు రసజ్ఞులూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరకిన గాక ఊరకె కృతుల్ రచయించు మటన్న శక్యమే?”
అన్నాడు కాద మరి.  భొజనము అనగానె షడ్రసాలే. మరీ “ఆత్మకింపైన” అన్నప్పుడు అవి మరీ మేళవించి ఉండాలి కదా.
 అన్నిటిని మించి మన ఆరోగ్యాన్నిశరీర స్థితిగతులను కాపాడె ఒక ద్రవము నీళ్లు. సేవించె నీళ్లకు తెలుగులొ “మంచినీళ్లు” అంటాము. ఈ పదము తెలుగువారి సొత్తు. ఇతర భాషలలొ దీనికి ప్రత్యామ్న్యాయ పదాలు లేవు. ఆంగ్లములొని  potable water అనేది దీనికి సమానము కాదు గాని, దగ్గర పదము. అంటే అందులొ అంత మంచితనము గలదు. ఈ రొజు మనకి మంచి నీళ్లు దొరకవు. మన కొళాయిలలొ కలుషితమైన నీళ్లె వస్తాయి. జాగ్రతగా స్థానిక సంస్థలు సరఫరా చెసే నీళ్లను “రక్షిత నీటి సరఫరా”  (Protected water supply) అంటారు. ఏ శుభ కార్యానికైనా  ముందు కలశాన్ని పూజిస్తాము.
“ఎలాగున్నారు” అన్న మిత్రుల ప్రశ్నకి, నా సమాధానం: “బాగున్నాను. నెలకి ఐదు వేల కి.మి బస్సు, రైలు, కార్లలొ తిరుగడానికి ఇబ్బంది లేదు. ఎనభైవ సంవత్సరంలొ ఉన్నాను. పెండ్లికి పిలిస్తే పొతాను. చావు తెలిస్తే పొతాను. అద్దె ఇంట్లొ ఉన్నాను. స్కూటరులొనే తిరుగుతాను.” అంటూ ఉంటాను. ఒక మిత్రుడన్నాడు- “నీవెందుకు బాగుండవ్రా? చల్ల నీళ్లతొ స్నానము చెస్తావు. వేడి నీళ్లు తాగుతావు.  ఈత సాప లేక కంబడి మిద పడుకొంటావు. ఖద్దర్ బట్టలు తొడుగుతావు. మాంసము మధ్యము సేవించవు. పొగ త్రాగె అలవాటు లేదు. చక్కర వ్యాధి , రక్తపు పొటు గురించి మాట్ళాడవు. సమయానికి మందులు తింటావు; భొజనము చెేస్తావు. ఇతర దుర్వ్యసనాలు ఉన్నట్ళు నాకు తెలియదు. బస్సులొ కూర్చొంటె అది ఊరు పొలిమెర దాటక ముందె నిద్ర పొతావు. ఏది పట్టించుకొవు. నీ మెదుడుకి రక్తానికి టెన్షన్ అంటే ఏమిటో అని తెలియదు… ఇత్యాది, ఇత్యాది”.
ఇప్పటికి, వచ్చిన బ్రహ్మరాక్షసం, కోరోనా. ఇది కచ్చితంగా  ప్రపంచీకరణ  దుష్ప్రభావం.  ఇక ముందు ఏమేమి రానున్నాయో, బ్రహ్మంగారి “కాలజ్ఞాన “మయితే నేను పూర్తిగా చదువలేదు. అయితే ఆరోగ్య సూత్రాలను, ప్రత్యేకముగా ఆహారాలలొ కాపాడడంలొ, ఈ నాటి మహామ్మారి కోరోనానే కాదు, ఇంకా, ఉన్న, రాబోయె, ఎన్నెన్నోరోగాలను మాత్రము అరిగట్టవచ్చు, కనీసం అదుపులోనైనా పెట్టుకొవచ్చు. మాంసాహారాన్ని త్యజించండని ఉచిత సలహా ఇవ్వవచ్చు. దానికి కొన్ని తరాలుగా అలవాటు పడినవారికి, అది కొంచం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే కొన్ని పరిశ్రమలు దాని పై ఆధార పడి ఉన్నాయు. అందువల్ల వాటిని స్వచ్ఛందంగా నియంత్రించుకొవాలి. సామూహిక విందు భోజనాలలొ వాటిని నియంత్రించాలని  విజ్ఞుల  అభిప్రాయం. సరే, ఇప్పటికయితే,  ఇంటికే పరిమితం కావాలి.  ఆలోచించండి, ఆహార వ్యవహారాలలొ, ప్రపంచీకరణామా?  ఐదు  వెేల రకాలల భిన్నత్వం  చాలకనా? ప్రాదేశీకరణమా? (Globalisation? or Regionalism?) 
అన్నపూర్ణేశ్వరీయేనమః

 

(*చంద్రశేఖర కల్కూర విరామం తీసుకున్న ఉడిపి హోటల్ యజమాని, కన్నడ తెలుగు భాషలలో ప్రావీణ్య ఉన్నపండితుడు. కర్నూలులో నివాసం ఉంటున్నారు. తెలుగు భాషాభివృద్ధికి  రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తుంటారు.)