Home Features సుధాకర్,రంగనాయకమ్మలాంటి వారిని బలిచేశావు, ఇక చాల్లే నాయుడు: లక్ష్మీ పార్వతి

సుధాకర్,రంగనాయకమ్మలాంటి వారిని బలిచేశావు, ఇక చాల్లే నాయుడు: లక్ష్మీ పార్వతి

345
0
(శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి, అధ్యక్షురాలు, తెలుగు అకాడమీ)
స్వార్ధపరుడు అధికారంలోకి వస్తే తను,తనవాళ్లు బాగుపడతారు.ఒక ఆశయమున్న వ్యక్తి అధికారంలోకి వస్తే ప్రజలు బాగుపడతారు.40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకు ఏమీ చేయలేదనేవిధంగా వారే తీర్పు ఇచ్చారు.
మంచి విజన్ ఉన్న నాయకుడు అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తుంది,ప్రజలకు ఏ విధంగా మేలు కలుగుతుందనేందుకు అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరం లోనే  వైయస్ జగన్ గారు నిరూపించారు.
పార్టీ,మతం,కులం,ప్రాంతం,రాజకీయాలు అనేవి లేకుండా అన్నింటికి అతీతమైన స్ధితిలో పరిపాలన ఎలా సాగుతుందో ఈ సంవత్సరంలోనే జగన్ గారి పాలనలో చూడగలిగాం.
చంద్రబాబు గారికి ఒకటే చెబుతున్నాను: నీకు 72 ఏళ్ల వయస్సు దాటిపోయింది.వృధ్ధాప్యం వచ్చేసింది.మన ధర్మం చెబుతున్నట్లు, వయస్సు పైనబడిన తర్వాత కృష్ణా…రామా….అనుకుంటూ ప్రశాంత జీవితం గడపండి.ఇప్పటికే ఎన్నో పాపాలు చేసి ఉంటారు.
ఈ పాపాలన్నీ పోవాలంటే చివరి వయస్సులోనైనా దైవాన్ని గురించి ఆలోచించండి.అధ్యాత్మికమార్గంలో పయనించాలని మన ధర్మం చెబుతోంది.ఆ వయస్సు కూడా చంద్రబాబుకు దాటిపోయింది.
ఇలాంటి స్దితిలో కూడా చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు.ప్రజలకు జరుగుతున్న మేలును అడ్డుకుంటున్నారు.భగవంతుడు నిన్ను క్షమిస్తాడా.నీకు ఆత్మవిమర్శ అనేది లేదా.
ప్రజలు నిన్ను ఛీత్కరించి ఇంట్లో కూర్చోబెట్టారు. గతంలో నీవే చెప్పావు, నామనవడితో ఆడుకునే టైం కూడా లేకుండా పోయిందని….ఇప్పుడు హాయిగా మనవడితో ఆడుకుంటున్నావు.
ఇక్కడ ప్రజలు కరోనాతో అల్లాడిపోతుంటే…ముఖ్యమంత్రిగారు ప్రజలకు ఏ ఇబ్బందిలేకుండా వారికి అండగా నిలబడుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రాష్ట్నాన్ని  నీవు అప్పులుపాలు చేసి వెళ్లిపోయినా కూడా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.ఇచ్చినమాట నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
ఒక్క సంవత్సరంలోనే తన మేనిఫెస్టోను ఖురాన్,భగవధ్గీత,బైబిల్ గా భావిస్తూ సంవత్సరంలోనే 99 శాతం హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రిగా  వైయస్ జగన్ గారు చరిత్ర కెక్కారు.
నవీన్ పట్నాయక్,మమతాబెనర్జీ లాంటివారే కాకుండా ఇతర రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులు జగన్ గారిని ప్రశంసిస్తున్నారు.
ఇక్కడ ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే నీవు హైద్రాబాద్ లో కూర్చుని మాట్లాడుతున్నావు.విమర్శలు చేస్తున్నావు.నీవేమి నాయకుడువి.ఏపి గురించి విషం చిమ్ముతున్నావు.ఇంకా నీచమైన రాజకీయాలు నడుపుతున్నావు.
ఆంధ్రప్రదేశ్ కు శ్రీ వైయస్ జగన్ రూపంలో మంచినాయకుడు దొరికాడు.నీ రాజకీయం ఇక్కడ అవసరం లేదు.ప్రజలకు చేసిన మంచిపని ఒక్కటి కూడా లేదు.అందుకే ప్రజలు నిన్ను మరిచిపోయారు.
ఎన్టీఆర్ లాంటి మహానుభావుడికి నీవు వెన్నుపోటు పొడిచి 25 సంవత్సరాలు అవుతోంది.40 ఏళ్లపాటు నీవు నీచమైన రాజకీయాలు చేసి కోట్లరూపాయలు దోపిడీ సాగించావు.నీ కుమారుడిని తీసుకువచ్చి ప్రజలపై బలవంతంగా రుద్దావు.
నీ కుమారుడిని ఓడించారంటే ప్రజలు నిన్ను ఎంతగా వ్యతిరేకించారో అర్ధం అవుతోంది.శంకరాచార్యగారు చెప్పినట్లు వృధ్దుడివైన తర్వాత ఆలోచించాల్సింది ఆశ,అధికారం గురించి కాదు ఆధ్యాత్మికం గురించి ఆలోచించాలి.
ఈ వయస్సులో పురాణాలు చదువుకో.పురాణాలు చెప్పే పండితులను పిలిపించుకో….చాగంటి లాంటి వారి ప్రవచనాలు విను….లేదా నన్ను రమ్మని పిలిచినా ఒక అత్తగా వచ్చి భగవధ్గీత రోజూ చెబుతాను.నీలో మార్పన్నా వస్తుందేమో.
90 ఏళ్ళ వయస్సులో కూడా ఇంకా నా ఆస్ధి,నా అధికారం, నా ఆశ అనుకుంటే అంతకంటే నీచమైన జన్మ ఉండదు. ఆ వయస్సులో పారమార్దిక చింతన చేయాలి.పశ్చాత్తాపపడితే భగవంతుడు క్షమిస్తాడు.ఆత్మవిమర్శ చేసుకో.
దేశంలోనే నాయకుడిగా ఉండి ఉమ్మడి ఏపికి ముఖ్యమంత్రిగా చేశావు.నేడు కేవలం మూడు గ్రామాలకే నాయకుడుగా మిగిలావు.ఈరోజు పాతాళంలోకి దిగజారావు.
పేదలకోసం ఇంగ్లీషుమీడియం,ఇంటిస్దలాల పంపిణివంటి మంచి పధకాలు జగన్ గారు
ప్రవేశపెడుతుంటే వాటికి కోర్టులకు వెళ్లి అడ్డుపడుతుంటావు.
అమ్మఒడి,పెన్సన్లు ఇతర సంక్షేమపధకాలు అందరికి పార్టీలకతీతంగా జగన్ గారు అమలు చేస్తున్నారు.
నీవు చేసిన నాటకాలు ఆపేసి మహా మేధావిగా నీవు భావిస్తున్న నీ కుమారుడికి పార్టీ పగ్గాలు అప్పచెప్పి నీవు మనవడితో ఆడుకో.చేసినతప్పులు ఒప్పుకో.
ఈ మధ్య నీవసలే జూమ్ నాయుడువి అయ్యావు.మహానాడు కూడా జూమ్ లో పెడతావేమో.మహానాడులో ఎన్టీఆర్ కు నీవు ద్రోహాన్ని,చేసిన తప్పును మనస్పూర్తిగా ఒప్పుకుంటే నీలో మార్పు వచ్చినట్లే.
ఎన్టీఆర్ కు నీవు వెన్నుపోటు పొడిచినట్లే…. నీ ఎంఎల్ ఏలు నీకు రేపు వెన్నుపోటు పొడుస్తారు.ఇంకో నాయకుడుని ఎన్నుకుంటారు.ఇప్పుడైనా నీవు అర్దం చేసుకుని నీచరాజకీయాలకు తెరదించు.
నీ నీచ రాజకీయాలకు ఏ రంగనాయకమ్మనో,సుధాకర్,సిపిఐ నారాయణ,రామకృష్ణ,పవన్ కల్యాణ్ లాంటి వారిని బలిపశువులుగా మార్చి ప్రజలతో ఛీత్కారం అందిస్తున్నావు.చివరకు నీ బతుకును కూడా అలానే చేసుకుంటావు.అధ్యాత్మిక మార్గంలోకి వెళ్లమని సలహా ఇస్తున్నాను.
విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ…
డాక్టర్ సుధాకర్ పై గతంలో ఆరోపణలు ఉన్నాయి.గిరిజన మహిళలను చికిత్స కోసం బెడ్ పై ఉంచి నిర్లక్ష్యంగా వదిలివెళ్లిపోయాడు.తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టిక్కెట్ కోసం సుధాకర్ ఇటీవల ప్రయత్నించాడు.అందుకోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు.టిక్కెట్ రాకపోవడంతో తిరిగి ఉద్యోగంలో చేరాడు. ఒక్కసారి రిజైన్ చేశాక తిరిగి ఉద్యోగం ఇవ్వడమే తప్పు.
సుధాకర్ అయ్యన్నపాత్రుడు రైట్ హ్యాండ్ అనేది అందరికి తెలుసు.అలాంటి సుధాకర్ ను చేతిలోపెట్టుకుని మాస్కులు లేవని, ఇతర ఆరోపణలు చేయడమే కాక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించారు.
నిజానికి పనిచేసేచోట ఏవైనా సౌకర్యాలు లేకపోతే సంబంధిత అధికారి దృష్ఠికిగాని,మంత్రి దృష్టికి తీసుకువెళ్తారు.ఏకంగా మీడియాను పిలిచి వారి ఎదుట ముఖ్యమంత్రిని,ప్రభుత్వాన్ని తిడుతూ విమర్శలు చేశాడు.ప్రభుత్వ ఉద్యోగి అలా ప్రవర్తించకూడదనే అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
సుధాకర్ రోడ్డుపైకి వచ్చి వినకూడని విధంగా ముఖ్యమంత్రి,మంత్రులను,పోలీసులను బూతులు మాట్లాడుతుంటే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు.
చంద్రబాబునాయుడు మనుషులను ఎంతగా వాడుకుంటున్నారనేందుకు రంగనాయకమ్మ ఒక ఉదాహరణ.బాబూ నువ్వే రావాలి అని ఆమె(రంగనాయకమ్మ) ఫేస్ బుక్ లో పెట్టుకున్నారంటే ఆమె టిడిపికి చెందిన వ్యక్తి.ఆమె చక్కగా పచ్చచీర కట్టుకుని తెలుగుదేశం వారితో కలసి పార్టీ ప్రచారం చేసిన ఆమె ఈరోజు హఠాత్తుగా సోషల్ వర్కర్ అయిపోయింది.
అసలు ఆమె సోషల్ వర్కర్ ఏంటి…పచ్చమీడియా కోసం, పచ్చపార్టీకోసమో మాట్లాడే వ్యక్తిని తీసుకువచ్చి 60 మహిళ అంటూ మాట్లాడుతున్నారు.
మరి లక్ష్మీపార్వతికి 60 ఏళ్లప్పుడే కదా మీరు కోటి అనే వాడ్ని తీసుకువచ్చి ఎంతగా అవమానించారు.వాడికి 25 లక్షల డబ్బులు ఇచ్చి టివి-5లో ఎంతదారుణంగా మాట్లాడించారు.మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తినే కదా.అప్పుడు ఈ మహిళా సంఘాలన్నిఏమయ్యాయి. ఎన్టీఆర్ భార్యను అయిన నన్ను దుర్మార్గులు అంత దారుణంగా అవమానం చేస్తే అప్పుడు మాట్లాడలేదు.
ఇప్పుడు మాత్రం 60 ఏళ్ల ఆమె అంటున్నారు.నాకు కూడా అదే వయస్సు. నన్ను అవమానించేటప్పుడు అది గుర్తుకురాలేదా.మీ ఇష్టం వచ్చినట్లు మీకు అనుకూలమైన వ్యక్తులను రోజుకొకరిని తీసుకువచ్చిప్రభుత్వంపై ఉసిగొల్పుతూ మాట్లాడిస్తున్నారు.
సుధాకర్ విషయం తీసుకుంటే అతను రోడ్డుపై బూతులు మాట్లాడిందంతా వదలివేసి పోలీసులు తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది మాత్రమే మాట్లాడుతున్నారు.అదేవిధంగా రంగనాయకమ్మ బాబూ…. నువ్వేరావాలంటూ ఫేస్ బుక్ లో పెట్టింది…టిడిపి జెండా పట్టుకుని తిరిగిందంతా వదలివేసి ఆమెపై కేసులు గురించి మాత్రమే అడుగుతున్నారు.
ఇదంతా ప్రజలకు అర్ధం కాదని అనుకుంటున్నారా….అర్ధమయ్యే నీకొడుకును ఓడించారు.నిన్ను ఇంటికి పంపించారు.కేవలం 23 సీట్లు ఇచ్చారు.చంద్రబాబూ….ఇదే పిచ్చి రాజకీయం చేస్తుంటే నీకు రెండే సీట్లు మిగులుతాయి.అంత హీనంగా బతకాలంటే మాకేమీ అభ్యంతరం లేదు.
ఇంతహీనమైన రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు….రాజకీయం చేయి….అది సద్విమర్శగా ఉండాలి.ప్రజలకు మేలు చేసేలా చేయి.పోతిరెడ్డిపాడు విషయంలో కూడా చంద్రబాబు ఒక్క మాట మాట్లాడటం లేదు.ఒక విజన్,ధైర్యం లేనివాడివి,పచ్చి అవకాశవాదివి.
ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నవాడివి. గతంలో వైయస్ రాజశేఖరరెడ్డిని ఎదుర్కోలేకపోయావు.
నేడు ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ఒన్ మ్యాన్ ఆర్మీలా పార్టీ పెట్టుకుని ప్రజలలోకి వెళ్లి ప్రజాభిమానం పొందాడు.వైయస్ రాజశేఖరరెడ్డి ఫోటో పెట్టుకుని విజయం సాధించాడు.అది విజయం అంటే.
నీలాగా మోది,పవన్ కల్యాణ్ లాంటి….. వాళ్ల కాళ్లు వీళ్ల కాళ్లు పట్టుకుని…. చచ్చిచెడి ఒక్కశాతం ఓటుతో గతంలో అధికారంలోకి వచ్చిన నీకు మాట్లాడే నైతిక హక్కు నీకేమైనా ఉందా .ప్రజలకు ఏమైనా చేశావా.
ఐదేళ్ల కాలంలో అన్నీ దోపిడీ చేశావు.ఇసుక,మట్టి,నీరు,చెట్టు అది, ఇదీ అని లేకుండా దోపిడీ సాగించావు.పట్టిసీమ పేరిట దోపిడీ సాగించావు.ఏం చేశావ్ ….పోలవరం ఏమైనా పూర్తి చేశావా….రాయలసీమకు ఏమైనా నీరిచ్చావా…
చెప్పుకోవడానికి ఏముంది.కనీసం రాజధాని కట్టావా….భూములన్నీ ధ్వంసం చేసి సర్వనాశనం చేసి, కమ్మసామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని….అది కూడా చివరకు ఇక్కడ కూడా అందరు రావడం లేదు.రెండు మూడు గ్రామాలను అడ్డంపెట్టుకుని మాట్లాడుతూ మొత్తం అన్ని ప్రాంతాలకు వ్యతిరేకమయ్యావు.
నీవు నాయకుడువి అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్దితులు ప్రజలలో ఉన్నాయి.చంద్రబాబుకు మతిభ్రమించింది.మతిమరుపు ఎక్కువైపోయింది.ఎవరిని గుర్తుపట్టలేని పరిస్ధితి వచ్చింది. డాక్టర్లు ఒకటే చెబుతున్నారు: రోజూ ఏదో ఒకటి మాట్లాడు…అది అబధ్దమైన పర్వాలేదు….అలా మాట్లాడుతుంటే కొంచెమైనా మైండ్ పనిచేస్తుంది. లేకపోతే కోమాలోకి వెళ్లిపోతావని చెప్పారంట.
అందుకనే పిచ్చిపిచ్చి కామెంట్స్  చేస్తున్నారు.సుధాకర్,రంగనాయకమ్మలాంటివారిని బలిచేశావు.ఇది చాలా తప్పు.చంద్రబాబూ….ఇప్పటికే చాలా తప్పులు చేశావు.శ్రీ కృష్ణుడు కూడా వందతప్పులే క్షమించాడు.
ప్రజలు నిన్ను క్షమించలేదు.కాని మా జగన్ గారు నిన్నుఇంకా క్షమిస్తున్నాడు.ఒక్కమాట అనకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.నీలాగా హంగులేదు,ఆర్బాటం లేదు.మీడియా ప్రచారం లేదు.ప్రజలకు ఏమి మేలు చేయాలనే దిశగా ఆయన ఆలోచనలు సాగుతున్నాయి.
ప్రజలకు ఇచ్చినమాట నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్లాలనే ఆలోచనతో జగన్ గారు ముందుకు వెళ్తున్నారు.ఇంతగా ప్రజాభిమానం ఉన్న ముఖ్యమంత్రి రాష్ర్టంలో ఉన్నారు.నీ అవసరం తీరిపోయింది.
నీవు ఏ దుర్మార్గాలు చేసినా వెంటనే బయటకు వచ్చేస్తున్నాయి. వెంకటేశ్వరరావు,రమేష్ కుమార్ లాంటి అధికారులను బలితీసుకున్నావు.సుధాకర్,రంగనాయకమ్మలను బలితీసుకున్నావు.ఇంకా ఎంతమందిని బలితీసుకుంటావు.ఇది తెలిసే చాలామంది నీ ముందుకు రాకుండా పారిపోతున్నారు.
నీ ఎంఎల్ ఏలు ఎందుకు నీవద్దకు రావడం లేదు.ఎవరైనా మాట్లాడుతున్నారా….నీవు బిస్కెట్ లు వేసే కుక్కలు కొన్ని ఉన్నాయి.ఏనుగు పోతుంటే అరుస్తుంటాయి. వాటికేం పనిఉండదు.అంతకుమించి మంచివిజన్ ఉన్న నాయకుడు నీ వెనక లేడు.గౌరవంగా బతకాలనుకునేవారు నిన్ను సపోర్ట్ చేయడం లేదు.
నీ పరిస్ధితి అతి దారుణంగా తయారైంది.ఇది అర్దం చేసుకుని ముందుకు వెళ్లాలని చంద్రబాబుకు సూచిస్తున్నాను.
(లక్ష్మీ పార్వతి విలేకరుల సమావేశంలో  వ్యక్తం చేసిన అభిప్రాయాలు)