Home Features కరోనా కేసులు పెరుగుతున్నా, తిరుమల దర్శనాలా అంటున్న స్థానికులు

కరోనా కేసులు పెరుగుతున్నా, తిరుమల దర్శనాలా అంటున్న స్థానికులు

809
0
SHARE
లాక్ డౌన్ సమయంలో తిరుమల
తిరుపతిలో కరోనా విస్తరిస్తూ ఉండటం, దీనిని ఖాతరుచేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాలు కొనసాగిస్తూ ఉండటం వివాదాానికి దారి తీసింది. చిత్తూరు జిల్లాలో, మరీ ముఖ్యంగా తిరుపతిలో కేసులు పెరుగుతున్నా , తిరుమలకు వస్తున్న భక్తులకు కోరానా లేదని,కేవలం టిటిడి సిబ్బందిలో మాత్రమే కరోనా ఉందని చెప్పి మెల్లిమెల్లిగా టిటిడి దర్శనాలను పెంచుతూపోతూ ఉండటం విమర్శలకు దారితీస్తూ ఉంది.ఈ సమయంలో చిత్తూరు జిల్లా  కలెక్టర్ తిరుమలను కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ వార్త ఎలెక్ట్రానికి మీడియాలో వస్తుండగానే,  జిల్లా డాక్టర్ భరత్ గుప్తా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.
తిరుమలను రెడ్ జోన్ గా పొరపాటున చేర్చామని వివరణ ఇవ్వడం వెనక పైస్థాయి నుంచి వత్తిడి ఉందని తిరుపతిలో బాగా ప్రచారంలో ఉంది.  ఈ వార్త రాస్తున్నప్పడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కరోనాబులెటీన్ ప్రకారం చిత్తూరు జిల్లాలో 238 కేసులు నమోదయ్యాయి. చాలా చోట్ల ఇలా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు కనపడగానే పాక్షికంగా లాక్ డౌన్ పెడుతున్నారు. మంగళవారం నుంచి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం లలో నిరవధిక పాక్షిక లాక్ డౌన్ విధించారు. ఉదయం ఆరునుంచి పదకొండగంటల దాకా షాపులను అనుమతించి అనంతరం లాక్ డౌన్ విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఇది ఇండెఫినిట్ గా కొనసాగుతుందని కూడా అధికారులు ప్రకటించారు.

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఆంక్షలు, లోకల్ లాక్ డౌన్

ఇతర చోట్ల పరిస్థితి ఇలా ఉంటే తిరుపతిలో టిటిడి ఇంకా భక్తులను అనుమతించడం ఆందోళన కలిగిస్తున్నదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్,తిరుపతి వాసి నవీన్ కుమార్ రెడ్డి.

1) తిరుమల శ్రీవారి ఆన్ లైన్ సేవా టికెట్లను మరి కొద్దిరోజుల పాటు నిలుపుదల చేయడం, 2) తిరుపతిలో మద్యం దుకాణాలను రెండు నెలలపాటు పూర్తిగా మూసివేయడం వల్ల తిరుపతి కరోనా వ్యాప్తిని అదుపు చేయవచ్చని ఆయన అంటున్నారు.

Like this story? Please share it with friends?

తిరుపతి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తిరుపతి “వస్త్ర వ్యాపారస్తుల” సంఘం, “చాంబర్ ఆఫ్ కామర్స్” సంయుక్తంగా నగరంలో అన్ని వ్యాపార వర్గాలు కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి వ్యాపారం నిర్వహించుకోవాలని నిర్ణయించి అమలు చేస్తున్నారు, ఇది అభినందనీయం అని చెబుతూ టిటిడి ఉన్నతాధికారులు భేషజాలకు పోకుండా  తిరుమల తిరుపతిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేయాలి అని నవీన్ రెడ్డి తెలిపారు.
లాక్ డౌన్ సమయంలో తిరుమల శ్రీవారి దర్శనాలు నిలిపివేశారు. లాక్ డౌన్ సడలించాక జూన్ 11 వ తేదీనుంచి  దర్శనాలను పునరుద్ధరించారు.  మొదట ఆరువేల మందినే అనుమతిస్తామని చెప్పి తర్వాత 12వేలకు పెంచారు. లాక్ డౌన్ తర్వాత వచ్చిన మార్పులేమిటంటే, రాష్ట్రంలో కరోనా కేసులు బాగాపెరగటం, అందులో బాగంగా చిత్తూరు జిల్లాలో మరీ విపరీతంగా పెరగడం.
జూన్ పదకొండు నుంచి ఇప్పటిదాకా ఒక్క టిటిడి ఉద్యోగుల్లోనే  91 మందికి కరోనా సోకింది.దీనితోనే తిరుమలని కలెక్టర్ కంటైన్మెంట్  జోన్ గా ప్రకటించారని, అయితే, ఇలా ప్రకటిస్తే తిరుమల ఆలయాన్ని మూసేసి దర్శనాలు రద్దు చేయాల్సి వస్తుంది.టిటిడి రాబడి పడిపోతుంది. ఉపాధి కోల్పోయే పేదవాడిలాగా టిటిడి పాలకమండలి ఆందోళన చెందడం ఆశ్చర్యంగా ఉంది. రాబడి తగ్గిందని చివరకు టిటిడి ఛెయిర్మన్ కేంద్ర సాయం కూడా కోరారు.

91మంది టిటిడి ఉద్యోగులకు కరోనా, భక్తులంతా క్లీన్

  టిిటిడి పెద్దలుకదిలి  కలెక్టర్  నిర్ణయాన్ని ఉపసంహరరింపచేశారని అనే అనుమానం సర్వత్రా వినిపిస్తుంది.ఇది ప్రజల ఆరోగ్య రీత్యా సబబా అని  స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు.
భక్తులలో ఎవరికీ కర్నా లేదని, వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని, టిటిడికి చెందిన 91 మంది ఉద్యోగుల్లో కరోనా సోకింది స్థానిక కారణాల వల్ల అని టిటిడి వాదిస్తున్నా  ఇక్కడి ప్రజలెవరూ విశ్వసించడం లేదు.
ఈ వాదన టిటిడి ఉద్యోగులను,స్థానిక జర్నలిస్టులను, ప్రజలను  కూడా కలవర పెడుతూ ఉంది. ఈ ధోరణి వల్ల దర్శనాలు కొనసాగిస్తే వైరస్ ప్రబలుతుందని వారు భయపడుతున్నారు.
దర్శనాలు నిలిపివేయడం మంచింది
Dr BN Sudhakar Reddy
చాలా మంది కొంతకాలం  మళ్లీ దర్శనాలు నిలిపివేసి,కేవలం ఆలయంలోపుల  సంప్రదాయానుసారం పూజరులోతోనే లాక్ డౌన్ కాలంలో లాగా పూజలు పుసస్కారాలు జరిపించాల్సిన అవసరం ఉందని తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు డాక్టర్ బిఎన్ సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
’తిరుపతిలో విద్యాసంస్థలుమూసేశారు.ఇపుడు వ్యాపారాలు మూసేస్తున్నారు. అలాంటపుడు దర్శనాలు అనుమతించడం మంచిదా?  ఎందుకంటే, తిరుపతి  చాలా కీలకమయిన ప్రదేశం. కర్నాటక, తమిళనాడుతిరుపతికి పొరు గురాష్ట్రాలు. చాలా మంది జబ్బుపడినవాళ్లు దేవుడిమొక్కుకోసం తిరుమల వస్తుంటారు. వారితో ఒక్కరికి గూఢంగా కరోనా వైరస్ ఉన్నా అది వ్యాపిస్తుంది. భక్తులందరిని ధర్మల్ చెక ప్ చేసినా మావన తప్పిదం వల్ల ఒక పాజిటివ్ కేసు  తప్పించుకున్నా ప్రమాదమే. అందువల్ల ప్రజల ఆందోళనను గమనించి టిటిడి దర్శనాలను ఆపేయాలి,’ అని సుధాకర్ రెడ్డి అన్నారు.  చిన్న చిన్న వ్యాపారస్థుల లాగా టిటిిడి నిర్వహణ ఖర్చులు చెప్పి దర్శనాలు కొనసాగించాలనుకోవడం ఏమాత్రం అభిలషణీయం కాదని ఆయన వ్యాఖ్యానించారు
Adimulam Sekhar
వాస్తవంగా తిరుపతిలో లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి ఉందని సీనియర్ జర్నలిస్టు, టిటిడి వ్యార్తల వెబ్ సైట్  ధర్మచక్రం సంపాదకుడు  ఆదిమూలం శేఖర్ కూడా అభిప్రాయపడుతున్నారు.
‘తిరుపతిలో పాజిటివ్ కేసులం సంఖ్య వేయి దాటింది. లాక్ డౌన్ సడలించడానికి ముందు  వందల్లో ఉన్న కేసులు ఇపుడు వేలకు పెరిగాయి. అందోళన చెందుతున్న ప్రజలు  లాక్ డౌన్ విధించాలిన కోరుతున్నారు. దర్శనాల వల్ల కరోనా తీవ్రంగా ఉన్న కర్నాటక, తమిళనాడు ప్రజలు తిరుపతికి రావడం ఎక్కువయింది. ఇక్కడ లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులున్నా, శ్రీవారి దర్శనాలను దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్ ప్రకటించేందుకు వెనకంజ వేస్తన్నారు,’ అని శేఖర్ వ్యాఖ్యానించారు