Home Features బంగారు ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయ్?

బంగారు ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయ్?

838
5
SHARE
బంగారానికి నిజంగా నిన్న రెక్కలొచ్చాయి.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. నిన్న ముంబై మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం ధర రు.1263 పెరిగి రు. 38,070 కు చేరింది. బంగారు బాటలోనే నడుస్తూ వెండి ధర కూడా రు.650 పెరిగి కిలో ధర రు.43,920కి చేరింది.
ఈ ట్రెండ్ చూస్తే  బంగారు ధర పది గ్రాములు రు. 50వేల కుచేరుకున్నా ఆశ్చర్యం లేదనిపిస్తుంది.
 ప్రపంచంలోని అన్ని దేశాలు తిరోగమనంలో ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల మధ్య పరిస్థితి మెరుగుపడి మామూలు స్థాయికి వస్తుందని నిపుణులెవరూ చెప్పలేకపోతున్నారు. ఈ పరిస్థితి మీద ఆర్థిక వేత్త డాన్ స్టీన్ బాంక్ South China Morning Post లో క్లుప్తంగా చెప్పారు.

‘Eventually, risks to the global outlook overshadow world economic growth, which could linger at 2-2.5 per cent or worse. World trade and investment plunges. Migration crises abound. The number of which has exceeded World War II figures since the mid-2010s, soars to record highs. A series of new geopolitical conflicts prove harder to contain.’

సరిగదా 2008 నాటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఇది గుర్తుకు తెస్తున్నదని అంటున్నారు.
నిన్న 99.9 శాతంప్యూర్ గోల్డ్ ధర రు. 1113 పెరిగి పది గ్రాముల ధర 37,920 లకు చేరితే, 99.5 శాతం ప్యూర్ గోల్డ్ ధర 1115 పెరిగింది.

హైదరాబాద్ లో ఇళ్ల అద్దెలు పెరుగుతున్నాయ్…ఎందుకో తెలుసా?

పదిగ్రామల ధర రు. 37,750 కి చేరింది. ప్యూచర్ల మార్కెట్లో కూడా బంగారు ధర రికార్డు స్థాయికి చేరింది.
మల్టీ కమోడిటీ ఎక్ఛేంజి (MCX) లో అక్టోబర్ కాంట్రాక్ట్ ధర పదిగ్రాములకు రు. 38,070 కు చేరింది. అంతకు ముందు రు.37,956 ట్రేడవుతూ ఉండింది.
అంతర్జాతీయంగా గోల్డ్ ఫ్యూచర్స్ ధర 1.2 శాతం పెరిగి అరేళ్లకిందట ఒక సారి చేరుకున్న ధర ఔన్స్ 1500 డాలర్లకు చేరువయింది. అపుడు ఔన్స్ ధర 1502 డాలర్లుండింది.
వెండిధర 13నెలల కిందటి ధర స్థాయికి అంటే ఔన్స్ ధరు 17.50డాలర్లకు చేరింది.. సింగపూర్ లో స్పాట్ ధరలు 2.2 శాతం పెరిగి ఔన్స్ 16.8082 డాలర్లకు చేరింది.
ఇది కూడా చదవండి: చెట్లు కూలిన బాధ: సిఎంను కదలించిన మణిపూర్ అమ్మాయి కంటతడి
బుధవారం మధ్యాహ్నానికి ట్రేడర్లు ఇన్వెస్లర్లు గందరగోళంలో పడ్డారు. ఎందుకంటే గవర్నమెంట్ బాండ్లు యూజ్లెస్ అని తెలిపోయింది. వాటి మీద రాబడి పడిపోయింది. అందువల్ల అక్కడి నుంచి డబ్బు తీసేసుకుని మరొక సురక్షిత మయిన దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి.  దీనితో సురక్షితమయిన మార్గం వైపు పరిగెత్తుతున్నారు. ఈ మార్గం బంగారమే. అందుకే  బంగారు భారత దేశంలోనే కాదు, ప్రపంచమంతా  ఆక్షణీయంగా మారింది.
అంతా బంగారులో ఇన్వెస్ట్ చేయడం (Exchange-Traded Funds ETF) మొదలుపెట్టారు.
ఫలితంగా  డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ల ధర ఔన్స్ ధర 32.60 డాలర్లు పెరిగి 1517 డాలర్లకు చేరింది. సెప్టెంబర్ కామెక్స్ లో వెండిఔన్స్ ధర 0.68 డాలర్లు పెరిగి 17.13 డాలర్లకు చేరుకుంది.
కారణాలివి
ఇలా పరిస్థితి విషమించడానికి కారణం అమెరికా- చైనా ట్రేడ్ వారే నంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచదేశాల ఆర్థిక ప్రగతి నెగెటివ్ లో పడిపోయింది. దీనితో ప్రపంచ ప్రభుత్వాల బాండ్లు పాతాళనికి పరుగు పెడుతున్నాయని కిట్కో లో జిమ్ వేకాఫ్  వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోని రిజర్వు బ్యంకులన్నీ తమ మానెటరీ పాలసీలను సడలించుకుని వడ్డీరేట్లను తగ్గిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
న్యూజిలాండ్, ఇండియా, థాయ్ లాండ్ లు ఇప్పటికే వడ్డీరేట్లను బుధవారం నాడు తగ్గించాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వు కూడా ఇదే పనిచేయక తప్పదనే వూహాగానాలు మొదలయ్యాయి.
అనుకున్నట్లుగా చైనా కరెన్సీ విలువ తగ్గించింది. డాలర్ మారకం విలువను 7 కంటే తగ్గించింది. ఇపుడు యువాన్ మారకం విలువ డాలర్ కు 6.9996 యువాన్లు మాత్రమే.
పదకొండేళ్ల తర్వాత ఇది జరిగింది. చైనా ఈ పనిచేసిందని ట్రంప్ కు కోపమొచ్చి చైనాని ‘కరెన్సీ మానిప్యులేటర్’ అని తిట్టేశాడు.
 యూరోప్ లో కూాడా బాండ్ల మీద రాబడి పడిపోయింది. జర్మన్ బాండ్ (bund) బుధవారం నాడు రికార్డు స్థాయికి పడిపోయింది.
ఇది 2008 నాటి సంక్షోభాన్ని గుర్తు చేస్తూ ఉందని కొంతమంది మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
బంగారు ఔన్స్ ధర ఇంకా పెరిగి  పెరిగి 2000 డాలర్లవుతుందని అంతర్జాతీయ గోల్డ్ ట్రెండ్స్ నిపుణుడు జెరాల్డ్ సెలెంటి చెబుతున్నారు.
భారత దేశానికి వస్తే రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్ల (repo rates)ను 35 బేసిస్ పాయింట్లను తగ్గించింది. రెపో రేట్ అంటే రిజర్వు బ్యాంక్ కమర్షియల్ బ్యాంకు ఇచ్చే రుణాల మీద విధించే వడ్డీరేటు.ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు రిజర్వు బ్యాంకు రెపోరేట్ ను వాడుతూ ఉంటుంది.ఇన్ ఫ్లేషన్ పెరిగినపుడు రిజర్వు బ్యాంకు రెపోరేట్ ను పెంచి బ్యాంకులు అతిగా రుణాలు తీసుకోకుండా కట్టడి చేస్తాయి. అపుడు మనీ సర్క్యులేషన్ తగ్గిపోయిన ఇన్ ఫ్లేషన్ తగ్గుతుంది.
రెపో రేట్లను బుధవారం రిజర్వు బ్యాంకు 34 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

 

Comments are closed.