ఆస్ట్రేలియా వైపు పరుగు పెడుతున్న భారతీయులు…

ఆస్ట్రేలియాలో భారతీయుల సంఖ్య బాగా పెరిగిపోతున్నది.
ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిటిక్స్ (ABS) విడుదల చేసిన జనాభా వివరాల ప్రకారం 2019 నాటికి ఆ దేశంలో ఉన్న భారతీయుల సంఖ్య 666,000.  2018 లో భారతీయుల సంఖ్య 592,000. అంటే 11 శాతం పెరుగుదల.
మొత్తం ఆస్ట్రేలియా జనాభాలో  భారతీయుల వాట  2.6 శాతం. అక్కడ ఉన్న భారతీయుల సగటు వయసు 34 సంవత్సరాలు.
ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్లే  వాళ్లు ఎక్కుగా స్థిరపడుతున్నది  ఆదేశ తూర్పుతీరంలో. అక్కడి విక్టోరియా రాష్ట్రంలో భారతీయలు ఎక్కువగా నివసిస్తున్నారు. అక్కడ సుమారు 182,000 మంది భారతీయులున్నారని ఎబిఎస్ వెల్లడించింది.
తర్వాతి స్థానం న్యూ సౌత్ వేల్స్ ది.  జూన్ 2016 నాటికి న్యూసౌత్ వేల్స్ లో  ఉన్న భారతీయులు 153,000 మంది.
ఇతర ప్రాంతాలకు సంబంధించి  పశ్చిమ ఆస్ట్రేలియాలో  53 400, క్వీన్స్ లాండ్ లో 53,100, దక్షిణ ఆస్ట్రేలియాలో 26,000, ఉత్తర ప్రాంతంలో  4,200, టాస్మేనియాలో 2,100 ఉన్నారు.  ఆస్ట్రేలియన్ రాజధాని ప్రాంతం (Australian Capital Territory)లో 10,900 మంది భారతీయులునివసిస్తున్నారు.
ఆస్ట్రేలియాకు అత్యధికంగా ప్రజలను పంపిస్తున్న దేశం భారతదేశమే. 2019-20లో  ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిండెన్సీ కోసం కేటాయించిన 160,323 ప్రదేశాలలో 33,611 ప్రదేశాలు భారతీయులకు కేటాయించారు.
2019-20 సంవత్సరంలో  28వేల మంది భారతీయులకు ఆస్ట్రేలియ పౌరసత్వం దొరికింది.
ఇటీవల ఉన్నత విద్యకోసం ఆస్ట్రేలియా వెళుతున్న భారతీయు విద్యార్థుల సంఖ్య కూడా బాగా పెరిగింది.
ప్రస్తుతం ఆ దేశంలో 94,000 మంది భారతీయ విద్యార్థులు వివిధ యూనివర్శటీలో చదువుతున్నారు. ఆస్ట్రేలియలో చదువుకుంటున్న మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో 15 శాతం మంది భారతీయులే.
భారతీయుల జనాభా పెరిగిపోతూ ఉండటంలో ఆదేశంలో భారతీయు భాషలు వినిపించడమూ ఎక్కువయింది. అయితే, వారిలో హిందీ మాట్లాడేవారే నెంబర్ వన్.
2016 లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాలో హిందీ భాష మాట్లాడే వారి సంఖ్య 159,62 మంది . తర్వాతి స్థానం  పంజాబీ. ఇదే లెక్క ప్రకారం పంజాబీ మాట్లాడే వారి సంఖ్య 132,496 .
నిజానికి ఆస్ట్రేలియా లో ప్రముఖంగా మాట్లాడే పది భాషలలో ఈ రెండు కూడా ఉన్నాయి.
 2029 నాటికి ఆస్ట్రేలియా జనాభా29.5 మిలియన్లకు చేరుకుంటుందని ABS అంచాన వేసింది. అదే దామాషాలో భారతీయుల సంఖ్య కూడా పెరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *