వైసిపి రెబెల్ ఎంపికి అవంతి హెచ్చరిక

నర్సాపురం ఎంపి రఘురామకృష్ణరాజు ఉత్తరాంధ్ర వ్యవహారాల జోలికి వస్తే సహించేది లేదని  పర్యాటక శాఖా మంత్రి  అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. నోటిదురుసు తగ్గించుకోవాలని కూడా ఆయన రాజుకు సలహాఇచ్చారు.
ఆయన ఈ  రోజు విలేకరులతో మాట్లాడుతూ ఇక ముందు  రఘురామ కృష్ణం రాజు నర్సాపురానికి పరిమితమయితే మంచిదని,రాజధాని వ్యవహారంలో తలదూర్చడం అంతమంచిది కాదని ఆయన హెచ్చరించారు. అసలు నువ్వెరు, విశాఖ పట్నం రాజధాని వద్దని చెప్పడానికి అని అవంతి ఆగ్రహించారు.
వైసిపి నచ్చకపోతే పార్టీ నుంచి రాజీనామా చేయాలని కూడా ఆయన సలహా ఇచ్చారు.
 అవంతి శ్రీనివాస్ ఈ రోజు విలేకరుల సమావేశం విశేషాలు:
1. రఘురామకృష్ణ రాజు ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఉపేక్షించేది లేదు.
2. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి భిక్షతో లోక్ సభ లో అడుగు పెట్టారన్న విషయం రఘురామకృష్ణమరాజు గుర్తు పెట్టుకోవాలి.
3.  2019 లోక్ సభ ఎన్నికల్లో   జగన్ గారి కరిష్మా తో మాత్రమే జనసేన  నాగబాబుపై గెలిచిన విషయం మర్చిపోవద్దు.
4. రాజకీయ భిక్ష పెట్టిన సీఎం పై విమర్శలు చేయడం తగదు.
5. వైఎస్సార్సీపీ జెండా, గుర్తుపై గెలిచిన రఘురామకృష్ణరాజు ప్రతిపక్ష టిడిపి నాయకుల కంటే ఎక్కువగా పార్టీ విధానాలను విమర్శలు చేస్తున్నారు.  రఘురామ కృష్ణమరాజుకి నోటి దురుసుతనం బాగా ఎక్కువ. ఆ దురుసుతనంతోనే రాజకీయంగా లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు.
6. రఘురామకృష్ణరాజు నర్సాపురానికే పరిమితం అయితే మంచిది. అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటే బావుండదు.
7. విశాఖ రాజధానిగా వద్దని చెప్పడానికి రఘురామకృష్ణంరాజు ఎవరు ?
8. ఇలా విశాఖకు వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు నే వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి బయటికి రాకుండా ప్రజలు అడ్డుకున్నారని తెలుసుకోండి.
9. ఢిల్లీలో నాలుగు పార్టీల నాయకులు రఘురామకృష్ణరాజుకు తెలిస్తే తెలవొచ్చు.. కానీ.. అదే పనిగా వైఎస్ఆర్సిపిపై విమర్శించడం తగదు. – ఇలానే మాట్లాడితే ఆ తర్వాత ఆ పార్టీల నాయకులు ఎవరూ మీతో రారు. అది తెలుసుకుంటే మంచిది.
10. రఘురామకృష్ణం రాజు పంథా మార్చుకొకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరు.
10. వైయస్సార్ సీపీ విధానాలు నచ్చకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయండి.
నలందా కిషోర్ అనారోగ్యంతోనే మృతి చెందారు
11. నలందా కిషోర్ మరణాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు.. లోకేష్ చేస్తున్నారు. శవ రాజకీయాలు మానాలి.
12. నలంద కిషోర్ టిడిపి అభిమాని.. ఆయన మరణానికి మేము కూడా సంతాపం తెలియజేస్తున్నాం.
13. కరోనా ఎవరికైనా వస్తుంది..పార్టీ లతో సంబంధం లేదు..
14. నలందా కిషోర్ ను పోలీసులు కర్నూలు తీసుకువెళ్ళడంతో మరణించారని
చంద్ర బాబు నాయుడు..లోకేష్ లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
15. నలందా కిషోర్ పై అభిమానం ఉంటే అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించినప్పుడు కిషోర్ కుటుంబాన్ని లోకేష్ ఎందుకు పరామర్శించ లేదు..
16. నలంద కిషోర్ మృతికి చంద్రబాబుదే బాధ్యత. -అరెస్టై బెయిలుపై బయటికి వచ్చిన తర్వాత చంద్రబాబు వద్దకు నలంద కిషోర్ వెళ్లారు. – అక్కడ నుంచి వచ్చిన తర్వాతే ఆయనతో పాటు మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. – అందుకే ఆయన మృతికి చంద్రబాబే బాధ్యత తీసుకోవాలి.