ఆంధ్రలో కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ మొదలు, ఫలితాల మీద ICMR అనుమానాలు,

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ మొదలయింది.  దక్షిణ కొరియానుంచి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక విమానాంలో దిగుమతి చేసుకుంది.
ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను శుక్రవారం నాడు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ర్యాపిడ్‌ టెస్టింగ్ ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా సోకిన వ్యక్తిని గుర్తించవచ్చు. కొత్తగా లక్ష ర్యాపిట్‌ కిట్లు రావడంతో ఆంధ్రప్రదేశ్‌ కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. ఇన్‌ఫెక్షన్‌ ఉందా లేదా నిర్ధారించడమే కాకుండా ఇన్‌ఫెక్షన్‌ వచ్చి తగ్గినా సరే ఈ కిట్లు గుర్తిస్తాయి అని జగన్ కిట్లను ప్రారంభిస్తూ అన్నారు.
ర్యాపిడ్ టెస్ట్ కిట్ తో జగన్ (ఫోట్ : వైఎస్ ఆర్ కాంగ్రెస్)
ఈ కిట్లను వెంటనే జిల్లాలకుపంపించారు. జిల్లాలలో కొన్ని ఆసుపత్రులను  ఈ టెస్టింగ్ కు గుర్తించారు. రాష్ట్రంలో కరోనా ఇన్ ఫెక్షన్ తీవ్రంగా ఉన్న జిల్లాలలో  కర్నూలు ఒకటి. కర్నూలు జిల్లాలో  ఈ కిట్ల ద్వారా  రోజుకు సుమారు 300 ర్యాపిడ్ పరీక్షలను నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఒక ప్రకటన చేశారు. ఇదీ ప్రకటన
‘‘ఈ రోజు ఉదయం నుండి కర్నూలు, నంద్యాల, బనగానిపల్లె, ఆదోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రూనాట్ యంత్రాల ద్వారా కోవిడ్/కరోనా టెస్టింగ్ షురూ.కర్నూలు, నంద్యాల, బనగానిపల్లె, అదోనిలలో ట్రూనాట్ యంత్రాల ద్వారా రోజుకు 300 ల కోవిడ్ టెస్ట్ లు. కరోనా టెస్ట్ కోసం ఎవరూ నేరుగా వెళ్లకూడదు.స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ రెఫర్ చేసిన వాళ్లు మాత్రమే టెస్టింగ్ కు వెళ్ళాలి. ఈ రోజు నుండి కర్నూలు నగరం రెడ్ జోన్ ప్రాంతాల్లో కరోనా టెస్టింగ్ నమూనాల సేకరణ కోసం మొబైల్ బూత్ ఏర్పాటును పగడ్బందీగా పర్యవేక్షణ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, మునిసిపల్ కమీషనర్ ను ఆదేశించాం.’’
అధికారులు మాత్రం ఈ టెస్టుకు ఉన్న పరిమితులను పట్టించుకోకుండా అదేదో దివ్యౌషధం అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇక కొరియానుంచి వచ్చిన కిట్లను ఉపయోగించి రాష్ట్ర ప్రజల్లో కరోనా సోకిన వారందరని పట్టి బంధించి ఆసుపత్రికి తరలించి చికత్స చేస్తామన్నట్లు చెబుతున్నారు. దీనితో ఇకసమస్య పరిష్కారమువుతుందనే భ్రమ కల్గించే ప్రయత్నం ఆంధ్రలోజరుగుతూ ఉంది. అయితే,ఇలాంటి ప్రచారం చూసే దేశంలో కోవిడ్ – 19 మీద నిఘా వేసిన భారత వైద్య శాస్త్రాల పరిశోధనాసంస్థ ( ICMR) ర్యాపిడ్ టెస్టింగ్ కు ఉన్న పరిమితుల మీద  అన్ని రాష్ట్రాలకు వివరణ ఇచ్చింది. అందులో ముఖ్యమయిన విషయమేమంటే, ఈ పరీక్షలను వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. ఆసుపత్రులలో ల్యాబ్ టెక్నిషియన్లతో చేయించరాదు. మరి రాష్ట్రంలో ఇలాంటి నిఫుణులున్నారా? సరే ఇది వేరే విషయం. అసలు విషయానికి వద్దాం.
ర్యాపిడ్ టెస్ట్ ల కంటే, కోవిడ్ ఫ్రంట్ లైన్ టెస్టులు చాలా అసవరమని,  వాటికి బదులు గా ర్యాపిడ్ టెస్ట్ వాడటం పరిష్కారం కాదని ICMR చాలా స్పష్టంగా పేర్కొంది. కరోనా సోకిందా లేదా కనుగొనేందుకు బంగారు ప్రమాణం లాంటిది మోలెక్యులార్ టెస్ట్ (Real time PCR based Molecular Test) మాత్రమే నని పేర్కొంది. అంటే ఆంధ్రప్రదేశ్ చేస్తున్న పరీక్షలు కరోనా వ్యాప్తిని చూపించలేవనే కదా?
“The rapid antibody test cannot replace the frontline test.” అని ICMR డైరెక్టర్ జనరల్  ఫ్రొఫెసర్ బలరామ్ బార్గవ ఆంధ్రప్రదేశ్ తో అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు.  అనేక రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్టులను దివ్యాయుధంగా భావిస్తున్నందున తాజా గైడ్ లైన్స్  విడుదల చేయాలసి వచ్చిందని ఆయన స్పష్టంగా ఈ లేఖలో పేర్కొన్నారు.
లేఖలో పేర్కొన్న అతి ముఖ్యమయిన విషయాలు:
  1. ఒక నిర్ణీత ప్రాంతంలో కరోనా వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందనే విషయాన్ని అంచనా వేసేందుకు జరిపే పరీక్షలకు తోడుగా ర్యాపిడ్ టెస్టింగ్ పనికొస్తుంది.
  2. రోగ లక్షణాలు (symptoms) బయటపడిన ఏడు రోజుల తర్వాత మాత్రమే ర్యాపిండ్ టెస్టింగ్ పనికొస్తుంది.
  3. ఈ పరీక్షలు రోగ చరిత్రను, రోగ వ్యాప్తి మీద నిఘా వేసేందుకు మాత్రమే పనికొస్తాయి.
  4. ఈ పరీక్షలను వైద్య నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.
ర్యాపిడ్ టెస్టింగ్ ఫలితాల విశ్వసనీయత మీద మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, ప్రజారోగ్య హక్కుల వాది , రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఇఎఎస్ శర్మ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కు లేఖ రాశారు.
ర్యాపిడ్ టెస్టింగ్ పలితాలలో విశ్వసనీయత బాగా తక్కువ అని, దాని బలమయిన టెస్టింగ్ రియల్ టైం పిసిఆర్ పరీక్ష అని ఆయన అన్నారు. RT-PCR (Reverse Transcrition Polymerase Chain Reaction) పరీక్ష  విశ్వసనీయత కూడా 90 శాతమే నని, ఈపరీక్షలలో కూడా పది శాతం వైరస్ఇన్ ఫెక్షన్ అందకుండా తప్పించుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అలాంటపుడు ఇంకా తక్కువ విశ్వసనీయత ఉన్న ర్యాపిడ్ టెస్టింగ్ విధానం వల్ల ఎక్కువ మంది వైరస్ సోకిన వారు దొరకకుండా పోవచ్చని కూడా ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. 20 నుంచి 30 శాతం ఫలితాలుఈ పరీక్షలలో తప్పుకావచ్చని ఆయన పేర్కొన్నారు. RT-PCR పరీక్షల్లో కూడా 30 శాతం దాకా ఫలితాలు తప్పుగా ఉన్నందున స్పెయిన్  చైనానుంచి దిగుమతి చేసుకున్న ఈ కిట్లను చైనా కే వాపసు పంపించిందని డాక్టర్ శర్మపేర్కొన్నారు. ర్యాపిడ్ టెస్టింగ్ మీదే పూర్తిగా ఆధార పడటం వల్ల మనం దారి తప్పే అవకాశం ఉందని హెచ్చరించారు.
Considering the accuracy level of rapid testing, depending exclusively on it can be misleading. In the case of COVID19 which seems to be highly contagious, over-caution should be preferred to under-caution: Dr EAS Sarma
Dr EAS Sarma కేంద్ర మంత్రికి రాసిన ఈ లేఖను చదవాలను కుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://trendingtelugunews.com/english/features/dr-eas-sarma-cautions-about-rapid-coronvirus-testing/

 

ఒంగోలు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు  డాక్టర్  రాఘవ గుండవరపు కూడా  ర్యాపిడ్ టెస్ట్ ప్రయోజనం పరిమితమయిందేనని వ్యాఖ్యానించారు.
ఆయన ఈ మధ్య The Lede తో ప్రతినిధితో మాట్లాడుతూ భారీ ఎత్తున, తక్కువ ఖర్చతో పరీక్షించేందుకే పనికొస్తాయని, ఈ ఫలితాల నమ్ముకుని కరోనా వ్యాప్తి మీద నిర్ధారణకు రావడం సాధ్యం కాదని అన్నారు. ఈ పరీక్షల్లో చాలా తప్పుడు నెగటివ్ (false negative), తప్పుడు పాజిటివ్ (false positive) వస్తాయని ఈ రెండుప్రమాదకరమయినవే నని అన్నారు. ఫాల్స్ నెగెటివ్ వచ్చిందని ఎవరినైన వదిలేస్తే, అతను వ్యాధిని ఇతరులకు అంటించే ప్రమాదం ఉందని, అలాగని ఫాల్స్ పాజిటివ్ కేసులు ఎక్కువయిన ప్రజలు అనవరసంగా ఆందోళన చెందుతారని అన్నారు.
“… they are less reliable. More false-negative or false-positive results can occur in the rapid test. False-negative means, even if the person is infected with the virus, the test comes negative. If we let this false-negative person into the community, he can spread the virus to more people. As opposed to this, if false positive reports are higher, then we are going to create panic in the society,” అని హెచ్చరించారు.