ఏపిలో ఏదో జరగబోతున్నట్లుంది… ఎంటది?

(Jinka Nagaraju)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీతో ఢిల్లీలో సమావేశమయిన 24 గంటల్లోనే ఇన్ కమ్ టాక్స్ డిపార్టమెంట్ బాంబుషెల్ వంటి ప్రెస్ నోట్ విడుదల చేసింది నిన్న.
అంతే, వైఎస్ ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం అధ్యక్షుడ చంద్రబాబు నాయుడి మీద విరుచుకుపడింది. అరెస్టు చేయాలంటున్నది. నిజంగా అరెస్టవుతారా?  ప్రధాని సమావేశం తర్వాత, ఈ  రోజు జగన్ కేంద్ర హోంమంత్రి తో జరిపే సమావేశం చాలా కీలమయింది కావచ్చు. ఎందుకంటే సమావేశాలకు ఇన్ కమ్ టాక్స్ శాఖ వారి ప్రెస్ నోటు కు ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది.
 ప్రధాని సమావేశంలో జరిగిందేమిటో ఎవరికీతెలియదు. ఐటి శాఖ ప్రెస్ నోటో లో మాత్రం చాాలా వివరాలు చెప్పకనే చెప్పారు.
గత వారం రోజులుగా రాష్ట్రంలో మీడియా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పర్సనల్ సెక్రెటరీగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావు ఇంటిమీద ఐడి దాడుల గురించి రాస్తూ ఉంది. నిన్న విడుదల చేసిన ప్రెస్ నోటలో ఐటి శాఖ చాలా వివరాలు ఎవరి పేరు పెట్టకుండానే బయటపెట్టింది.
దాడులన్నీ ఒక రాజకీయ ప్రముఖుడి సన్నిహతులమీద జరిగాయని, ఇందులో ఆయన ప్రయివేటు సెక్రటెరీ కూడా ఉన్నారని చెప్పింది. పేర్లులేకపోయినా ఇదెవరె అందరికీ తెలిసిందే.
ఇంతటీ కీలకమయిన సమాచారంతో ఐటిశాఖ ప్రెస్ నోట్ విడుదల చేయడానికి, జగన్ ఢిల్లీ మీటింగ్ కు ఏదయినా సంబంధం ఉందా?
ఉందనే చాలా మంది భావిస్తున్నారు. జగన్ బిజెపికి దగ్గరయ్యేందుకు చూస్తున్నారని, దీనికేదో ఒప్పందం జరిగే అవకాశాలున్నాయని చాలా మందికి అనుమానాలున్నాయి.
భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క రాష్ట్రాన్ని కోల్పోతున్నది. సొంత పార్టీ రాష్ట్రాలు లేనపుడు కనీసం మిత్రులనైనా రాష్ట్రాల్లో ఉంచుకోవాలని ఢిల్లీ   ఎన్నికల తర్వాత బిజెపి భావిస్తున్నట్లున్నది. అందుకేనేమో ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయోలేదో జగన్ కు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది.
చంద్రబాబు మీద ఆధారాలు ఎక్కడ?
వైసిపి చంద్రబాబు అవినీతి గురించి చాాలా రోజులుగా మాట్లాడుతూ ఉంది. అయితే,  ఎనిమిదినెలలుగా అధికారంలో ఉన్నా ఒక్క అధారం కూడా చూపకపోవడంతో విమర్శలు ఎదుర్కొంటూ ఉంది.దీనితో చంద్రబాబు నాయుడిమీద సరైనరీతిలో దాడి చేయలేకపోతున్నది. దాడి చేస్తున్నపుడల్లా, అధారాలెక్కడ అని తెలుగుదేశం ఎదురు దాడి చేస్తున్నది.  ఆధారాలు లేక వైసిపి ఇబ్బందులు పడుతున్నపుడు  ఇన్ కమ్  టాక్స్ ప్రెస్ నోట్ రావడం, అందులో రు. 2000 కోట్ల అక్రమనిధులు కనిపించాయని ఉండటంతో వైసిపిలో పండగవాతావారణం వచ్చింది.
ఒక్క దెబ్బతో ఈ ప్రెస్ నోట్  వైసిపి చేతిలో వజ్రాయుధంగా మారింది. దీనితో  చంద్రబాబు మీద దాడి ప్రారంభించింది. ఈ డబ్బంతా పెండ్యాలశ్రీనివాసరావుదగ్గిర దొరికిందని, ఇక నాయుడి ఇంటీమీద దాడి చేస్తే ఎంత దొరుకుతుందోనని నిప్రశ్నిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనుంచి దాడులు ప్రారంభించింది.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/telugu/breaking/andhra-telangana-it-raid-yields-rs-2000-crore-unaccounted-money/

ఇన్ కమ్ టాక్స్ ప్రెస్ నోట్
రాజకీయ దాడులు సరే. ఇంతకి ఇన్ కమ్ టాక్స్ విభాగం గురి చూసి సరిగ్గా చంద్రబాబుకు తగిలేలా ప్రెస్ నోట్ వదిలిందో లేదో తెలియదు కాని, అది వైసిపి చేతిలో ఆయుధమయి కూర్చున్నది మాత్రం నిజం.
శాసన మండలి లో మెజారిటీ ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు రాజధాని తరలింపు ను అడ్డుకున్నాడన్న అక్కసుతో ఉన్న వైసిపి నేతలకు ఇన్ కమ్ టాక్స్ ప్రెస్ నోట్ కొండంత ధైర్యం ఇచ్చింది.  ఇక రాష్ట్రం నలుమూలలనుంచి నరకరడం మొదలుపెట్టింది.ఇలా…
చెరుకువాడ శ్రీ రంగనాధరాజు, మంత్రి:  సీఎం వద్ద పని చేసిన పీఏ ఇంట్లో ఏకంగా 6 రోజులు సోదాలు జరపడం నా జీవితంలో చూడలేదు. రూ.2 వేల కోట్ల అక్రమార్జన గుర్తించడం మాములు విషయం కాదు. మొన్నటి వరకు నష్టాల్లో ఉన్న లోకేష్‌ కంపెనీల విలువ ఒక్కసారిగా ఎలా పెరిగింది?.
వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి:  చంద్రబాబు, లోకేష్‌ అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరగాలి. చంద్రబాబు దోచుకున్న అవినీతి సొమ్మును కేంద్ర ప్రభుత్వం కక్కించాలి. – ఇప్పుడు బయటపడిన రూ.2 వేల కోట్ల అవినీతిపై పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు నోరు మెదపడం లేదు?  చంద్రబాబు అవినీతిలో పవన్‌ కళ్యాణ్‌కూ భాగస్వామ్యం ఉంది.
అవంతి శ్రీనివాస్, మంత్రి:
– పోలవరం, పట్టిసీమ వంటి ప్రాజెక్టులలో భారీ అవినీతికి పాల్పడ్డారు. తమ అవినీతిని ఎవరూ పట్టుకోలేరని చంద్రబాబు భావించారు.
– సీఎంగా పని చేసినప్పుడు ప్రజాధనానికి కాపలాదారుడుగా ఉండాలి కానీ దోపిడీదారుడిగా కాదు.
– మనీ లాండరింగ్‌లో చంద్రబాబు దిట్ట. అడ్డంగా దొరికిపోయారు కాబట్టే చంద్రబాబు స్పందించటం లేదు.
బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి:
– చీటికి మాటికి పిచ్చి రాతలు రాసే ఆంధ్రజ్యోతి, ఈనాడుకు రూ.2 వేల కోట్ల స్కామ్‌ కనిపించడం లేదా?.
– ఈ స్కామ్‌లో చందబాబు పాత్ర ఉంది. కాబట్టి సీబీఐ దర్యాప్తు జరపాలి.
– ఈ విషయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ కూడా జోక్యం చేసుకుని, చంద్రబాబు అవినీతిపై విచారణ జరిపించాలి.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/telugu/breaking/ycp-demands-arrest-of-chandrababunaidu/

కురసాల కన్నబాబు, మంత్రి:
చంద్రబాబు ఎంత దోచుకున్నారన్నది ఐటీ సోదాలతో తేలిపోయింది. నీతి, దాని వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ఇప్పుడు ప్రజలకు కూడా అర్ధమైంది.  ప్రతి రోజూ మీడియాతో మాట్లాడే చంద్రబాబు ఇప్పుడెందుకు నోరు విప్పడం లేదు?.
ధర్మాన కృష్ణదాస్, మంత్రి:
చంద్రబాబు కమీషన్ల బాగోతం బట్టబయలైంది. గతంలో సీబీఐని వ్యతిరేకించింది ఇందుకేనా? అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ ఎదుర్కోవాలి. ప్రజలు అవినీతిని సహించడం లేదు. పారదర్శకమైన పాలన కోరుకుంటున్నారు.
అంజాద్‌ బాషా, ఉప ముఖ్యమంత్రి:
– చంద్రబాబు అవినీతిపై దేశమంతా చర్చ జరుగుతోంది. చంద్రబాబు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి.
ప్రతి ప్రాజెక్టులో చినబాబుకు కమీషన్లు వెళ్లేవి. ఇది ఆరంభం మాత్రమే అని చెప్పడంతో అవినీతి చేసిన టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ ఎంపీ:
అక్రమాలు బయట పడటంతో చంద్రబాబు, లోకేష్‌ విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. అందువల్ల వారి పాస్‌పోర్టులు వెంటనే స్వాధీనం చేసుకోవాలి. చంద్రబాబు అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని ఖజానాకు జమ చేయాలి.  అమరావతి, పోలవరం పేర్లతో చంద్రబాబు కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దోచుకున్నారు. డొల్ల కంపెనీల పేరుతో అక్రమ లావాదేవీలు నడిపించి కోట్లు వెనకేసుకున్నారు.
మార్గాని భరత్‌రామ్, రాజమండ్రి ఎంపీ:
టీడీపీ నేతల అక్రమ సంపాదన ఇప్పుడు వెల్లడవుతోంది. కేవలం నాలుగైదు చోట్ల సోదాలు చేస్తేనే వేల కోట్ల రూపాయలు బయటపడ్డాయి. పార్టీ ముఖ్య నేతలపై ఐటి దృష్టి సారిస్తే ఎన్ని లక్షల కోట్లు బయటపడతాయో?.  ఐటీ దాడులపై చంద్రబాబు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదు?.
గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే.
ప్రభుత్వ చీఫ్‌ విప్‌:
దేశ చరిత్రలో అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు. ఆయన అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేయగల ఘనుడు.  స్వాతంత్య్రం తర్వాత దేశ చరిత్రలో ఇటువంటి భారీ స్కామ్‌ ఎక్కడా లేదు.  రూ.3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.  ఇవన్నీ తప్పుదోవ పట్టించేందుకే అమరావతి అంశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే.
ప్రభుత్వ విప్‌:
చంద్రబాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు. తన బినామీలపై సోదాలు జరుగుతుంటే ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు?. ఈ అక్రమాలు వెలుగులోకి రాకూడదనే కృతిమ ఉద్యమం నడుపుతున్నారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చే పార్టీలు పునరాలోచన చేసుకోవాలి.
కొట్టు సత్యనారాయణ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే.
ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌:
 చంద్రబాబు దగ్గర పని చేసిన పీఏ నే రూ.2 వేల కోట్లు దోచుకుంటే గత అయిదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇంకెన్ని వేల, లక్షల కోట్లు దోచుకుని ఉంటాడు?
చంద్రబాబు దగ్గర అవినీతి సొమ్ము విచ్చలవిడిగా ఉందని మేము మొదటి నుండి చెబుతూనే ఉన్నాం. అది ఈరోజు ప్రజలందరికి తేటతెల్లమైంది. తన బండారం బయట పడుతుందనే అధికారంలో ఉండగా సీబీఐ, ఐటీ అధికారులు రాష్ట్రంలోకి రాకుండా చంద్రబాబు జీవోలు చేశారు.
కారుమూరి నాగేశ్వరరావు. తణుకు ఎమ్మెల్యే:
చంద్రబాబు అవినీతి చిట్టాపై లోతైనా విచారణ జరపాలి. పీఏ స్థాయి వ్యక్తి దగ్గరే రూ.2 వేల కోట్ల అవినీతి బయటపడితే చంద్రబాబు అనుచరులు, కుటుంబ సభ్యుల వద్ద ఇంకా ఎంత ఉంటుంది?.  రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.
యూవీ రమణమూర్తి రాజు (కన్నబాబు), యలమంచిలి ఎమ్మెల్యే:
డొల్ల కంపెనీల పేరుతో చంద్రబాబు అండ్‌ కో లక్షల కోట్లు దోచుకున్నారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ దగ్గర చాలా విషయాలున్నాయి. ఆయన డైరీని పూర్తిగా పరిశీలిస్తే భారీ అక్రమాలు బయటపడతాయి. విదేశాలకు పారిపోకుండా చంద్రబాబు, లోకేష్‌ల పాస్‌పోర్టులు వెంటనే సీజ్‌ చేయాలి. వారిని విచారించాలి. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసింది.
ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే:
చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గతంలో చెప్పారు. ఆ అవినీతి బండారం ఇవాళ బయట పడింది. పీఎస్‌ శ్రీనివాస్‌ వద్ద పట్టుబడిన సొమ్ము చంద్రబాబుదే. అందువల్ల ఆయనను తక్షణమే అరెస్టు చేసి తీహారు జైలుకు పంపించి, అవినీతి ఆరోపణలపై కేంద్రం విచారణ చేయాలి. ఐటి దాడుల్లో పట్టుడిన సొమ్ము ఈ రాష్ట్రానిదే కనుక, ఆ సొమ్మును అధికార వికేంద్రీకరణకు ఖర్చు పెడితే మన రాజధానులు అభివృద్ధి చెందుతాయి.
కిలారి రోశయ్య, పొన్నూరు ఎమ్మెల్యే:
తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారు?. ఐటీ దాడులపై ఆయన నోరు ఎందుకు విప్పడం లేదు? పరిపాలించమని ఐదేళ్లు ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు.
కాసు మహేష్‌రెడ్డి, గురజాల ఎమ్మెల్యే:  రాజకీయాలను భ్రష్టు
పట్టించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు. 1994 నుంచే ఆయన డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారు. ఓట్ల కొనుగోలుకు ఆద్యుడు చంద్రబాబు.  ఇంత జరుగుతున్నా చంద్రబాబు పార్టనర్‌ పవన్‌ కళ్యాణ్‌ నోరు ఎందుకు మెదపడం లేదు?.
డా.గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నరసారావుపేట ఎమ్యెల్యే:
చంద్రబాబు నిజాయితీపరుడయితే ఐటీ కేసుపై విచారణ ఎదుర్కోవాలి. అవినీతికి పాల్పడటం, కోర్టుల నుంచి స్టే తెచ్చుకోవటం చంద్రబాబుకు అలవాటు. కానీ బయట మాత్రం తాను నిప్పునంటూ డబ్బాలు కొట్టుకుంటారు.
ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్యే:
టీడీపీ ఒక పార్టీ కాదు. అది ప్రజాధనాన్ని దోచుకోనే ఒక సంస్థ. అమరావతిలో రాజధాని భూములు పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారు. అచ్చెన్నాయుడు, బోండా ఉమ అనే బ్రోకర్లను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కోట్లు దోచుకున్నారు.
ఎల్లో మీడియా రామోజీరావు, రాధాకృష్ణలు ఫోర్త్‌ ఎస్టేట్‌ను నాశనం చేశారు.
ఇరుకున పడ్డ తెలుగుదేశం
ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఇన్ కమ్ టాక్స్ ప్రెస్ నోట్ తెలుగుదేశం పార్టీ ని ఇరుకునపెట్టింది. ఒక ముఖ్యమంత్రి  దగ్గిర పిఎస్ గా పనిచేసిన వ్యక్తి ఇంటి మీద ఇన్ కమ్ టాక్స్  దాడి జరగడం అక్కడ కొన్ని కీలకమయిన డాక్యుమెంట్లు దొరకాయని ఐటి శాఖ పేర్కొంది. ఆయన దగ్గిర పనిచేసిన ఒక ఉద్యోగికి నాటి ముఖ్యమంత్రికి సంబంధం ఏమిటి?  అని పైకి లాజిక్ కోసం  ఖండింవచ్చు. అయితే, సాధారణ ప్రజలు కూడా పెండ్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తిని డెప్యుటేషన్ మీద వచ్చిన  చిన్న ప్రభుత్వోద్యోగిగా చూడలేడు.
ఎందుకంటే దశాబ్దాలుగా ఆయన చంద్రబాబు తో ఉన్నారు.  చాలా పెత్తనం వెలగబెట్టారు.
అయితే, ఆయనకు చంద్రబాబు కు ఏమిటి సంబంధం అని చెప్పేందుకు తెలుగుదేశం పార్టీ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమ, పంచుమర్తి అనురాధ లను రంగంలోకి దించింది. వాళ్లెంతచెప్పినా ఐటి శాఖ ప్రకటనకే వెయిట్ ఉంటుంది. అసలు ఇన్ కమ్ టాక్స్ దర్యాప్తులో చివరకేమీ తెలుతుందో తెలియదుగాని, ప్రెస్ నోట్ మాత్రం బాంబులా పేలింది.