Home Features ఉపవాసాలు చాలా మేలు చేస్తాయ్ : పాత సత్యం రుజువు చేసిన అమెరికా రీసెర్చ్

ఉపవాసాలు చాలా మేలు చేస్తాయ్ : పాత సత్యం రుజువు చేసిన అమెరికా రీసెర్చ్

129
0
Intermittent fasting (source: Harvard blog)
(Jinka Nagaraju)
ఉపవాసాలు చేయడం అన్ని మతాల్లో ఉంది. ఉపవాసాలు పగలూ చేయవచు.సైంటిఫిక్ కారణాలు చెప్పకపోయినా, అన్ని మతాలు ఉపవాసాన్ని విధిగా చెప్పాయి.
ఏడాది పొడవునా ఉండటం కష్టం కనీసం కొన్ని మాసాలలోనైనా ఉపవాసాలుండేలా మతాలు శాసించాయి. ఉపవాసాలు పగలూ చేయవచ్చు. రాత్రిచేయవచ్చు. తమ అనుకూలాన్ని బట్టి చాలా మందిప్రజలు ఉపవాసాలను విధిగా పాటిస్తారు.ముఖ్యంగా మహిళలు మరీ దీక్షగా ఉపవాసాలుంటారు. తిండి, ఆరోగ్యం విషయంలో మహిళలకున్నంత పట్టుదల దీక్ష పురుషుల్లో వుండదు.
ఇండియాలో మహిళల సగటు జీవిత కాలం తాజాగా జరిగిపిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే (Sample Registration Survey: SRS 2013-2017) 70.4  సంవత్సరాలు. పురుషుల్లో ఇది 67.8 సంవత్సరాలు. పట్టణాలలో  మహిళలకు సగటు ఆయుష్టు 73.70 కాగాగ్రామీణ ప్రాంతాలలో 69. ఇదే పురుషుల్లో పట్టణాలలో 71.20 గ్రామీణ ప్రాంతాలలో 66.40 సంవత్సాలు. ఇదే సార్వ జనీన సత్యం. అమెరికాలోఇదే  ఎలా ఉందో చూడండి.
హార్వర్డ్ మెడికల్ స్కూల్ (Harvard Medical School) అధ్యయనం ప్రకారం శారీరకంగా పురుషులు బలవంతులుగా కనిపించినా, ఆరోగ్య రీత్యా బలహీనులుపురుషులే నని చెప్పింది. మగవారికంటే ఎక్కువ కాలం బతికేది కూడా మహిళలే. ఉదాహరణకి ఆమెరికా 1900 సంవత్సరంలో మహిళల సగటు ఆయష్సు 48.3 సంవత్సరాలు, పురుషులది 46.3 సంవత్సరాలు. 1950 నాటికి మహిళల సగటు జీవిత కాలం 71.1 సంవత్సరాలకు చేరితే పురుషుల ఆయుష్సు 65.6 దాటలేదు. 2000 నాటికి మహిళల జీవితకాలం 79.7 సంవత్సరాలయితే, పురుషులది 74.3 సంవత్సరాలే.
(ఈ వార్త నచ్చితే మీ మిత్రులందరికి షర్ చేయండి)
ఇదేపరిస్థితి ప్రపంచమంతా ఉంది. దీనికి  రకరకాల కారణాలు చెప్పినా, సామాజిక,సాంస్క్రతిక కారణాలు కూడా ఉన్నాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ చెప్పింది. తూర్పు ప్రపంచంలో ఈ సామాజికాంశాలలోకి ఉపవాసంకూడావస్తుంది.
కొద్ది రోజుల కిందట ట్రెండింగ్ తెలుగున్యూస్ ఉపవాసం మీద జరిగిన ఒక అద్భుతమయిన పరిశోధన గురించి మీకు తెలియచేసింది. ఇది రాత్రి పూట రోజుకు 14 గంటల ఉపవాసం గురించి. ఇలా రోజు కు రాత్రి డిన్నర్ కు, మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ కి మధ్య 14 గంటల వ్యవధి ఉంటే మీరేమి తిన్నారనేదానితో నిమిత్తం లేకుండా మీరు బరువు తగ్గుతారు, బిపి, షుగర్ మెరుగుపడుతుందనే ఈ పరిశోధన సారాంశం. అంటే మనం తిన్నాతాగిని 10 గంటల వ్యవధిలో అయిపోవాలి.
దీనిని టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ (Time Restricted Eating, TRE) అని పిలిచారు(కింది వార్త). దీని మీద అమెరికాలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త భారతీయుడే ఆయన పేరు సచ్చిదానంద పాండా.

అందరికీ శుభవార్త… బరువు తగ్గేందుకు చిట్కా కనిపెట్టిన NRI శాస్త్రవేత్త

ఇపుడు ఉపవాసం ప్రయోజనం గురించి మరొక పరిశోధన వచ్చింది. ఈ పరిశోధన అమెరికా టక్సాస్ లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ (Baylor College of Medicine)లోజరిగింది. ఈ ప్రయోగం చేసిన శాస్త్రవేత్త ఆయెసే లైలా మిండికోగ్లు (Ayse Leyla Mindikoglu). ఈ పరిశోధనా ఫలితాలను అమెరికా గ్యాస్ట్రోఎంటెరొలాజికల్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన డైజెస్టివ్ డిసీజ్ వీక్ (Digestive Disease Week) లో ప్రదర్శించారు.
ఒక నెల రోజుల పాటు ఉపవాసాలు చేస్తే మనం తీసుకునే రకరకాల ఆహారాల వల్ల కలిగే అనర్థాలను అరికట్టే ప్రొటీన్ల సంఖ్య శరీరంలో భారీ పెరుగుతుందని డా. ఆయ్సే లైలా పరిశోధన లో తేలింది.
ఈ పరిశోధనకు, సచ్చిదానందా పాండా TRE కిపోలిక ఉంది. లైలాపరిశోధన ప్రకారం ఉపవాసం వల్ల సత్ఫలితాలు రావాలంటే ఉపవాసాలు సరైన సమయం (Right time)లో సరైన వ్యవధి (Right duration)తో చేయాలి.
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా చేసే ఉపవాసం
సాధారణంగా ఎక్కువ ఉపవాసాలిలాగే ఉంటాయి. ముఖ్యంగా రంజాన్ పండగ సమయంలో పగటి పూట ఉపవాసాలు సాధారణం. ఈ మధ్య రంజాన్ సమయంలో ముస్లిమేతరులు కూడా మతంతో నిమిత్తం లేకుండా రోజా ఫాలో అవుతుండటం లైలా గమనించారు. రోజా సమయంలో ఆహారం తీసుకోవడం నిలిపివేస్తే, అంటే ఉపవాసం ప్రారంభిస్తే, మనిషుల్లో కాన్ సెంట్రేషన్ కూడా పెరుగుతూ ఉంది.
ఉపవాసాల మీద పరిశోధనలు జరగడం కొత్త కాదు. ఎప్పటినుంచో ఉన్నాయి. రోజులు గడిచే కొద్ది మన శాస్త్ర విజ్ఞానం పెరుగుతుంది. ఈ విజ్ఞానం ఆదారంగా ప్రతిసారి ఒక కొత్త కోణం నుంచి ఉపవాసాల మీద పరిశోధన సాగుతూ ఉంటుంది. ఉపవాసాలు చేయడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది, వృద్ధాప్య ఛాయలు అంతతొందరగా రావని తెలిసింది. ఉపవాసాల వల్ల జీర్ణ వాహిక ఆరోగ్యం (Gut health) బాగుపడుతుందని శీరరంలో సర్కేడియన్ రిథమ్ (Circadian Rhythm) మెరుగుపడుతుందని కూడాతెలిసింది.
సర్కేడియన్ రిథమ్ అంటే ఏమిటి? మన శరీరంలో కూడా ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. మన శీరరంలో అన్ని అవవయాలు ఒక క్రమ పద్ధతిలో టైమ్ ప్రకారం పని చేస్తాయి. బ్రెయిన్ వేవస్ రిలీజ్ కావడం, హార్మోన్లు విడుదల కావడం, శరీర కణాలు పుట్టడం, ఆకలిరావడం, నిద్ర రావడం, మెలకువ రావడం ఒక గడియారం అలారం ప్రకారం జరుగుతుంటాయి. దీనినే సర్కేడియన్ రిథమ్ అంటారు. ఇది టైంతప్పితే చాలా కష్టాలొస్తాయి. ఉపవాసాల వల్ల ఈ బయోలాజికల్ యాక్టివిటీస్ టైంప్రకారం సాగుతాయని పరిశోధనలు తేల్చాయి.
ఇపుడు లైనా పరిశోధన ఉదయం నుంచి సాయంకాలం దాకా సాగే రంజాన్ ఉపవాసాల వల్ల శరీరంలో జరిగే మార్పలను పరిశీలించింది.
నెల రోజుల పాటు సాగే ఈ ఉపవాసాలు శీరరంలో మంచి ప్రోటీన్లను పెద్ద ఎత్తున పుట్టించాయి.. ఈ ప్రోటీన్లకు ఇన్సులిన్ రెసిస్టెన్సు ను తగ్గించే గుణం ఉంది. మనం తీసుకునే హానికర ఆహారాలు శీరరంలోకల్గించే అనర్ధాలు ( మితి మీరిన ఫ్యాట్, షుగర్స్ ) కూడా ఈ మంచి ప్రొటీన్లు శుద్ధి చేస్తాయి.ః
లైలా బృందం ఉపవాసాలుంటున్న 14 మందిలో ఈ మార్పులు గమనించారు. రంజాన్ సమయంలో వీరు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా సుమారు 15 గంటలు ( TRE లో 14 గంటలు) ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం చేస్తున్నపుడే కాకుండా, ఉపవాసం మానేసిన ఒక వారం దాకా కూడా వారి రక్తనమూనాలను వీరు పరీక్షించారు.
వీరిలో ట్రోపో మయోసిన్ (Tropomyosin- TPM) అనే ప్రొటీన్ ఎక్కువగా ఉండటం గమనించారు. ఇది ఎముక కండరాలను (skeletal muscles), గుండె పనితీరును క్రమబద్ధం చేసే ప్రొటీన్. చిన్న చిన్న డామేజ్ జరిగినా ఇది చికిత్స చేస్తుంది. ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణమయిన కణాలు పాడయిఉన్నా వాటిని సరిచేస్తుంది. మీరీ ముఖ్యంగా TPM3 అనే ప్రొటీన్ ఇన్సులిన్ సెన్సిటివీటీని పెంచుతుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ రెగ్యలేట్ అవుతూ ఉంటాయి. రంజాన్ మాసంలో నెల రోజులు ఉపవాసం ఉన్న వారిలో , ఉపవాసం వదిలేశాక ఒక వారం రోజుల పాటు TPM3, TPM1, TPM4 ప్రొటీన్లు బాగా ఎక్కువగా ఉండటం కనిపించింది.
అందువల్ల సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలో వరకు ఉపవాసం చేయడం మనేది ఒబెసిటీ సంబంధ (ఉబకాయ సంబంధ) సమస్యలతో బాధపడే వారి చౌకయిన ఒక ఉపశమనమని మిండికోగ్లు చెబుతున్నారు.
శీరరంలో టిపిఎంఉత్పత్తి అనేది టైమింగ్ తోపాటు, ఎంతసేపు ఉపవాసం చేస్తున్నారనే దానిమీద కూడా ఆధార పడి ఉండటం ఈ పరిశోధనలో కనిపించిన విశేషం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో 650 మిలియన్ల మంది వూబకాయం (Obesity)తో ఉన్నారు. ఇది ఆందోళనకలిగించే విషయమని ఈ సంస్థచెబుతూ ఉంది. ఇలాంటి వాళ్లు, ఉపవాసాలను పాటించి కొంతయినా ఆరోగ్యం మెరుగుపర్చుకోవచ్చు.