తిరుమల బ్రహ్మోత్సవాలలో దర్భ గడ్డి ప్రాముఖ్యం ఇదే…

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆగమోక్తంగా నిర్వహించే ధ్వజారోహణం కార్యక్రమం లో వాడే ఒక ముఖ్యమయిన వస్తువు దర్భ గడ్డి. దీనిని వృక్ష శాస్త్ర నామం డెస్మోస్టాఖ్యా బైపినేటా (Desmostachya Bipinnata). హిందూ సంప్రదయాంలో దర్భ పుల్లలకు చాలా ప్రాశస్త్యం ఉంది.రుషులు దర్భ తో చేసిన కుర్చీల మీద కూర్చుంటారు. దర్భ చాపలమీద శయనిస్తారు. ధ్యానంలో దర్భ చాపలనే వాడాలి. దర్భచాపలమీద ఉన్ని జంబుకాణం లేదా జంతుచర్మం పరుచుకుని కూర్చుంటారు. దర్భ చాప అందుబాటులో లేకపోతే, కనీసం కొన్ని దర్భపుల్లలనైనా వాడాలి. అలా చేసినందున  దుష్టశక్తులు ధ్యాన సమయంలో సమీపానికి రావనివిశ్వాసం. అభిషేకంలో, యజ్జం చేసే టపుడు, వివాహ సమయంలో కూడా దర్బలను రకరకాల రూపంలో వాడతారు.
TTD Picture
దర్భలను సంస్కృతంలో కుశ అనిపిలుస్తారు. దర్భపోచలు చాలా పదునుగా ఉంటాయి. అందుకే చలాకైన వాడిని  కుశాగ్రబుద్ధితోఉన్నాడని చెబుతారు.
గ్రహణ సమయంలో దేవతల విగ్రహాలమీద, నిల్వవుండే ఆహార పదార్థాలమీద దర్భ  పుల్లలు వేస్తే వాటిమీద గ్రహణ ప్రభావం ఉండదని చెబుతారు.
TTD Picture
కొన్ని పూజకార్యక్రమాలకుపూనుకునే ముందు మానసిక, ఆధ్యాత్మకి స్వచ్ఛత అవసరం. ఇది దర్భ పవిత్రమ్  లేద దర్భ గడ్డిని వాడటం వల్ల వస్తుందని చెబుతారు.
దీనికోసం తిరుమల బ్రహ్మోత్సవాలలో కూడా ఈ లక్ష్యంతోనే దర్భ పవిత్రమ్ ను వినియోగిస్తారు.  దీనికోసం  టిటిడి అటవీ విభాగం  ఉత్సవాలకు అసవరమయిన పవిత్రమైన దర్భను సిద్ధం చేస్తుంది. దర్భతో తయారుచేసిన చాప, తాడును  అటవీ విభాగం అధికారులు, సిబ్బంది ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీవారి ఆలయ అధికారకుల  అందచేస్తారు.
TTD Picture
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించే కైంకర్యాలు, సేవలు, హోమాల్లో దర్భను వినియోగిస్తారు. ఈ దర్భను తిరుమలలోని కల్యాణవేదిక ఎదురుగా గల టిటిడి అటవీ విభాగం నర్సరీల్లో పండిస్తారు. బ్రహ్మోత్సవాల కోసం బాగా పెరిగిన దర్భ అవసరమవుతుంది.
TTD Picture
ఇలాంటి దర్భను తిరుపతి సమీపంలోని వ‌డ‌మా‌ల‌పేట‌  పొలాల గట్ల నుండి సేకరిస్తారు. ఈ దర్భను అక్కడి నుంచి తెచ్చాక  15 రోజుల పాటు నీడలో ఆరబెడతారు. ఈ దర్భతో 22 అడుగుల పొడవు, 6 అడుగుల వెడ‌ల్పు చాపను, 200 అడుగుల తాడును తయారుచేస్తారు. దీనికోసం 10 రోజుల సమయం పడుతుంది. ధ్వజారోహణం సందర్భంగా ధ్వజస్తంభానికి ఈ చాపను, తాడును చుడతారు.

One thought on “తిరుమల బ్రహ్మోత్సవాలలో దర్భ గడ్డి ప్రాముఖ్యం ఇదే…

Comments are closed.