ICU దారిలో ఇండియన్ ఎకానమీ: ప్రధాని మోదీ మాజీ సలహాదారు హెచ్చరిక

భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పడిపోవడం మీద ఇద్దరు ప్రపంచస్థాయి ఆర్థిక వేత్తలు ఆర్వింద్ సుబ్రమణియన్, జోష్ ఫెల్మన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొన్న మొన్నటి దాకా బాగా సాగిన ఆర్థిక వ్యవస్థ ఉన్నట్లుండి ఇలా తిరోగమనంలో ఎందుకు పడిందో వాళ్లు అధ్యయనం చేసి ఒక వర్కింగ్ పేపర్ ను “India’s Great Slowdown: What Happened? What’s the Way Out? పేరుతో విడుదల చేశారు.
ఇది నెట్ లో అందుబాటులో ఉంది. హార్వర్డ్ యూనివర్శిటీ సెంంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవెలప్ మెంట్ కోసం తయారు చేసిన వర్కింగ్ పేపర్ ఇది.
అర్వింద్ సుబ్రమణియన్ నరేంద్రమోదీ మొదటి సారి ప్రధాన అయినపుడు కేంద్రానికి ఛీప్ ఎకనమిక్ అడ్వయిజర్ గా ఉన్నారు. జోషో ఫెల్మన్ ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నెల్లోనే ఈ వర్కింగ్ పేపర్ విడుదల కావడంతో భారతదేశం ఆర్థిక వ్యవస్థ ను గమనిస్తున్న వాళ్లందరి ఇది సంచలనం సృష్టిస్తూ ఉంది.
39 పేజీల వర్కింగ్ పేపర్ లోని కొన్ని ప్రధానాంశాలను ఇక్కడ అందిస్తున్నాం.
1. ఉన్నట్లు భారత ఆర్థిక వ్యవస్థ జబ్బు పడింది. జిడిపి తిరోగమనం 4.5 శాతానికి పడిపోయింది. కన్స్యూ మర్ గూడ్స్ ప్రొడక్షన్ పెరుగుదల పూర్తి గా ఆగిపోయింది. ఎగుమతులు పడిపోయాయి. దిగుమతులు దిగజారాయి. ప్రభుత్వం రాబడి కూడా తిరోగమనంలో పడిపోయింది.
2. వీటికి సంబంధించిన గణాంకాలు చూస్తే పరిస్థితి తీవ్రంగా ఉందని అర్థమవుతుంది.ఇపుడున్న కనిపిస్తున్నమాంద్యం ఎపుడో ఎదురయిన 1990-1991 నాటి తీవ్ర మాంద్యం లాగా ఉంది. విద్యుత్తు వాడకం పడిపోయింది. ఈ జబ్బు 1991 నాటికంటే అద్వాన్నంగా ఉంది. ఇది ఆర్డినరీ మాంద్యం (స్లోడౌన్ )కాదు. ఇది మహామాంద్యం (Great Slowdown). భారత ఆర్థిక వ్యవస్థ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లోకి వెళ్లిపోతూ ఉంది.
3. మొన్నమొన్నటి దాకా 7 శాతం జిడిపితో వెలిగిన దేశం ఇది. ఏ ఒడిదుడుకులు లోనుకాని  ఆర్ధిక వ్యవస్థ ఇది. ఆహారోత్పత్తి తగ్గలేదు. ప్రపంచ ఇంధన ధరలు పెరిగినా ఇక్కడ ప్రభావం చూపలేదు. ద్రవ్య పరిస్థితిఆదుపు తప్పలేదు. మరయితే ఉన్నట్లుండి భారత ఆర్థిక పరిస్థితి ఎలా తలకిందులయింది అనేది ప్రశ్న?
4. ఈపరిస్థితినుంచి బయటపడేందుకు ఆర్ బిఐ కేంద్ర ప్రభుత్వాలు చాలా శ్రమపడుతున్నాయి. ఆర్ బిఐ ప్రపంచంలో ఏ సెంట్రల్ బ్యాంక్ చేయనంతగా ఇంటరెస్ట్ రేట్లను 135 బేసిస్ పాయింట్లు తగ్గిచింది. భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలో వడ్డీరేట్లను ఇంతగా తగ్గించిన సందర్భం లేదు. అయినా సరే, బ్యాంకురుణాలను ఎవరూ తీసుకోవడం లేదు. పెట్టుబడులు రావడం లేదు ఈ రంగం కూడా మాంద్యంలో కూరుకుపోయింది.
5. దీనితో ఈ రోగానికి చికిత్స ఏమిటో అర్థం కావడం లేదు. అనీ, ఇలా వదిలేయడానికి వీల్లేదు. చికిత్స కనుక్కోవలసిందే.
6. లోతుగా విచారిస్త్తే, భారతదేశం బ్యాలెన్స్ షీట్ సంక్షోభంలో పడిందని అర్థమవుతుంది. ఈ సంక్షోభం రెండు ఉప్పెనల్లాగా వచ్చింది. మొదటి ఉప్పెన ట్విన్ బ్యాలెన్స్ షీట్ క్రైసిస్ . ఇది బ్యాంకులను, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలను చుట్టుముట్టింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించాక ఎదురయిన గ్లోబల్ ఫైనాన్సియల్ క్రైసిస్ నుంచి ఇది పుట్టుకొచ్చింది. దీనితో 2000 దశాబ్దంలో వచ్చిన ఇన్ ఫ్ట్రా స్ట్రక్చర్ బూమ్ (అంటే హౌసింగ్ ) దీనితో భగ్నం కావడం మొదలయింది. దీనికి సకాలంలో ప్రభుత్వం సరైన చికిత్స చేయలేకపోయింది. ఫలితంగా భారత్ ప్రగతికి ఉపు అందిస్తున్న రెండు రంగాలు, ఇన్వెస్ట్ మెంట్స్, ఎగుమతులు చితికిపోయాయి.
7. ఇపుడు దేశం నాలుగు బ్యాలెన్స్ షీట్ సవాళ్లు ఎదుర్కొంటున్నది. పైన చెప్పిన రెండింటితో పాటు (ఎగుమతులు, ఇన్వెస్ట్ మెంట్స్) మరొక రెండు బ్యాలెన్స్ షీట్ సంక్షోభాలు చుట్టుముట్టాయి. అవి ఏమిటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు.
8. ఈ పరిస్థితికి కారణాలు చూద్దాం. గత దశాబ్దమంతా కార్పొరేట్ సెక్టర్ బాగా రుణాల వత్తిడికి లోనయింది. ఈ కంపెనీలు రుణాల తీర్చలేకపోయాయి. రుణాలు సంపదలో 40 శాతానికి చేరుకున్నాయి. ఈ ఏడాది సెకండ్ క్వార్టర్ నాటికి పెరిగి రుణభారం 45 శాతానికి చేరుకుంది. బ్యాడ్ లోన్ సమస్య ను పరిష్కరించడంలో బాగా జాప్యం జరిగింది. మొదట్లో ఆర్ బిఐప్రకటించిన పథకాలేవీ పనిచేయలేదు. డిసెంబర్ 2016 లో ఇన్ సాల్వెన్సీ బాంక్ రప్ట్సీ కోడ్ (IBC) ప్రవేశపెట్టారు. భారీగా అప్పుల్లో కూరుకుపోయిన 12 పెద్ద కంపెనీలను ఐబిసికి రికమెండ్ చేసింది. ఇందులో సగంసమస్యలు పరిష్కారమయ్యాయి. ఐబిసి విద్యుత్ రంగానికి చెందిన ఐపిపిల జటిలసమస్యలను పరిష్కరించలేక పోతున్నది.
9. ఇపుడు ఇండియన్ హౌసింగ్ గాలిబుడగ సమస్యవచ్చింది. భారతీయ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడేందుకు బటన్ నొక్కింది ILFS అనే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. 2018లో ఈకంపెనీ కుదేలయింది. ఇదొక భూకంపం సృష్టిచింది.ఈ కంపెనీకి 90 వేల కోట్లరుపాయల అప్పుంది. ఇది తీర్చలేకపోవడంతో భారత ఆర్థిక వ్యవస్థ వణికిపోయింది. ILFS అనేది NBFC సెక్టర్ లోకి వస్తుంది. ఇలాంటి కంపెనీలు బ్యాంకుల దగ్గిర తీసుకుని రియల్ ఎస్టేట్ వంటి రంగాలకు అప్పు లిస్తాయి. ఈ కంపెనీలు కూలిపోతే ఎమవుతుంది, దాని ప్రభావం బ్యాంకుల మీద కూడా పడుతుంది.
10. ఇక్కడొక ప్రమాదకరమయిన పరిణామం ఉంది.  ఈ NBFC కంపెనీలను షాడో బ్యాంకింగ్ కంపెనీలు అంటారు. ఇవి డిపాజిట్లుసేకరించవుగాని, బ్యాంకుల్లాగా భారీగా రుణాలిస్తాయి. ఈ NBFCలరుణాలన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీలకే వెళ్లాయి. 2000 దశాబ్దంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు విపరీతంగా ప్రాజక్టులను ప్రారంభించాయి. మిడిల్ క్లాస్ వాళ్లందరికి సొంత ఇంటి కల నిజం చేసే నినాదంతో ఈ కంపెనీలు విజృంభించాయి. అయితే, గ్లోబల్ ఫైనాన్సియల్ క్రైసిస్ ఉద్యోగాల సంక్షోభం రావడంతో ఇళ్లకు డిమాండ్ పడిపోయింది. దేశంలోని 8 మహానగరాల్లో జూలై 2019 నాటికి 10లక్షల ఫ్లాట్స్ కొనే వాడు లేక మూలనపడ్డాయి.సాధారణంగా ఇది 2 లక్షల కంటే మించకూడదు. రుపాయల్లో చెప్పాలంటే హీనమంటే వీటి విలువ 8లక్షల కోట్లు. ఇది నాలుగు సంవత్సరాల బిజినెస్ తో సమానం. సాధారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు బ్యాంకులు రుణాలిచ్చేవి. ఇటీవల ఈ కంపెనీలు ఎన్ బిఎస్ సి ల నుంచి రుణాలు తీసుకోవడం మొదలుపెట్టాయి. రియల్ ఎస్టేట్ రుణాల్లో ఎన్ బిఎఫ్ సి వాటా రు. 5 లక్షల కోట్ల దాకా ఉంటుంది. డెవెలపర్స్ తమప్రాజక్టుల సకాలంలో పూర్తి చేసి, వాటిని విక్రయించి రుణాలుతీసుస్తారని అనుకున్నారు. అలా జరగలేదు. అంతే అంతాకుప్పకూలిపోయింది.
11. ఈ ప్లాట్లకి డిమాండ్ లేకపోవడంతో రుణాలన్నీ ఇరుక్కుపోయి ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. సాధారణంగా ఇలాంటపుడు డెవలపర్స్ ఫ్లాట్ల ధరలను తగ్గించి కొనేవాళ్లను ప్రోత్సహించాలి. ఈ సారి అలా చేయడం లేదు. ఎందుకంటే, ఇలా ఫ్లాట్ల ధరలను తగ్గిస్తే, రుణాలు పొందేందుకు తాకట్టు పెట్టిన ఆస్తుల ధరలను తగ్గించాల్సి వస్తుంది. అది ప్రమాదకరం. ఈ సందిగ్ధ పరిస్థితి ప్రభావం మ్యూచ్యువల్ ఫండ్స్ మీద పడింది. ఎందుకంటే మ్యుచ్యువల్ పండ్స్ ఎక్కువ ఇన్వెస్టు చేసింది రియల్ ఎస్టేట్ రంగాలకు రునాలిచ్చే కంపెనీల్లోనే. ఎన్ బిఎఫ్ సి లకు రావాలసి రుణాలు రావేమో అనే భయం మ్యూచ్యువల్ ఫండ్స్ ను పట్టుకుంది.
12. దీనితో ఎన్ బిఎస్ సి లకు బ్యాంకులు రుణాలివ్వడం మానేశాయి. ఫలితంగా ఎన్ బిఎఫ్ సిలకు నిధుల సరఫరా ఆగిపోయింది. ఇది రియల్ ఎస్టేట్ నిధులు అందుబాటులో లేకుండా చేసింది. ఎన్ బిఎస్ సి సంక్షో
భంతో చిన్న చిన్నవ్యాపారాలకు రుణాలు ఆగిపోయాయి. దీనితో కార్లవంటి డ్యూరబుల్ గూడ్స్ అమ్మకాలు పడిపోయాయి. అంటే కన్య్సూమర్ గూడ్స్ ఉత్పత్తి రంగం కుదేలయింది.
13. ఆమధ్య అమెరికాలో గృహనిర్మాణ రంగం కుప్పకూలిన విషయం గుర్తుంది కదా. ఇదే గ్లోబల్ ఫైనాన్సియల్ క్రైసిస్ కు దారి తీసింది. ఇపుడు మనం చూస్తున్ని దాని ఇండియన్ వర్షన్ అనుకోవచ్చు. అమెరికా, ఇండియాల పరిస్థితికి కొద్దిగా తేడా ఉంది. ఇండియాది విపరీతమయిన సప్లయి సమస్య. డిమాండ్ కు మంంచి విపరీతంగా కట్టేశారు. దీనికంతా చెడా మడా రుణాలిచ్చారు. కొనేవాళ్లు తక్కువయ్యారు. రుణాలన్నీ ప్రాజక్టులలో ఇరుక్కుపోయాయి. 2019లో పేలిపోయింది ఈ హౌసింగ్ బుడగే…