చంద్రగిరి దగ్గిర 5 వేల సం. కిందటి రాక్షస గూటికి ట్రెకింగ్

తిరుపతి చట్టుపక్కల అదిమ మానవుడి సంచారం ఉండిందనేందుకు చాలా ఆధారాలు బయల్పడ్డాయి. ఇందులో కొన్ని అధారాలు రాక్షస గూళ్లు (Megaliths).  ఈ ఫోటోలో కనిపిస్తున్నది, చంద్రగిరి సమీపంలో మలయ్యపల్లి దగ్గిర  కొండమీద నిలబెట్టిన రాక్షస గూడు.
ఈప్రాంతంలో ఇలాంటివి అక్కడక్కడ ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. చాలా మటుకు గనుల తవ్వకం వల్ల మాయామయ్యాయి. ఈ కొండ మీద  ఇంకా ఎవరి కన్ను పడినట్లు లేదు.పడితే ఇది కూడా నుగ్గు నుగ్గు అయి మాయమయివుండేది.
అందువల్ల తిరుపతికి వచ్చే యాత్రికులు  ఈ ప్రాంత పురాతన మనిషి నాగరికత చూడటం మర్చిపోరాదు.  ఇవన్నీ కూడా చరిత్రకు పూర్వపు (prehistory ) ఈ ప్రాంతమానవుల నాగరికత చిహ్నాలు.
మల్లయ్యపల్లె గూడు లాగే మరొకటి ఇక్కడే తాటికోన దగ్గిర ఉంది.చంద్రగిరి పట్టణానికి తూర్పున 5 కి.మీ దూరానఈ  తాటి కోన ఉంటుంది.  ఈ గ్రామానికిసమీపాన వాలుగా ఉండే కొండమీద  జంగమోల్ల బండ అనే రాక్షస గూడు (Dolmen)ఉంటుంది.
ఫోటో లో ఉన్న పెద్దరాతి గూడు (megalith) పురాతన మానవుడి నిర్మాణ కౌశలం చూపిస్తుంది. ఒక పెద్ద బండను గూడులాగా నిలబెట్టడానికి రాళ్లు పేర్చి స్తంభాలు కట్టారు. చిన్న రాళ్లు పేర్చి కట్టిన ఈ స్తంభాలకు ఎలాంటి పూత పూయలేదు. అయినా సరే, ఇది కనీసం  నాలుగయిదు వేల ఏళ్లుగా చెక్కుచెదరుకుండా ఉంది.
తొలినాళ్ల నాగరికత నదుల ఒడ్డునే వెలసింది. ఆరోజుల్లో ఇక్కడి స్వర్ణముఖీ నది నిండుగా పారుతూ ఉండివచ్చు.అందుకే ఈ ప్రదేశంలో  వాళ్లు సెటిలయిపోయి ఉండాలి, ఈ గూళ్లు నిర్మించుకుని ఉండాలి. చాలా కాలం తర్వాత ఇక్కడ మల్లయ్య పల్లె వెలసింది. ఒకనాటి చంద్రగిరి పాలకుడు మల్లయ దేవమహారాజు పేరిట ఈ వూరు పేరు స్థిరపడింది.
మల్లయ్య పల్లె నుంచి అడవివైపు నడుస్తూ ఉంటే నున్నటి గుట్ట కనబడుతుంది. ఆ గుట్టమీదే  ఈ పురాతన గూడు కనిపిస్తుంది. ఒ ఈ గూడు నాటి విశ్వాలకు, కర్మకాండలకు ముడివడి ఉంటుంది.
ఆలయ నిర్మాణ సంస్కృతి రాకముందు గ్రామదేవతల ఆలయాలన్నీ చిన్న చిన్న గూళ్లే. ఈ గూడు తర్వాత పాండవగుడి లేదా పాండురాజలు గుడి అని పేరుపడింది. మరికొందరు వీటినా రాక్షస గూళ్లు (గుళ్లు) అని పిలుస్తారు.
Pictures: Bhooman (Tirupati)