హిందూ ముస్లిం ఐక్యతో కోసం జైలు కెళ్లిన శంకరాచార్య

భారతదేశ గొప్పదనం అందరినీ అక్కున చేర్చుకోవడం. భారతీయసమాజంలో ఎన్ని చీలికలుపేలికలు ఉన్నా,  కులమతాలనేవే ప్రధాన సమస్యలు.

మనుషుల్ని ఈ కులాలు మతాలు విభజించరాదని చాలా మంది రకాలుగా ప్రయత్నాలు చేశారు.

ఇందులో రాజకీయ నేతలు, సంఘసంస్కర్తలేకాదు, హిందూ స్వామీజీలు కూడా ఉన్నారు.

ఇపుడయితే ఆశ్రమాలు పెట్టుకోవడం భారీ వ్యాపారమయింది. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ఆశ్రమాలు అండ నిస్తున్నాయి. డేరా బాబా మొదలుకుని కల్కిభగవాన్ దాకా  కొన్ని ఆశ్రమాలలో కోట్లకు కోట్లు డబ్బు, బంగారు, వజ్రాలు, అత్యాచారాలు, హత్యాచారాలు ఎలా జరిగేవో తెలిస్తే రోతపుడుతుంది.

అయితే, కరుడు గట్టిన హిందూ వాదులలో కూడా ఈ దేశంలో ప్రజలంతా సమానమని, అందరికి సమానగౌరవం దక్కాలని చెప్పడమే కాదు, దానికోసం రోడ్డెక్కి జైలు పాలయిన వారున్నారు.

అలా హిందూముస్లిం ఐక్యత కోసం కేసులో ఇరుక్కుని జైలు పాలయిన స్వామీజీలో మొదట చెప్పుకోవలసిన పేరు పూరీ జగద్గురు శంకరాచార్య, స్వామి భారతీ తీర్థుల వారిది.

హిందూ ముస్లిలు ఐక్యంగా ఉండేలా చూడటం హిందూ ధర్మం అని ఆయన చెప్పేవారు.

ఈ ఆశయ సాధనలోనే ఆయన 1921లో జైలు కెళ్లారు.

ఆయన కరుడు గట్టిన  సనాతన వాది. జీవితంలో ధర్మనిష్ట చాలా కఠినంగా పాటిస్తారు. హిందూ ధర్మం మొదట, మిగతావి తర్వాతే అనేది ఆయన వాదన.

ప్రభుత్వాలు,కోర్టులు కూడా హిందూధర్మం తర్వాతే.

ప్రభుత్వాలతో, కోర్టులతో వ్యవహరించేటపుడు కూడా తాను హిందూ ధర్మం ప్రకారమే నడుచుకుంటానన్న హిందూవాది ఆయన. అయితే, ప్రతిమతస్థుడు వాళ్ల ధర్మ సూత్రాలను మరవరాదనే  వారు.

ఆరోజుల్లో భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం (1919-1924) నడుస్తూఉంది. ఇది జాతీయోద్యమంలో విడదీయరాని భాగమయింది.

మొదటి ప్రపంచయుద్ధం చివరి రోజుల్లో బ్రిటిష్ వారు ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని(సింపుల్ గా టర్కీ) విభజించారు. ఈ సామ్రాజ్యానికి పాలకుడు ఖలీఫా. ఖలీపాను ముస్లింలు ప్రవక్త వారుసుడిగా భావిస్తారు.

ఒట్టోమన్ పెద్ద సైనిక శక్తి కాకపోయినా, ప్రపంచయుద్దంలో బ్రిటిష్ కు వ్యతిరేకంగా పనిచేసింది.బ్రిటిష్ సైనికులను ఒకదశలో బాగా దెబ్బతీసింది. తర్వాత యుద్ధంలో భారీ గా ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎదుర్కొంది. తర్వాత కరువుకాటకాల బారిన పడింది.

ప్రపంచయుద్దంలో ఓడిపోయి, చితికిపోయిన ఒట్టోమన్ మళ్ళీ ఒక శక్తిగా ఎదగకుండా చేయాలని బ్రిటిష్ వాళ్లు భావించారు. ఎందుకంటే అప్పటికిదే ప్రధాన ముస్లిం దేశం. అందువల్ల మొదట  ఖలీఫా హోదాను రద్దు చేశారు. దేశాన్ని చిన్న చిన్న రాజ్యాలుగా విడగొట్టారు.

దీనితో చాలా మధ్య ప్రాచ్య దేశాలు పుట్టుకొచ్చాయి. బ్రిటిష్, ఫ్రాన్స్  సామ్రాజ్యాలలో భాగమయ్యాయి.ఇరాక్, పాలస్తీనా,సిరియా లెబనాన్…వంటిదేశాలు ఇలా వచ్చినవే.

వీటిని ఫ్రెంచ్ బ్రిటిష్ వారు తమ ఆదీనంలో ఉంచుకున్నారు.

ఖలీఫా హోదాను పునరుద్ధరించాలని భారత దేశ ముస్లిం నేతలు 1920లో ఇంగ్లండు వెళ్లి ప్రభుత్వాన్నివేడుకున్నారు. వారి కోరికను బ్రిటిష్ ప్రభుత్వం మన్నించలేదు. బ్రిటిష్, ఫ్రాన్స్ లు తమ  విభజన రాజకీయాలు కొనసాగించాయి.

దీనికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే ఖిలాఫల్ ఉద్యమం. ఆరోజుల్లో బాగా చదువుకున్న ముస్లిం పెద్దలంతా ఏకమయ్యారు.ఇందులో ప్రముఖుల అలీబ్రదర్స్ పేరున్న ముహమ్మద్ అలీ, షౌకత్ అలీలు.

బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం కాబట్టి హిందువులు కూడా దీనికి సమర్థించారు. గాంధీ కూడా సమర్థించారు.

ఇలా హిందూ ముస్లిం ఐక్యతకు ఖిలాఫత్ ఉద్యమం బాట వేసింది. గాంధీజీ కూడా  దీనికి మద్దతు ప్రకటించారు.

ఇలాగే శంకారాచార్యుల వారు (అలియాస్ వెంకట్రామన్ ) కూడా ఈ ఉద్యమానికి మద్దతుప్రకటించారు. అంతేకాదు, స్వామీజీ,  అలీ బ్రదర్స్ తో పాటు,డాక్ట కిచ్ లూ, మౌలానా హుసేన్ అహ్మద్ వంటి వారి తో కలసి వేదిక లెక్కిప్రసంగించారు.

వీళ్లందరిని కలిపి కరాచీ సహాయనిరాకరణవాదులు (Karachi Non-co-operators)అని పిలిచే వారు.వీళ్లంతా ఆఖిల భారత ఖిలాఫత్ మహాసభలోపాల్గేనేందుకు కరాచీ వచ్చారు. బ్రిటిష్ రాజు సేవలో ఉన్న ముస్లిం సైనికులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయించేందుకు వుసిగొల్పుతున్నారని కుట్రకేసు (1921) పెట్టారు.

భారత స్వాతంత్య్రో ద్యమ కాలంలో సంచలనం రేకెత్తించిన కేసు ఇది.

ఈ కేసు విచారణ 1921 అక్టోబర్ 24న కరాచి సెషన్స్ కోర్టులోని ఖలిక్దినా హాలులో ఉదయం 11.30 గంటలకు మొదలయింది.

సింధ్ జ్యుడిషియల్ కమిషనర్ న్యాయమూర్తి స్థానంలో ఉన్నారు. కేసులో శంకరాచార్యతో కలసి ఏడుగురు నిందితులుగా ఉన్నారు.

ఈ విచారణలో నిందితులు ప్రదర్శించిన ధిక్కారాన్ని,ముఖ్యంగా శంకరాచార్య ధిక్కారాన్ని, ధైర్యాన్ని చూసి మహాత్మగాంధీ,బ్రిటిష్ వ్యవస్థకు పతనం ప్రారంభబయిందని వ్యాఖ్యానించారు.

కరాచీ వేదిక నుంచి ఒక ఫత్వా జారీ అయింది. అక్కడ కొన్ని తీర్మానాలు కూడా చేశారు. వీటన్నింటిని సారాంశం, బ్రిటిష్ సైన్యంలో, పోలీస్ లో పనిచేయడం ఇస్లాం కు వ్యతిరేకం అని.

అప్పటి నుంచి దీనిని అనేక వేదికల మీది నుంచి కూడా చదివి వినిపించడం, కరపత్రాలు పంచడం చేశారు. ఇది ఒక కుట్ర అని బ్రిటిష్ ప్రభుత్వం కేసుపెట్టింది. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి కరాచీ జెయిలుకు తరలించారు.

ఈ కేసులో బ్రిటిష్ విచారణను,కోర్టు నియమాలను తీవ్రంగా ధిక్కరించిన వ్యక్తి స్వామి శంకరాచార్య. ఆయన వేదగణిత పండితుడు.

కోర్టులో న్యాయమూర్తి కెన్నెడీ (ఐసిఎస్ ) విచారణ ప్రారంభించారు. ఒక్కొక్కరిని ఆయనప్రశ్నిస్తున్నారు. స్వామీజీని ప్రశ్నించాల్సి వచ్చింది. ఆయన సీటులో కూర్చుని ఉన్నారు.

లేచి నిలబడి మీ పేరు చెప్పండి అని ఆయన స్వామీజీ ని అడిగారు.

లేచినిలబడి సమాధానం చెప్పడం ఆశ్రమ ధర్మ కాదు అని అంటూ ఆయన కూర్చునే తన పేరు స్వామి శంకరాచార్య అన్నారు.

అయితే అంతకు ముందు మరొక నిరసన వ్యక్తమయింది.

నిందితుల మీద పెట్టిన కేసును చదివి వినిపిస్తుప్పు డు శంకరాచార్య పేరును వెంకట్రామన్ అని చదివారు.

దీనికి మహమ్మద్ అలీతోపాటు మిగతా నిందితులంతా నిరసన తెలిపారు. హిందూ ధర్మం ప్రకారం స్వామీజీని శంకరాచార్య అని ఆశ్రమనామంతోనే పిలవాలని, పూర్వాశ్రమ నామం చెల్లదని చెప్పారు. స్వామీజీకి ఈ ప్రత్యేక గౌరవం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.

” I do not care if I and my brother are not called Moulanas, it matters little to us  although I graduated from Firangi Maha School and earned my title like my father before me. Personally I don’t object. But I must speak on behalf of the Sankaracharya. Surely, when my friend, Dr Kitchlew , who is possessor of a mere German degree is called a doctor, the Sankaracharya must be addressed in a way befitting his high station in Life అని మొహమ్మద్ అలీ కోర్టుకు నొక్కి చెప్పారు.

ఆయన కుర్చీలో కూర్చునే ఉండటం తగదని కోర్టు జడ్జి చాలా సార్లు హెచ్చరించారు.

శంకరాచార్య లేచి నిలబడలేదు.‘నా హోదా జడ్జి హోదా కంటే చాలా ఉన్నతమయింది.ఒక్క గురువు ఎదురుగా ఉన్నపుడు తప్ప మరొకరి ముందులేచి నిలబడటాన్నినా మతం నిషేధించింది,’అని చెప్పారు.

ఈ ప్రకటన కోర్టురికార్డు లో నమోదు చేయలేదు. జడ్జినోట్స్ లో కి ఎక్కింది.

తర్వాత జడ్జి మాట్లాడుతూ శంకరాచార్య అని ప్రస్తావిస్తూ  తనేమయిన చెప్పేది ఉంటే వివరించుకోవచ్చని చెప్పారు.

కోర్టుకు ఆయన  తన వాదనని రాతపూర్వకంగాఅందించారు.

అందులో ఆయన ఇలా చెప్పారు. ‘ఖిలాఫత్ అనేది మతానికి సంబంధించి మహోన్నత ప్రాముఖ్యం ఉన్న విషయం. ఇలాంటి ఇస్లామిక్ ధర్మానికి చేసిన హానినే బ్రిటిష్ వాళ్లు రేపు ఇతర మతాలకు చేయగలరు ( Khilafat is ” a question of supreme Dharmik importance. What the British did to an islamic institution, they could toto the institutions of other religions as well”)
అంతేనా, కాదు, ఇంకా ఉంది. ఆయన సరోజిని నాయుడు అన్న మాటలను అక్కడ ఉదహరించారు. మక్కా హిందూవులకు కూడా కాశీ రామేశ్వరం లాగా కావాలి (Mecca ought to be to Hindus as kashi and Rameshwar) అని అన్నారు.

ఇక మత సంబంధ వ్యవహారాల్లోకి వస్తే, ఖిలాఫత్ అనేది హిందూ ధర్మ శాస్త్రాల్లో విశ్వాసమున్న ప్రతి హిందువుకు ఒక ముఖ్యమయిన అంశం కావాలి ( Going into the technical ecclesiastical point of view, we see that Khilafat is matter of vital importance to every Hindu who believes in Hindu scriptures) అని ఆయన పేర్కొన్నారు.

కేసు విచారణ ముగిసింది. తెల్లదొరల ప్రభుత్వం వారి మీద మోపిన నేరాలను రుజువు చేయలేకపోయింది. కోర్టు ఈ ఆరోపణలనుచిన్న చిన్న తప్పులుగా మాత్రమే పరిగణించింది.

ఇందులో ఆరుగురికి రెండు సంవత్సరాల శిక్ష పడింది. శంకరాచార్యుల మీద ఆరోపణలు రుజువుకాలేదు. ఆయన నిర్దోషి అని ప్రకటించింది.

తర్వాత కూడా శ్రీ శంకరాచార్య హిందూ ముస్లిం ఐక్యతకు చాలా ప్రాముఖ్యం ఇచ్చారు.

మక్కా, కాశీ లాగా ఒక గొప్ప పుణ్యక్షేత్రని శంకరాచార్య కోర్టులో సమర్పించిన  వాదనలోని ఒక భాగాన్ని ఇక్కడ అందిస్తున్నాం.

Responding to Mrs. Sarojini Naidu’s appeal to us of the afternoon, we repeated our earlier general pronouncement that, as a believer in the Doctrine of Swa-Dharma for all, every Hindu should necessarily sympathise with the Khilafat cause, and we then added that, according to the detailed account of the Final Deluge contained in the Bhavishya Puran and other Sacred Scriptures of Hinduism, the Lord would take a Colossal
form, stand aloft with His feet on Benares and Mecca (the only two places which would survive the Deluge), gather together there all the Faithful of all faiths, times and climes and gamer them up thence to His own bosom, thus showing that, for a Sanatani Hindu who believed in the Puranas, Mecca was—not merely for general reasons of broad-minded religious sympathy as expressed by Mrs. Sarojini Naidu, but, in the light of this positive and categorical statement on the subject,—a Sacred places like Benares !

(source: Historical Trial of Ali Brothers)
.