కేంద్ర పాలిత ప్రాంతాలెట్లా ఏర్పడ్డాయి… రాష్ట్రాలుగా ఎలా మారాయి?

కేంద్రం ప్రభుత్వం  జమ్మూ-కశ్మీర్ రాష్టం హోదాను రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని జమ్ము-కశ్మీర్, లద్దాఖ్‌ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాలని ప్రతిపాదించింది.దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటు ఆమోదించింది.
ఇందులో జమ్మూ-కశ్మీర్ చట్టసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్ధాఖ్ చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటాయని పార్లమెంటులో ఈ బిల్లులను ప్రతిపాదిస్తూ హోం మంత్రి అమిత్ షా చెప్పారు.
దీనితో దేశంలో ఇపుడు 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి.

https://trendingtelugunews.com/gold-silver-prices-explode-to-scale-up-record-high/

నిజానికి ఈ ఫిబ్రవరిలో లద్దాఖ్ ను కాశ్మీర్ నుంచి విడదీసి ప్రత్యేక రెవిన్యూ డివిజన్ గా మార్చారు. దీనితో లద్దాఖ్ కు ఒక కలెక్టర్ (డివిజనల్ కమిషనర్ ), ఒక పోలీస్ ఇన్ స్పెక్టర్ జనరల్ నియమితులయ్యారు. దీని ఫలితంగా జమ్ము-కాశ్మీర్ మూడు డివిజన్ల రాష్ట్ర మయింది. అవి జమ్ము, లద్దాఖ్, కశ్మీర్ లు. ఇపుడు లద్దాఖ్ ఏకంగా కేంద్రం పాలిత ప్రాంతమవుతూ ఉంది.
అంతర్గత భద్రత, సీమాంతర ఉగ్రవాదాన్ని దృష్టిలో పెట్టుకొని జమ్మూ-కశ్మీర్ ఇలా రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చినట్లు అమిత్ షా తెలిపారు.

https://trendingtelugunews.com/sushma-made-twitter-her-office-last-tweet/

అయితే, ఒక వైపు కేంద్ర పాలిత ప్రాంతాలు (యూనియన్ టెరిటరీస్ UT)రాష్ట్రాల హోదా కోరుతూ ఉన్నపుడు కేంద్రం మరొక రెండు యుటిలను సృష్టించడం విశేషం.
నిజానికి, తెలంగాణ ఉద్యమ సమయంలో కొంతమంది హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేసినపుడు,  యూనియన్ టెరిటరీలను ఇక ముందు సృష్టించేది లేదని  అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇపుడేమో యుటిల సంఖ్యను ఇప్పటి ప్రభుత్వం పెంచింది.
కేంద్రపాలిత ప్రాంతం అంటే ఏమిటి?
మన రాజ్యంగా నిర్మాతాలు కేంద్ర పాలిత ప్రాంతాల గురించి ఆలోచించలేదు. భారత దేశమంటే రాష్ట్రాల సమాహారం అనుకున్నారు. అయితే, కేంద్ర పాలిత ప్రాంతాల అవసరం రాజ్యాంగాన్ని ఆమోదించాక వచ్చింది. యూనియన్ టెరిటరీస్ అనే మాట ఒరిజినల్ రాజ్యాంగంలో లేదు.
ఏడవ రాజ్యంగ సవరణ ద్వారా 1956లో ఈ మాటని రాజ్యాంగానికి చేర్చారు.
స్వాతంత్య్రం వచ్చే నాటికి ఇండియాలో ఉన్న వివిధ పరిపాలన ప్రాంతాల స్వరూపాన్ని భారతదేశాన్ని  నాలుగు రకాల ప్రాంతాలుగా విభజించారు. అవన్నీ క్రమంగా రాష్ట్రాలుగా మారడం ఇంతవరకు సాగుతూ వచ్చిన పరిణామం. ఈ నాలుగు రకాల ప్రాంతాలు ఏవంటే…
పార్ట్ ఎ ప్రాంతాలు : ఇవన్నీ 9 ఒరిజినల్ రాష్ట్రాలు. ఇవి బ్రిటిష్ ఇండియాలో ప్రావిన్సెస్ గా ఉండేవి. వీటికి ఎన్నికయిన అసెంబ్లీలుంటాయి.రాష్ట్రపతి నియమించే గవర్నర్ ఉంటారు. ఇవి అస్సాం, బీహార్, బాంబే,మధ్య ప్రదేశ్, మద్రాస్, ఒరిస్సా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్.
పార్ట్ బి ప్రాంతాలు: ఇవన్నీ 9 సంస్థానాలు. రాజప్రముఖులు వీటిని పాలించేవారు. ఇవి హైదరాబాద్, జమ్ము-కాశ్మీర్, మధ్య భారత్, మైసూర్, పటియాల తూర్పు పంజాబ్ రాష్ట్రాల యూనియన్ (PEPSU), రాజస్థాన్, సౌరాష్ట్ర, ట్రావన్కోర్ -కొచ్చిన్,వింధ్య ప్రదేశ్.
పార్ట్ సి ప్రాంతాలు: ఇవి 10 చిన్న సంస్థానాలు. ఇవి చీఫ్ కమిషనర్ పాలనలో ఉండేవి. అవి: అజ్మీర్,కూర్గ్, కూచ్ బెహార్, భోపాల్, బిలాస్ పూర్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కచ్, మణిపూర్, త్రిపుర,
పార్ట్ డి ప్రాంతం ఒక్కటే. అది అండమాన్ నికోబార్ ద్వీపాలు.  ఇదే యూనియర్ టెరిటరీ (UT) . దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ ఉండేవాడు. 1956లో వచ్చిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంతో వీటి హోదాలు మారిపోయాయి.
1949 లో రాజ్యాంగాన్ని ఆమోదించినపుడు భారతదేశంలో ఒకే ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఉండేది. అదే అండమాన్ నికోబార్ దీవులు.
ఆ తర్వాత, ఢిల్లీ దేశ రాజధాని పాలన ప్రాంతం , చండిగడ్ , లక్ష ద్వీప్ లను అంతకు ముందున్న రాష్ట్రాలనుంచి విడదీసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు.
గోవా, దాద్రా, నగర్ హవేలి, డామన్ , డయూ,పాండిచ్చేరి లను ఇరత దేశాల ఎలు బడి నుంచి వెనక్కి తీసుకుని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది. ఇందులో పాండిచ్చేరి ఫ్రెంచ్ వారి నుంచి వచ్చింది. మిగతావి పోర్చుగీసు వారి నుంచి సైనిక చర్య ద్వారా వెనక్కులాక్కున్నవి.
కేంద్ర పాలిత ప్రాంతమంటే అక్కడి పరిపాలన నేరుగా కేంద్ర ప్రభుత్వం సాగిస్తుందని అర్థం. ఇపుడు ఈ జాబితాకు జమ్ము-కాశ్మీర్, లద్దాఖ్ లను చేర్చితే తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలవుతాయి.
ఇది కూడా చదవండి
నెహ్రూ, షేక్ అబ్దుల్లా దాగుడుమూతలు, కాశ్మీర్ కుట్ర కేసు గురించి తెలుసా?
యుటి లు రాష్ట్రాలుగా మారిన వైనం…
కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక విచిత్రమయిన చరిత్ర ఉంది. కేంద్రం సృష్టించిన కేంద్ర పాలిత ప్రాంతాలో కొన్ని రాష్ట్రాలుగా మారిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని ప్రాంతాలు రాష్ట్రాలుగా కావాలని కోరుతున్నాయి.
కేంద్ర పాలిత ప్రాంతాలు ఎలా ఉండే వి ఎలా రాష్ట్రాలయ్యయో చూద్గాం.
అస్సాం-మేఘాలయ తప్ప ఈశాన్య భారతంలోని రాష్ట్రాలన్నీ మొదట కేంద్ర పాలిత ప్రాంతాలుగానే ఉండేవి. అక్కడ రాష్ట్రాలు ఏర్పడటం  నాగాలాండ్ తో మొదలయింది. మొదట అస్సాంలో భాగంగా ఉన్న నాగాలాండ్ ను మొదట కేంద్ర పాలిత ప్రాంతం చేశారు. అయితే, అక్కడిప్రజలు రాష్ట్రం హోదా కోరడంతో నాగాలాండ్ ఈశాన్యంలో రెండో రాష్ట్రంగా అవతరించింది.
మణిపూర్, త్రిపురలు చాలా కాలం యుటిలుగా నే కొనసాగాయి.అరుణా చల్ ప్రదేశ్ నార్త్ ఈస్ట్ ప్రాంటియర్ ప్రావిన్స్ (NEFA) గా ఉండింది.భౌగోళికంగా అస్సాంలో భాగంగానే ఉన్నా,పాలనాపరంగా  ఇది విదేశీ వ్యవహారాల శాఖ అదుపులో ఉండింది.
1962లో చైనా యుద్ధం తర్వాత హోం శాఖ కు బదిలీ అయింది.
మేఘాలయ యుటి కాకుండానే  నేరుగా 1972లో రాష్ట్రం అయింది.
1971-72ల మధ్య మణిపూర్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ లో రాష్ట్రాలయ్యాయి. ఇవి పార్ట్ సి ప్రాంతాల జాబితాలో చేరాయి.
1949లో మణిపూర్ కు అసెంబ్లీ ఉండినా,దానిని  రద్దు చేసి చీఫ్ కమిషనర్ పాలనలోకి తీసుకువచ్చారు. 1956లొ యుటి అయింది. 1971లో పూర్తి స్థాయి రాష్ట్రమయింది.
త్రిపుర కూడా 1949లో భారత్ లో విలీన మయింది. కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగి చివర మణిపూర్, మేఘాలయలతో కలసి జనవరి 21, 1972న రాష్ట్రమయింది.పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఈ మార్పు జరిగింది.
1980 దశకంలో మరొక వర్గం కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాలయ్యాయి. అవి, గోవా, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. ఇందులో గోవా, డామన్ ,డయు లను పోర్చుగీస్ వారి నుంచి వెనక్కు లాక్కుని మొదట యుటి చేసి తర్వాత రాష్ట్రం చేశారు.డిసెంబర్ 18 నుంచి మే 30,1987 దాకా ఇది కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. 1987లొో గోవాలను మాత్రం రాష్ట్రం చేసి, మిగతా వాటిని కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగిస్తున్నారు. అపుడే  అస్సాం నుంచి  విడదీసి మిజ్రోరాం, అరుణాచల్ ప్రదేశ్ లను కూడా రాష్టాలుగా మార్చారు.
యుటిలు కేంద్ర పాలిత ప్రాంతాలు కావడమేనేది ఇపుడు సాగుతున్న పరిణామం. అయితే, కేంద్రం రాష్ట్రం హోదా తీసేసి రెండు ప్రాంతాలను యుటిలుగా మార్చింది. అదే విశేషం.