రేపే అమెరికా అంగారక ‘ప్రాణి అన్వేషణ’ యాత్ర ప్రారంభం

తన లాంటి మనిషిని కాకపోయినా, కనీసం ఒక సూక్ష్మజీవినో, అదీకాకపోతే, దాని ఆనవాళ్లయినా కనిపెట్టాలన్న ‘భూమ్మీది మనిషి’  ఆత్రుత ఇపుడు ఆంగారక యాత్రకు  బాటవేసింది.
అంగారక గ్రహయాత్రల చరిత్ర
అంగారకుడిని గుట్టు విప్పాలన్న తొలి ప్రయత్నం 1960, అక్టోబర్ 10 జరిగింది. అప్పటి సోవియట్ యూనియన్   మార్స్ నిక్ 1  ఉపగ్రహాన్ని పంపింది. ప్రయోగ సమయంలోనే ఇది విఫలమయింది. అక్టోబర్ 14,  మార్స్ నిక్ 2 ని ప్రయోగించాలని చూసింది.  ఇది కూడా ప్రయోగ సమయంలోనే పేలిపోయింది. రెండు ప్రయోగాలువిఫలమయినా ఏమాత్రం వెనకాడ కుండా  1962 అక్టోబర్ 24న సోవియట్ యూనియ్ స్పుత్నిక్  22ను ప్రయోగించింది. ఇవన్నీ అంగారకుడి మీదకు కాదు, ఆగ్రహాన్ని సమీపాన్నుంచి గమనించేందుకు చేసిన ప్రయత్నాలు.  ఈ భూకక్ష దాకా వెళ్లాకా పేలిపోయింది. ఆయేడాది నవంబర్  1 సోవియట్ రష్యా మరొక సారి ప్రయత్నించింది.  ఈసారి  భూకక్ష దాటి పోయింది.   అయిదు నెలలు ప్రయాణించింది.  1963 మార్చి 21నాటికి 65.9 మిలియన్ మైళ్లు ప్రయాణించింది. ఆ దశలో ఈ అంతరిక్ష నౌక కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినింది. దాని జీవితం అలా ముగిసింది. 1964 నవంబర్ 4 రష్యా మరొక ప్రయత్నం చేసింది. అదీ విఫలమయింది.   ఇపుడు అమెరికా రంగ ప్రవేశం చేసింది. 1962 నవంబర్ 5న అమెరికా మారినర్ 3  న ప్రయోగించింది.అదీ విఫలమయింది. అయితే, నవంబర్ 28న అమెరిక ప్రయోగించిన మారినర్ 4 విజయవంతమయింది. 1965 జూలై 14న అది మార్స్ ని సమీపించింది. అక్కడి నుంచి 21 ఫోటోలను భూమికి పంపించింది. ఇలాంటి ప్రయత్నలు చివరకు 1997లో విజయవంతమయ్యాయి. పాథ్ ఫైండర్  లాండర్ , సోజోర్నర్ రోవర్ మార్స్ మీద  మొట్టమొదటి సారిగా దిగాయి. రోవర్స్ యుగం దీనితో మొదలయింది.  1996 డిసెంబర్ 4న నాసా పాథ్ ఫైండర్ ను పంపించింది. అది 1997  జూలై 4 అంగారక ఉపరితలం మీద సురక్షితంగా దిగింది. ఈ రోవర్ పేరే జోర్నర్ (Sojourner)
ఇప్పటి యాత్రల లక్ష్యం
సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల కిందట భూమి, అంగారక గ్రహాలు ఒకేలా ఉండేవి. రెండుచోట్ల వాతావరణం దట్టంగా ఉండింది. రెండు గ్రహాలలో నీరు ఉండింది. అంటే రెండు గ్రహాల మీద ప్రాణిని నిలబెట్టగలిగే పరిస్థితులుండేవి. తర్వాత  భూమి ఈ పరిస్థితులను కాపాడుకుంది. ఇక్కడ ప్రాణి నిజంగానే అవతరించింది. పరిణామం చెందింది. 2020 జూలై 30 నాటికి ప్రాణి మనిషి స్థాయికి అంతరిక్ష యాత్రికుడి స్థాయికి ఎదిగింది. ఈ భూమ్మీద  ప్రాణి ఎపుడు అవతరించిందనేది చెప్పడం కష్టం,అయితే భూమిని ప్రాణులు  సురక్షిత ఆవాసం చేసకున్నాయి.
కాని అటువైపు, అంగాకరకుడి మీద ప్రాణి ఉద్భవించలేదు.  అక్కడి వాతావరణమూ నిలబడలేకపోయింది. వాతావరణం  పలుచబడింది. నీరూ మాయమయింది. చివరకు అదొక ఎడారిలా మారిపోయింది. ఎందుకల జరిగిందనేది అంతుచిక్కని ప్రశ్న. దీనికి జవాబు వేదికేందుకు మనిషి అరవై సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు.
ఒకపుడు భూమిని పోలిన అంగారక గ్రహం మీద కూడా   3.5 బిలియన్ సంవత్సరాల కిందట భూమ్మీదిలాగే   ప్రాణి అవతరించిందా?
అవతరించి ఉంటే అది ఏమయింది?
అక్కడే ఏదో ఒకరూపంలో  ఎంతో కొంత ప్రాణి లేదా దాని అవశేషాలున్నాయా?
ఈ ప్రశ్నకు సమాధానం అందుకే అంగారక గ్రహయాత్రలు  జరపాల్సిన ఆవశ్యకత పెరిగింది. భూమిని ఇరకవుతూ ఉంది. కొత్త ప్రదేశాలను కబ్జా చేయాల్సిన అవసరం ఉంది. దీనికి అనకూలంగా కనిపిస్తున్నది అంగారకుడే. ఒకపుడు ఫైబై (Flyby) లతో మొదలయిన అంగారకయాత్ర  ఇపుడు రోవర్ లస్థాయికి ఎదిగింది. ఈ నెల పరిశోధనలు విజయవంతమయితే మనిషేనేరుగా ఎరగ్రహం మీద వాలేందుకు బాటపడుతుందేమో చూడాలి. అరవైయేళ్ల శ్రమతో, విచ్చుకున్న కళ్లతో వస్తున్న మనిషిని అంగారకుడు నిరుత్సహపరచడుకదా? ఇది హైకూలో ఆ సందేశం ఉంది.

 

Keep checking you out
Mars, not sure you’re right for me
But  I can’t quit you
అమెరికా పర్సవిరెన్స్
ఇందులో భాగంగానే రేపు అమెరికా పర్సివరెన్స్ (Perseverance) ను పంపిస్తున్నారు. ఈ నెలలో మూడు దేశాలు వివిధ  లక్ష్యాలతో అంగారకుడి వైపు అడుగేస్తున్నాయి. ఇందులో జూలై 20  వ తేదీన ఒక బండి కదిలింది. దీని పేరు ఎల్ అమల్ (Al Amal). ఎల్ అమల్ అంటే నమ్మకం (hope) అని అర్థం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఉపగ్రమహాన్ని జపాన్ అంతరిక్ష నౌక రోదసిలోకి తీసుకు వెళ్లింది. ఎల్ ఎమల్  అంగారకుడి చుట్టూ తిరుగుతూ అక్కడి వాతావరణాన్నిఅధ్యయనం చేసే పరిమిత లక్ష్యంతో మొదలయింది.
చైనా యాత్ర
 తర్వాత  జూలై 23న చైనా యాత్ర మొదలయింది. తియన్ వెన్ -1 (heavenly questions) వాహనాన్ని అంగారకుడి మీదకు పంపించింది.  యుఎఇ కంటే ఇది చాలా పెద్ద లక్ష్యాలతో చైనా యాత్ర మొదలయింది. ఇందులో మూడు భాగాలున్నాయి. ఒకటి ఆర్బిటర్. ఇది అంగారక గ్రహంచుట్టూ తిరుగుతూ నిఘా వేస్తుంది. రెండోది ల్యాండర్. మూడో ది రోవర్. ఇది ఆంగారక ఉపరితళం మీద మనిషి ఉనికి గురించి, అక్కడి రాళ్లు రప్పల రహస్యాల గురించి శోధిస్తుంది.
హైనాన్ రాష్ట్రంలోని వెన్ చాంగ్ స్పేస్  లాంచ్ సెంటర్ నుంచి దీనిని ప్రయోగించారు. అంగారకుడికి సంబంధించి ఇది చైనా చేస్తున్న మొదటి ప్రయోగం. మొదటి ప్రయత్నంలోనే ఒక దేశం ఇలా మూడు లక్ష్యాలంతోముందుకెళ్లడం ఎఫుడూ జరగలేదు. చైనా రోవర్ అంగారకుడి మీద యుటోపియా ప్లానిటియా అనే చోట దిగుతుంది. ఇదేం కొత్త ప్రాంతం కాదు.  అమెరికా వాళ్లు పంపిన అంతరిక్ష నౌక 1976 లోనే ఇక్కడ కాలుమోపింది. తమ అంగారక యాత్ర లక్ష్య లేమిటో చైనా ఇంకా పూర్తి గా వెళ్లడించలేదు.

Quick Facts

  • Mission Name: Mars 2020
  • Rover Name: Perseverance
  • Main Job: The Perseverance rover will seek signs of ancient life and collect rock and soil samples for a possible return to Earth.
  • Launch Window: July 30 – Aug. 15, 2020
  • Launch Location: Cape Canaveral Air Force Station, Florida
  • Landing: Feb. 18, 2021
  • Landing Site: Jezero Crater, Mars
  • Mission Duration: At least one Mars year (about 687 Earth days)
  • Tech Demo: The Mars Helicopter is a technology demonstration, hitching a ride on the Perseverance rover. (Source:NASA)
జూలై 30.  7.50 am EDT (Eastern Daylight Time: సాయంత్రం 5.20 ఇండియన్ స్టాండర్డ్ టైం ) అమెరికా నాసా ‘పర్సివవరెన్స్’ వాహనాన్ని అంగారకుడి మీదకు పంపుతూ ఉంది. అమెరికా ప్రధాన స్పేస్ పోర్ట్ అయిన కేప్ కెనవరేల్ నుంచి ఈ వాహనాన్ని ప్రయోగిస్తారు.దీనిని నిర్మించి, పంపించి ప్రయోగాలు చేసేందుకు 2.4 బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని అంచనా. పర్సివరెన్స్ అంగారక గ్రహం మీద  జెజీరో (Jazero) అనే 45 కి.మీద వెడల్పున్న భారీ గుండంలో దిగుతుంది. ఒకప్పుడిక ఒక సరస్సు ఉండింది.
Jezero Crater, Landing Site for the Mars Perseverance Rover/NASA
ఇక్కడేమయినా ప్రాణి ఉద్భవించి ఉండందా అని  పర్శివరెన్స్ ప్రవేశపెట్టే రోవర్ జాగ్రత్తగా వెదుకుతుంది. అంతే కాదు,అంగారకుడి నుంచి కొన్ని రాళ్లను కూడా ఈ రోవర్ తీసుకువస్తుంది. జెజీరో అనేది కూడా మరొక పెద్ద గుండం అంచున ఏర్పడిందే. ఈ భారీ గుండం పేరు ఇసిడిస్ ప్లానిటియా (Isidis Planitia) ఈ 3.9 బిలియన్ సంవత్సరాల కిందట ఏర్పడిందని శాస్త్రవేత్తులు నమ్ముతున్నారు. ఇందులోకి ఒక నది నీళ్లను తీసుకువచ్చేది (పైపోటో లో నది జాలు చూడవచ్చు).  ఈ నది ఇక్కడ సృష్టించిన డెల్టాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ సరస్సు అడుగున ఉన్న సెడిమెంట్ ను  అంగారక జీవశాస్త్రం కోసం రోవర్  పరిశీలిస్తుంది.
ఆ మధ్య భూమ్మీద  తొలినాళ్ళ జీవి ఆచూకి లభించింది. స్ట్రొమటో లైట్స్ (stromatolites)    శిలాజం (Fossil) రూపంలో ఇది కనిపించింది.  లోతులేని నీళ్లలో కొన్ని రకాల సూక్షజీవులు జీవులు పొరలుపొరలుగా పరుచుకుని జీవిస్తుంటాయి. ఈ దట్టమయిన చాపల మధ్య కొంత మట్టి (sediment)చిక్కుకుపోతుంది. కాలక్రమంలో ఇవన్నీ గట్టిపడి శిలాజంగా మారిపోతాయి. ఈ మొత్తాన్ని స్ట్రొమటో లైట్  అంటారు. ఈ సూక్ష్మజీవులనుంచి వెలువడిన ఆక్సిజెన్ నే మనం పీల్చుకునేది.
ఇలాంటి స్ట్రొమటో లైట్స్ భూమ్మీద  గ్రీన్ ల్యాండ్ లో 2016లో కనిపించాయి. ఇది 3.7బిలియన్ సంవత్సరాల కిందటివని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అంటే ఆరోజుల నాటి  ఇలాంటి ప్రాథమిక ప్రాణి ఉనికి భూమ్మీద కనిపించినపుడు, అన్ని విధాల భూమిని పోలిని అంగాకరకుడి మీద  ఎందుకు ఉండరాదు. పర్శివరెన్స్ రోవర్ చేసే ప్రధాన పనుల్లో అంగారకుడి మీద స్ట్రొమటోలైట్స్ ఉన్నాయా, ఉంటే ప్రాథమిక ప్రాణి ఉనికి కనిపిస్తుందేమోనని వెదకడం. ప్రాణి ప్రాణినుంచే పుట్టనవసరం లేదు.ప్రాణిలో ఉండేదేమిటి? ఆర్గానిక్ అణువులు. అంటే కార్బన్ చుట్టూర ఏర్పడిన ఇతర రకాల కర్బనేతర అణువుల సముదాయమే. ఇంకా స్పష్టంగా చెబితే, ఆర్గానికి ప్రాణి పుట్టకను ఇనార్గానిక్ పరమాణువుల్లో వెదకడంమన్నమాట. పర్సివరెన్స్ ను పంపి నాసా శాస్త్రవేత్తలు ప్రాణి ఎట్లా ఏర్పడిందో కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.
నాసా పంపిస్తున్న పర్సివరెన్స్ లో రెండు రకాల పరికరాలున్నాయి. ఇవి అంగారక గ్రహో పరితలం మీద ఉండే రాళ్లు రప్పల్లో ఎలాంటి ఖనిజాలున్నాయి, ఆర్గానిక్ అణువులేవయినా ఉన్నాయా అనే విషయాలను పరిశీలిస్తాయి.  ఇందులో ఒక పరికరం షెర్లాక్ (Sherloc). రోవర్ రోబోటిక్ చేతి చివర ఉండే షెర్లాక్  తనకు ఎదురుబడే రాళ్లలోకి లేజర్ కిరణాలు పంపి తన అన్వేషణ మొదలు పెడుతుంది. రెండో పరికరం వాట్సన్ (Watson). ఇదొక కెమెరా. షెర్లాక్ పరిశీలించే రాళ్లని ఫోటలు తీయడం దీని పని. నిజానికి 2012  అమెరికా పంపించిన క్యూరియాసిటి చేసే పనిని షెర్లాక్, వ్యాట్సన్ లు మరింత ముందుకు తీసుకుపోతాయి. క్యూరియాసిటీ రాళ్లలో రంధ్రాలు వేసి, అందులో  ఆర్గానిక్ పదార్థాలేమయిన ఉన్నాయా అని చూసేది. అయితే, ఇపుడు పర్శివర్సెన్స్ ఏకంగా స్ట్రొమటోలైట్స్ కోసం వెదుకుతుంది.
పర్సివరెన్స్ రోజుకొకసారి మాత్రమే భూమ్మిది నుంచి సూచనలు తీసుకుంటుంది. దీనికి కారణం రేడియో తరంగాలు అంగారకుడికి చేరుకునేందు చాలా సమయం పట్టడమే.
రోవర్ మీద 23 కెమెరాలను అమర్చారు. అంతేకాదు,  పర్శివరెన్స్ కు డా చెవులు కూడా అమర్చారు. ఇవి అంగారకుడి మీద  వాతావరణ చేసే ధ్వనులను రికార్డుచేస్తాయి.అంటే మనిషి మొట్టమొదటి సారి అంగారక సంగీతాన్ని వినబోతున్నాడన్నమాట. రోవర్ గేర్ల శబ్దం,  రోవర్ చక్రాల కింద పడిన రాళ్ల నలిగిపోతున్న శబ్దం కూడా దీనికి తోడవుతుంది నేపథ్యం సంగీతం లాగా.
Helicopter/NASA
పర్శివరెన్స్ మరొక విశేషం, ఒక హెలికాప్టర్. 1.8 కెజీలున్న ఈ మినీ హెలికాప్టర్ పేరు ఇంజెన్యుటి (ingenuity). అంగారకుడి పల్చటి వాతావరణంలో హెలికాప్టర్ ను ఎలా ఎగురుతుందో  ఇంజెన్యుటి ని ప్రయోగించి శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు. ఇది విజయవంతమయితే  మరింత శక్తి వంతమయిన డ్రోన్ లను అక్కడ ప్రయోగేంచందుకు వీలవుతుంది.
అమెరికా తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజన్సీ (ESA),  రష్యా సహకారంతో  రోజలిండ్ ఫ్రాంక్లిన్  (Rosalind Franlin) రోవర్ ను అంగారకుడి మీదకు పంపే ప్రయత్నం చేస్తూ ఉంది. అంది కూడా ఈ సీజన్ లోనే జరగవచ్చనుకుంటున్నారు. ఇపుడున్న టైమ్ టేబుల్ ప్రకారం ఇఎస్ రోజలింగ్ ఫ్రాంక్లిన్ ను ప్రయోగిస్తే వారి రోవర్ 2023 నాటికి  అంగారకుడి మీద కాలుమోపుతుంది. అది ఆగ్జియా ప్లేనమ్ (Oxia Planum) అనేచోట దిగనుంది. అంగారకుడి మీద ప్రాణి అనేదెపుడైనా ఉండి (Has life ever existed on Mars?) అనే ప్రశ్నతో సాగబోతున్న ఈ యాత్ర పేరు  ExoMars.
ఈ ప్రయోగాలన్నింటి వల్ల అంగారకుడి మీద ప్రాణి కనిపించినా, ప్రాణి శిలాజం కనిపించినా, సృష్టి మీద మనిషి దృక్పథమే మారిపోయే అవకాశం ఉంది.

Like this story? Share it with a friend