Home Features జూన్ 21న ప్రొ.జయశంకర్ స్మారకోపన్యాసం, వక్త : ప్రొ. మాడభూషి శ్రీధర్

జూన్ 21న ప్రొ.జయశంకర్ స్మారకోపన్యాసం, వక్త : ప్రొ. మాడభూషి శ్రీధర్

239
0
తెలంగాణ రాష్ట్ర సాధనకు సైద్ధాంతిక బాట వేసిన ప్రొఫెసర్  జయశంకర్ 9 వ స్మారకోపన్యాసం  జూన్ 21, 2020 రోజున జూమ్ యాప్ ( zoom app) ద్వార జరపాలని తెలంగాణ విద్యావంతులు వేదిక (టివివి) నిర్ణయించింది.
ఈ ఏడాది  ప్రొ . మాడభూషి శ్రీదర్  స్మారకోపన్యాసము చేస్తారు.
ఈ రోజు హిమాయత్ నగర్ లో అమృత ఎస్టేట్ లో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటి విస్తృత స్థాయి సమావేశంలో  ఈ విషయం నిర్ణయించారు. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది
 కోవిడ్-19 ముదురుతున్న పరిస్థితులలో  ప్రజలు అనుసరించాల్సిన విధానాలను కూడా సమావేశం చర్చించింది.   విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ చేతులేత్తేసి, ప్రజలను గాలికివదిలేసినట్లు స్పష్టం గా కనబడుతోందని వేదిక అభిప్రాయపడింది.
 ప్రభుత్వాలు ఇలా బాధ్యతలను విస్మరిస్తే  దేశంలో, రాష్ట్రంలో సామాన్య ప్రజల మరణాల తీవ్రత పెరిగే ప్రమాదం వుందని  ప్రభుత్వాలు కరోనాను వ్యక్తిగత రక్షణకే వదిలేయకుండా సామాజిక బాధ్యతతో తమ విధానాలను సమీక్షించుకోవాలని తెలంగాణ విద్యావంతుల వేదిక విజ్ఞప్తి చేసింది.
 ప్రైవేట్, కార్పొరేట్ అసుపత్రులకు కరోనా చికిత్స ల నుంచి మినహాయింపు ఇవ్వడంతోనే కరోనా వైద్యం నుంచి మెల్లమెల్లగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైదొలుగుతున్నట్లు సమాజాన్ని కి సంకేతాలు ఇస్తున్నాయి.ఇది పాలక వర్గాల యొక్క లోపభూయిష్టమైన విధానమనేది ప్రస్పుటమని టివివి వ్యాఖ్యానించింది.
తెలంగాణ రాష్ట్రంలోని పాత పది జిల్లాల నుండి సుమారుగా 35 మంది టివివి ప్రతినిధులు ఈ ఆన్ లైన్ సమావేశంలో పాల్గొని నాలుగున్నర గంటలకు పైగా ఈ క్రింద పేర్కొన్న ఎజెండా లోని అంశాల పై కూలంకషంగా చర్చించడం జరిగింది.సమావేశం విశేషాలను తెలంగాణ విద్యావంతుల వేదిక, ప్రధాన కార్యదర్షి డా . తిప్పర్తి యాదయ్య ఒక ప్రకటనలో
సమావేశంలో తీర్మానించిన మరిన్ని అంశాలు
* ఉద్యోగాలు  లేక లక్షాలాదిమంది ఇబ్బందులు పడుతుంటే కరోనా నేపథ్యంలో  ఉ ద్యోగాలు కోల్పోతున్న వారు కూడా తోడవ్వడంతో దేశంలో ను,రాష్ట్రంలో ను నిరుద్యోగం  తీవ్రతరమైంది. ఈ ప్రమాదం నుంచి సమాజాన్ని భయటపడేందుకు  ప్రభుత్వం పెట్టుబడులు పెంచాలని, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలని,తాత్కాలికంగా నైనా నిరుద్యోగ భృతి కల్పించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్ చేస్తుంది.
* సమైక్య పాలకులు క్రిష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసి తీవ్రమైన జల దోపిడి చేసినారు.ఆ జల దోపిడి నేటికి నిరాటంకంగా కొనసాగుతున్నా స్వరాష్ట్ర పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీన్ని అదనుగా తీసుకున్న సీమాంధ్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్కుల కు పెంచుతూ సంగమేశ్వరం నుంచి రోజుకు 3 టి.ఎంసీ లను రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 203 జివోను విడుదల చేసింది. ఇదే అమలైతే దక్షిణ తెలంగాణ ఎడారి గా మారడంతో పాటు జంటనగరాల ప్రజల గొంతేండే ప్రమాదం వుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మరింత ఒత్తిడి తెచ్చి సీమాంధ్ర జలదోపిడి ని అడ్డుకోవాలని, అదేవిధంగా క్రిష్ణా నది జలాలో తెలంగాణ ప్రాంతాన్ని కి దక్కాల్సిన న్యాయబద్దమైన వాటా దక్కేలా తన బాధ్యత ను నిర్వర్తించాలని ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరి తెలంగాణ ప్రజలకు శాపంగా మారకూడదని తెలంగాణ విద్యావంతుల వేదిక గుర్తు చేస్తుంది.
* రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో ప్రభుత్వం పంటలు సాగు చేయించే విధానం రైతుల హక్కులను స్వేచ్ఛ ను హరించేవిధంగా వుంది. వ్యవసాయ పంటలలో ప్రభుత్వం బలవంతంగా,నిరంకుశంగా వ్యవహరించకూడదని తెలంగాణ విద్యావంతుల వేదిక అభిప్రాయపడుతుంది.
* కరోనా బాధితుల సంఖ్యా విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో అన్ని తరగతుల పరీక్షలు విద్యార్థులకు నిర్వహిస్తామని ప్రకటించి పిల్లలను, పిల్లల తల్లిదండ్రులను పరీక్ష నిర్వాహణ సిబ్బందిని తీవ్రమైన ఒత్తిడికి లోను చేస్తున్నది పరీక్షల పట్ల ప్రభుత్వాలకు, యూనివర్సిటీలకు, అధికారులకు ఇది అతివ్యామోహంగానే పరిగణించాల్సివస్తుంది. కరోనా నేపథ్యంలో హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర లాంటి పలు రాష్ట్రాలల్లో ప్రభుత్వాలు బోర్డు పరీక్షలు రద్దు చేశాయి. అదే విధంగా తెలంగాణలో కూడా అన్ని బోర్డు పరీక్షలను రద్దు చేయవలసిందిగా తెలంగాణ విద్యా వంతుల వేధిక డిమాండ్ చేస్తున్నది.
* ఇక యూనివర్సిటీ స్థాయి డిగ్రీ మరియు పిజి పరీక్షల నిర్వాహణకు ఉస్మానియా యూనివర్సిటీతో సహా దాదాపు అన్ని యూనివర్సిటీలు విద్యార్థుల నుండి వేలకు వేల రూపాయలు పరీక్ష ఫీజుల రూపంలో ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఒకవైపు ప్రతిష్టాత్మకమైన హైద్రాబాదు కేంద్రీయ విశ్వ విద్యాలయం పరీక్షలు రద్దు చేసుకుంటే రాష్ట్ర స్థాయి విశ్వ విద్యాలయాలేమో విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టుతుంది. ఈ పరిస్థితుల్లో అన్ని పరీక్షలను రద్దు చేయాలని కేంద్రీయ విశ్వ విద్యాలయం నిర్ణయించిన విధంగానే విద్యార్థులకు వారు పూర్తి చేసుకున్న సెమిస్టర్ ఆధారంగా గ్రేడ్ అవార్డు చేసి, తర్వాతి సెమిస్టరుకు ప్రమోట్ చేయవలసిందిగా విశ్వ విద్యాలయాలను తెలంగాణ విద్యావంతుల వేధిక కోరుతున్నది.
* విద్యార్థులు, కవులు, రచయితల, మేధావులపై నిర్బంధాన్ని విధిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతులను బలవంతంగా నొక్కే కార్యక్రమం కొనసాగుతున్నది. మోసపూరిత అవాస్తవ అర్థరహిత అభియోగాలను మోపి హింసిస్తున్నది. భీమాకోరెగావ్ కేసు విషయంలో తెలంగాణ తొలిదశ ఉద్యమ కారుడు, కవి, రచయిత, హక్కుల కార్యాకర్త వరవర రావు గారిని 2018 నవంబరు నుండి జైల్లో పెట్టారు. ఆయన మీదనే కాక సురేంద్ర గాడ్లింగ్, శోమసేన్, రోనా విల్సన్, సుధీర్ ధావలే, మహేష్ రౌత్, సుధా భరద్వాజ్, వర్మన్ గొన్సాల్వేస్, అరుణ్ పెరిరా లపై అభియోగాలను మోపి అరెస్ట్ చేసారు.  ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫసర్ జి.ఎన్. సాయిబాబా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సి ఏ ఏ ) జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్ ఆర్ సీ ) లకు వ్యతిరేకంగా 2019 డిసెంబర్ నుండి ఢిల్లీ షాహిన్ భాగ్ కేంద్రంగా దేశావ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కోవిడ్ ను పురస్కరించుకొని జైల్లో ఉండే ఖైదీలను విడుదల చేయమని, జైళ్లు ఖాళీ చేయమని సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను బుట్ట దాఖలు చేస్తున్నది కవులు, మేధావులు మరియు రాజకీయ ఖైధీలను విడుదల చేయాల్సిందిగా తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్ చేస్తున్నది.
* స్వేచ్చా స్వాతంత్రాలకు, ప్రజాస్వామ్యానికి పెద్ద దిక్కు అని ప్రగల్భాలు పలికే అమెరికా లో వర్ణ వివక్షతో కూడిన జాత్యాహంకార హత్యలు, దాడులను తెలంగాణ విద్యావంతుల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది.
* అమెరికా ప్రభుత్వంతో పాటు ప్రపంచ దేశాలు కూడా నల్ల జాతీయులుకు బాసటగా నిలవాలని, పౌర హక్కులను కాపాడాల్సిన ఉందని విశ్వసిస్తున్నది. ఇదే సమయంలో పాలస్తీనా పౌరులపై ఇజ్ర్రాయిల్ చేస్తున్న దాడులను, చాలా దేశాలలో అల్పసంఖ్యాక వర్గాలపై వివక్షతో కూడిన దాడులను తెలంగాణ విద్యావంతుల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది.