విశ్వ విఖ్యాత న్యూయార్క్ న్యూరో సర్జన్ కరోనా వైరస్ కు బలి

విశ్వవిఖ్యాత న్యూరో సర్జన్, ముఖ్యంగా తలలు కలసి పుట్టిన పిల్లలను విడదీయడంలో ప్రపంచంలోనే మేటి అనిపించుకున్న న్యూరో సర్జన్ డాక్టర్ జేమ్స్ టి. గుడ్ రిచ్ కరోనా వైరస్ సోకి చనిపోయారు.
జటిలమయిన ఆపరేషన్లను సునాయాసంగా విజయవంతం చేసి ఎందరికో ప్రాణం దానం చేసిన డాక్టర్ ,అందునా అమెరికాలోనే పేరుమోసిన ఒక మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ కూడా ఆయన డాక్టర్  కోవిడ్ -19 తో చనిపోవడం విచారకరం.
కరోనా వైరస్ దాడితో  అమరికా, ముఖ్యంగా న్యూయార్క్ పట్టణం తలకిందులవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్త రాస్తున్నప్పటికి న్యూయార్క్ సిటీలో వేయిమంది దాకా చనిపోయారు. ఈ న్యూయార్క్ ఉపద్రవానికే డాక్టర్ గుడ్ రిచ్ కూడా బలయ్యారు.
ప్రపంచవ్యాపితంగా నావెల్ కరొనా వైరస్ సోకిచనిపోయిన వారి సంఖ్య 42100కు పెరిగింది.
కరోనా వైరస్ బారినపడి అమెరికాలో చనిపోయిన రెండో వర్లడ్ ఫేమస్ సెలెబ్రిటీ ఈ డాక్టర్ . మొదటి వ్యక్తి ప్రఖ్యాత పాప్ సింగర్ , 1970 దశకం మధ్యలో ప్రపంచ యువతను I Love Rokc N Role గీతాన్ని రచించి పాడి వూర్రూత లూగించిన ఎలన్ మెర్రిల్.
డాక్టర్ గుడ్ రిచ్ సోమవారం నాడు కోవిడ్-19 వ్యాధి తీవ్రం కావడంతో మరణించినట్లు ఆయన పని చేస్తున్న ఆసుపత్రి మాంటిఫియోర్ హెల్త్ సిస్టమ్ ట్వీట్ చేసింది. ఆయన వయసు 73 సంవత్సరాలు.
 తలలు కలసి పుట్టిన మెక్డొనాల్డ్ కవలలను ఆయన వేరుచేసి రికార్డ్ సృష్టించారు. వార్తలకెక్కడం అంటే పెద్ద ఇష్టపడని డాక్టర్ గుడ్ రిచ్ చిన్న పిల్లల మెదడు సంబంధ వైద్యానికి ముఖ్యంగా తలలు కలసిని పిల్లలను వేరే చేసే కఠిన సర్జరీలకు పెట్టిందిపేరు. ఇపుడాయన మాంటిఫియోర్ కు చెందినబ్రాంక్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ఆయన 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అక్కడి పేడియాట్రిక్ న్యూరో సర్జరీ విభాగంఅధిపతిగా ఉంటున్నారు. అంతేకాకుండా, అల్బర్ట్ ఐన్ స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ లో న్యూరోలాజికల్ సర్జరీ, పెడియాట్రిక్స్,ప్లాస్టిక్ అండ్ రికన్ స్ట్రక్టివ్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్ గా ఉంటున్నారు.
2016 లో 40 డాక్టర్ల టీమ్ తో 27 గంటలు ఆపరేషన్ చేసి తలలు కలసి పుట్టిన నెలల జేడన్, ఎనియాస్ మెక్డొనాల్డ్ కవలలను విజయవంతంగా విడదీశారు. అపుడు వారి వయసు 13 నెలలు. వారి పుర్రెలే కాదు మెదడు కూడా 3 సెంటిమీటర్ల దాకా అతుక్కుపోయిఉంది.
అది ఆయన చేసిన ఏడో సర్జరీ.  ఇలాంటి సర్జరీలు ప్రపంచంలో బాగా అరుు. ప్రపంచంలో మొట్టమొదటి సర్జరీ 1952లో జరిగింది. అప్పటి నుంచి 2016 దాకా జరిగిన ఆపరేషన్లు కేవలం 59  మాత్రమే.
ఆయన మొదటి తలలు కలసిన కవలల సర్జరీని 2004 చేసి ప్రపంచమంతా ఖ్యాతి సంపాదించారు. అపుడుకార్ల్ , క్లారెన్స్ ఆగ్వైర్ లను విడదీశారు. ఎనిమిది సెంటిమీటర్ల మెదడు కణాలు కలసిపోయిన కవలలు వారు.ఇలా తలలంటుకుని పుట్టిన కవలలను విడడీసే సర్జరీని, మొదట్లో చాలా జటిలమే అనిపించిన తర్వాత దాన్నొక కళ లాగా మార్చామని ఆయన CNN కు చెప్పారు. ఆయన చేసిన 27 గంటల 2016 ఆపరేషన్ ను రికార్డు చేసే అవకాశం సిఎన్ ఎన్ కి దొరికింది.