Home Features గెలుస్తూనే సగం జీతం శాశ్వత విరాళం ఇచ్చిన బ్రిటన్ భారతీయ ఎంపి

గెలుస్తూనే సగం జీతం శాశ్వత విరాళం ఇచ్చిన బ్రిటన్ భారతీయ ఎంపి

125
0
Britain's youngest MP Nadia Whittome (Source Twitter)
బ్రిటిషోళ్లు ఇండియాను దాదాపు రెండు వందల యేళ్ల పైబడిపరిపాలించారు. మరి భవిష్యత్తులో ఎపుడైనా భారతీయ సంతతి వ్యక్తి బ్రిటన్ కు ప్రధాని అవుతారా?
ఇదెంత వరకు సాధ్యమో చెప్పలేం గాని, బ్రిటిష్ పార్లమెంటు ఎన్నికలు జరిగినపుడల్లా ఈ ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది.
ఎందుకంటే,బ్రిటిష్ పార్లమెంటు (బ్రిటిష్ కామన్స్ )లోకి ఎన్నికవుతున్న భారతీయుల సంఖ్య ప్రతిసారీ  పెరిగిపోతున్నది. గురువారం నాడు జరిగిన ఎన్నికల్లో 15 మంది భారతీయులు గెలిచారు. ఇందులో నలుగురు కొత్తవాళ్లు, 11 మంది మళ్లీ ఎన్నికయ్యారు. వీరిలో నాడియా విటోమ్ అతి పిన్నవయసులో ఎంపికయిన ఎంపి అయ్యారు. అంతేకాదు, మొత్తం బ్రిటిన్ పార్లమెంటులో కూడా ఆమెయే యంగెస్టు ఎంపి.

ఆమె వయసు 23 సంవ్సరాలు. ఆమె బ్రిటిష్ లేబర్ పార్టీ అభ్యర్థిగా నాటింగ్హామ్ నుంచి గెలిపొందారు. లేబర్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినా నాదియా గెలిచారు. గెలుస్తూనే ఆమె చేసిన ప్రకటక అందరిని ఆశ్చర్యపరిచింది. బ్రిటిష్ పత్రికల్లో ప్రధాన వార్త అయింది. ఆమె చాలా కాలంగా అక్కడ సంఘ సేవ చేస్తున్నారు. నర్సుల, ఫైర్ ఫైట్సర్స్ వంటి వాళ్ల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకని, ఎంపిగా తాను తీసుకునే జీతంలో సగానికి కంటే ఎక్కువగా ఆమె నాటింగ్హామ్ చారిటీస్ కు విరాళమిస్తున్నట్లు ప్రకటించారు.
ఇలా ఎంతకాలమో తెలుసా? నర్సుల, ఫైర్ ఫైటర్స్ జీతాలు పెరిగే దాకా. తాను కేవలం బ్రిటన్ లో ఒక వర్కర్ కి ఎంత జీతమొస్తుందో అంతే తీసుకుంటానని ఆమె ప్రకటించారు.ఒక వర్కింగ్ క్లాస్ ఫామిలీ నుంచి వచ్చిన నాదియా జాతి వివక్ష నేరాలకు వ్యతిరేకంగా చిన్న వయసులోనే పోరాటం మొదలుపెట్టారు.
బ్రిటన్ లో ఒక ఎంపికి టాక్స్ పోగా సంవత్సరానికి 79వేల పౌండ్ల జీతం వస్తుంది. తాను ఇందులో కేవలం 35వేల పౌండ్లు మాత్రమే తీసుకుంటానని, మిగతాదంతా చారిటీస్ కు ఇస్తున్నానని ప్రకటించినట్లు మిర్రర్ రాసింది.
‘నేనిదేదో ఘనత కోసం చేయడం లేదు. ఇది వితరణ కూడా కాదు. ఎంపిలకు ఇంత పెద్ద జీతాలు అసవరం లేదని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. అయితే, మన లాగే, టీచింగ్ అసిస్టెంట్లు, నర్సులు, ఫైర్ ఫైటర్స్ కూడా మంచి జీతాలతో బాగుండాలి,’ అని అమెచెప్పారు.
వాళ్లకూ పనికి తగ్గ వేతనం వచ్చినపుడే నేను పూర్తి జీతం తీసుకుంటానని ప్రకటించారు. భారత దేశంలో కూడా ప్రజాప్రతినిధులకు ఇలాంటి విశాల హృదయం అలవడాలని కోరుకుందాం. ఎందుకంటే, మన ఎంపిలు ప్రజాసేవ కోసం కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలుస్తున్నారు. మన శాసన సభ్యులలో, ఎంపిలలో జీతం మీద ఆధారపడిన వాళ్లు బాగా తక్కువ. వాళ్లు మినహా మిగతా వాళ్లంతా తమజీతాలను నాదియాలా ప్రభుత్వ పాఠశాలలకో, ఆసుపత్రులకో ఇస్తే చాలా బాగుంటుంది.
సరే మళ్లీ మొదటి విషయానికొద్దాం.
బ్రిటన్ కు భవిష్యత్తులో ఎపుడైనా భారతీయ సంతతి ఎంపి ప్రధాని అవుతాడా?
ఆ మధ్య Could the UK Ever Have a British Indian Prime Minister? అంటూ HuffingtonPost కూడా ఒక వ్యాసాన్ని ఈ ఆసక్తి రేకేత్తించే క్యాప్షన్ తో రాసింది. అది ప్రధాని నరేంద్రమోది బ్రిటన్ పర్యటనకు వచ్చినపుడు 2015 నవంబర్ లో రాసింది.
భారతీయుల ఐక్యత మోదీ రాక సందర్భంగా వెల్లడయిందని చెబుతూ ఈ వ్యాసంలో భారతీయులు బ్రిటిష్ రాజకీయాలలో చాలా దూరంగా వచ్చారని అని వ్యాఖ్యానించింది. 1960 నాటికి వాళ్లంతా బతుకు దెరువు కోసం వచ్చిన వాళ్లు. అపుడువాళ్లకి ఎలాంటి రాజకీయ ఆంకాంక్షలు లేవు. బ్రిటిష్ ప్రభుత్వంలోని అత్యున్నత పదవిని అందుకోవాలనే కోరిక పుట్టటమే కష్టం. ఇపుడా పరిస్థితి లేదు. ఇది సుదూర భవిషత్యుల్లో ఇది నెరవేరాలని భారతీయులు కలలు కనే స్థాయికి వచ్చారని హఫింగ్టన్ పోస్టు వ్యాఖ్యానించింది.
ఎందుకంటే, భారతీయులు ఇంగ్లండులో అత్యధిక పెద్ద మైనారిటీ వర్గం.జనాభా వాళ్లు 2.5 శాతానికి చేరుకున్నారు. మొదటి తరం భారతీయులు ఫ్యాక్టరీలలో, స్కూళ్లలో,వార్తపత్రికల్లో పనిచేసేందుకు వచ్చిన వాళ్ళే. వాళ్ల సంతతి ఇపుడు డాక్టర్లు, ఇంజనీర్లు, పారిశ్రామికులుగా తయారయేందుకువారంత బాట వేశారు. ఇపుడు న్నతరం రాజకీయంగా బాగా చైతన్యవంతమయింది.
ఇది గురువారం నాటి ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తుంది. ఈ ఫలితాలను శుక్రవారం ప్రకటించారు. భారతీయ సంతతి వారు బ్రిటన్ లోని రెండు పార్టీ (రూలింగ్ టోరీ, లేబర్ )లలో ఉన్నారు. ఈ సారి గెలపొందిన వారిలో ఒకరు ఈ రెండు పార్టీలకు చెందని లిబరల్ డెమోక్రట్.
ఈ సారి టోరీలలో 7 మంది గెలిస్తే లేబర్ నుంచి 8 మంది గెలిచారు. రెండు పార్టీల నుంచి మొత్తంగా 63 మంది పోటీ చేశారు. 1915లో 56 మంది పోటీ చేస్తే 11 మంది గెలిచారు. ఈ సారి బ్రిటిష్ కామన్స్ లో భారతీయ సంతతి వారి సంఖ్య నలుగురితో పెరిగింది.
విశేషమేమంటే, అత్యతిధి శ్వేత జాతీయులున్న నియోజకవర్గాల నుంచి కూడా భారతీయ సంతతి వారు గెలవడం. ఈ సారి గెలుపొందిన వారిలో గగన్ మహింద్రీ (41 సం. హెర్ట్ ఫోర్డ్ షైర్ సౌత్ వెస్ట్) క్లెయిర్ కాంటినో (34 సం. సర్రే ఈస్ట్),నాదియా విటోమ్ (23 సం.నాటిగ్హామ్ ఈస్ట్), రిషి సునక్ ఉన్నారు. రిషి ఎవరోకాదు, ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ ఆర్ నారాయణ మూర్తి అల్లుడు.