చంద్రబాబు పంతం: సిఎస్ లేకుండా క్యాబినెట్ మీటింగ్ జరపవచ్చు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 10న కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కు మధ్య ఇపుడునడుస్తున్న కోల్డ్ వార్ లో క్యాబినెట్  సమావేశం ఎలా ఉంటుందనేది  అధికార వర్గాల్లో చర్చనీయాంశమయింది.

క్యాబినెట్ మీటింగ్ చంద్రబాబు సిఎస్ మీద ప్రయోగిస్తున్న పవర్ ఫుల్ అస్త్రమని, దీనితో సిఎస్ ఎల్ వి సుబ్రహ్మణ్యం క్యాబినెట్ సమావేశానికి రావడమో లేకపోతే, ఆ రోజు శెలవుపెట్టడమో చేయాలనే వాదన అధికారుల్లో వినబడుతూ ఉంది,

ముఖ్యమంత్రి నేరుగా అధికారులకు సూచనలు పంపిస్తున్నారని, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన కార్యదర్శికి ఏ విషయాలను కమ్యూనికేట్ చేయడం లేదని ఒక వర్గం అధికారులు చెబుతున్నారు.

అందువల్ల  తనకు సహకరించని ప్రధాన కార్యదర్శి ఎల్ విని  బైపాస్ చేసి కొత్త కార్యదర్శిని నియమించుకుని ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశం నిర్వహించి పంతం నెగ్గించుకోవచ్చని కొంత మంది అధికారులు చెబుతున్నారు.

ప్రధాన కార్యదర్శి అంటే క్యాబినెట్ కు కార్యదర్శి. క్యాబినెట్ సమావేశం ఏర్పాటుచేయడంలో కార్యదర్శిగా ప్రధాన సమన్వయకర్త పాత్ర వహిస్తారు.  ‘క్యాబినెట్ సమావేశం ఏర్పాటుచేయాలంటే ఒక పద్ధతి ఉంది. ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశం ఏర్పాటుచేయాలనుకుంటున్నారని, ఏర్పాట్లుచేయండని ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రధాన కార్యదర్శికి ఒక నోట్ పంపిస్తారు. తర్వాత ప్రధాన కార్యదర్శి ఈ విషయాన్ని అన్ని శాఖల కార్యదర్శులకు లేఖరాసి ఆయాశాఖలనుంచి క్యాబినెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నఅంశాలేమిటో తెలియచేయాలని కోరతారు. శాఖ లనుంచి సమాచారం వచ్చాక క్యాబినెట్ అజండా తయారవుతుంది. ఈ అజండా క్యాబినెట్ కు వెళ్తుంది. అక్కడ ఆమోదం పొందుతుంది,,’ అని సీనియర్ అధికారి టిటిఎన్ కు చెప్పారు.

ఒక వేళ ప్రధాన కార్యదర్శి అందుబాటులో లేకపోతే ఎలా?

దీనికొక మార్గం ఉందని ఆయన చెప్పారు.‘ఏకారణం చేతనైనా ప్రధాన కార్యదర్శి అందుబాటులో లేకపోతే, తర్వాతి సీనియర్ అధికారిని క్యాబినెట్ సెక్రెటరీ గా ఆ ఒక్క క్యాబినెట్ సమావేశానికి ప్రత్యేకంగా నియమిస్తారు. ఈ నియామకానికి జివొ జారీ చేయాల్సి ఉంటుంది.తదుపరి సీనియర్ అధికారి పేరును ఖరారు చేసేందుకు ప్రధాన కార్యదర్శి ఆమోదం అవసరం.’ అని ఆయన చెప్పారు. .

సాధారణంగా ప్రధాన కార్యదర్శి/క్యాబినెట్ కార్యదర్శి లేకుండా క్యాబినెట్ సమావేశం జరగదు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సమావేశం తేదీని ప్రకటించారు. అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం ఇంకా సమావేశం గురించి ప్రధాన కార్యదర్శికి తెలియపర్చలేదు. ఇంకా నాలుగు రోజులు గడువు ఉంది కాబట్టి నేడో రేపో తెలియచేయవచ్చు అని కొంతమంది అధికారులు భావిస్తున్నారు.అయితే, దీని వెనక ఏదో ప్లాన్ ఉందని కొంతమంది అనుమానిస్తున్నారు.

కొత్త క్యాబినెట్ కార్యదర్శిని ముఖ్యమంత్రి నియమించవచ్చా?

క్యాబినెట్ సమావేశం గురించి తెలియపర్చలేదనేసాకుతో ప్రధాన కార్యదర్శి ఎల్ విసుబ్రహ్మణ్యం సమావేశానికి హాజరుకాకుండా ఉండేందుకు  ఏదయిన ప్రోగ్రాం పెట్టుకుని ఢిల్లీ వెళ్లిపోతారా? ఇదే జరుగుతుందని కొంతమంది అధికారులు టిటిఎన్ కు చెప్పారు. అపుడు ఘర్షణకు తావుండదు. లేదా ఇష్టం లేని క్యాబినెట్ కు సిఎస్ వెళ్లాలి. అపుడు ఇంతవరకు పోరాడి సాధించిందేమీ ఉండదు.

ఢిల్లీ వెళ్లే పక్షంలో తదుపరి సీనియర్ అధికారిని తాత్కాలిక క్యాబినెట్ సెక్రెటరీగా  ముఖ్యమంత్రి నియమించవచ్చని క్యాబినెట్ బిజినెస్ రూల్స్ చెబుతున్నాయి.

‘According to Rule 11 (2) of AP Government Business Rules issued in GO(P) No.4,General Administration (Cabinet-2)Department, Dt.28.11.2018 , the Chief Secretary, or such other officer as the Chief Minister may appoint shall be the Secretary to the Council of Ministers.
In the past when ever the Chief Secretary is out of station on the day of the meeting of the Cabinet, the next senior most IAS officer is appointed as the Secretary to the Council of Ministers only for the purpose of the Cabinet meeting to be held on that date,’అని ఒక సీనియర్ అధికారి చెప్పారు.

అందువల్ల ఎల్ వి  వద్దనుకుంటే, ముఖ్యమంత్రి మరొక అధికారిని నియమిస్తూ పై రూల్ ప్రకారం క్యాబినెట్ సమావేశం నడపవచ్చు. అయితే,  తాత్కాలిక క్యాబినెట్ సెక్రెటరీ నియమించే జివొని జారీ చేయాల్సింది ప్రధాన కార్యదర్శియే. అపుడాయన ముఖ్యమంత్రి తనని బైపాస్ చేస్తున్నారని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ తీసుకోవాలని ఆయన డిలే చేయవచ్చు. అపుడు ఎన్నికల కమిషన్ ఏం చెబుతుందో చూడాలి.

ఎన్నికలు కోడ్ అమలులో ఉన్న సమయంలో సాధారణంగా మంత్రివర్గ సమావేశం జరుగదు. కానీ ప్రధాని మోదీ తన మంత్రివర్గ సమావేశాన్ని ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే నిర్వహించారు కాబట్టి పోటీగా చంద్రబాబు కూడా కేబినెట్ సమావేశం నిర్వహించాలనుకుంటున్నారు. ఆయన ఇప్పటికే తనకొక రూలు,ప్రధానికొకరూలా అని ప్రశ్నించారు.

ఫణి తుఫాను తర్వాత ఎదురయిన అసాధారణ పరిస్థితులలో తాను క్యాబినెట్ ఏర్పాటుచేయల్సి వచ్చిందిని చంద్రబాబు నాయుడు వాదించవచ్చు. బాధితులకు సాయం, ఫణి ప్రభావిత ప్రాంతాలలో సహాయ చర్యలపై సమీక్ష, అకాల వర్షాల్లో రైతులకు వాటిల్లిన నష్టం, ధాన్యం కొనుగోళ్లు, సాగునీటి సరఫరా వివిధ సమస్యలపై చర్చించే ఉద్దేశంతో క్యాబినెట్ ఏర్పాటు చేస్తున్నారు.

ఈ కారణాలతోనే మొన్న ఒక రివ్యూ సమావేశం ఏర్పాటుచేశారు. అపుడు కూడా సమావేశ సమాచారాన్నిప్రధాన కార్యదర్శికి పంపలేదని తెలిసింది. ‘ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రివ్యూ గురించిన సమాచారం నేరుగా శాఖ కార్యదర్శులకు వెళ్లింది.వారు ప్రధాన కార్యదర్శికి ఈ విషయం చెప్పి రివ్యూమీటింగ్ కు వెళ్లాలా వద్ద అని వాకబు చేశారు. సమావేశం తుఫాన్ గురించి కాబట్టివెళ్లండని ఆయన సలహా ఇచ్చినట్లు ఒక సీనియర్ అధికారి చెప్పారు. అంతేకాదు, సహాయక చర్యలకు సంబంధించిన ఫైళ్ల మీద తానే వెంటనేసంతకం చేస్తానని కూడా చెప్పినట్లు తెలిసింది.

మొత్తానికి పదో తేదీ క్యాబినెట్ సమావేశం  ఏర్పాట్ల గురించి ప్రధాన కార్యదర్శి ఎల్ వి ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇది ఎల్ వి కి ఇబ్బందికరమయిన పరిస్థితే. ఎందుకంటే, క్యాబినెట్ పేరు తో ఎల్ వి ఇగ్నోర్ చేసి మరొక అధికారిని క్యాబినెట్ సెక్రటెరీ నియమించే అధికారం ముఖ్యమంత్రి ఉంది.

కాబట్టి కొత్త క్యాబినెల్ కార్యదర్శిని నియమించడాన్ని ప్రధాన కార్యదర్శి వ్యతిరేకిస్తే తాను క్యాబినెట్ సమావేశానికి హాజరు కావలసి వస్తుంది. అపుడుది తాను  తీసుకున్న ఇండిపెండెంట్ పొజిషన్ నుంచి చీఫ్ సెక్రెటరీ దిగివచ్చినట్లే.  లేదా  మరొక అధికారిని నియమించుకునేందుకు ముఖ్యమంత్రికి అవకాశమిస్తూ తాను ఆరోజు ఢిల్లీ వెళ్లడమో సెలవు పెట్టడమో యేయాలి.  ఏవిధంగా చూసిన క్యాబినెట్ సమావేశంతో ఎల్ వి సుబ్రహ్మణ్యాన్ని ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంది.

ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి కోల్డ్ వార్ లో వారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో తెలియడం లేదు. వచ్చే రెండు మూడు రోజులు చాలా కీలకమయినవి.

(revised version)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *