ప్రణబ్ జ్ఞాపక శక్తి కాంగ్రెస్ కు కవచంగా పనిచేసేది….

ప్రణబ్ ముఖర్జీకి అసాధారణమయిన జ్ఞాపక శక్తి ఉంది. పార్లమెంటు సభల్లో మాట్లాడటపుడు చాలా సందర్భంగాలలో ఆయన తారీఖులు, గణాంకవివరాలు వెల్లడించి అధికార పార్టీని,మంత్రులను ఇరుకున పెట్టేవారు. అధికారంలో ఉన్నపుడు ఇదే జ్ఞాపకశక్తి కాంగ్రెస్ పార్టీకి కవచంగా పనిచేసేంది.
ఒకసారి పార్లమెంటులో చర్చ జరుగుతూ ఉంది. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి, లోక్ సభలో చరణ్ సింగ్ చాలా తీవ్రమయిన విషయం బయటపెట్టారు. బడ్జెట్ పేపర్లను ప్రభుత్వం ఇంటర్నేషనల్  మానిటరీ ఫండ్ (IMF)jకులీక్ చేశారని, ఇది భారత సర్వసత్తాక దేశపు రహస్యాన్ని లీక్ చేయడమేనని ఆయన ఆరోపించారు.అంతేకాదు, బడ్జెట్ పేపర్ల లీకయిందనేందుకు ఆయన డాక్యమెంటునుకూడా సభలో చూపించారు. ప్రధాని ఇందిరా గాంధీ ఈ ప్రతం చూసి వణికి పోయారు. అపుడు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ. ఆయన రాజ్యసభలో ఉన్నారు. వెంటనే ఆయనను లోక్ సభకు రప్పించారు. ఆయన హడావిడిగా వచ్చారు. లోక్ సభలో గంభీరంగా చరణ్ సింగ్ చేసిన ప్రసంగంఅంతా విన్నారు.  సభ యావత్తు ఈ గండం నుంచి ప్రభుత్వం ఎలా బయటపడుతుందోనని ఉత్కంఠతో చూస్తూ ఉంది. ఆరోజులో బడ్జెట్ పేపర్ల్ లీక్ కావడమంటే ప్రభుత్వం కూలిపోవడమే. ఇలాంటపుడు ప్రణబ్ ముఖర్జీ ముఖంలో ఎలాంటి ఆందోళనలేదు.  చరణ్ సింగ్ ఉపన్యాసానికి జవాబిచ్చే ముందు ఆయనొకసారి ప్రధాని వైపు చూసి కనుసైగతో ధైర్యం చెప్పారు.
తర్వాత చరణ్ సింగ్ కు జవాబిస్తూ , ‘ చరణ్ సింగ్ గారూ, మీరు చదివినదంతా కరెక్టే. అయితే, మీరు ఇపుడు చదవిని బడ్జెట్ పేపర్ పోయిన సంవత్సరానిది. అది గత ఏడాది నేను చేసిన బడ్జెట్ ప్రసంగం. తారీఖు సరి చూసుకోండి,’ అని అన్నారు. కాంగ్రెస్ పక్షాలు గొల్లున నవ్వాయి. బల్లలు చరిచాయని హిందూస్తాన్ టైమ్స్ రాసింది.
ప్రణబ్ ముఖర్జీ హిందీ 
ఎంతకాలం ఢిల్లీలో ఉన్న ఆయన హిందీ మెరుగుపడలేదు. దీని మీద జోక్ ప్రచారం లో ఉంది. ఒక సారి ముఖర్జీ వ్యతిరేకులంగా వచ్చి ప్రధాని పివి నరసింహారావుకు  ఫిర్యాదు చేస్తే క్యాబినెట్ నుంచి ఆయనను తప్పించి ఉత్తర ప్రదేశ్ కు గవర్నర్ గా పంపించండిన కోరారు. అపుడుప్రధాని ఏమన్నారో తెలుసా?
‘ఇప్పటికే ఉతర్త ప్రదేశ్ ప్రజలు సగం మంది కాంగ్రెస్ వదిలిపెట్టి ములాయాం సింగ్ యాదవ్ సమాజ్ వాది పార్టీలోచేరారు. ఇలాంటపుడు  ప్రణబ్ ముఖర్జీని ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా వేస్తే , ఆయన హిందీ విని మిగతావాళ్లు కూడా పార్టీ వదలిపెట్టి పారిపోతారు,’ అని నరసింహారావు అన్నాట.
ఆయన లకీనెంబర్ 13 !
ప్రణబ్ ముఖర్జీ లకీ నెంబర్ పదమూడా? అదినికరంగా చెప్పలేం గాని, ఆయన జీవితంలో పదమూడో నంబర్ చాలా ముఖ్యమయిందిలా కనిపిస్తుంది. ఎందుకంటే, ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లోకి మారేదాక ఆయన ఒకే ఇంటిలో ఉన్నారు. అది టల్కటోరా రోెడ్ నెంబ. 13  బంగళా.ఇదే మంత పెద్ద బంగళా కాదు. రక్షణ మంత్రిగా ఉన్నపుడు అధికార నివాసం మార్చాల్సి వచ్చింది. దానికి ఆయన భార్య అంగీకరించలేదు. ఆయనకు  సువ్రా ముఖర్జీలో విహామయింది కూడా జూలై 13న. పార్లమెంటుభవనంలో ఆయన కార్యాలయం నెంబర్ కూడా 13వ నెంబర్ దే. ఆయన భారత దేశానికి 13వ రాష్ట్రపతి అయ్యారు.
స్వాతంత్య్ర యోధడి కుటుంబం
ప్రణబ్ ముఖర్జీ తండ్రి కెకె ముఖర్జీ స్వాతంత్య్ర సమరయోధుడు. స్వాతంత్య్రపోరాటం పాల్గొన్ని పలుమార్లు జైలుకెళ్లారు. స్వాతంత్య్రం వచ్చాక బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1952 నుంచి 1965 దాకా ఎమ్మెల్యే గా ఉన్నారు.