సంకల్పబలానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఐఎఎస్ అధికారి

(కందారపు మురళి)
తిరుపతి నగరంలో కోవిద్ పనుల్లో నిరంతరం బిజీగా ఉండే ఐఏఎస్ అధికారి గిరీషా నగరంలో ఎంతో మందికి స్ఫూర్తి. కరోనా అధికారులకు పరీక్షాసమయం. ఎంత శ్రమించిన ఇంకా చాలా పనిమిగిలే ఉంటుంది. కేసులు పెరుగుతున్నాయ్. వసతులు పరిమితం. కరోనాభారినపడినవారికి భోరసా ఇవ్వాలి.  ఇలాంటి నేపథ్యంలో పనిచేస్తు, శ్రమిస్తూ, ప్రశంసంలందుకుంటున్న అధికారి పిఎస్ గిరీషా.
అందరికంటే ముందుగా నిద్రలేస్తాడు.  అందరికంటే ముందే పనిలోకి వస్తాడు. తాను ఇతరులను పురమాయించడమే కాదు, వారిని పనులమీదకు పంపి వారితో పాటు తాను పనిచేస్తూ వాళ్ల మధ్య ఒకరిగా ఉండటం ఆయన నైజం.   సాయంత్రం అందరి తరువాతై ఆయన ఇంటికి చేరుకుంటాడు.   కష్టించి పనిచేయడంలో ఆనందం, సంతృప్తివెదుక్కునే అరుదైన అధికారి గిరీషా.
తిరుపతి నగర మున్సిపల్ కమిషనర్ గిరీషాతో కలసి పనిచేయడం ఉత్సాహాన్నిస్తుందని ఆయనతో పనిచేసే వాళ్లు ప్రశంసిస్తారు.
సంకల్ప బలానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. పిఎస్ గిరీషా 2012 బ్యాచ్ ఐఎఎస్ అధికారి.
కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన గిరీషా అందరిలాగా చలాకీగా ఉండే ఒక సాధారణ కుటుంబీకుడు. తొమ్మిదవ తరగతి చదువుతుండగా విద్యుత్ ఘాతానికి గురై తన కుడి చేతిని పూర్తిగా కోల్పోయాడు రెండు చేతులు పూర్తిగా స్పర్శను కోల్పోయిన తరుణంలో తొమ్మిది ఆపరేషన్ల తర్వాత ఎడమచేతిని కాపాడగలిగారు డాక్టర్లు.ఎనిమిది నెలలు ఆయన ఇంటి దగ్గిరే ఉన్నారు.
ప్రమాదం తర్వాత ఆయన కొత్త జీవితానికి అలవాటు పడాల్సి వచ్చింది. ఎడమచేత్తో రాయడం నేర్చుకోవడం మొదలుపెట్టారు. పదకొండో తరగతి పరీక్షలు రాసే నాటికి ఆయనఎడమచేతి వీరుడయిపోయాడు. ప్రమాదం సృష్టించిన ప్రతికూల  పరిస్థితులో మీదఇలా ఆయన తొలివిజయం సాధించారు.
నిజానికి ఆయన చిన్నప్పటినుంచి ఎంతగానో కలలుగన్నది డాక్టర్ కావాలని.  డాక్టర్ కావాలన్న ఆశయం చాలా ఆయనలో  పట్టుదల పెంచింది. తొమ్మిదవ తరగతి,ఆపైన పదవ తరగతి పాస్ అయ్యాడు 11వ తరగతి లో మంచి ప్రతిభను చూపాడు ఎడమ చేతితో రాయడాన్ని ప్రాక్టీస్ చేసి విజయం సాధించాడు కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో టాప్ ర్యాంకర్ గా రాష్ట్రంలో నిలిచాడు.
వైద్యుడుగా తన శరీరానికి ఉన్న బలహీనతల కారణంగా రాణించ లేనని అర్థం చేసుకుని తల్లిని ఒప్పించి, ఐఏఎస్ కు సిద్ధమయ్యారు. 2010లో ఆయన సివిల్స్ ప్రిపేర్ అయ్యేందుకు రైల్వే ఉద్యోగంలో చేరారు.
గిరీషా తన రెండవ ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు ఎన్నికయ్యారు
మొదటగా నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఇక్కడి ప్రజల మన్ననలు పొందగలిగారు ఆ తరువాత చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పదవిని చేపట్టారు గతంలో జాయింట్ కలెక్టర్ లు గా పనిచేసిన ఎవరికీ తీసిపోని విధంగా అద్భుతమైన ప్రతిభని గిరీషా చిత్తూరు జిల్లాలో కనబరిచారు
ఆ తదనంతరం ఆధ్యాత్మిక పట్టణమైన తిరుపతి నగరానికి మున్సిపల్ కమిషనర్ గానూ, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు స్మార్ట్ సిటీగా తిరుపతిని మంచి ర్యాంకింగ్ లో నిలపడం లోనూ, తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ ను అభివృద్ధి పథంలో నడిపించడం లోనూ ప్రత్యేకమైన కృషి చేశారు
జాయింట్ కలెక్టర్ గానూ, తుడా వైస్ చైర్మన్ గానూ, మున్సిపల్ కమిషనర్ గానూ పలు సందర్భాలలో సమస్యల మీద వీరితో సంప్రదించిన అనుభవం నాకుంది… ప్రజల పట్ల ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించే అధికారి గిరీషా సంకల్ప బలంతోనే విజయాలు సాధించారు అనడానికి ఓ ప్రత్యక్ష నిదర్శనం… ఈయన జీవితం అందరికీ స్పూర్తిదాయకమే. కరోనా మహమ్మారిని ఓడించేందుకు నిరంతరం ప్రజలకు చేరువ గా ఉంటూ కృషి చేస్తున్న అధికారి గిరీషా కు సిఐటియు తరపున అభినందనలు తెలియజేస్తున్నాను
Kandarapu Murali
(కందారపు మురళి, రచయిత, తిరుపతి)