భారతీయ డాక్టర్ కు జీవిత ఖైదు : వైద్యపరీక్షల పేరుతో ఇతగాడు…ఏంచేశాడంటే

భారతీయ సంతతికి చెందిన జనరల్ ప్రాక్టిషనర్ మనీష్ షాకు లండన్ కోర్టు లైంగిక వేధింపుల ఫిర్యాదులమీద జీవిత ఖైదు శిక్ష విధించింది.
మనీష్ షా లండన్ లో మంచిపేరున్న డాక్టరే. ఈస్ట్ లండన్ రామ్ ఫోర్డ్ ఏరియా లో ఉండే మనీష్ షాకు అక్కడ మంచి డాక్టరనే  పేరుంది.
తన దగ్గిరకు వచ్చే రోగులను ‘ప్రేమ’గా పలకరిస్తాడని, కళ్లింత చేసుకునే మహిళారోగులను ‘బాగా పరీక్షిస్తా ’డని పేరుంది.
ఈ డాక్టర్ ప్రేమ వెనక, కళ్లతో చేతల పరీక్షించడం వెనక పెద్ద జబ్బుందని చాలా మందికి తెలియదు. ఇదితెలియని వాళ్లంతా ఆయన మాయమాటలు నమ్మి తమ ఫామిలీ డాక్టర్ ను చేసుకున్నారు.
జనరల్ ప్రాక్టిషనర్ అయిన షా తన వైద్యానికి ‘డిఫెన్సివ్ మెడిసిన్’అని చక్కటి పూత పూశాడు. విదేశాలలో మహిళల్లో క్యాన్సర్ భయం చాలా ఎక్కువ. ఫామిలీ హిస్టరీని ఇతగాడు తన లైంగిక వాంఛలను తీర్చుకునేందుకు వాడుకున్నాడు.
 క్యాన్సర్ వస్తుందని మహిళలను ‘ప్రేమ’ భయపెట్టేవాడు. బెదరగొట్టేవాడు. వక్షోజ క్యాన్సర్ వస్తుందని, ముందుగా కనుగొనడం చాలా ముఖ్యమని, పరీక్ష చేయించుకోవడం ఉత్తమమని మాయమాటల చెప్పేవాడు.
వాళ్లందరిని పరీక్షలకు వప్పించే వాడు.వక్షోజాలను పరీక్షించేటపుడు కనీసం గ్లవ్ స్ కూడా తొడుక్కోకుండా తడిమే వాడు. మహిళలను పరీక్షల పేరుతో పూర్తిగా నగ్నం చేసి టేబులుపడుకోబెట్టి ‘పరీక్షించే’ వాడు. అంతేకాదు, మహిళలను పరీక్షించేటపుడు ఎవరైనా తోడుండాలన్న నియమం కూడా పాటించే వాడు. మరొక వ్యక్తిని అనుమతించకుండా తానే ‘పరీక్షించే’ వాడు.
50 వయసు సమీపిస్తున్నది కాబట్టి పరీక్ష చేయించుకోవాలని చెప్పేవాడు. ఈ పేరుతో వారి వక్షోజాలను తడమడం కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఇక 25 సంవత్సరాలోపు వయసున్నవారికి స్మియర్ టెస్ట్ (సెర్వికల్ క్యాన్సర్ ఉందేమోనని అనుమానంతో చేసే పరీక్ష) అని చెప్పి వేళ్లు చొప్పించి పరీక్షించేవాడు. ఇతగాడి తీరుమీద చాలా మందికి ఎట్టకేలకు అనుమానం వచ్చింది.
అక్కడి మానే మెడికల్ సెంటర్ లో జనరల్ ప్రాక్టిషనర్ గా పనిచేస్తున్నపుడు 2009-2018 మధ్య షా ఇలా పలువిధాల వికారాలు పోయాడు. 2013 లో నలుగురు మహిళలు డాక్టర్ వెకిలి చేష్టలు లైంగిక వేధింపులుగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదిలింది.
ఇంగ్లండుకు చెందిన ఎన్ హెచ్ ఎస్ ఈ ఫిర్యాదుల మీద సుదీర్ఘమయిన విచారణ జరిపింది. ఆయన దగ్గిర వైద్యం చేయించుకున్న ఎంతో మహిళలను విచారించడంతో, ఇతగాడు జరుపుతున్న పరీక్షల ఉద్దేశం వైద్యం కాదని, లైంగిక సంతృప్తికోసమని తేలింది. మొత్తంగా  139 మంది పేషంట్ల ని విచారించారు. ఇదంతా ఫిర్యాదు చేసిన పేషంట్ల అనుమానాన్ని ధృవీకరించింది.
దీనితో మొదట షాని 2013 సెప్టెంబర్ లో అరెస్టు చేశారు. ఈకేసుల మీద విచారణ 2019 డిసెంబర్ లో ముగిసింది. 2020 ఫిబ్రవరి 7వ తేదీన ఈనేరాలు రుజువయ్యాయి. మొత్తంగా 24మందిమహిళల మీద 90 అత్యాచార అభియోగాలు రుజువయ్యాయి. దీనితో అతనికి మూడు జీవిత ఖైదులు శిక్షలు పడ్డాయి.
అవసరం లేకపోయినా పరీక్షలపేరుతో మోసగించడంతో ఆయని మాయలమరాఠీ (Master of deception)గా ఓల్డ్ బెయిలీ కోర్టు పేర్కొంది.
మహిళలను నమ్మించేందుకు ఎంజెలీనా జోలీ, జేడ్ గూడీల పేర్లు ప్రస్తావించేవాడు. హాలివుడ్ స్టార్ ఎంజెలీనా జోలీ తనకి 85 శాతం వక్షోజ క్యాన్సర్ ఉందని తెలినపుడు డబల్ మాస్టెక్టమీ చేయించుకున్నారు. టివి సెలెబ్రిటీ గూడీ సెర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయారు. ఇలాంటి ఆందోళనకరమయిన విషయాలు చెప్పి, వారి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే, ముందు డిఫెన్సివె మెడిసిన్ అని పరీక్షలు ఒప్పించేవాడు. తానే స్వయంగా వక్షోభాలను పరీక్షించేవాడు.