విజయవాడలో కూడు పోయింది, ఒదిషాలో ప్రాణం పోయింది, వలసకూలీ విషాదం

వలస కూలీల వ్యథలు వర్ణణానీతం. ఒక కూలీది ఒక్కొక్కవిధమయిన అలుపెరగని జీవన సమరం. కూలీ కోసం ఉన్న వూరోదలి, అయినవాళ్లందరిని వదిలేసి వేలమైళ్ల దూరాన పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఏదో బాగా సంపాదించాలని కాదు, బతుకు దెరువు కోసమే. ఇపుడు లాక్ డౌన్ వీళ్ల బతుకులను బుగ్గిపాలు చేసింది. కూలీ పొగొట్టింది. నోటికాడి అన్నం గిన్నెను లాగేసుకుంది.
‘వలస  కార్మికులను ఇళ్ళకు పంపవద్దు భోజనాలు పెట్టండి’ అని కేంద్రం చెప్పడం ఒక జీవితకాలం లేటు అయింది. అప్పటికే వాళ్లంతా ఉపాధిపోయిన వూరొదలి ఇంటి ముఖం పట్టారు. మధ్యలో అధికారులు నిలిపేసే ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ఒంగోలు పట్టణంలో ఇలాంటి దర్ఘటన జరిగింది. పట్ణణంలోని RISE ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ప్రభుత్వం వలసకూలీల కోసం ఒక షెల్టర్ ఏర్పాటుచేసింది. అక్కడ ఒక కూలీ తనని వూరెళ్లకుండా  అపేసినందుకు నిరసనగా లారీకిందికి దూకే ప్రయత్నం చేశాడు.అయితే, అక్కడే ఉన్న ఒక ఎస్ఐ ఆయన్ని కాపాడారు.

https://trendingtelugunews.com/telugu/breaking/guntur-police-cane-the-migrant-labourers/

అందుకే ఎవరు ఆపినా, ప్రధాని డబ్బులిస్తున్నాడన్నా కూలీలు  ఆగడం లేదు.
వేల కిలో మీటర్ల దూరానఉన్న తమగ్రామాలకు ప్రాణాలకు తెగించి జాతీయ రహదారుల వెంబడి, రైలు పట్టాల వెంబడి, అడువులగుండా ఎడాలరు గుండా పోతున్నారు. కొంతమంది ఆయాసమొచ్చి మధ్యలోనే చనిపోతున్నారు. మరికొందరు జాతీయ రహదారులమీద ప్రమాదాలలో చనిపోతున్నారు. ఈ వార్త రాస్తున్నపుడు తెలంగాణ నిర్మల్ జిల్లాలో కూలీలను తీసుకువెళ్తున్న లారీ బోల్తాపడింది. అదృష్ణ వశాత్తు ఎవరూ మరణించలేదు.కాని ఉత్తర ప్రదేశ్ లో అరయ్యా వద్ద జరిగిన ప్రమాదంలో మాత్రం 23 మంది చనిపోయారు.
కొంతమంది ఇళ్లు చేరే లోపు చనిపోతున్నారు. కొందరు ఇళ్లు చేరాక చనిపోతున్నారు. ఉపాధి వూర్లో ఉండలేరు, ఉండూరులో బతక లేరు. దీనితో భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుండటంతో చాలా మంది ఇంట్లో నే ఆత్మ హత్య చేసుకుంటున్నారు.

https://trendingtelugunews.com/telugu/breaking/this-labourers-leaves-for-chattishgarh-carrying-children-in-kavadi/

అయితే ఒదిషాకు చెందిన ఒక వ్యక్తి ఆంధ్రలో ఉపాధి పోవడం తో ఒదిషా తిరిగివెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు?…క్వారంటైన్ దగ్గిర.
ఆయన పేరు సురేంద్ర బెహరా. వయసు 38 సంవత్సరాలు.బరిపాడ జిల్లా రైకామా కు చెందిన బెహెరా క్వారంటైన్ సెంటర్ వద్ద చెట్టుకు లంగీతో ఉరేసుకుని చనిపోయి ఉండటాన్ని అధికారులు గమనించారు.
ఇది ఆత్మహత్యగా నే కనిపిస్తూ ఉందని బైసింగా పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ ఇన్స్ పెక్టర్ లక్ష్మీధరస్వైన్ చెప్పారని OdishaTV రాసింది.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడనగరంలో బెహెరా భార్యతో కలసి కూలిపని చేసుకుంటూ జీవించే వాడు. కోరోనాలాక్ డౌన్ తో విజయవాడను మూసేయడంతో బెహెరా బికారి అయ్యాడు. ఉపాాధి పోయింది. తిండికరువయింది. అందువల్ల గత్యంతరం లేక  ఆరురోజుల కిందట ఆయన భార్యతో కలసి సొంతవూరు కొచ్చాడు. అయితే, ఇంటికి పోయే అవకాశం రాలేదు. అధికారులు వెంటనే ఐసోలేషన్  అంటూ బెహెరాను ఒక క్వారంటైన్ సెంటర్లో పడేశారు. అసలే ఉపాధి పోయిన, బతుకు చితికిపోయి, నిరాశలో ఉన్న బెహెరాను క్వారంటైన్ జీవితం ఇంకా కృంగదీసింది. దీనితో ఆయన ఆత్మహత్యకు పూనుకున్నాడు.
ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం బరిపాడ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి పంపించారు. అసహజమరణం అంటూపోలీసులు ఒక కేసు బుక్ చేశారు.