చెన్నై తిరిగొస్తున్న చిన్నమ్మ…

శశికళ నటరాజన్  (69) గుర్తుంది కదా? నాటి ముఖ్యమంత్రి జయలలితకు సలహాదారుగా ఉంటూ తమిళనాడు రాజకీయాలను చిటికెన వేలుతో నడిపించిన మహిళ.

భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా పాలిటిక్స్ లో  లేకుండా పాలిటిక్స్ ను గుప్పిట్లో పెట్టుకున్న నాయకులు కనిపించరు. అయితే, జయలలిత మరణంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.

ఆమెను ఒక పెద్ద రాజకీయ శక్తిగా చేసిన  జయలలిత అనుమానాస్పదంగా చనిపోయింది. జయలలిత మీద ఉన్నఅక్రమాస్తుల కేసులో ముద్దాయిగా  అయింది.  జైలు శిక్షపడింది. అప్పటినుంచి ఆమె బెంగుళూరు పరప్పన అగ్రహార జైలులో ఉంటున్నారు. కోర్టు విధించిన పదికోట్ల ఫైన్ కూడా చెల్లించారు. దీనితో ఆమెను విడుదల చేసేందుకు నిర్ణయించింది. సత్ప్రవర్తన కింద ఆమెకు  135 రోజుల రెమిజన్ రావలసి ఉంది. అదిరాలేదు.

అందువల్ల మామూలగా  ఆమె నాలుగేళ్ల శిక్షాకాలం తీరిపోవడంతో జనవరి 27న ఆమె జైలు నుంచి విడుదలవుతున్నారు. లేదు ఇంకా ముందుగానే విడుదలవుతారని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు విడుదలైన వెంటనే  తమిళనాడువస్తారు.  చెన్నై వచ్చాక తన ప్రతిజ్ఞ నేరవేర్చే  ఎత్తుగడ వేస్తారని సర్వత్రా అనుకుంటున్నారు.

జైలు కెళ్లే ముందు శశికళ చేసిన ప్రతిజ్ఞ గుర్తుందా?

ఫిబ్రవరి 15, 2017న  బెంగుళూరు జైలుకు బయదేరే వ్యాన్ ఎక్కే ముందు శశికళ చెన్నై మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి దర్శించారు. అక్కడ సమాధి మీద మూడు పిడిగుద్దులు గుది, “ నేను జైలు నుంచి తిరిగొస్తాను. కుట్రకు, ద్రోహానికి ప్రతీకరాం తీర్చుకుంటాను,” అని ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ నెరవేర్చేందుకు ఆమె కంకణం కట్టుకుంటారా?

నిజానికి జయలలిత చనిపోయాక  శశికళ ముఖ్యమంత్రి అయ్యేందుకు రంగం సిద్ధమయింది. ఈ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నపుడు  2017 ఫిబ్రవరి 14న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఆమె ఆశల్ని వమ్ము చేసింది.

2004 నాటి అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు విధించిన  శిక్షని సుప్రీంకోర్టులో  ఖరారయింది. జైలు కెళ్లాల్సి వచ్చింది.

తర్వాత ఆమె ఇపిఎస్-ఒపిఎస్ (EPS-OPS) కంట్రోల్ లో ఉన్న  ఎఐఎడిఎంకె నుంచి 2017 ఆగస్టులో ఆమె జైలులో ఉన్నపుడు బహిష్కరించారు.

తమిళనాడు రాజకీయాలు ఈ మధ్య ఏ మాత్రం రసవత్తరంగా లేవు. జయలలిత, కరుణానిధి చనిపోయాక ఇక బిజెపి దూకుతుందని, ద్రవిడ రాజకీయాలనుంచి తమిళనాడుని కాషాయ రాజకీయాల్లోకి లాక్కొస్తుందనుకున్నారు. అదీ జరగలేదు. అంతా స్టేటస్ కో కు అడ్జస్టయిపోయారు.

పళని  స్వామి , పన్నీర్ సెల్వమ్ (EPS-OPS) కూటమి చెక్కు చెదరకుండా పరిపాలన సాగిస్తూ ఉంది. ఇపిఎస్ అంటే,  ముఖ్యమంత్రి ఇ పళని స్వామి, ఒపిఎస్ అంటే ఉపముఖ్యమంత్రి  ఒ పన్నీర్ సెల్వమ్. శశికళ జైలు పోయాక కొద్ది రోజులు కొట్లాడుకున్నా,  తర్వాత రాజీ అయి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదువులను పంచుకుని  హయిగా ఉంటున్నారు. వీళ్లకి పైనుంచి బిజెపి అండ ఉందని చెబుతున్నారు.

2021 మే జరిగే ఎన్నికల్లో ఎఐఎడిఎంకె ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళని స్వామి అని ప్రకటించుకున్నారు.

శశికళ ఏ పాత్ర పోషిస్తారు?

శశికళ చాలా కీలకమయిన ఎన్నికల  సమయంలో జైలు నుంచి విడుదలవుతున్నారు. కాని, జైలు శిక్ష వల్ల  ఆమె ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పొటీచేసే అవకాశం లేదు  కాబట్టి  పరోక్షంగా,గతంలో లాగే తెరవెనక ఉండి రాజకీయాలను నడపాలి. ఎలా?

గత వైభవం రోజుల్లో పళనిస్వామిని, పన్నీర్ సెల్వం ఇద్దరిని శశికళయే అందలం ఎక్కించింది. దీని సాక్ష్యం, పన్నీర్ సెల్వం శశికళ ముందు సాగిలపడటమే నమస్కరించడమే. తాను జైలుకు వెళ్లే ముందు పన్నీర్  సెల్వమ్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి పళని స్వామిని శశికళ ముఖ్యమంత్రినిచేసింది.

దీనికి కృతజ్ఞతగా ఆయన సాగిలపడి నమస్కారం చేశారు.  అయితే, వీరిద్దరు ఇపుడు ఆమెను ఎఐఎడిఎంకె లోకి ఆమెను ఆహ్వానిస్తారా? అనుమానమే. ఆమె జైలు నుంచి విడుదలై వస్తుందని తెలిసినా జనవరి 9వ తేదీన ప ముఖ్యమంత్రి  పళనిస్వామియే మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని  ఎఐఎడిఎంకె కౌన్సిల్ తీర్మానించింది.

ఎఐఎడిఎంకె లో చోటు లేకపోతే, శశిశళ దారి ఎటు?

మరొక ఆప్షన్ ఆమె మేనల్లుడు టిటివి దినకరణ్  స్థాపించిన అమ్మ మక్కలి మున్నేట్ర కళగం (AMMK). పొరపచ్చాలున్నా దినకరణ్ తో కలపి పోయి, ఈ పార్టీని పెంచి పెద్ద చేయాలి.  జయలలిత  చనిపోయాక జరిగిన రాధాకృష్ణ నగర్ (ఆర్ కె నగర్) ఉప ఎన్నికలో గెల్చి దినకరన్ అసెంబ్లీలో  ప్రవేశించారు.

తర్వాత 2019 లోక్ సభ ఎన్నికలల్లో గౌరవ ప్రదంగా 5శాతం ఓట్లు సంపాదించాడు.

అందువల్ల శశికళ ఈ పార్టీలో చేరి కొత్త రాజకీయ నాటకం నడపవచ్చనేది ఒక వాదన. ఆమె బయటకు రాగానే, ఎఐఎడిఎంకెలో ఉన్న అసంతృప్తి వాదులంతా పోలోమని స్వాగతం చెప్పవచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఆమెకోసం చెన్నైలో మంచి పోయెస్ గార్డెన్ లోనే ఒక  కొత్త ఇల్లు కడుతున్నారు. మళ్లీ పోయెస్ గార్డేన్ పొలిటికల్ సెంటర్ కాబోతున్నది.

మొత్తానికి ఆమె ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. పన్నీర్ సెల్వాన్ని మచ్చిక చేసుకుని ఎఐఎంకెలోకి దూరడం, కావాలంటే ఎఎంఎంకె ను తర్వాత వీలినం చసుకోవచ్చు.  లేదా ఎఎంఎంకె లో చేరి ఎఐడిఎంకెని దెబ్బతీయడం.

భారతీయ జనతా పార్టీ లో పాత్ర ఎలా ఉంటుంది?

శశికళ రాగానే బిజెపికి చేతినిండా పని ఉంటుంది. ఎందుకంటే, రెండు ద్రవిడ పార్టీలను దెబ్బతీసే అజండాతో బిజెపి కాచుకుని  ఉంది కాబట్టి తమిళ నాడు రాజకీయాలను కొనవేటితో నడిపించిన శశికళను ప్రత్యక్షంగానో, పరోక్షంగా బిజెపి ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు.

శశికళరాకను దృష్టిలోపెట్టుకునే  రాజకీయాల్లోకి రాకుండా రజినీకాంత్ ను భారతీయ జనతా పార్టీయే నివారించందని కూడా కొందరు అనుమానిస్తున్నారు. అనుభవం లేని సినీనటుడిని నమ్ముకోవడం కంటే, అనుభవం, అనుచరులు, ఆస్తులు ఉన్న శశికళే ఎప్పటికైనా మేలని బిజెపి భావించినందునే  రజినీకాంత్ కు నచ్చ చెప్పి రాజకీయ పార్టీ పెట్టకుండా ఒప్పించిందని తమిళనాడు ఒక టాక్ ఉంది.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలంగా పాల్గొనకపోయినా, 2023/2024 లోక్ సభ ఎన్నికల నాటికి శశికళ ఫుల్ ఫామ్ లోకి వస్తుందని, రాజకీయాలను మళ్లీ శాసించడం మొదలుపెడుతుందని చాలా మంది భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *