నిన్న చిదంబరం, నేడు పవార్, రేపెవరు? ఇంతకీ పవార్ కుంభకోణమేమిటి?

రాజకీయ రంగు అంటుకున్నా, మహారాష్టను కుదిపేసిన ఒక భారీకుంభకోణం మీద మొత్తానికి విచారణ కేంద్రం చేతిలోకి వెళ్లింది.
ప్రముఖుల అరెస్టుకురంగం సిద్ధమవుతూ ఉంది.
మరొక వైపు, ఇందులో కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ వంటి ఇతర ప్రాంతీయ పార్టీల నాయకుల ఏరివేత కోణం కనిపిస్తూ ఉందని ఆరోపణలొస్తున్నాయ్.
దాదాపు 25 వేల కోట్ల కుంభకోణంగా పేరున్న మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణం పేరుతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ (ఇడి ) తన దృష్టిని ఇపుడు నేషనలిస్టు కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్ర రాజకీయ బలాఢ్యుడు శరద్ పవార్ మీదకు మళ్లించింది.
మహారాష్ట్రరాజకీయాలలో ముఖ్యంగా షుగర్ బెల్ట్ ప్రాంతంలో బాగా పలుకుబడి ఉన్న నాయకుడు శరద్ పవార్. ప్రాంతీయ పార్టీ పెట్టిన ఆయన కాంగ్రెస్ తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. కాంగ్రెస్ కు నిజానికి ఆ రాష్ట్రంలో అండగా నిలుస్తున్నది పవారే.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిలక నోటిఫికేషన్ వెలుబడిన మూడు రోజుల్లోనే ఇడి అధికారులు శరద్ పవార్ మీద, ఆయన మేనల్లుడు అజిత్ పవార్ మీద కేసులు బుక్ చేశారు.
తొందర్లోనే పవర్ అండ్ కోను  ఇడి విచారణ పిలిచే అకాశం ఉంది. బ్యాంకు లో పనిచేస్తున్న, గతంలో పనిచేసిన 70 మంది పోలీస్ ఎప్ ఐ ఆర్ ఆదారంగా ఈ ఇడి ఎంతో చొరవ తీసుకుని కేసులు బుక్ చేసింది.  అక్టోర్ 21 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నుపుడు ఈ రాజకీయపరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఏ రాష్ట్రంలో నైనా జరగవచ్చు.
వీరితో పాటు మరికొందరు కాంగ్రెస్ నాయకులమీద, ఎన్ సిపి నేతల మీద కూడా కేసులు బుక్ చేశారు.
ఎన్ ఫోర్స్ మెంట్ కేసు ఇన్ ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)ను సోమవారం నాడే బుక్ చేశారు. ముంబై పోలీస్ ఆర్థిక నేరాల విభాగం తయారుచేసిన ఒక ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా ఇడి ఈ కేసులు బుక్ చేసింది. కేసులు మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లో జరిగిన అవకతవకలకు సంబంధించినవి. అయితే, ఈ కేసులు రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని ఎన్ సి పి ఆరోపిస్తున్నది.
శరద్ పవార్ కు ఈ బ్యాంక్ తో గత 50 యేళ్లలో ఎపుడూ సంబంధం లేదని, ఇది కేవలం పవార్ ను రాజకీయంగా మహారాష్ట్రలో ఫినిష్ చేసేందుకే నని ఎస్ సిపి ఎమ్ ఎల్ ఎ జితేంద్ర ఆహాద్ వ్యాఖ్యానించారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో శదర్ పవార్ ప్రచారం ఉధృతంగా చేయనున్నారని చెబుతూ ఆయన ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకే పవర్ మీద ఉన్నట్లుండి ఎన్నికల ముందు కేసులు బుక్ చేశారని ఆయన అరోపించారు.
మహారాష్ట్ర రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి 28.01.2019న ఒక క్రిమినల్ కేసును బాంబే హైకోర్టు ముందుర దాఖలు చేయడం జరిగిందని, ఈ కేసును సాంతం విన్న తర్వాత దీని మీద ఎఫ్ ఐ ఆర్ బుక్ చేయాలని కోర్టు ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగాన్ని ఆదేశించిందని, దీనివల్లే ఎఫ్ ఐ ఆర్ బుక్ చేశారని ఇడి వర్గాలు చెప్పినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ రాసింది.
దీని ఆధారంగా 23.09.2019న ఇడి బ్యాంక్ చెయిర్మన్, డైరెక్టర్లతో పాటు శరద్ పవార్, అజిత్ పవార్ , దిలిప్ రావ్ దేశ్ ముఖ్, ఈశ్వర్ లాల్ జైల్, జయంతి పాటిల్ తదితరుల మీద ECIR ను ఫైల్ చేసిందని ఈ వర్గాలు తెలిపాయి.
కుంభకోణం ఏమిటంటే…
మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకులో రు. 25వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణ. బ్యాంక్ ఛెయిర్మన్, ఎండి, డైరెక్టర్లు, చక్కెక కర్మాగారాల డైరెక్టర్లు, ఆఫీస్ బేరర్లు, స్పిన్నింగ్ మిల్లులకు, ఇతర పరిశ్రమలకు భారీగా బ్యాంకు నుంచి రుణాలు మంజూరుచేశారు.  ఇందులో చాలా అక్రమాలకు పాల్పడ్డారని ఎప్ ఐఆర్ లో పేర్కొన్నారు.
మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు అధికారులు సహకార చక్కెర మిల్లుల పేరుతోనే  రుణాలిచ్చినా  ఇందులో జరిగిన  అక్రమాలకు వల్ల  రుణాలన్నీ ఈ కర్మాగారాల పాలకవర్గాల జేబుల్లోకి వెళ్లాయి.
చక్కెర మిల్లులకు రుణాలిచ్చే పేరుతో మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ మిల్లుల పాలకవర్గాలకు లబ్ది చేకూర్చారని చెబుతారు.
ఇది బ్యాంకును, బ్యాంక్ షేర్ హోల్డర్లను మోసగించడమేననని పోలీసు వర్గాలు చెబుతున్నాయ్.
చక్కెర మిల్లులు నష్టాల్లోఉన్నా, రుణాలు తీర్చే శక్తి లేకపోయినా మ. కో.బ్యాంక్ ఉదారంగా వ్యవహరించి వాటికి రుణాలిచ్చింది. కనీసం ఈ రుణాలకు పూచీకత్తులు కూడా తీసుకోలేదు. ఇక్కడే అన్ని అక్రమాలకు పాల్పడ్డారు.
రుణాలు తీసుకున్నాక, చాలా సహకార చెక్కెర మిల్లులు ఖాయిలా పడ్డాయి. తర్వాత దివాళా తీస్తున్నాయని పేరుతో మరొక కుంభకోణానికి పాల్పడ్డాయి. ఈ మిల్లులను కారు చౌకగా అమ్మేసి కొనేవాళ్లకు బాగా   లబ్ది చేకూర్చారు. పోనీ మిల్లులు కొన్న వాళ్లెవరు? ఈ మిల్లులు కొన్న వాళ్లంతా కూడా మిల్లు పాలకవర్గాల బంధువులో , వ్యాపార భాగస్వాములో. మిల్లులను అమ్మేస్తున్నపుడు షేర్ హోల్డర్ల అంగీకారం కూడా తీసుకోలేదని ECIR పేర్కొంది.
పవార్ & కో మీద  పెట్టిన కేసులేమిటి?
పవార్ తదిరుల మీద ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 420 (cheating and dishonestly inducing delivery of property),409(criminal breach of trust by public servant, or by banker , merchant or agent),406( Punishment for crminal breach of trust),465( punishment for forgery),467(Forgery of valuable security, will etc),120(B)(Punishment for criminal conspiracy)
ఈ కుంభకోణం మీద నబార్డ్ దర్యాప్తు చేసింది. మహారాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం ఒక క్వాసి జ్యుడిషిల్ కమిటీ కూడా విచారణ జరిపింది. ఇవన్నీ కూడా అజిత్ పవార్ మీద వెలెత్తి చూపాయి. బ్యాంకు నష్టాలకు అతన నిర్ణయాలు, చర్యలు,ఉదాసీనతే (decision, actions and inactions) కారణమని పేర్కొన్నాయని ఎకనమిక్ టైమ్స్ రాసింది.
నిజానికి పవార్ మీద ప్రత్యేకంగా ఇడి ఎలాంటి విచారణ చేయలేదు. ముంబై పోలీపులు ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేశారని తెలిసి, ఆ వివరాలతో మనీ లాండరింగ్ కేసు పెట్టి ఎఫ్ఐ ఆర్ దాఖలు చేశారు. పోనీ ముంబయి పోలీసులు,  ఆర్థిక నేరాల విభాగం వాళ్లు ఫైల్ చేసిన రిపోర్ట్ ఆధారంగా తమ ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేశారు. అదీ సంగతి.
నవంబర్ 10, 2010 నుంచి సెప్టెంబర్ 26,2014దాకా అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్కామ్ జనవరి 1, 2007 -డిసెంబర్ 30,2017 మధ్య జరిగింది.
షుగర్ మిల్లులకు, స్పిన్నింగ్ మిల్లులకు రుణాలు మంజూరు చేయడంలో అజిత్ పవార్ బ్యాంకునియమాలను, ఆర్ బిఐ గైడ్ లైన్స్ ని ఉల్లంఘించారని నబార్ద్ ఆడిట్ రిపోర్టు వెల్లడించింది.
తర్వాత సురేంద్ర ఆరోరా అనే ఒక యాక్టివిస్టు బ్యాంకు అధికారుల మీద, పాలకవర్గం మీద జరపాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. తర్వాత ఈ కేసు ప్రాథమిక సాక్ష్యాలున్నాయయని అభిప్రాయపడుతూ ఎఫ్ ఐ ఆర్ బుక్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

(Image from Twitter)