Home Features ‘పక్క ఇంటి అమ్మాయి’ని అంతా మర్చిపోయారు!

‘పక్క ఇంటి అమ్మాయి’ని అంతా మర్చిపోయారు!

832
1
(Ahmed Sheriff )
ఒక యువతి, ఆమెకు సంగీతమంటే అమితమైన ప్రేమ. ఒక యువకుడు, అతడికి ఆ యువతి అంటే అమితమైన ప్రేమ. 
ఇద్దరికీ గిట్టదు. ఆ యువతి తనకు సంగీతం నేర్పించ డానికి ఒక గురువును నియమించు కుంటుంది. ఆ గురువు యువతి కి దగ్గరవటానికి ప్రయత్నిసూ వుంటాడు. ఈ రూపేణా యువకుడి ప్రేమ ప్రయాణం లో ఒక పెద్ద అవరోధం అవుతాడు
తన మిత్రులతో తన ప్రేమ విషయం చెప్పి ఆమె ప్రేమను పొందడానికి సహాయం అడిగినప్పుడు, అతడి మిత్రుడు ఆ యువకుడిని, తనకు సంగీతం లో ప్రావీణ్యం  వుందని ఋజువు చేసుకోవడం ఒక్కటే మార్గ మని చెబుతాడుదీనికోసం ఆ మిత్రుడు మొదట ఆ యువకుడికి సంగీతం నేర్పించడానికి ప్రయత్నిస్తాడు.  అది కుదరక , తాను తెరవెనుక వుండి పాడుతూ, యువకుడి ని పాట పాడుతున్నట్లు నటించమంటాడు..  
ఈ చిట్కా కొద్ది కాలం నడుస్తుంది. ఈ కొద్ది కాలం లో ఆ యువతి ఈ యువకుడి కేసి మొగ్గు చూపుతుంది. ప్రేమలో పడుతుంది. కాని ఒక రోజు నిజం బైట పడి ఆమె ప్రేమంతా కోపంగా మారి ఆ కోపం లో ఆమె తన సంగీత గురువునే పెళ్ళి చేసుకుంటానని చెబుతుంది.చివర్లో ఆ యువకుడి మిత్రుడు, యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఒక బూటకపు సన్నివేశాన్ని సృష్టించి, ఆ యువకుడు, యువతి ప్రేమను పొందేలా చేస్తాడు.     
ఇదీ కథ.
ఇదే కథ 
వివిధ భాషల్లో ఆరేడు చిత్రాలు గా వచ్చినా, ఈ కథ చెప్పగానే ఇప్పటి సినిమా ప్రేక్షకులు ఈ కథ ఎక్కడో విన్నట్లుందే అనొచ్చు.  కానీ 70, 80, 90 దశకాల్లోని సినిమా ప్రేక్షకులు మాత్రం ఓ ఇది పడోసన్  (హింది) సినిమా కథ  కాదూ?” అంటారు. దీనికి కారణం ఈ చిత్రం  ఆ నాటి ప్రేక్షకుల మనసుల్లో ఒక గొప్ప సంగీత, హాస్య భరిత చిత్రంగా ముద్ర వేయడమే. అయితే ఈ కథ వెనుక వున్న కథేమిటి ?
పడోసన్ చిత్రం 1968 లో విడుదల అయింది. ఈ చిత్రం విడుదల కు దాదాపు 16  సంవత్సరాల క్రింద బెంగాలీ రచయిత అరుణ్ చౌదరి రాసిన పాసేర్ బాడి అనె ఒక బెంగాలి కథ ఆధారంగా 1952 లో అదే పేరుతో ఒక బెంగాలి సినిమా వచ్చింది. ఈ
సినిమా అధారంగా ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపేనీ అనే సంస్థ బెంగాలీ చిత్రాన్ని 1953 లో తెలుగు లో తీయాలనుకుని  దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య (సి పుల్లయ్య)ను సంప్రదించింది. అదే పక్క ఇంటి అమ్మాయి అనే చిత్రమయింది.  ఈ చిత్రం లో హీరో గా ఆనాటి హాస్యనటుడు రేలంగి, హీరొయిన్ గా అంజలీ దేవి నటించారు. పక్క ఇంటి అమ్మాయి చిత్రం టైటిల్స్ లో శ్రీ  అరుణా చౌదరి గారి పాసేర్ బాడి అను బంగాలి కథ అధారం అని ప్రదర్శిస్తారు.
పక్క ఇంటి అమ్మాయి (1953) లో హీరోయిన్ పాత్ర.  సంగీతం లో అభిరుచి వుండి చిలిపితనం తో కూడుకున్న ఆధునిక పాత్ర. అంతవరకు అంజలి నటించిన పాత్రలు, దేవకన్య లేదా రాజ కుమారి లాంటివే.

 ఆధునిక పాత్ర ఆమెకు కొత్తదే. . అయినా అంజలీ దేవి నటన కొనియాడ తగిందిగా వుంది. ఆమె ప్రేమను పొందాలని అభిలషించే అమాయక యువకుడిగా రేలంగి ఆ  పాత్రలో ఇమిడిపోయాడు
దీనికి హీరోయిన్ కావాలి. అపుడు ఆయన తన 1943 చిత్రం ‘గొల్లభామ’లో హరోయిన్ గా నటించిన అంజలిని ఎంచుకున్నారు. మరి హీరో ఎవరు? ఆయన దగ్గిర ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నారు.ఆయన సరిపోతాడనుకున్నారు పుల్లయ్యా. ఇలా ఈ ‘పక్క ఇంటి అమ్మాయి’కి హీరో హీరోయిన్ గా అంజలి రేలంగి వెంకట్రామయ్య కుదిరారు. స్క్రీన్ ప్లే పులయ్య, ఆరుద్ర కలిసిరూపొందించారు. అంతవరకు అంజలి ఇలాంటి సాంఘిక చిత్రాలలో నటించలేదు. ఆమె ఎపుడూదేవకన్య, మోహినీ వంటి పాత్రలోనే కనిపించారు. ఇందులో ఆమె హాస్యభరిత పాత్ర పోషించారు.
చిత్రంలో సుబ్బరాయుడి(రేలంగి) గారి పక్కంటి అందమయిన అమ్యాయి పేరు లీలా దేవి (అంజలి).సుబ్బారాయుడి చేష్టలంటే
ఆమెకు పెద్ద గా ఇష్టం లేదు. కాని లీలా అంటే సుబ్బారాయుడికి చాలా ఇష్టం. ప్రేమకూడా. ఆమె మనసుదోచుకునేందుకు సుబ్బరాయుడు ఎంరాజాను అడ్డంపెట్టుకుని పాడుతున్నట్లు నటిస్తూంటాడు. లీలాదేవికి సంగీతమంటే చాలా ఇష్టం. డ్యాన్సు కూడా. డాన్స్ నేర్పంచుకునేందుకు నారాయణరావు ( అంజలి భర్త)ను టీచర్ గా కుదుర్చుకుంటుంది. సుబ్బరాయుడిని వదిలించుకునేందుకు నారాయణరావుసాయం తీసుకుంటుంది. అయితే, ఎఎమ్ రాజాను అడ్డుపెట్టుకని సుబ్బరాయుడు పాడే ఫేక్ సాంగ్స్ ను విని ఆమె దాదాపు ఆయన్ని ఇష్టపడేంతా మారుతుంది. రహస్య బయటపడుతుంది. లీలా తిరస్కరిస్తుంది. సుబ్బారాయుడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తాడు చివర్లో ఆమె మనసు మార్చుకుని ఆయన్ని ప్రేమిస్తుంది. అముల మన్మధ రాజా (ఎఎంరాజా), సుశీల పాటలతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అప్పటికి సుశీలకు 17 సంవత్సరాలు.
60, 70 దశకాల్లో మహమూద్ తారస్థాయి హాస్య నటుడు. తానే ఒక చిత్రాన్ని నిర్మించాలనుకున్నాడు. తనకనువైన జోనర్ కామెడీ అని తెలుసుకుని,  ఎన్. సి. సిప్పీ తో కలిసి పడోసన్ చిత్రాన్ని నిర్మించాడు. ఇది కూడా తెలుగులో బాక్సాఫీస్ హిట్ సాధించిన 15 సంవత్సరాలకు.
ఒక నిర్మాత గా మహమూద్ కి ఇది మొదటి చిత్రం. ఈ చిత్రం లో నాలుగు ముఖ్యమైన పాత్రలు. హీరోహీరోయిన్, హీరొ స్నేహితుడు, సంగీతం మాస్టరు. తెలుగులో వచ్చిన పక్క ఇంటి అమ్మాయి (1953) ని ఆధారంగా తీసుకుంటే మహమూద్ హీరో వేషం (రేలంగి పాత్ర) వేయాలి. అది అతనికి సరిపోయే పాత్ర.  
అయితే మహమూద్ కి మాత్రం తనకి పేరు తీసుకు రాగల పాత్ర  సంగీతం మాస్టారు పాత్రే అని పించింది. దక్షిణ భారత దేశ ప్రజల రూపు రేఖలూ, హావ భావాలతో ప్రెక్షకులను నవ్వించడానికి ఆస్కారం ఎక్కువ అని తెలుసుకున్నాడు. మాస్టర్ పిళ్ళై (మాస్టర్జీ) పాత్ర సృష్టించబడింది. హీరో గా సునీల్ దత్ ను ఎంపిక చేశారు. అంతవరకూ హుందా హీరొ పాత్రల్లో నటించిన సునీల్ దత్ కు ఈ చిత్రం లో లోకజ్ఞానం లేని అమాయకుడి పాత్ర చాలా కొత్తది.  సరిపోనిది. ఈ చిత్రం తరువాత తన అభిమానులు తగ్గారని చెప్పుకున్నాడు సునీల్ దత్
 మాస్టర్ పిళ్ళై పాత్ర  రూపు రేఖలూ హావ భావాలు మద్రాసీలను  హేళన పరిచే విధంగా వుండడం తో అడపా దడపా వివాదాలు సృష్ఠించినా, అన్ని వర్గాల ప్రెక్షకులు సినిమాని ఆస్వాదించారనే అనాలి.  ప్రముఖ నటుడు కమలహాసన్   ఈ విషయం లో ఆందోళన చేయాలని సంకల్పించి, సినిమాని చూసాక చిరునవ్వు నవ్వుకుని మహమూద్ కు ఫాన్ అయ్యానని చెప్పుకున్నాడు. ఈ చిత్రం ద్వారా మహమూద్ అనుకున్న ఫలితాన్ని సాధించాడు. చివరికి పడోసన్ అంటే మహమూద్ గానే గుర్తుండి పొయింది అందరికీ. 
పక్క ఇంటి అమ్మాయి సినిమాలో హీరొ (రేలంగి) స్నేహితుడు గాయకుడు కాడు. అతడు ఒక గాయకుడిని (ఏ. యం. రాజా) ను తెచ్చి తెర వెనుక పాటలు పాడిస్తూ వుంటాడు. అయితే పడోసన్ సినిమాలో హీరో (సునీల్ దత్)  స్నేహితుడు (కిశోర్ కుమార్) గాయకుడు కూడాపడొసన్ సినిమాలో గాయక స్నేహితుడి పాత్ర  కిశోర్ కుమార్  కు చాలా పేరు తెచ్చింది. కిశోర్ కుమార్ నటుడూ, గాయకుడు కూడా. అవటం, అతనికి కలిసొచ్చింది. కిశోర్ కుమార్ ఆ పాత్ర తో సునీల్ దత్ నూ మహమూద్ నూ కూడా వోవర్ టేక్  చేస్తాడనిపించి కిశోర్ కుమార్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను మహమూద్ తొలగించాడని కూడా చెబుతారు. 
అప్పట్లో గాయకుడి పాత్రలో నిజమైన గాయకుడే, నటించడం కూడా ఒక ఆకర్షణ గా నిలిచింది. 
పడొసన్ సినిమాలో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. ఈ సినిమాతో మరింత పేరు తెచ్చుకున్నది దీని సంగీత దర్శకుడు ఆర్. డీ. బర్మన్. ఈ సినిమా మొత్తానికి హైలైట్ పాట మాస్టర్ పిళ్ళై (మహమూద్) కి, గురు (కిశోర్ కుమార్) కి మధ్య జరిగే పోటీ పాట “ఎక్ చతురనార్…”

సినిమాలో ఈ పాట పెట్టమని కిశోర్ కుమారే సలహా ఇచ్చాడట.  నిజానికి ఈ పాట కిశోర్ కుమార్ అన్నయ్య అశోక్ కుమార్  “ఝూలా” (1941) అనే చిత్రం లో పాడింది

మొత్తానికి పడొసన్ హింది చిత్రసీమలో  ఒక గొప్ప హాస్య రస ప్రధాన చిత్రంగా మిగిలి పోయింది. తప్పనిసరిగా చూడవలసిన 25 సినిమాల జాబితాలో చోటు  సంపాదించుకుంది
కంచికి వెళ్ళని కథ
ఈ సినిమా 1960 లో అడుత వీట్టు పెన్ (తమిళ సినిమా) గా తర్జుమా అయింది.ఈ సినిమాని అంజలీ దేవే అంజలి ప్రొడక్షన్స్ బానర్ కింద భర్త ఆది నారాయణ రావు తో కలిసి నిర్మించింది. దీనికి దర్శకత్వం వేదాంతం రాఘవయ్య 
పడొసన్ విడుదలయిన పదమూడు సంవత్సరాలకు (1981) తెలుగు లో మళ్ళీ ఇదే కథతో, ఇదే పేరుతో పక్కింటి అమ్మాయి సినిమా (చంద్రమోహన్, జయసుధ, ఎస్. పీ. బాలసుబ్రమణ్యం ) వచ్చింది. ఈ మూడు చిత్రాల్లోనూ వెనక వుండి పాట పాడే వారి పాత్రలో గాయకులే వుండటం విశేషం. 1953 పక్క ఇంటి అమ్మాయి, ( ఏ. యం. రాజా), 1968 పడొసన్, (కిషోర్ కుమార్) 1981 పక్కింటి అమ్మాయి, (ఎస్. పీ. బాలసుబ్రమణ్యం) 
ఇదే కథ మళ్ళీ 2003 లో పక్కద మానె హుడుగి పేరుతో కన్నడ చిత్రంగా  నిర్మించ బడింది

 

(Ahmed Sheriff is a Hyderabad based poet, and PMP expert.email: csahmedsheriff@gmail.com)

 

1 COMMENT

Comments are closed.