రాయలసీమ తొలినాళ్ల మేటి పత్రిక ‘శ్రీ సాధన’ వెలుగులోకి వచ్చిన విధానం

రాయలసీమలో తొలి నాళ్ల పత్రికల్లో పేరెన్నిక గన్నది శ్రీ సాధన. ఇది వార పత్రిక. తొలిసంచిక 1926, ఆగస్టు 14 న విడుదలయింది. ఆరోజులో ప్రజల స్థితిగతులను వెలుగులోకి తెచ్చేందుకు తీసుకువచ్చిన ఈ పత్రికకు పప్పూరు రామాచార్యులు సంపాదకులు. ఆ రోజుల్లో పినాకిని, మాతృసేవ, బాల భారతి వంటి పత్రికలొచ్చినా,అవి ఎక్కువ కాలం సాగలేదు. 12 పేజీల శ్రీ సాధన లో,  ఈ రోజు పత్రిలకు ధీటుగా శీర్షికలుండేవి. ప్రపంచ వ్యార్తలు,స్థానిక వార్తలు, వ్యాఖ్యలు, తత్వశాస్త్రం, పుస్తక సమీక్షలు, లోతైన పరిశోధనాత్మక వ్యాసాలు  వంటి వాటితో శ్రీసాధన ఒక సంపూర్ణ పత్రికగా నడిచింది. 1926 ఆగస్టు 25 తేదీ సంచికలో పిఎల్ నరసింహం ‘సుగాలీ’ ల మీద Social Anthropology వ్యాసం రాస్తూ ఒక ఆసక్తికరమయిన సిద్ధాంతం చెప్పారు. సుగాలీ అనే మాట సుగ్రీవ, వాలి అనే మాటల నుంచి వచ్చిందని చెప్పారు. అంతేకాదు,దీనికి సాక్ష్యంగా ఆయన సుగాలీలలో ఉన్న సంప్రదాయాన్ని ఉదహరించారు.సుగాలీలలొ అన్న చనిపోయినపుడు భార్య మరిదిని పెళ్లిచేసుకోవచ్చు. అన్న పిల్లలను వ్యత్యాసం తో చూసే పద్ధతి కూడాఇలాంటి పెళ్ళిళ్లో లేదని ఆయన రాశారు.
1927 జనవరి 15వ సంచికలో ‘సీడెడ్  జిల్లా’లలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలలో కరువు గురించిన వ్యాసం ఉంది. ఈ సంచికలో టేకూరు సుబ్రహ్మణ్యం కరువు మీద సంపాదకీయం రాశారు. కరువు మీద పప్పూరు రామచార్యులు  గణాంక వివరాలతో రాసిన వ్యాసం గొప్ప విశ్లేషణ. ఇలా శ్రీసాధన సంచికలు రాయలసీమ ఆధునిక చరిత్ర, రాయలసీమలో జాతీయోద్యమం , రాయలసీమ జర్నలిజం తెలుసుకునేందుకు పనికొచ్చే  విలువయిన ప్రత్రాలు. శ్రీసాధన పత్రిక ప్రతులను చదవాలనుకునే వారికోసం  డాక్టర్ తవ్వా వెంకటయ్య  ల్అందిస్తున్నారు.
(డా.తవ్వా వెంకటయ్య)
నా పరిశోధన లో నాకు తెలిసిన విషయాలు మాత్రమే ఇక్కడ పొందుపరుస్తున్నాను. ‘శ్రీ సాధన’ పత్రికను  ప్రారంభించి సంపాదకత్వం వహించింది పప్పూరు రామాచార్యులు. ఆయన తదనంతరం పత్రిక భాధ్యత ఆయన కుమారుడు పప్పూరి శేషాచార్యులు తీసుకున్నారు.
ఆయన తర్వాత ఆ పత్రికను బాధ్యతగా నడిపి వారు లేకపోవడంతో ఆయన శ్రీ సాధన పత్రికలను “లలిత కళా పరిషత్ అనంతపురం” వారికి అప్పజెప్పాడు.
అవి అక్కడే కొంతకాలం ఉన్న తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిజిపి గా పనిచేసిన శ్రీ రొద్దం ప్రభాకర్ అనంతపురం జిల్లా పైన ఉన్న అభిమానంతో వాటిని వెలుగులోకి తీసుకురావాలని సంకల్పించారు. అంతే కాకుండా వాటిని డిజిటలైజేషన్ చేసి భావితరాల పరిశోధనకు ఉపయోగపడేలా భద్రపరిస్తే బాగుంటుంది అని అనుకున్నారు.
వెంటనే ఆయన అప్పటి ప్రెస్ అకాడమీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు తో మాట్లాడి అనంతపురంలోని లలితా కళా పరిషత్తు లో ఉన్న శ్రీ సాధన పత్రికలను లలిత కళా పరిషత్ కార్యదర్శి ఏ. నరసింహమూర్తి , సహాయ కార్యదర్శి అమళ్ళదిన్నే గోపీనాథలతో మాట్లాడి శ్రీ సాధన మూల ప్రతులను ప్రెస్ అకాడమీ వారి కి పంపించాడు.
వారు వాటిని డిజిటైజేషన్ చేశారు. సిడిలుగా రూపొందించి వాళ్ల దగ్గర కొన్ని కాపీలు ఉంచుకొని రొద్దం ప్రభాకర్ కి సిడీలను పంపించారు.
ఈ విధంగా మొట్టమొదటిగా ‘శ్రీసాధన’ పత్రికలను వెలుగులోకి తీసుకుని వచ్చింది రొద్దం ప్రభాకర్ .
కొంతకాలం తర్వాత అనంతపురం జిల్లాకు చెందిన V.K రంగారెడ్డి గారు అనంతపురం జిల్లా స్వాతంత్ర చరిత్ర గురించి తెలుసుకోవాలని శ్రీసాధన పత్రిక గురించి ఆరా తీశాడు.
అప్పుడు ఆయనకు శ్రీ సాధన పత్రిక C.D లు రొద్దం ప్రభాకర్ దగ్గర ఉన్నాయనే తెలిసింది. కానీ ఆయనతో రంగారెడ్డి గారికి పరిచయం తక్కువగా ఉండటంతో, అయనతో పరిచయం ఉన్న శ్రీ రమేష్ నారాయణని, కైప నాగరాజు  తో సంప్రదించాడు.
రమేష్ నారాయణ చొరవ తీసుకుని శ్రీ రొద్దం ప్రభాకర్ తో మాట్లాడి శ్రీ సాధన పత్రికల కు సంబంధించిన సీడీలను చెప్పించుకున్నాడు వాటిని ముగ్గురు వ్యక్తులకు అందించాడు
ఒకటి V.K రంగారెడ్డికి , మరొకటి తన సనిహితుడు కైప నాగరాజు కి ఇంకొకటి జెన్నే ఆనంద్ కుమార్ కి ఇచ్చాడు.
జెన్నే ఆనంద్ కుమార్ ఒక అడుగు ముందుకు వేసి సీడీల రూపంలో ఉన్న శ్రీ సాధన 14 సంపుటాలను జిరాక్స్ తీసి ఒక సెట్ సి పి బ్రౌన్ గ్రంథాలయం కడప వారికి, ఇంకొక సెట్ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి అందించాడు.
సంక్షిప్తంగా చెప్పవలసి వస్తే శ్రీ సాధన పత్రిక ఈ విధంగా వెలుగులోకి వచ్చింది.
పప్పూరి శేషాచార్యులు నుండి లలిత కళా పరిషత్ అనంతపురం కు అటు నుండి రొద్దం ప్రభాకర్  ఏ. నరసింహమూర్తి, అమళ్ళదిన్నె గోపీనాథ్  తీసుకుని వాటిని పొత్తూరు వెంకటేశ్వరరావు కు పంపాడు. తిరిగి డిజిటైజేషన్ తర్వాత సీడీల రూపంలో ప్రభాకర్  దగ్గరికి వచ్చాయి.
ప్రభాకర్ గారి నుండి రమేష్ నారాయణ  తీసుకున్నారు.
రమేష్ నారాయణ  1) వీకే రంగారెడ్డి కి
2)కైప నాగరాజు కి 3)జెన్నే ఆనంద్ కుమార్ కి పంపబడ్డాయి.
ఈ విధంగా శ్రీసాధన పత్రికను వెలుగులోకి తీసుకుని వచ్చిన గొప్ప వాళ్ళను జ్ఞాపకం చేసుకోవడం భావితరాలకు వారి కృషిని అందించడం కనీస బాధ్యతగా భావిస్తున్నాను.
ఈ విషయం పట్ల మరింత సమగ్ర సమాచారం కోసం ఏడు పదులు దాటిన రమేష్ నారాయణ  అందుబాటులో ఉన్నారు. ఆయనను ప్రదించవచ్చు
ఆయన ఫోన్ నెంబర్: 9441383888, 9494221356

(డాక్టర్ తవ్వా వెంకటయ్య, రాయలసీమ కథా సాహిత్య పరిశోధకుడు, కడప జిల్లా)