లాల్ బహదూర్ శాస్త్రి మొదట రాజీనామా చేసింది జడ్చర్ల వల్లే…అసలు కథ ఇదీ

నైతిక బాధ్యత మీద మంత్రి పదవులకు రాజీనామా చేయడమనేది అంతరించి పోయిన సంప్రదాయం.
ఇండియాలో ఇపుడు మంత్రులెవరూ ఏదైనా అవినీతి ఆరోపణ వచ్చినపుడో,  కోర్టు మొట్టిక్కాయలు వేసినపుడో లేదా రైలు ప్రమాదాలు జరిగినపుడో  రాజీనామా చేసే స్థితిలో లేరు.
పూర్వం ఇదొక సంప్రదాయంగా ఉండింది. మాటపడటం వాళ్లకు నచ్చేది కాదు. అందుకే ఎవరైనా వేలెత్తి చూపేలోపే రాజీనామా చేసేవారు.లాల్ బహదూర్ శాస్త్రి రైల్లే మంత్రిగా రెండు ప్రమాదాాలు జరగ్గానే రాజీనామా చేశారు. నిజానికి ఆరోజు ఎవరూ మంత్రిరాజీనామా చేయాలని అడగలేదు. సరిగదా, ఆయన రాజీనామాను ఆమోదించడానికి వీల్లేదని ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మీద వత్తిడి తెచ్చారు.
Hassan Diab / Wikipedia
ఇపుడీవిషయం ఎందుకుచర్చనీయాంశమయిందంటే లెబనాన్ ప్రధాన మంత్రి హసన్ దయాబ్ రాజీనామా చేశారు. వారం రోజుల కిందట రాజధాని బీరూటో లో ఓడ రేవుసమీపంలో నిల్వ చేసిన 2700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ డిపోలో పేలుడు సంభవించి 160  మంది మాడి మసైపోయారు. 6000 మంది గాయపడ్డారు.లక్షలాది మందినిరాశ్రయులయ్యారు.
ఇందులో ప్రధాని రాజీనామాచేసేందుకేమీ లేదు. అయితే, ఈ డిపోలో అరేళ్లుగా అమ్మోనియం నేట్రేట్ మూలుగుతూ ఉంది. ఎందుకిలా మూలుగుతూ ఉంది? దీన్నెందుకు తరలించలేదని పరిశీలిస్తే, ఇందులో చాలా అవినీతి ఉందని,అందులో రాజకీయనాయకులున్నారని ప్రధాని దయాబ్ కనుగొన్నారు. బహాశా ఇందులో పెద్ద పెద్దవాళ్ల హస్తాలు కనిపించాయేమో,వెంటనే ఆయన ప్రేలుడుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.
భగవంతుడా లెబనాన్ ని నువ్వు కాపాడాలి అని ప్రకటించి ఆయన రాజీనామా చేశారు. ఆయన స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు. అమెరికా యూనివర్శిటీ ప్రొఫెసర్. ఈ పదవి బాధ్యతలు చెపట్టే కొయలిషన్ ప్రభుత్తాన్నినడిపేందుకే ఇక్కడి వచ్చారు. అయితే, ఈ అవినీతి చూసి దిమ్మతిరిగి ఈ దేశాన్ని కాపాాడటం తన వల్ల కాదని ఆయన రాజీనామా చేశారు.
రాజీనామా గురించి ఆయన టివిలో బ్రీఫ్ గా ఒక ప్రకటన చేశారు. తనకు ముందు అధికారంలో ఉన్న వాళ్లు దేశాన్ని ఎంత భ్రస్టు పట్టించారో ఆయన చెప్పారు. అందుకే రాజకీయనేతల్లో కరప్షన్ గురించి చూసి ఆయన మనసు చివుక్కుమంది.  ఈ భూకంపం రాజకీయ నాయకుల అవినీతి వల్లే జరిగిందని ఆయన గమనించారు.
ఆయన ఏమన్నారంటే, “ I have discovered that corruption is bigger than the state and that the state is paralyzed by this (ruling)clique and cannot confront it or get rid of it. …They should have been ashamed of themselves because their corruption is what has led to this disaster that had been hidden for years.”
ఇలాంటిది భారతదేశంలో జరుగుతుందా అనే చర్చ ఇక్కడి మీడియాలో లేచింది.
భారతదేశంలో పూర్వం ఇలాంటి సంఘటనలు జరిగేవి.  రైలు ప్రమాదం జరిగిందని, పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చనిపోయారని   రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఆవేదన చెంది  మంత్రి పదవికి రాజీనామా చేశారు.భారతదేశంలోనైతిక బాధ్యతతో రాజీనామా చేసిన  తొలి రైల్వే మంత్రి అయనే.
ఈ రైలు ప్రమాదం నవంబర్ 23, 1956న తమిళనాడులోని అరియలూర్  వద్ద జరిగింది. మారతైయ్యార్ నదిలో వరదల వల్ల అరియలూర్-కల్లగం మధ్య ఉన్న బ్రిడ్జి మునిగిపోవడం, బ్రిడ్జికట్ట తెగిపోవడంతో ప్రమాద జరిగింది. ఇందులో 144  మంది దాకా చనిపోయారు. దీనికి నైతిక బాధ్యత వహించి శాస్త్రి రాజీనామా చేశారు. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాజీనామా ఆమోదించారు.
జడ్చర్ల రైలు ప్రమాదం
అయితే, శాస్త్రీ రాజీనామా చేయడం అది మొదటి సారి కాదు. అంతకు ముందు కూడా ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగినపుడు  రాజీనామా చేశారు. ఆ రైలు ప్రమాదం హైదరాబాద్ రాష్ట్రంలో జరిగింది. ఈ ప్రమాదం అరియలూర్  ప్రమాదానికి కేవలం రెన్నెళ్ల ముందు 1956 సెప్టెంబర్ 2 జరిగింది.  సికిందరాబాద్-ద్రోణాచలం (డౌన్ 565) ఎక్స్ ప్రెస్ కు  జడ్చర్ల-మహబూబ్ నగర్ మధ్య ఈ ప్రమాదం జరిగింది.  అర్థరాత్రి ఒంటి గంట సమయంలో భారీ వర్షం కురుస్తున్నపుడు ఈ ప్రమాదం జరిగింది.ప్రమాదంలో 112 మంది చనిపోయారు. అపుడిది సింగిల్ లైన్ . మీటర్ గేజ్. ఇక్కడి కి సమీపంలోని పొచాని కుంట చెరువు నిండిపోయి  ఈ కాలువలోకి వరద వచ్చింది. నిజానికి అప్పటికి మూడు గంటల ముందు ఒక గూడ్సు ట్రెయిన్ సురక్షితంగా బ్రిడ్జి మీది నుంచి వెళ్లింది. అయితే, ట్రెయిన్ 565 మాత్రం ప్రమాదంలో చిక్కుకుంది, రైలుప్రయాణిస్తున్నపుడు బ్రిడ్జి కూలిపోయింది, అని డిప్యూటి రైల్వే మంత్రి అలగేశన్ లోక్ సభలో చెప్పారు. ప్రమాదంలో సుమారు 34 మంది గాయపడ్డారు. ప్రత్యేక రైలు నడిపి మృతులను తీవ్రంగా గాయపడిన వారిని కాచీగూడ తీసుకువచ్చారు.  ఈ రైలు తెల్లవారు జామున 0.45 నిమిషాలకు జడ్చర్ల  వదిలింది.

అంతకు ముందుకూడా వరదల వల్ల బ్రిడ్జి దెబ్బతినింది.  అపుడు రిపేర్లు చేశారు. బ్రిడ్జి సురక్షితమయిన అధికారులు ప్రటించారు.  కొద్ది రోజులు బ్రిడ్జి మీద రైళ్ల స్పీడ్ కూడా తగ్గించారు. ఈ ప్రమాదం జరగడానికి కొద్ది రోజులు ముందే రైళ్ల స్పీడ్ గంటకు  40 మైళ్లకు  పునరుద్ధరించారు.
ఈ ప్రమాదం జరిగిన సమాచారం జరగ్గానే లాల్ బహదూర్ శాస్త్రి, రైల్వే బోర్డు  ఛెయిర్మన్ తో కలసి జడ్చర్చకు వచ్చారు. అందువల్ల మరుసటి రోజు లోక్ సభలో ఈ విషయంలో పెద్ద చర్చ జరిగింది. రైల్వే డిప్యూటీ మంత్రి అలగేశన్ ప్రమాదం  వివరాలు అందించారు. ఈచర్చలో కాకినాడ ఎంపి డాక్టర్ రామారావు, గుల్బర్గా ఎంపి స్వామి రాామానంద తీర్థ, ఖమ్మం ఎంపి టిబి విఠలరావ్ తో పాటు సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్ గుప్తా వంటి వారు పాల్గొన్నారు. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా సుధీర్ఘమయిన వివరణ ఇచ్చారు.
 ప్రమాద స్థలాన్ని పరిశీలించి వచ్చాక  లాల్ బహదూర్ శాస్త్రి నైతిక బాధ్యత తీసుకుని రైల్వేమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆయనను వారించి పదవిలో కొనసాగేలా చేశారు. ఆయన రాజీనామాను నెహ్రూ తిరస్కరించారు. అయితే, మూడునెల్లలోనే తమిళనాడు అరియలూరు ప్రమాదం జరిగింది.  ఈ సారి   శాస్త్రి  రాజీనామాను నెహ్రూ ఆపలేకపోయారు. ఆ ప్రమాదం లో 144 మంది చనిపోవడంతో రైల్వే మంత్రిగా బాగా క్రుంగిపోయారు. “It will be good for me and the Government as a whole, it quietly quit the office I hold,” అనిచెప్పి ఆయన రాజీనామా చేశారు.
 ఈ సారి నెహ్రూ కూడా అపలేకపోయారు. నిజానికి శాస్త్రి రాజీనామాను అమోదించవద్దని  37 ఎంపిలు  ప్రధాని నెహ్రూకు నివేదించారు. ఇలాంటి ప్రమాదాలు అరుదుగా జరగుతుూనే ఉంటాయని, వాటికోసం రాజీనామ చేయరాదని వారు వారించారు. శాస్త్రి పట్టువదల్లేదు.నెహ్రూ రాజీనామాను రాష్ట్రపతికి సిఫార్సు చేశారు.రాజీనామా ఆమోదించినందుకు నెహ్రూనుతప్పు పడుతూ పత్రికల్లో సంపాదకీయాలు కూడా వచ్చాయి.
ఇలాంటి పరిస్థితిని ఇపుడూహించగలమా?

Like this story? Share it with a friend!