రిటైర్ మెంట్ వయసు పెంచాలి: ఆర్ధికమంత్రి ప్రతిపాదన

మోదీ.2.0 ప్రభుత్వ పెద్ద గోలే పెట్టుకుంది. ఆర్ఘిక వేత్త కృష్ణ స్వామి సుబ్రమణియన్ రాసిన 2019-20 ఎకనమిక్ సర్వే నివేదికను ఈ రోజు ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సర్వే ప్రభుత్వానికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించడమే కాకుండా కొన్ని ఆసక్తికరమయిన ప్రతిపాదనలు చేసింది. ఇందులో ప్రధానమయింది రిటైర్ మెంటు వయసు పెంచడం. ఇలాగే కొన్ని చోట్ల సీరియస్ వార్నింగ్స్ కూడా ఇచ్చింది. అవేమిటో ఇపుడు చూద్దాం:
1) 2019-20 లో జిడిపి పెరుగుద 7 శాతానికి తీసుకురావాలని లక్ష్యం పెటుకుంది. ఇపుడు ఇది 5 సంవత్సరాల కిందటి స్థాయికి పడిపోయింది. దీనిని పైకి తీసుకురావాలి అంతేకాదు, 2024-25 నాటికి ఆర్థిక వ్యవస్థను $5 ట్రిలియన్లకు పెంచాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఈరోజు పార్లమెంటుకు సమర్పించిన ఎకనమిక్ సర్వేలో పేర్కొన్నారు.
2)భారతదేశంలో రిటైర్ మెంటు వయసు పెంచాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది ఎకనమిక్ సర్వే. మనిషి సగటు జీవిత కాలంలో భారతదేశంలో బాగా పెరిగినందున రిటైర్ మెంటు వయసు పెంచాలని సర్వే సూచించింది. ‘భారత జనాభా పెరుగుదల రేటు 2030-41 నాటికి 0.5శాతం కంటే తక్కువగా ఉంటుంది. దీనికి కారణం జననాల సంఖ్య తగ్గిపోతుంది. జీవనకాలం పెరుగుతూండటమే. అందువల్ల రిటైర్ మెంటు వయసు పెంచడం తప్పని సరి అవుతుంది. తీరా ఆ సమయం వచ్చాక నిర్ణయం తీసుకోవడం కంటే ఇప్పటినుంచి , కనీసం ఒక దశాబ్దం ముందే దీనికి సన్నద్ధం కావాలి. దీని వల్ల వర్క్ ఫోర్స్ ఈ మార్పుకు సిద్ధమవుతారు,’అని సర్వే పేర్కొంది. చాలా దేశాలలో ఇప్పటికే వృద్ధుల, పెన్షన్ల బారం నుంచి తప్పించుకునేందుకు రిటైర్ మెంట్ వయసు పెంచినట్లు సర్వే పేర్కొంది. ఇపుడు దేశంలో 58 సంవత్సాలనుంచి 65  సంవత్సరాల వరకు రిటైర్ మెంటు వయసు ఉంది. దీనిని బట్టి  చూస్తే బహుశా 70 సం. దాక రిటైర్ మెంట్ ఉండకపోవచ్చని మీడియా వూహాగానాలుచేస్తున్నది.
3) సర్వే మరొక కొత్త ప్రతిపాదన తీసుకువచ్చింది. దేశంలో ఎక్కువ టాక్స్ చెల్లించేవారికి కొన్ని ప్రత్యేక మర్యాదలుచేయాలనుకుంటున్నంది. ఉదాహరణకు కొన్ని రోడ్లకు వాళ్ల పేర్లు పెట్టడం. జిల్లాలో అత్యధిక టాక్స్ కట్టిన వాళ్లకి టోల్ బూతుల వద్ద ప్రయారిటీ ఇవ్వడం, ముఖ్యమయిన భవనాలకు, స్కూళ్లకు, ఆసుపత్రులకు వారి పేర్లు పెట్టడం. టాప్ టాక్స్ పేయర్స్ కు గుర్తింపు గౌరవం పెంచేందుకు ఇది అవసరమని  సర్వే అభిప్రాయపడింది.
4) భారతదేశం నీళ్ళ సంక్షోభం ఎదుర్కోబోతున్నదని ఎకనమిక్ సర్వే హెచ్చరించింది. 2050 నాటికి దేశంలో నీళ్ల అభద్రత (water insecurity) పెరిగి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రాంతమవుతుందని పేర్కొంది. భూగర్భజలాలను విపరీతంగా వాడుకోవడం మీద కూడా సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, ఉత్పాదకత భూమి అధారంగా కాకుండా నీటి వాడకం అధారంగా ఉండేలా చూడాలని కూడాసూచించింది. నీళ్లను పొదుపుగా వాడే రైతులకు ప్రోత్సహకాలు ఇచ్చే విధంగా వ్యవసాయ విధానాలు ఉండాలని, రాబోతున్న భయంకరమయిని నీటీ కొరతను నివారించేందుకు సన్నద్ధం కావాలని సర్వే సూచించింది. మద్రాసునీళ్ల సంక్షోభం తర్వాత దేశమంతా నీటి భయం పట్టుకుంది.ఈ నేపథ్యంలో ఎకనమిక్ సర్వే దీనికి చాలా ప్రాముఖ్యం ఇవ్వడం విశేషం. భారతదేశానికి నీటి సంకోభం ఉందని సర్వే గుర్తించింది.
5) సర్వే నివేదిక రాసిన సుబ్రమణియన్ చైనా నుంచి చాలా స్పూర్తి పొందినట్లు నివేదిక చెబుతుంది. చైనా ఎక్కడ విజయవంతమయింది, ఎక్కడ విఫలమయిందనే అంశాల అధారంగా నివేదిను రూపొందించారు. దేశం అభివృద్ధిచెందాంటే సేవింగ్స్, ఇన్వెస్ట్ మెంట్స్ , ఎగుమతులు ఎలాంటి కీలకపాత్రపోషిస్తాయో అయన చైనా అనుభవం నుంచే ఉదహరించారు. ఈ మూడు రంగాలలో చైనా 1980-2017 మధ్య బాగా పనిచేసినందునే అంతర్జాతీయ ఆర్థిక శక్తి అయిందని ఆయన పేర్కొన్నారు. 2017లో చైనా జిడిపిలో ఇన్వెస్ట్ మెంట్స్, సేవింగ్స్ రేటు 45 శాతానికి చేరుకున్నా చైనా ఇన్వెస్ట్ మెంట్లతో నడుస్తున్న ఆర్థిక వ్యవస్థగానే కొనసాగుతూ ఉందని సర్వే పేర్కొంది.