అప్పు చేసి పప్పుకూడు తినమంటోంది కేంద్రం, కానీ ఎవరూ కదలడం లే…

భారత ఆర్థిక ప్రగతి లెక్కలు తారుమారవుతున్నాయ్… పడిపోతున్న ప్రగతి పాయింట్లు.
భారతదేశం జిడిపి పురోభివృద్ధి జ్యోతిషం కుదేలవుతూ ఉంది.  లెక్కలు  పై నుంచి కిందికి జారిపోతున్నాయ్.
 రిజర్వు బ్యాంక్ రెపో రేట్ (..అంటే నిధులు అవరసమయినపుడు రిజర్వు బ్యాంకు కమర్షియల్ బ్యాంకుల ఇచ్చే రుణాల మీద విధించే వడ్డీ రేటు) తగ్గించినా, కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ టాక్స్ వంటి టాక్స్ ల భారాన్ని తగ్గించినా ఈ ఏడాదిలో జిడిపి వృద్ధి వూపందుకునేలా కనిపించడం లేదు.
అందుకే రిజర్వు బ్యాంకు  భారత ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేమని, వాటిని కుదించేసింది.
ఈ ఏడాడి భారత అర్థిక వ్యవస్థ పెరుగుదల రేటు అంచనా 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది.
ఇంత భారీగా వృద్ధి రేటును కుదిస్తూ అంచనాల మీద కోత వేయడం అనేది ఇటీవల ఎపుడూ జరగలేదు.
దీనితో ఈ ఏడాది ఆర్థికమాంద్యం అలుముకోవచ్చన్న భయాందోళనలను పెరుగుతున్నాయి.
భయానికి కారణమేమిటంటే…
ఈ ఏడాది మొదటి క్వార్టర్ లో అంటే ఏప్రిల్-జూన్ నెలల ఆర్థికాభివృద్ధి 5 శాతానికి పడిపోయింది బాగా ఆందోళన కలిగించింది.
దీనితో రిజర్వు బ్యాంకు జూలై – సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థికాభివ‌ృద్ధి రేటును 5.3 శాతం గా నిర్ణయించింది. దీనితో ఈ ఆర్థిక సంవత్సరం ఉత్తరార్ధంలో అంటే అక్టోబర్ -మార్చిలో వృద్ధిరేటు 6.6 నుంచి 7.2 శాతం మధ్యే ఉంటుందని రిజర్వు బ్యాంకు భావించాల్సి వస్తూ ఉంది.
మొదట్లో ఇది 7.3నుంచి 7.5శాతం మధ్య ఉంటుందని ఆశపడ్డారు.
ఈ పరిణామాలతో 2020-2021 మొదటి క్వార్టర్ ఆర్థిక ప్రగతి రేటును కూడా  7.4 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించాల్సి వచ్చింది.
ఇలా ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభయినప్పటినుంచి ఆర్థిక రంగం మీద పెట్టుకున్న అన్ని భారీ అంచనాలను తగ్గించుకోవలసి వస్తున్నది.
ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. భారతదేశం వచ్చే అయిదేళ్లలో 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యం పెట్టుకున్నట్లు 2019-20 కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
అయితే, ఆమె తొలి బడ్జెట్ ఆమోదం పొందినప్పటినుంచి ఇప్పటికదాకా జాతీయ,అంతర్జాతీయ పరిణామాలేవీ ఈలక్ష్య సాధనకు అనుకూలంగా లేవు.
మాన్యు ఫ్యాక్చరింగ్ కంపెనీలలో ఉత్పత్తి పడిపోతూ ఉంది. ముఖ్యంగా ఆటోమొబైల రంగం కుదేలయింది.వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి.
మరొక వైపు వరదలు.
ఈ మధ్య రిజర్వు బ్యాంకు మానెటరీ పాలసీ రిపోర్టు విడుదల చేసింది. సమీప భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొంది.
“Private consumption, which had all along supported the econonic activity, is beginning to slow down due to host of factors. In this context  the perfomance of large employment generating sectors such as automobile and real estate remains less than satisfactory,” అని మానెటరీ పాలసీ రిపోర్టు (page 43-44) వ్యాఖ్యానించింది.
అంటే ఏంటంటే, వినియోగదారుల షాపింగ్ ఉత్సాహం వల్లే ఇంతవరకు భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటూ వచ్చింది. రకరకాల కారణాల వల్ల కొనుగోలుదారులు కొనడం తగ్గించేస్తున్నారు. భారీగా ఉపాధి అవకాశాలు కల్పించే శక్తి ఉన్న ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాల పనీతీరు ఏ మాత్రం సంతృప్తి కరంగా లేదు- అని అర్థం.
ఆర్థిక రంగానికి బలాన్ని ఇచ్చేందుకు టానిక్ లాగా రిజర్వు బ్యాంక్ మరొక సారి రెపో రేట్ ను మరొక 25 బేసిస్ పాయింట్లు శుక్రవారం మరొక సారి  తగ్గిచింది.
ఇలా చేయడం ఈ ఏడాది ఐదో సారి. ఒక విధంగా ఇందులో చాలా దుర్మార్గం ఉంది. ఎందుకంటే, రెపో రెటు తగ్గించినందువల్ల ప్లోటింగ్ వడ్డీరేటు అమలులోకి వచ్చిన రుణాల మీద ఇఎంఐ తగ్గుతుంది. అపుడు యువకులుకొత్త రుణాలు తీసుకుని జల్సా చేసుకుంటారని ప్రభుత్వం భావిస్తుంది.
అయితే, రిటైరయ్యాక వచ్చే డబ్బులను పిక్స్ డ్ డిపాజిట్ చేసి ఆవచ్చే వడ్డీ మీద బతకాలనుకుంటున్న సీనియర్ సిటిజన్లకు రాబడి తగ్గుతుంది. వాళ్ల జీవితం కష్టాల్లో పడుతుంది.
ఇపుడు ఆర్ బిఐ  పాలసీ రేపో రేటును అంటే ఇంటరెస్టు రేటు  5.15 శాతానికి తగ్గించింది.
దీనితో బాంకులు కూడా ఈరేటు వినియోగదారులకు పంచితే, రుణాల మీద వడ్డీరేట్లు తగ్గిపోయి, రుణాలు బాగా తీసుకుని,మాల్స్ కి పరిగెత్తి అంతా తెగకొనేసి మార్కెట్లన్నీ కళకళలాడేలా చేస్తారని భారత ప్రభుత్వం భావించింది.
అంటే అప్పు చేసి పప్పుకూడా తింటారని అనుకున్నారు. కాని,అలా జరగడం లేదు…
నాలుగు సార్లు రెపోరేటు తగ్గించినా బండి కదలడం లేదు. ఇపుడయిదోసారి తగ్గిస్తే కదులుతుందా…
ఎంత తోసినా ఆర్థిక వ్యవస్థలో కదలిక ఉండటం లేదు. What Next?