ప్రపంచానికంతా ఒక ఉమ్మడి భాష వస్తుందా?

(దివి కుమార్)
సమస్త ఆధునిక జీవన రంగాలలో తెలుగు వాడకం విస్త్రుతం కాకుండా మన మాతృభాష నిరంతర జీవశక్తిని పొందలేదు.
నూతన శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా రంగాల అధ్యయన, కార్యకలాపాలు తెలుగులో సాగించే పరిస్థితి రావాలి.
ఇంగ్లీషు భాషద్వారా ప్రపంచ వ్యాపిత జ్ఞానాన్ని సమకూర్చుకుంటూనే, దాన్ని మన సాంప్రదాయక వృత్తి, జ్ఞాన నైపుణ్యాలకు మన దేశీయ భాషల ద్వారా సమన్వయించుకోవాలి..

ఏదో ఒక రోజుకి ప్రపంచ మానవ సమాజం ఒకే ఉమ్మడి భాషను రూపొందించుకుంటుంది. అది ఇంగ్లీషే కానక్కరలేదు.

ఈలోగా ఒక స్వతంత్ర తెలుగు జాతిగా మనం నిలదొక్కుకుని తలెత్తుకు నిలవాలంటే మన భాషలోనే మన చదువులు – పరిపాలన నిర్వహించుకో గలగాలి.
పరాయి భాషలను కూడా మన భాషద్వారా నేర్చుకునే విధానం కావాలి. ( మా చిన్నతనంలో తెలుగు ద్వారా హిందీని నేర్పే ‘పరిచయ్’ అనే ఆరు నెలల మంచి కార్యక్రమం అమలు
జరిగింది. )
భాషకు సహజమైన నూూతన పదసంపద అపుడే వృధ్ధిచెంది వాాస్తవ రూపం పొందుతుంది. ఆధునిక జీవన రంగాలకు విస్తరించలేని భాషలన్నీ గిడసబారి పోతాయి.
నేటి దురవస్ధే కొనసాగనిస్తే మౌఖిక భాషలుగా మారిపోయే క్రమం తీసుకుంటాయి.

ఇంత సుదీర్ఘ చరిత్రగల భాష క్షీణిస్తే ఏదోనాటికి తెలుగు జాతి తనదైన స్వతంత్ర సాంస్క్రతిక ఉనికిని కోల్పోవచ్చు.

ఈ పరిస్ధితి దాపురించే ప్రమాదం నుండి తప్పించుకునే ఆలోచన చేయక తప్పదు.

నలభై ఏళ్ళుగా అమలు జరుగుతున్న ఆంగ్ల మాధ్యమం చదువుల వల్ల ఆధునిక తెలుగు తరాలు తమ ప్రాపంచిక జ్ఞానాన్నీ, ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని ఎంత స్థాయిలో అలవరుచుకున్నాయో నిజాయతీతో కూడిన అధ్యయనం, పరిశోధన, మదింపు(evaluation) లేకుండానే దానిని కొనసాగించటం గుడ్డెద్దు చేలో పడిన చందమే అవుతుందని ప్రభుత్వాలకు గట్టిగా చెప్పేవారే లేకపోవటం తెలుగుజాతి చేసుకున్న దురదృష్టాల్లో ఒకటి.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు తలవొగ్గిన పాలకులు దళారీతనంతో లొంగుబాటు ఆర్ధిక రాజకీయాలను అమలు జరుపుతారుతప్ప తమ ప్రజలకు వారి సహజ సంపదలనే కాదు, భాషలను కూడా మిగల్చలేరు. వారనుసరిస్తున్న ఆంగ్ల మాధ్యమం చదువులు , విద్యా ప్రైవేటీకరణ విధానాలే తెలుగు భాషా క్షీణతకు నేటి మూల కారణం .. ..

(సోషల్ మీడియా నుంచి)