Home Features నేడు మాజీ ప్రధాని ఐకె గుజ్రాల్ నూరో జయంతి, ఏడు ముక్కల్లో ఆయన గురించి…

నేడు మాజీ ప్రధాని ఐకె గుజ్రాల్ నూరో జయంతి, ఏడు ముక్కల్లో ఆయన గురించి…

25
0
SHARE
రాజకీయ కుటుంబాలు, పచ్చి మత రాజకీయాలు, బాగా డబ్బున్న నేతలు తప్ప మిగతా వాళ్లు- ఎంతగొప్పవాళ్లయినా గుర్తుంచుకోవడం కష్టమయిన రోజులివి. అందుకే మనకు ఐకె గుజ్రాల్ (డిసెంబర్ 4, 1919- నవంబర్ 30, 2012) అనే సౌమ్యుడు, కవి హృదయుడు, లిబరల్ రాజకీయ నాయకుడు  ప్రధానిగా  ఒకరుండేవారని చాలా మందికి తెలియదు.
ఆయనకున్న ఫ్రెంచ్ కట్ తప్ప మామూలు మనుషులకు గుర్తొ చ్చే విషయాలు గుజ్రాల్ లో తక్కువ. దానికి తోడు ఆయన పదవిలో ఉన్నంతకాలం కుట్రలు కుతంత్రాలు, వివాదాలు చుట్టుముటాయి. ప్వాతంత్య్రం వచ్చాక అత్యంత వివాదాస్పాద కాలంలో ఆయన ప్రధాని గా ఉన్నారు. చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్న ఇట్లాంటి ఒడిదుడుకులను ఎదుర్కొనే సత్గా లేని వాడు. పార్టీలన్నీ తనని ఆటబొమ్మలాగా వాడుకున్నా,ఫుట్ బాల్ లా తన్నుకున్నా ఎపుడు అసంతృప్తి వ్యక్తం చేయని వాడు గుజ్రాల్.
నూరో జయంతి సందర్భంగా గుజ్రాల్ గురించిన కొన్ని అసక్తి కరమయినవిషయాలు:
1. ఐకె గుజ్రాల్ (ఇంద్ర కుమార్ గుజ్రాల్ ) పదకొండు నెలలు ప్రధాని గా పనిచేశారు. యునైటెడ్ ఫ్రంటు ప్రభుత్వానికి మొదట హెచ్ కె దేవే గౌడ ప్రధాని ఉన్నారు.ఆయన దిగిపోయాక, ఆయన ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా ఉన్న ఐ కె గుజ్రాల్ ప్రధాని అయ్యారు. 12 వ ప్రధానిగా ఏప్రిల్ 1997 నుంచి మార్చి 1998 దాకా బాధ్యతలు నిర్వర్తించారు.
2. ఆయన 1964లో కాంగ్రెస్ లో చేరారు. ఇందిరా గాంధీకి బాగా సన్నిహితులు. ఆ యేడాదే ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. 1975లో ఇందిరా గాంధీ ఎమర్జీన్సీ విధించినపుడు ఆయన సమాచార ప్రసార శాఖ మంత్రి. 1976లో రాజ్యసభ కు మళ్లీ ఎన్నికయి కేంద్ర జలనవరు లశాఖ మంత్రిగా ఉన్నారు. తర్వాత రష్యాలో భారత రాయబారిగా ఉన్నారు.
3. 1980లో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి జనతా దళ్ లో చేరారు. 1989లో పంజాబ్ జలంధర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. విపి సింగ్ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1992లో మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు.
4. 1996 ఎన్నికల తర్వాత యునైటెడ్ ఫ్రంటు దేవెగౌడ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేసినపుడు ఆయన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి.  గుజ్రాల్ డాక్ట్రిన్ తయారు చేశారు. భారతో ముందుగా ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యంగా ఉండాలనేదే ఈడాక్ట్రిన్. దీనితో ఆయన పాకిస్తాన్ మీద కఠినంగా వ్యవహారించలేదనే విమర్శ వచ్చింది. ప్రధాని అయ్యాక ఈ డాక్ట్రిన్ ను ఇంకా ముందుకు తీసుకువెళ్లారు.ఇపుడు ప్రధాని మోదీ విదేశీ ప్రముఖులను ఆలింగనం(Hug or Jhappi) చేసుకుని సంచలనం సృష్టించారు. నిజానికి అది గుజ్రాల్ ప్రవేశపెట్టిన సంప్రదాయం.  1991 లో గల్ఫ్ వార్ జోరుగా సాగుతున్నపుడాయన సద్దామ్ హుసేన్ ను ఆలింగనం చేసుకున్నారు. తాను ఇరాక్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా రప్పించేందుకు ఇలా చేశానని ఆయన ఆతర్వాత చెప్పారు.
5. దేవేగౌడ్ ప్రధానిగా దిగిపోయాక గుజ్రాల్ అన్ని పార్టీలకు ఆమోదయోగ్యుడయిన ప్రధాని అభ్యర్థి అయ్యారు. ఈ సయయంలో ఆయన చాలా చిక్కు సమస్యలను ఎదుర్కొన్నారు. బీహార్ లో పశువుల దాణా అవినీతి కేసు బయటపడింది. ముఖమంత్రి లాలూ ప్రసాద్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు సిబిఐ  రాష్ట్ర గవర్నర్ ఎ ఆర్ కిద్వాయ్ అనుమతి కోరింద. కిద్వాయ్ అనుమతినిచ్చారు. లాలూప్రసాద్ రాజీనామా చేయాలనే డిమాండ్ యు ఎఫ్ లోనే మొదలయింది. అపుడు ఐకె గుజ్రాల్ సిబిఐ డైరెక్టర్ జోగిందర్ సింగ్ ను బదిలీ చేసి వివాదంలో చిక్కుకున్నారు.
6. 1997లో ఉత్తర ప్రదేశ్ లో బిజెపి ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ ను బర్త్ రఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించే విషయంలో మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. అక్కడి అసెంబ్లీలో హింసాత్మక సంఘటనలు జరిగాక గవర్నర్ రమేష్ భండారీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని సూచించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారామ్ కేసరి,రక్షణ మంత్రి ములయాం సింగ్ దీనిని సమర్థించారు. హోం మంత్రి ఇంద్రజిత్ గుప్తా వ్యతిరేకించారు. చివరకు క్యాబినెట్ రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేసింది. అయితే, రాష్ట్రపతి కెఆర్ నారాయణ్ దీనిని తిరస్కరించారు. నిజానికి గుజ్రాల్ కు కూడా రాష్ట్రపతి పాలన ఇష్టం లేదు.అయితే, ఆయన మీద యునైటెడ్ ఫ్రంట్ పార్టీల వత్తిడి ఎక్కువయింది.దీనితో క్యాబినెట్ ప్రధాని అభిప్రాయానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది.
7. తర్వాత జైన్ కమిషన్ వివాదం చుట్టుకుంది.1997ఆగస్టు 28న జైన్ కమిషన్ తన నివేదికనుసమర్పించింది. నవంబర్ 16న నివేదికలోని అంశాలు మీడియాకు లీక్ అయ్యాయి. రాజీవ్ గాందీ హత్య కేసును విచారించిన జైన్ కమిషన్ శ్రీలంక తీవ్రవాదులకు తమిళనాడు డిఎంకె పార్టీ మద్దతు నీయడం మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది. డిఎంకె పార్టీ కూడా యునైటెడ్ ఫ్రంటులోభాగస్వామి. దీని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. డిఎంకె పార్టీ ప్రభుత్వం నుంచి తప్పుకోవాలనే డిమాండ్ కాంగ్రెస్ నుంచి  మొదలయింది. ప్రధానిగా గుజ్రాల్ దీనికి అంగీకరించలేదు. నవంబర్ 28న గుజ్రాల్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంది. గుజ్రాల్ ప్రధానిగా రాజీనామా చేశారు. అయితే, తదుపరి ప్రధాని వచ్చే దాకా ఆయన ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగారు.
(Photo source Wikimedia)