తెలంగాణలో అడుగడుగానా జైన గుడులే… ఇదిగో మరొక ఆధారం

తెలంగాణలో అడుగడుగును చరిత్ర దాక్కుని ఉంది. అదిఎపుడైనా, ఎక్కడైనా బయటపడవచ్చు. గత శనివారంనాడు కరీంనగర్ జిల్లా గాంధార మండలం కోట్ల నరసింహుల పల్లి గ్రామంలో ప్రాచీన జైన తీర్థంకురుడి పాలరాతి విగ్రహలు బయటపడ్డాయి.
గాంధార అంటూనే చరిత్ర మీద మక్కువ వున్నవాళ్లందరికి జైన స్వర్ణయుగం గుర్తుకు వస్తుంది. దక్షిణ భారత దేశంలో జైన మతానికి సంబంధించి కరీంనగర్ జిల్లాకు పెద్ద పీట వేయాల్సి ఉంటుంది.
ఇప్పటి వేములవాడ రాజధాని పరిపాలించిన చాళుక్యులు, రాష్ట్రకూటులకాలంలో జైనమతం ఇక్కడ స్వర్ణయుగం అనుభవించింది. ఇక్కడి నుంచే జైన మహాకావ్యం ‘యశస్తిలక చంపు’ వచ్చిందంటే జైన చరిత్రలో గాంధార మండలానికి ఒక అధ్యాయం మొత్తం కేటాయించాల్సి ఉంటుంది.
ఇలాంటి గాంధార మండలం కోట నరసింహపల్లె కు చెందిన వొగ్గు అంజయ్య అనే రైతు పొలాన్ని ట్రాక్టర్ తో దున్నుతున్నపుడు ఈ విగ్రహం బయటపడింది. ఇది 23వ తీర్థంకురుడు పార్శ్వ నాథుడిదో లేక 24 వ తీర్థంకరుడ  వర్ధమాన మహావీరుడిదో అయి ఉండవచ్చని  పురావస్తు శాఖ వారు భావిస్తున్నారు. పత్రికల్లో రెండుపేర్లు వచ్చాయి.
ఈ విగ్రహాలు దొరికిన ప్రదేశం, రాష్ట్ర కూట రాజుల మొదటి రాజధాని అయిన బొమ్మలమ్మ గుట్ట 15 కి.మీదూరాన ఉంటుంది. బొమ్మల గట్టు మాట చెవుల్లో జినాలయా గంటలు మోగించాలి.
ఇక్కడ గతంలొ కూడా రాష్ట్ర కూటుల కాలానికి చెందినే అనేక చారిత్రకాధారాలు కూడా దొరికాయి. ఈ గ్రామంచుట్టు మట్టితో కట్టిన కోట ఉండేది. దీనివల్లే ఈ వూరి పేరు ‘కోట్ల నరసింహుల పల్లి’ అయింది.
ప్రాథమికసమాచారం ప్రకారం  జూన్ 13 వ తేదీనబయల్పడిన విగ్రహం ఏడో శతాబ్ధానికి చెందినది. సోమవారం నాడు పురావస్తు శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించారు. ప్రభుత్వం అనుమతి తీసుకుని ఇక్కడ తవ్వకాలు జరుపుతామని అధికారులు చెప్పారు. వర్ధమానుడు రాకుమారుడు.ఆయన కాశీని పరిపాలించిన అశ్వసేనుని కుమారుడు.
జైన తీర్థంకురుడు వర్ధమాన మహావీరుడి అవశేషాలు జిల్లాలో బయపడటం ఇది మొదటి సారికాదు. 2017లో మల్లారం మండలం కేంద్రంలో కూడా ఒక శాసనం బయటపడింది. అది కూడా మహావీరుడి బొమ్మ ఉన్న శిలాఫలకం కనిపించింది. దీనిని అప్పట్లో ద్యావన పల్లి సత్యనారాయణ అనే చరిత్రకారుడు దీని మీద సంస్కృం, తెలుగులో రాసిన అక్షరాలను చదివి అసులు చరిత్ర కూపీలాగారు.ఆయన అందించిన సమాచారం ప్రకారం ఇది ఆ వూర్లో కట్టిని జైనదేవాలయానికి సంబంధించింది. ఈ ఆలయాన్ని 850 సంవత్సరాల కిందట నిర్మించారు. ఈ శాసనం ప్రకారం, ఇక్కడ 23వ తీర్థంకరుడయిన శ్రీ వర్ధమాన మహావీరుడికి ఇక్కడ ఒక గుడి నిర్మించారు. ఈ గుడిని మాణిక్య శెట్టి అనే వ్యక్తి నిర్మించాడు. ఆ గుడి ఆలనా పాలనకు భక్తుల పోచెనాయుడు అనే వ్యక్తి ముప్పాయపల్లె అనే గ్రామాన్ని మాన్యంగా ఇచ్చాడు.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/english/features/brief-history-of-politics-of-vendetta-vengeance-in-india/

మల్లారం గ్రామ ప్రజల ఎనిమిదేళ్ల కిందట ఇక్కడ చెట్లపొదలును నరుకుతున్నపుడుఈ శాసన ఫలకం కనిపించింది. దీనిని చెప్యాల మధుసూదనరావు అనే వ్యక్తి సత్యానారాయణ దృష్టికి తీసుకువచ్చారు. ఈ శాసన ప్రకారం తెలంగాణలో జైన గురువు కట్టిన చివరి ఆలయమని అర్థమవుతుందని సత్యనారాయణ చెప్పారు. ఎందుకంటే ఆ తర్వాత ఈ ప్రాంతంలోకి విస్తరించిన ‘వీరశైవం’ జైనమతాన్ని తరిమేసిందని ఆయన చెప్పారు. ఆ ఆలయ్యాన్ని కట్టించిన వ్యక్తి శెట్టి అయినందున ఈ ప్రాంతంలో వైశ్యలు ఆరోజుల్లో జైనాన్ని ఆదరించినట్లు అర్థమవుతుందని సత్యానారాయణ చెప్పారు.
ఈ శాసనంలో కాకతీయ చిహ్నాలు ఎద్దు, సూర్య చంద్రులు ఫలకానికి నాలుగువైపుల ముద్రించారు. ఈ శాసనంలో గిరి దేవసాని అనే మహిళ పేరుకూడా ఉంది. ఈ పార్శ్వనాథ ఆలయం ప్రధాని పూజారి దొడ్డలసిద్ది శెట్టి అనంతరం ఆలయం బాధ్యతలు స్వీకరించి ఉండవచ్చేని, దీనిని బట్టి జైనంలో మహిళలకు ఉన్న హోదా అర్థమవుతుందని ఆయన చెప్పారు.
జైనమత వ్యాప్తిలో కరీం నగర్ జిల్లాకు చాలా ప్రాముఖ్యం ఉంది.
‘యశస్థిలక చంపూ’ అనే మాట విన్నారా?
గద్యం పద్యం కలగలిపి రాసిన కావ్యమే చంపూ రీతి. కరీంనగర్ జిల్లా వేములవాడ రాష్ట్ర కూల పాలకుల సామంతుడుయిన అరికేసరి అస్థానంల సోమదేవ సూరి (క్రీ.శ 950) అనే పండితుండేవారు. ఆయన అనేక పుస్తకాలు రాశాడు.అందులో యశస్థిలక చంపు ఒకటి.
రాష్ట్రకూల రాజ్యంలో వివిధ వర్గాల ప్రజలు తీసుకునే అహారాపుటలవాట్లను వర్ణించినపుస్తకమిది. ఇది ప్రణయ కావ్యమే అయినా ఆ అనాటి అస్థాన జీవితం, మత కార్యక్రమాలు, క్రీడలు, వినోద కార్యక్రమాలు, పండుగలు అన్నీ ఇందులో ప్రత్యక్షమవుతాయి. జైననీతిని విశదీకరించే పుస్తకమిది. అంటే ఆరోజుల్లో ఈ ప్రాంతంలో జైనమంత వేళ్లూనికుందని, దానికి బాగా ఆదరణలభిస్తున్నదని అర్థమవుతుంది. ఈ పుస్తకానికి మహాకావ్య మని గుర్తింపు వచ్చింది. విశేష ఆదరణలభించింది.
కరీంనగర్ జిల్లాలోని వేముల వాడ, గంగాధర, రేపాక, నాంపల్లి, శనిగరం,పొట్లపల్లి, కోరట్ల, పోలసం,కాళేశ్వరం, నగునూరు, యెల్గేడు, ముల్కనూరు, తంగల్లపల్లి.కరీంనగర్ లు జైనమతానికి సంబంధించి చాలా ముఖ్యమయిన ప్రదేశాలు.
ఈ ప్రదేశాలు జైన చరిత్రకు చెందిన ఎన్నో అధారాలు దొరికాయి. ప్రఖ్యాత జైన పండితుడు సోమదేవసూరి గౌరవార్థం రెండవ బడ్డెగ రాజు ఒక శుభదామ పేరుతో ఒక జైనాలయాన్ని నిర్మించినట్లు వేములవాడ శాసన చెబుతుంది.ఇపుడిది అంతరించింది. అయితే, ఈ ఆలయంలోని పార్శ్వనాధుడి విగ్రహాన్ని వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో చూడవచ్చు. మూడో అరికేసరి నిర్మించిన జైనాలయానికి శ్రీమత్ విజయ గౌండ అనే వ్యక్తి భూదానం చేసినట్లు రేపాక శాసనం చెబుతుంది. వేముల వాడ చాళుక్యల తొలినాళ్ల రాజధాని బోధనలో ఒకపుడు 56 అడుగుల బాహుబలి విగ్రహం ఉండేది. ఇపుడది లేదు. దీనికి సంబంధించిన తల మాత్రం బోధన పిడబ్ల్యుడి బంగాళో ఉంది.
జైనబసది (జైనామఠాలు)
జైనాలయాలకు అనుబంధం బసదు (బస్తి) లు ఉండేవి. హిందూమఠాల వంటివి. ఇవిధార్మిక కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు ఉద్దశించినవి.ఇక్కడే జైనగురువులు విద్యార్థులు జైనజ్ఞానం పంచేవారు. గంగాధరలో ఒక ప్రముఖ జైనబసది వుండింది. ఇక్కడే సోమదేవసూరి కొంతకాలం ఉన్నారని,అపుడే ఆయన యశస్తిలక చంపూ కావ్యం రాశారని చెబుతారు.
గాంధార కరీంనగర్ కు ఉత్తరాన 25 కి.మీ దూరాన ఉంటుంది. ఆరోజుల్లో ఇదొక పెద్ద జైనదర్శనీయం స్థలం. తానిక్కడ కూర్చునే యశస్తిలక చంపు రాసినట్లు సోమదవసూరి స్వయంగా చెప్పారు. ఒక బొమ్మల గుట్ట దాకా వస్తే, ఇది వృషభాద్రి అనే పేరుతో ఆరోజులోచాలా ప్రఖ్యాత జైనకేంద్రంగా ఉండింది. కన్నడ అదికవి గా పేరున్న పంపమహా కవి సోదరుడు జినవల్లభ ఇక్కడే త్రిభాష శాసనం (క్రీ.శ 945) , సంస్కృతం తెలుగు కన్నడలలో వేయించారు. జినవల్లభుడు ఈ ప్రాంతంలో అనేక జైనాలయాలను నిర్మించాడని ఈ శాసనంలో ఉంది. అంటే ఈ ప్రాంతానికి జైనప్రాశస్త్యం ఎంతగా ఉందో అర్థమవుతుంది.
కోహెడ మండలంలోని శనిగరంలో  కూడా యుద్ధమల్లుడు అనే రాజు కట్టించిన జౌనాలయం ఉండేది. ఇక్కడ పార్శనాధుని విగ్రహం ఇంకా ఉంది. ఇలాగే  రేపాక, కోరట్ల, పోలస, పొట్లపల్లి ప్రాంతాలలో జైనం బాగా విస్తరించి ఉండింది. శైవమతం రావడంతో జైనం వెనకడుగువేసిందని చెబుతారు.

Like this story, pl share it with a friend