ట్రంప్ అంటే వల్లమాలిన ప్రేమ ఉన్న ఆరు దేశాల్లో ఇండియా ఒకటి… మిగతా ఏవి?

(TTN Desk)
మనవాళ్లకి అమెరికా దేశమన్నా, అమెరికా డాలరన్నా చాలా ఇష్టం. ఇక అమెరికా అధ్యక్షుడి గురించిచెప్పాల్సిన పనిలేదే. తెలంగాణ కు చెందిన బుస్సా క్రిష్ణ ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంపుకు గుడికట్టాడు.
అమెరికా వాళ్లు మనగురించి ఏమనుకున్నా మనమంచికే అనునకుంటాం. అమెరికా వాళ్లు ఏదయినా పొగిడితే వెనకాలేముందో చూసుకోకుండా కళ్లకు అద్దుకుంటాం.
బిజెపి సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ చేసిన ట్వీట్ ఒకటి ఇలాగే వివాదంలో ఇరుక్కుంది. అమెరికా ఇండియాను డెవెలప్డ్ దేశంగా గుర్తిస్తోందన్న హెడ్ లైన్  ఉన్న వార్త నొకదాన్ని ఆయన ట్వీట్ చేసి ఉప్పొంగి పోయారు.

అమెరికా లాంటి దేశం, భారతదేశాన్ని డెవెలప్డ్ దేశమంటే ఆయన వార్తను కళ్లకు అద్దుకుని ట్వీట్ చేశారు.దానికి తెగ లైకులొచ్చాయి. అసలు వార్తలో ఏముందో అమెరికా ఎందుకు ఇండియాను developed nation అని అధికారికంగా వర్గీకరించాలనుకుంటున్నదో తెలుసుకోకుండా ఇచ్చిన ట్వీట్ఇదని altnews వాళ్లు ఫ్యాక్ట్ చెక్ చేసి చెబుతున్నారు.
ఇండియాలో పేదరికమున్నా, రైతుల ఆత్మహత్యలున్నా, నిరుద్యోగమున్నా,అదవినీతి ఉన్న, అమెరికా వాళ్లిచ్చిన డెవెలప్డ్ నేషన్ బిళ్ల తగించుకుని వూరేగవచ్చుని చాలా మంది ఆశపడ్డారు.అయితే,వార్త హెడ్ లైన్ కింద దాగి ఉన్న అసలు కథ వేరు. అమెరికా దేశాలను చాలా రకాలుగా వర్గీకరించి సబ్సిడీలు ఇస్తూ ఉంటుంది. ఇందులో డెవెలెపింగ్ నేషన్స్ , డెవలప్డ్ నేషన్స్ అనేవి రెండు రకాల దేశాలు.
డెవెలెపింగ్ నేషన్స్ అనేవి పేద దేశాలు కాబట్టి అమెరికా కు సరుకులు ఎగుమతి చేసేందుకు ఈ దేశాలకు కొన్ని ప్రయోజనాలు కల్పించింది.అయితే,చాలా దేశాలు, మనదేశం లో దొంగ క్యాస్ట్ సర్టిఫికేట్ పుట్టించుకుని రిజర్వేషన్లు పొందుతున్నట్లు, చాలా డెవెలప్డ్ నేషన్స్ తాము డెవెలపింగ్ నేషన్ అని చెప్పుకుంటూ ఈ రాయితీలు కొట్టేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి వచ్చింది. ట్రంపు భగ్గుమన్నాడు. ఇదంతా మోసమన్నాడు. ఆయన భగ్గుమన్న దేశాలలో ఇండియా ఒకటి.

వెంటనే ఆయన ఇండియాని డెవెలప్డ్ నేషన్ అని ప్రకటించేశేయండి అన్నారు. అంతే, ప్రకటించేశారు.దీనితో ఇండియా ఉత్పత్తులు అమెరికాకు వెళ్లితే వచ్చే రాయితీలన్నీ పోయాయి. ఈ వార్తంతా చదవకుండా అమెరికా డెవెలప్డ్ నేషన్అని అనిందని చంకలెగరేసుకున్నారని Altnews అంటున్నది. ఏమిచేయాలి?
భారత్ కు వచ్చే ఇండియా మీద ఒక దెబ్బ వేసి ట్రంప్ సోమవారం నాడు న్యూఢిల్లీలో దిగుతున్నాడు. అయనను ప్రసన్నం చేసుకునేందుకు మనం చాలా తంటాలు పడుతుంటాం. అమెరికా అధ్యక్షుడికి పలికే స్వాగతానికి,ఇతర దేశాల అధ్యక్షుకులకు పలికే స్వాగతానికి తేడా చూడండి.
ప్రెశిడెంట్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక తొలిసారి భారత్ వస్తున్నాడు. దీనికి ఆయన లక్ష్యం వేరే ఉంది. అది వేరే కథ. ఈ సారి ఆయనను గుజరాత్ తీసుకువెళ్లి, అక్కడ సాధించిన అభివృద్ధిని చూపేందుకు ప్రధాని మోదీ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ట్రంప్ చేత భేష్ అనిపించుకోవాలనుకుంటున్నారు.
అందువల్ల గుజరాత్‌ అక్కడి ప్రభుత్వం కనీ వినీ ఎరుగని రీతిలో స్వాగతం ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌ టూర్‌ కోసం గుజరాత్‌ సర్కార్‌ భారీగా నిధులు కేటాయించింది. ట్రంప్‌ 3 గంటల పర్యటనకు ఏకంగా రు. 80 కోట్లు ఖర్చు చేస్తోందని వార్త. ట్రంప్ కు స్వాగతం పలకడం కోసం నిమిషానికి రూ.55 లక్షలు ఖర్చు చేస్తుందట.ట్రంప్ టూర్ ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి మొదలవుతుంది. ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందికరమయిన దృశ్యాలు, గతుకుల రోడ్లు, మురికివాడలు ట్రంప్ కంట కనిపించకుండా చేయాలని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దీనితో అహ్మదాబాద్‌ నగరాన్ని పెళ్లికూతురిలా ముస్తాబుచేసుందుు ప్రయత్నాలు జరుగుతున్నా. దీని మీద ఇండియా పత్రికలన్నీ వార్తలు రాశాయి.అయితే,వాష్టింగ్టన్ పోస్టు కూడా వార్త రాసింది. అంటే తన రాక పట్ల ఇండియాపడున్న ఆదుర్దా ట్రంప్ మహాశయునికి కూడా తెలిసిపోయే ఉంటుంది.
ట్రంప్‌ వెళ్లే మార్గంలో రోడ్లు అద్దంలా కనిపించేందుకు అహ్మదాబాద్‌ నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. రోడ్లను మరమ్మతులు చేయడంతో పాటు నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దుతోంది. ఇందుకోసం 6 కోట్లు ఖర్చు చేస్తోంది. రోడ్లకు కొత్త పూత పూస్తున్నారు. కొత్త రోడ్డేస్తున్నారు. ఫుట్ పాత్ లు సిద్ధమవుతున్నాయి. గతుకులన్నీ పూడ్చేస్తున్నారు. ఇవన్నీ చూసి ఇలా ట్రంప్ మహాశయుడు అర్నెళ్ల కొకసారి తమ కాలనీ మార్గంలో వెళ్తే బాటుటుందని హమీర్ వఘేలా అనే వ్యక్తి వాషింగ్టన్ పోస్టు కుచెప్పారు.
ట్రంప్ మార్గంలో ముఖ్యంగా ట్రంప్ ప్రారంభిస్తున్న క్రికెట్ స్టేడియం పక్కన ఒక మురికి వాడ ఉంది. అక్కడి 45 కుటుంబాలకు ఖాళీ చేసి పొమ్మని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.అయితే ఇది ట్రంప్ కు కనిపించకుండా చూడాలి.
ఇలాగే ఎయిర్ పోర్టు నుంచి ఇందిరా బ్రిడ్జి దారిలో మరొక మురికి వాడ ఉంది. అందులో  2000 మంది నివసిస్తున్నారు.  కాలనీ చుట్టు,అక్కడిప్రజలు మాకు కష్టమవుతుందని చెబుతున్నా, అరడుగుల ఎత్తున ఒక పొడవాటి గోడకట్టేశారు. ఇది నగరంలో ఎప్పటి నుంచో ఉన్న పాత పుండు.  దీనిని ఏ ప్రభుత్వం నయంచేయలేక పోయింది.గతంలో   ఈదారి గుండానే విదేశీ విఐపిలు వెళ్లాల్సివచ్చింది. అపుడు వారికి కనిపించకుడా భారీ కర్టెన్లు అడ్డం గా పెట్టారు.
ఇపుడు ట్రంప్ కోసం గోడ కడుతున్నారు. ట్రంపు నగరంలోకి వచ్చే దారి70 లక్షల మంది ప్రజలు వచ్చి ట్రంప్ కు స్వాగతం పలుకుతారని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. అంటే, ఇళ్లకు బీగాలేసి అహ్మదాబాద్ ప్రజలంతా ట్రంప్ కోసం వస్తారని అర్థం. ఇది మరీ ఎగ్జాగరేషన్ కాని, లక్ష మంది దాకా తీసుకురావచ్చని అనుకుంటున్నారు.
అమెరికా అంటే పడిచచ్చేదేశాలు ప్రపంచంలో ఆరున్నాయని,అందులో ఒకటి ఇండియా అని ఆ మధ్య Pew Research Centre పోల్ లో వెల్లడయింది. ట్రంప్ విధానాలను ప్రపంచమంతా విమర్శిస్తున్న ఈ ఆరుదేశాలలో నెత్తికెత్తుకుంటున్నారని ఈ పోల్ వెల్లడిచింది.  మిగతా దేశాలు, ఫిలిప్పైన్స్, ఇజ్రేల్, నైజీరియా, పోలండ్,కెన్యా.
ట్రంప్ ఇండియాలో గడిపేది కేవలం 36 గంటలే. తాజ్ మహల్ ను నిగనిగలాడే చేస్తున్నారు.
ఇండియా పట్ల ఆమెరికా ధోరణి ఎలా ఉన్నా, అమెరికా సానుభూతికోసం భారత్ ఎపుడూ తాపత్రయ పడుతూ ఉంటుంది. సుమారు 2.4బిలియన్ అమెరికా డాలర్లతో 24 లాక్ హీడ్ మార్టిన్ మిలిటరీ హెలికాప్టర్లు అమెరికానుంచి కొనే ప్రతిపాదనకు మొన్నా మో దీ క్యాబినెట్ అమోదం తెలిపింది.
అహ్మదాబాద్‌ నగరంలో మొత్తం 17 మార్గాల్లో రోడ్లు బాగు చేస్తున్నారు. ట్రంప్‌ పాల్గొనే మోతేరా స్టేడియంను కూడా తీర్చి దిద్దుతున్నారు. మోతేరా స్టేడియం ఇంకా ప్రారంభం కాకపోయినా, ట్రంప్ కోసం వినియోగిస్తున్నారు. స్టేడియం-ఎయిర్‌పోర్టు నుకలిపుతూ 1.5 కిలోమీటర్ల కొత్త రోడ్డు వేస్తున్నారు. ఇండియా డెవెలప్డ్ నేషన్ అయింది కాబట్టి పేదరికం ఆనవాళ్లు కనపడకుండా మురికి వాడల గుడిసెలు కనిపించకుండా చూస్తున్నారు.
ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి మొదట సబర్మతీ ఆశ్రమానికి వెళతారు. తర్వాత మోతెరాలోని క్రికెట్‌ స్టేడియం నుంచి రోడ్‌ షో ఉంటుంది. ఈ మార్గాన్ని సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. డివైడర్లకు రంగులు వేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా పూలతో అలంకరిస్తున్నారు. ఇందుకోసం 6 కోట్లు ఖర్చవుతోంది. రోడ్‌ షో సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను 4 కోట్లు కేటాయించారట.
మోతేరా స్టేడియంలో నిర్వహిస్తున్న ‘కేమ్ ఛో ట్రంప్’ కార్యక్రమానికి సుమారు లక్షమంది హాజరవుతారని అంచనా. వీరి ట్రాన్స్‌పోర్ట్ అల్పాహారం కోసం సుమారు 10 కోట్లు ఖర్చవుతుంది. మొత్తంగా నగరంలోని రోడ్ల మరమ్మత్తుల కోసం అహ్మదాబాద్‌ నగరపాలక సంస్థ బడ్జెట్‌లో 500 కోట్లు కేటాయించినట్లు వార్తలు చెబుతున్నాయి.