బిర్యానీని హైజాక్ చేసేందుకు పెద్ద పెద్ద కంపెనీల ప్రయత్నం

(టిటిఎన్ డెస్క్)
ఇండియాలో బిర్యానీ బిజినెస్ వేల కోట్లకు పెరిగింది.
బిర్యానీ ,ముఖ్యంగా చికెన్ బిర్యానీ,ఇండియన్ల మోస్ట్ ఫేవరెట్ పుడ్ అయిపోయింది. సర్వకాల సర్వావస్థల ఫుడ్ గా బిరియానీకి పేరొచ్చింది. ఒక సర్వే ప్రకారం బిర్యానీ తినేందుకు టైమనేదే లేదు. పొద్దున, మధ్నాహం,రాత్రి, ఆర్థరాత్రి… ఇలా బిరియానీ ఎపుడైనా తినొచ్చు.
ఇపుడు హైదరాబాద్ లో మిడ్ నైట్ బిర్యానీ పాపులర్ అవుతూ ఉంది. ఒకపుడు అరడజనో డజనో ఇరానీ హెటళ్లలో మాత్రం అమ్ముడయిన బిర్యానీ ఇపుడు హైదరాబాద్ లో వందల  హోటళ్లలో రకరకాల పేర్లతో రుచులతో పాపులర్ అయిపోయింది. బిర్యానీ అంటేనే హైదరాబాద్. అయితే ఈమధ్య బిర్యానీ దేశమంతా విస్తరించి లోకల్ ఫ్లేవర్స్ తో ఘుమఘుమ లాడుతూ ఉంది. అంతేకాదు,ప్రపంచంలో ఇండియన్లున్న ప్రతిదేశంలో బిర్యానీ అక్కడి తయారీ పద్ధతులతో దినుసులతో కొత్త రుచులు సంతరించుకుంటూ ఉంది. అయితే, ఎన్ని ప్రయోగాలు జరిగినా హోటళ్ల మెన్యూలో హైదరాబాద్ బిర్యానీయే టాప్ ఐటెమ్. అందుకే బిర్యానీ బ్రాండ్ సృష్టించుకుని మార్కెట్ మీద పట్టు సంపాయించుకునేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. ఇపుడు మనకు ఉడిపి ఇడ్లీ, ఆంధ్రా దోసే, హైదరాబాద్ బిర్యానీ, చెట్టినాడ్ చికెన్ ఉన్నాయి తప్ప కంపెనీల పేర్లతో ఫుడ్ లేదు. అదే ఇండియా బ్యూటీ. అయితే, ఇపుడు కంపెనీల బ్రాండ్ నేమ్ తో బిరియానీ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో  బిరియానీ గురించి కొన్ని ఆసక్తికరమయిన విశేషాలు
1. రెండేళ్లుగా భారతదేశంలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలో నెంబర్ వన్ ఐటెం గా ఉన్న ఎకైక ఫుడ్ ఐటెం బిర్యానీయే
2. ఇపుడు దేశంలో దాదాపు 40 రకాలుగా బిర్యానీ మార్కెట్లలో దొరుకుతూ ఉంది.
3.ఫిక్కి-పిడబ్ల్యూసి (Federation of Indian Chambers of Commerce and Industry-PricewaterhouseCoppers) తీసేకువచ్చిన నివేదిక ప్రకారం 2018లో బిరియానీ డెలివరీ ఇండస్ట్రీ విలువ రు.2500 కోట్లు.
4. 2018లో 44 నగరాలలో ఒక్క స్విగ్గీ ద్వారానే 3.5 సెకన్లకు ఒక బిర్యానీ అర్డర్ చేశారు.చివరకు బ్రేక్ ఫాస్ట్ కు కూడాకొన్ని నగరాలలో బిరియానీ ఆర్డర్ చేశారు. బిరియానీ స్విగ్గీ లో ఆర్డర్ చేయడంలో హైదరాబాద్ నెంబర్ వన్. ఇందులో కూడా చికెన్ బిర్యానీది మెుదటి స్థానం, మటన్ బిరియానిది రెండోస్థానం.
5. హైదరాబాద్ బిరియానీ అంతర్జాతీయ బిర్యానీ క్యాపిటల్ అయిపోయింది. ఢిల్లీ-ఎన్ సిఆర్,బెంగుళూరు, ముంబయి,పూణేలు ఆతర్వాతే. తమాషా ఏమిటంటే హైదరాబాదీలు ఎంత బిర్యానీ ప్రియులంటే లక్నవి బిరియానీ, కోల్ కత్తా బిరియానీ, ఆంధ్రవాళ్లు తయారు చేసే నాటుకోడి బిరియానీ, కేరళీయుల తాలచేరి, మలబార్ బిరియానీలను కూడా ఆదరిస్తున్నారు. బిర్యానీ అయితే చాలు, హైదరాబాదీలు లాగించేస్తున్నారు, ఆదరిస్తున్నారు. బిరియానీ ఇంతపాపులర్ అవుతున్నపుడు శాకాహారులు కూడా బిర్యానీ తినాలనుకుంటారు. ఈ లోటు పూరించేందుకు విజిటబుల్ బిర్యానీలలో కూడా హైదరాబాద్ ప్రయోగాలు చేస్తూ ఉంది.
6.జొమాటోలో కూడా ఇదే పరిస్థితి. జోమాటో అందుకున్నఫుడ్అర్డర్స్లో కూడా బిర్యానీ దే అగ్రస్థానం. నగరాలలోనే కాదు, చిన్న చిన్న పట్టణాలలో (త్రీటియర్, ఫోర్ టియర్ ) కూడ బిరియానే అగ్రస్థానం.
7. చివరకు స్టార్టప్ లు కూడా బిర్యానీ మార్కెట్లోకి వచ్చి సెటిలయిపోతున్నాయి. బిరియానీ బ్లూస్, అమ్మీస్ బిరియానీ, చార్ కోల్ బిర్యానీ… ఇలాంటి పేర్లతో
8. ఫుడ్ ఇ-కామర్స్ బిజినెస్ ఇండియాలో విపరీతంతా పెరిగిపోయింది. దీనివిలువ 2017లోనే రు. 3లక్షల కోట్లు. బిజినెస్ గ్రాజుయేట్లు, వెంచర్ క్యాపిటలిస్టులు ఈ రంగంలోకొ చొరబడి అత్యాధునిక కిచెన్లు పెట్టి ఫుడ్ వ్యాపారం చేస్తున్నారు. వీళ్లందరి బిజినెస్ కూడా బిర్యానీ చుట్టూర తిరుగుతూ ఉంది.
9.సులభంగా, ఒకే పాత్రలో ఫుల్ బోజనాన్ని వండి షా జహాన్ సైన్యానికి అందించేందుకు ముంతాజ్ మహాల్ తన వంటవాళ్ల చేత చేయించిన ప్రయోగం నుంచే బిర్యానీ వచ్చిందని ఒక కథనం ఉంది. ఏమైనా బిరియానీ ఈ జీ చేయవచ్చు. సులభంగా చేయవచ్చు. రుచిగా కూడా ఉంటుంది. అందుకేబిర్యానీ దేశమంతా అందరు ఇష్టపడే ఆహారమయిపోయింది. బిరియానీ బిజినెస్ విపరీతంగా జరిగేందుకు ఇదే కారణం.
10. హైదరాబాద్ బిర్యానీ లాగే ఉత్తర ప్రదేశ్ లక్నోకు ఒక బిరియానీ ఉంది. లక్నవీ బిరియానీ అంతపాపులర్ కాలేదు. లక్నో నవాబు వజీద్ అలీషా కలకత్తాకు మకాం మార్చినపుడు ఆయన తన వెంటనే వంటవాళ్లను కూడా తీసుకువెళ్లాడు. ఆయన కలకత్తా వెళుతున్నపుడు ఆయనకు ఇష్టమయిన బిర్యానీ చేసేందుకు వంటవాళ్లు కొద్ది గా మార్పులు చేసి ప్రయోగాలు చేశారు. వాళ్ల బిర్యానీలోకి ఆలుగడ్డలు, టొమాటోలు వచ్చి చేరాయి. ఆయన వారసులురాలు మంజీ లత్ ఫాతిమా (51) ఈ బిర్యానీ అందించే బిజినెస్ ప్రారంభించారు. ఆన్ డెలివరీ మాత్రమే చేస్తారు.
11. బిరియానీ లో జాతీయ బ్రాండనేది లేదు. వీధివీధికో బ్రాండ్ ఉంది. ఉదాహరణకు హైదరాబాద్ లో సికిందరాబాద్ స్టేషన్ దగ్గిర ఆల్ఫా బిర్యానీ, కొంచెం ముందుకు వెళ్లి క్లాక్ టవర్ దగ్గిర నిలబడిత గార్డెన్ బిర్యానీ ఉంటుంది. మరొక పక్కకు జరిగితే ప్యారడైజ్ ఉంటుంది. లేదు, అబిద్స్ లోకి వచ్చారనుకుంటే అక్కడ గ్రాండ్ బిర్యానీ దొరుకుతుంది. ఆర్టీ సి క్రాస్ రోడ్డు కొస్తే బావర్చీ ఉంది, ఆస్టోరియా ఉంది. చాదర్ ఘాట్ కు వస్తే నయాగరా బిర్యానీ ఫేమస్. ఇలాగే ఓల్డ్ సిటీకి వెళితే మీకు షాగోస్, మదీనా ఉంది, హైదర్ గూడకు వెళ్లితే బహార్ బిర్యానీ… తాజా గా వచ్చిన బిర్యానీలలో బావర్చి, పంజాగుట్టలోని ఇంపీరియల్ బాగా పేరు పడ్డాయి… ఇలా ఒక్కొక్క బజారున ఒక్కొక్క బిర్యానీ బ్రాండ్ ఉంది.
ఇవికాకుండా ఈ మధ్య రకరకాల బిర్యానీలు వచ్చాయి గాని, అవి బ్రాండ్స్ కాలేకపోయాయి. ఇలా వచ్చిన బిర్యానీలో బావర్చి పేరుతో లెక్కలేనని బిరియానీలువచ్చాయి. బిర్యానీ తింటే ఇరానీ హోటళ్లలోనే తినాలనేది బిర్యానీ ప్రియులు నమ్మకం. అందుకే ఇరానీయేతర బిరియానీలకు ఇంత గుర్తింపు రాలేదు. వులువచారు బిర్యానీ, నాటుకోడి బిర్యానీ..వగైరా బ్రాండ్లు కాలేకపోయాయి.
బిర్యానీ హైజాక్ చేసే ప్రయత్నం
బిర్యానీ మార్కెట్ ను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు భారీగా జరుగుతున్నాయి. ఇండియన్ ఫుడ్ ను విక్రయించేందుకు బ్రాండులేవీ లేవు. ఉన్న వన్నీ లోక్ ల్ బ్రాండ్లు మాత్రమే. ఫార్టడైజ్ బిర్యానీ నాగపూర్ లో దొరకదు, విశాఖల దొరకదు. ఇలా కెఫె బహార్ కు మరొక బ్రాంచ్ లేదు.  కెఎఫ్ సి, మెక్డొనాల్డ్  వంటి బ్రాండ్ ఇండియా ఫుడ్ ఇండస్ట్రీలో లేవు.  అందువల్ల ఇలాంటి బ్రాండ్ లను సృష్టించేందుకు పెద్ద పెద్ద పెట్టుబడి లు పెట్టి బ్రాండ్ బిర్యానీ  తయారు చేసేందుకు రెబెల్ ఫుడ్స్, బిగ్ బాక్స్ బహ్రోజ్ వంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. వాళ్ల ప్రయత్నాలేమవుతాయో తెలియదు గాని, ప్రజలకు హైదరాబాద్ బిర్యానీ, లక్నవీ బిరియానీ, కశ్మీర్ పులావులే నచ్చుతాయి. రెబెల్ ఫుడ్ బిరియానీ తయారుచేసినా, అమ్ముకోవాలంటే హైదరాబాద్ పేరు పెట్టుకొనక తప్పదు.

(బిర్యానీ ఫోటో సోర్స్ )