Home Features ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ జ్ఞాపక శక్తిని పెంచుతుంది: జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ

ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ జ్ఞాపక శక్తిని పెంచుతుంది: జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ

174
0
ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ బాగా ఉత్తేజాన్ని ఇస్తుందని అందరికి తెలిసిందే. కాఫిలో ఉన్న కెఫీన్ కు ఈ గుణం ఉంది. అందుకే చాలా మంది లేస్తూనే ఒక ఒక కప్పు పొగలు కక్కే స్ట్రాంగ్ కాఫీ తీసుకోమంటారు.
అలాగే ఒక ఒకప్పు కాఫీ పడగానే వచ్చే హుశారు వేరు. ఇది చాలా శాస్త్రీయ పరిశోధనల్లో రుజువయింది. దీన్ని అధారం చేసుకునే రకరకాల కెఫీనేటెడ్ పానీయాలుమార్కెట్ లోకి వచ్చాయి.
ఇపుడు కాఫీకి ఉన్న మరొక కొత్త గుణం బయటపడింది. అమెరికా బాల్టిమోర్ లోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కాఫీకి మతిమరుపును తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచే గుణం (memory enhancer) ఉందని కనుగొన్నారు.
వారి పరిశోధనా ఫలితాలు నేచర్ న్యూరో సైన్స్ (Nature Neuroscience)లో పబ్లిష్ అయ్యాయి.
శాస్త్రవేత్త డేనియల్ బొరోటా నాయకత్వంలోని బృందం కాఫీ జ్ఞాపకశక్తిని పెంచే గుణం మీద పరిశోధనలు చేసి ఆసక్తికరమయిన విషయాలు కనుగొన్నారు.
ఈప్రయోగానికి 160 మందిని ఎన్నుకున్నారు. వారంతా 18-30 సంవత్సరాల లోపు వారే. వాళ్లలో ఎవరికీ చెప్పకుండా కెఫిన్ టాబ్లెట్లను, కెఫిన్ లేని చక్కెర బిల్లలను ఇచ్చి వాళ్ల లో కెపీన్ తీసుకు వచ్చినమార్పులను పరిశీలించారు.
ప్రయోగం ఇలా జరిగింది.
మొదట వాళ్లందరికి కొన్ని బొమ్మలను చూపించి అందులో ఇన్ డోర్, అవుట్ డోర్ వస్తువులను గుర్తించాలని అడిగారు. తర్వాత వాళ్లందరికి పైన చెప్పని టాబ్లెట్స్ ఇచ్చార్. కెఫిన్ బిల్లలో 200 మిల్లీ గ్రాముల కెఫీన్ ఉంది. వీటిని తీసుకున్న 24 గంటల తర్వాత వాళ్లందరిని మొదట చూపిన బొమ్మలతోపాటు కొన్ని పాతవాటిని పోలిన కొత్త బొమ్మలను కూడా ఇచ్చారు. వాటన్నింటిని కలిపి వాటిలో పాతవేవో కొత్తవేవో కనిపెట్టమని అడిగారు.
ఇందులో 200 మి.గ్రా కెఫీన్ బిల్లలు తీసుకున్న వారిలో, చక్కెర బిల్లలు తీసుకున్నవారికంటే జ్ఞాపక శక్తి పెరగడాన్ని ఈ శాస్త్రవేత్త లు గుర్తించారు.
తర్వాత 100 మి.గ్రా, 300 మి.గ్రా కెఫీన్ డోసులతో కూడా ప్రయోగం నిర్వహించారు. నూరు మిల్లీ గ్రాములు తీసుకున్నవారికంటే 200 మిగ్రా పైబడి తీసుకున్నవారిలో కెఫీన్ పనిచేయడం బాగా కనిపించింది. అయితే, 300 మి.గ్రా పైబడి తీసుకున్నవారిలో పెద్దగా పనితీరు మెరుగుపడలేదు.
అందువల్ల జ్ఞాపకశక్తి పెరగాలంటే 200 గ్రాముల కెఫీన్ అవసరమని వారుచెబుతున్నారు. అంతేకాదు, కెఫీన్ ప్రభావం కనిపించేందుకు 24 గంటల సమయం పడుతూ ఉంది. ఈ పరీక్షలో అభ్యర్థులు బొమ్మలు గుర్తించడానికి ఒక గంట ముందు కెఫీన్ ఇచ్చినపుడు వారి జ్ఞాపకశక్తిలో ఎలాంటి మార్పు లేదు.
మనిషి మెదడులో జ్ఞాపకశక్తికి సంబంధించిన భాగం హిప్పోక్యాంపస్.స్వల్పకాల, దీర్ఘకాల జ్ఞాపకశక్తికి ఇదిస్విచ్ బాక్స్ లాగా పనిచేస్తుంది.ఇంతవరకు దీనిమీద కెఫీన్ ప్రభావం ఎలా ఉంటుందో ప్రయోగాలు జరగలేదు.ఇపుడు ఈ ప్రయోగం కెఫీన్ ప్రభావం మనిషి కాగ్నిటివ్ పవర్ మీద ఎలా ఉంటుందో స్పష్టంగా గుర్తించింది. కాగ్నిటివ్ పవర్ అంటే లర్నింగ్, రిమెంబరింగ్, కమ్యూనికేటింగ్ ల సమాహారం.వీటిని ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ పెంచుతూ ఉందని ఈ పరిశోధనలో తేలింది.
కెఫీన్ జ్ఞాపకశక్తి ఎలా పెంచుతూ ఉందనే దానికి చాలా వివరణలున్నాయి. ఇందులో ఒకటి: కెఫీన్ ఎడినోసిన్ అనే హార్మోన్ మీద పనిచేస్తూ ఉంది. మామూలుగా నోరెపైనెఫ్రైన్ (Norepinephrine) అనే ఒక హార్మనో జ్ఞాపకశక్తికి దోహదపడుతూ ఉంటుంది. ఎడినోసిన్ (Adenosine) ఈ హార్మోన్ కు అడ్డు వస్తూ ఉంటుంది. కెఫీన్ ఎడినోసిన్ అడ్డుకుని నోరెపైనెఫ్రైన్ తన పని తాను చేసుకుపోయేందుకు వీలుకల్పిస్తుందని వీరు భావిస్తున్నారు. లాంగ్ టర్స్ జ్ఞాపకశక్తిని ఎలా పెంచుతున్నదో స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే మరింతలోతైన పరిశోధణ జరగాలని బోరొటా బృందంచెబుతూ ఉంది.