Home Breaking హారీష్ రావుకు సవాల్ విసిరిన కేటిఆర్

హారీష్ రావుకు సవాల్ విసిరిన కేటిఆర్

200
0
SHARE

హారీష్ రావుకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సవాల్ విసిరారు. పార్లమెంటు నియోజవకర్గ స్థాయి సన్నాహాక సమావేశాల్లో కేటిఆర్ పాల్గొంటున్నారు. శుక్రవారం మెదక్ లో  పార్లమెంటరీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

“ హరీష్ రావు చెప్పినట్టు ఈ రోజు పోటి కాంగ్రెస్, బిజెపి మనకు లేదు. పోటి  ఉన్నదంతా ఒకరితో ఒకరు మెజార్టీలు సాధించుకునేది ఉంది. కరీంనగర్ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాలకంటే మెదక్ లో ఎక్కువ మెజార్టీ సాధించాలని హారీష్ రావు అన్నారు. నాది సిరిసిల్ల. కరీంనగర్ పార్లమెంటు పరిధి. నేను సవాల్ చేస్తున్నా… మెదక్ లో మాకంటే ఎక్కువ ఓటు అయినా తెచ్చుకొని రుజువు చేసుకోవాలని సవాల్ చేస్తున్నా.” అని కేటిఆర్ అన్నారు.

ఈ సందర్భంగా బావకు సవాల్‌ చేస్తున్నారు అని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించగా.. కేటీఆర్‌ ఇందుకు స్పందిస్తూ.. బావతో కాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం కంటే మేమే ఒక్క ఓటన్న ఎక్కువ తెచ్చుకొని మీ కంటే ముందుంటాం. బావ మేమంతా మంచిగానే ఉన్నామని కేటీఆర్‌ చెప్పడంతో సభలో చప్పట్లు మార్మోగాయి.