Home Features గుజరాత్ సర్దార్ పటేల్ విగ్రహంలో చైనా సరకు ఎంత?

గుజరాత్ సర్దార్ పటేల్ విగ్రహంలో చైనా సరకు ఎంత?

307
0
గాల్వాన్ లోయలో 20 మంది భారతీయులను హతమార్చి, భారత భూభాగాన్ని కభళించేందుకు చైనా ప్రయత్నించిన తర్వాత చైనా వస్తువులను బహిష్కరించాలన్న సెంటిమెంట్ ప్రజల్లో బలపడుతూ ఉంది. చాలా చోట్లో మేడ్ ఇన్ చైనా వస్తువులను బహిష్కరిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజలు చైనా వస్తువులను కాల్చేశారు. టివి లను పగుల గొట్టారు. చాలా కంపెనీలు ఇక ముందు చైనా వస్తువులను దిగుమతి చేసుకోరాదని నిర్ణయించాయి. ట్విట్టర్ #BoycottChina #BoycottMadeInChina వంటి హ్యాండిల్స్ బాాగా ట్రెండ్ అవుతున్నాయి.
మరొక వైపు చైనా వస్తువులను బహిష్కరించడం అంతసుళువుకాదనే వాదన కూడా వినబడుతూ ఉంది. ఎందుకంటే చైనా వస్తువులు,ముడిసరుకులు, విడిభాగాలు భారతదేశంలో ఎంత లోతుగా చొచ్చుకుపోయాయంటే, దేవతల విగ్రహాలను కూడా చైనాలోనే తయారుచేయించేపరిస్థితి వచ్చింది. భారీ విగ్రహాల తయారీలో చైనాకు ఉన్న నైపుణ్యం అలాంటిది. ప్రతి ప్రాజక్టులో ఎంతో కొంత భాగం చైనా ముడి సరుకో, విడిభాగాలో, నైపుణ్యమో ఉంటున్నది. చివరకు సర్దార్ పటేల్ భారీ విగ్రహంలో చైనా ఆనవాళ్లున్నాయి. ఇది ఈ రిపోర్టు చదవండి.

 

 

ఈనేపథ్యంలో  గుజరాత్ లో సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలోని సాధు గుట్ట మీద ఏర్పాటుచేసిన సర్దార్ పటేల్ విగ్రహం ప్రస్తావన వస్తూ ఉంది. ఈ విగ్రహాన్ని చైనాకు చెందిన ఫౌండ్రీ తయారు చేసిందనే వివాదం ఆ రోజుల్లో చెలరేగింది. ఈ ఫౌండ్రీ పేరు సియాంగ్జీ టాంగ్కింగ్ మెటల్ హ్యాండి క్రాఫ్ట్స్ (Jiangxi Tongquing Metal Handicrafts). ఈ విషయం విగ్రహం ప్రతిష్టించడానికి ముందే వివాదం సృష్టించింది. భారతీయత, భారత జాతీయ వాదం ప్రేరణ కోసం ఉక్కు మనిషి సర్దార్ పేటల్ విగ్రహాన్ని చైనా ఉక్కుతో చేయడం మేమిటని ప్రశ్నించారు. చిత్రకూట్ లో ఒక సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించడంతో ఇది వివాదమయింది. అంతేకాదు, విగ్రహాన్ని మెరుగులు దిద్దేందుకు ఏకంగా చైనా కార్మికులు వచ్చి పనిచేశారని మరొక కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ పేర్కొన్నారు. .ఈ ఫోటోలను కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ ట్వీట్ చేశారు కూడా.

ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రతిపాదించారు.కంపెనీ దక్షిణ చైనా లో ఉంటుంది. ఈ కంపెనీ చాలా పెద్ద పెద్ద విగ్రహాల మీద పనిచేసింది.ముఖ్యంగా బుద్ధ విగ్రహాలను తయారు చేసింది.
అయితే, ఈ విగ్రహాన్ని చైనాలో తయారుచేశారన్న విమర్శను ఎల్ అండ్ టి  ఖండించింది. ఈ మేరకు ఈకంపెనీ  2015లో ఒక ప్రకటన కూడా విడుదల  చేసింది. విగ్రహం ఇండియాలోనే తయారయిందని, కాకపోతే, విగ్రహానికి అవసరమయిన బ్రాంజ్ పలకాలను మాత్రం చైనానుంచి తెప్పించామని, విగ్రహం మొత్తంలో చైనా సరకు కేవలం 9 శాతం లోపే అని ఎల్ అండ్ టి ఈ ప్రకటనలో పేర్కొంది.

The entire statue itself is being built in India at the site and only the bronze cladding is the form of bronze plates is being sources from China, which constituted a negligible amount of the lest than nine percent of the total value of the project: L&T

భారీ విగ్రహాల తయారీ లో చైనాకు బాగా పేరుంది.నిజానికి రెండు భారీ విగ్రహాలను చైనాలో తయారుచేయించాలని తెలంగాణ ప్రభుత్వం కూడా భావించింది.ఇందులో ఒకటి యాదాద్రి కోసం హనుమాన్ విగ్రహం, రెండోది 125అడుగుల అంబేద్కర్ విగ్రహం. ఈ విగ్రహాలను తయారుచేయించే పని మీద అప్పటి టూరిజం మంత్రి కె శ్రీహరి చైనాను కూడా సందర్శించారు. అపుడు షాంగై ఎలెక్ట్రికల్ కంపెనీతో అంబేద్కర్ విగ్రహం తయారీ, ప్రతిష్ట గురించి శ్రీహరి చర్చలు జరిపారు. అయితే, నాలుగేళ్లవుతున్నా, అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట ఒకడుగు కూడా ముందుకు పడలేదు.