భవిష్యత్తులో కరెంటు కష్టాలెలా తీరుతాయి? అణువిద్యుత్తే దిక్కా?

ప్రపంచంలో ఇపుడు మొత్తంగా 450 న్యూక్లియర్ పవర్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. మరొక 52 రియక్టర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో ఏసియా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2019లో నాలుగు రియాక్టర్లు పనిచేయడం మొదలుపెట్టాయి. ఇందులో రెండు చైనాలో, ఒకటి రష్యాలో ఉంటే మరొకటి సౌత్ కొరియాలో ఉంది. 2020లో మరొక 15 రియాక్టర్లు చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా, రష్యా, బెలారస్, స్లోవేకియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఆపరేషన్ లోకి రాబోతున్నాయి.
న్యూక్లియార్ రియాక్టర్ ప్రమాదాలు, పర్యావరణానికి వచ్చే నష్టాల భయంతో జర్మనీ న్యూక్లియర్ విద్యుత్ ను మానేసింది, పూర్తిగా రెనివబుల్ ఎనర్జీమీద ఆదారపడింది. ఇది చాలక పోవడంతో పొరుగుదేశాలనుంచి విద్యుత్ ను కొనుగోలు చేయాల్సి వస్తున్నది.జర్మనీకి విద్యుత్ సరఫార చేస్తున్నదెవరు, ఫ్రాన్స్, స్వీడెన్. ఈదేశాలు న్యూక్లియార్ విద్యుత్ ను ఉత్పత్తి చేసి జర్మనీకి విక్రయిస్తున్నాయి. జర్మనీ పొరుగుదేశాలలో న్యూక్లియార్ రియక్టర్లను ప్రోత్సహిస్తున్నట్లేగా.
బొగ్గు విద్యుత్కేంద్రాలనుంచి విపరీతంగా కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతున్నందున, దీనిని తగ్గించేందుకు ప్రపంచంలో చాలా దేశాలు సాంప్రదాయేతర విద్యుత్ మీద దృష్టి నిలిపాయి. విండ్, సోలార్, హైడ్రో,బయో ఫ్యూయల్స మీద విపరీతంగా ఖర్చు చేశాయి.అయితే, కార్బన్ డయాక్స్డై డు విడుదల చేయకుండా విద్యుదత్పాదన చేసేందుకు వీలయ్యేది ప్రధాన మార్గం న్యూక్లియార్ విద్యుత్. ఇపుడు ప్రపంచ వ్యాపితంగా మొత్తం విద్యుత్ వాడకంలో న్యూక్లియార్ పవర్ వాటా కేవలం 14 శాతమే.
భవిష్యత్తులో విద్యుత్ అవసరాలు సురక్షితంగా తీరేదెలా? అణువిద్యుత్ ప్రయోజనాలున్నాయి, ప్రమాదాల భయమూఉంది. ఒక విధంగా పర్యావరణ పరంగా అది కాలుష్య రహితం.మరొక విధంగా ప్రమాదాలు జరిగినపుడు రేడియో ధార్మిక కాలుష్యం తెస్తుంది. ఈరెండింటి సమన్వయం కుదరడం లేదు. అందుకే అణువిద్యత్తే సురక్షితం అనే వాళ్లు,అనువిద్యత్తు వద్దే వద్దు అంటున్నవాళ్లుగా ప్రపంచం విడిపోయింది.
అణువిద్యుత్  మీద పర్యావరణ నిపుణుల్లో ఏకాభిప్రాయం లేదు.
చాలా మంది పర్యావరణ నిపుణులు అణువిద్యుత్ ను వ్యతిరేకిస్తున్నారు. ఇది ఖరీదయిందని, పుకుషీమా,చెర్నోబైల్ వంటి ప్రమాదాలు జరిగినపుడు చాలా నష్టం జరుగుతుందని, న్యూక్లియార్ పొల్యూషన్ దీర్ఘ కాలిక నష్టాలు తీసుకువస్తుందని వారు వాదిస్తున్నారు. అందుకే భారతదేశంలో కొత్త అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటుచేయాలన్నపుడు వారి నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో కొవ్వాడ (శ్రీకాకుళం జిల్లా), కావలి (నెల్లూరు) లలో అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఎంపికయ్యాయి. దీని మీద బాగా నిరసనలు వచ్చాయి.
మరొకొందరు, ముఖ్యంగా జొనాథన్ తెన్నెబామ్ (బెర్లిన్ ) వంటినిపుణులు అణువిద్యుత్తే భవిష్యత్తుకు భోరోసా అంటున్నారు.
ఇపుడున్న అణువిద్యుత్కేంద్రాలు చాలాపెద్ద రియాక్టర్లను వినియోగిస్తాయని దీనితో పెట్టబడి భారీ గా పెట్టుబడి అవసరమవుతుందని ఇదిదాదాపు 5నుంచి 10బిలియన్ డాలర్ల దాకా ఉంటుంది. అందువల్ల చాలావర్ధమాన దేశాలు అణువిద్యుత్ ఖర్చు ను భరించలేవు. దీనికి పరిష్కారం చిన్న చిన్న రియాక్టర్లు తయారు చేయడమేనని ఆయన చెబుతున్నారు. ఆయన వాదన ఏషియా టైమ్స్ లో వచ్చింది.చిన్న చిన్న మాడ్యులార్ రియాక్టర్స్ ని ప్రమాదాలు కూడా నివారించే పద్ధతిలో తయారు చేసుకోవడం వల్ల ఖర్చుతగ్గుతుంది, కార్బన్ డయాక్స్ డ్ విడుదల కాని విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఆయన చెబుతున్నారు.
దీనికి ఉదాహరణగా ఆయన నాలుగు కొత్త డిజైన్లను ఉదహరించారు. ఇవి 1. మోల్టెన్ సాల్ట్ రియాక్టర్స్ ( molten-salt reactors), 2. ట్రావెలింగ్ వేవ్ రియాక్టర్స్ (traveling-wave reactors), 3. పెబుల్ బెడ్ హై టెంపరేచర్ రియాక్టర్స్ ( pebble-bed high-temperature reactors) 4, స్మాల్ మాడ్యులార్ రియాక్టర్స్ ( small modular reactors). ఇవన్నీ కూడా తయారయ్యే క్రమంలో ఉన్నాయని, ఇవే భవిష్యత్తు అని ఆయన వాదిస్తున్నారు. ప్రమాదాలు జరిగాయని జడిసిపోవలసిన పనిలేదని చెబుతున్నారు.