గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కొలువు ఎంచుకున్న అంతర్జాతీయ శాస్త్రవేత్త

ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు మనయూనివర్శిటీల్లోనే చాలా అరుదుగా కనిపిస్తారు. శాస్త్రవేత్తలెవరైనా ఉన్నారంటే జాతీయ స్థాయి రీసెర్స్ ఇన్ స్టిట్యూట్ లలోనో, ఐఐటిలోనో కనిపిస్తారు, యూనివర్శిటీలకు రారు. ఎందుకంటే యూనివర్శిటీల క్లాస్ రూం నుంచి ల్యాబొరేటరీ దాకా వాాతావరణం బాగుండదు.
ఇండియాలో మంచి శాస్త్రవేత్తలెవరైనా ఉన్నా అవకాశం రాగానే ఇండియాలో విడిచివెళ్లిపోతారు. ఐఐటిల నుంచి బిటెక్ తో బయటకొచ్చే విద్యార్థుల్లో ఎక్కువ మంది విదేశాలకు వెళ్లిపోతున్నారనే విమర్శ ఉంది. వద్దు వెళ్లొద్దు, ఇండియాలోనే ఉండి దేశానికి సేవ చేయండి, మీకు ఉద్యోగాలకు డోకాలేదుగా అని ఆ మధ్య కిర్లోస్కర్ బద్రర్స్ లిమిటెడ్ సిఎండి సంజయ్ కిర్లోస్కర్ ఒక యూనివర్శిటీ కాన్వొకేషన్ లో విజ్ఞప్తి చేశారు.
వీళ్లంతా అక్కడ మంచి యూనివర్శిటీల్లోనే, ల్యాబోరేటరీల్లోనే చేరిపోతారు.  అంతర్జాతీయ పరిశోధనలు చేస్తుంటారు. ఇలా పరిశోధనలు చేసి, అత్యున్నత అంతర్జాతీయ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన వాళ్లెవరూ ఇండియాకు తిరిగిరారు. వచ్చినా ఇఛ్చాపురం,అచ్ఛంపేట లేదా ఆలూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో పనిచేయరు. ఇక్కడున్న లెక్చరర్లే ఈ మారుమూల డిగ్రీ కాలేజీల్లో పనిచేసేందుకు ముందుకురారు. అంతా సిటీ కాలేజీల్లోనే పోస్టింగ్ కోసం  ప్రయత్నిస్తారు.
అయితే, ఒకే ఒక్క భారతీయ శాస్త్రవేత్త ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.  ఆయన మామూలు శాస్త్రవేత్త కాదు, ప్రపంచంలో మొదటి రెండు శాతం అగ్రశ్రేణి శాస్త్రవేత్తలలో ఒకడైన మేధావి ఆయన.ఇక మన వూరెళ్లి పోదాం, అక్కడి ప్రజలను విద్యావంతులను చేద్దాం అని ఇండియా వచ్చి, కాలేజీ లెక్చరర్ పరీక్ష రాసి, ఒక మారుమూల డిగ్రీ కాలేజీలో కావాలనే పోస్టింగ్ తీసుకుని విద్యార్థులు చైతన్య పరుస్తున్నాడు. ఆయన పేరు డాక్టర్  షకీల్ అహ్మద్. కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని మేంధార్  గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ (Government Degree College Mendhar:GDCM)  లో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్.
మేంధార్ ఎక్కడుందో తెలుసా? పాకిస్తాన్, ఇండియాలో మధ్య ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) సమీపంలో.

(Like this story? Share it with a friend!)

శాస్త్రప్రపంచంలో ఆయన హోదా తెలిస్తే అవాక్కయి పోవలసిందే. వారం రోజుల కిందట ఒక సర్వే ఆయనను ప్రపంచంలోని మేటి శాస్త్రవేత్తల్లో ఒకడని పేర్కొంది. ఈ సర్వే చేసిందెవ ఎగ్జిట్ పోల్స్ చేసే సంస్థ వంటి బిజినెస్ సంస్థ కాదు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ. ప్రపంచంంలో మూడు నాలుగు మంచి యూనివర్శిటీల పేర్లు చెబితేఅందులో స్టాన్ ఫోర్డ్  ఉంటుంది. ఈ యూనివర్శిటీ పాలిమర్ కెమిస్ట్రీలో అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు లిస్టు తయారు చేసింది. అందులో టాప్ 2 శాతం శాస్త్రవేత్తలో డాక్టర్ షకీల్ అహ్మద్ ఒకరు అని పేర్కొంది. ఈ రెండు శాతంలో ఉన్న వాళు కూడా అంతా ఐఐటి వాళ్లు, ఐఐఎస్ సి వాళ్లే ఉన్నారు. అందులో డాక్టర్ షకీల్ అహ్మద్ ఒకరు. ఈ స్టడీ PLOSS Biology లో పబ్లిష్ అయింది. ఆయన స్పెషలైజేషన్ పాలిమర్ కెమిస్ట్రీ. ఈ 31 సంవత్సరాలనాటికే ఆయన రాసినా 30 పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్ పబ్లిష్ అయ్యాయి.అంతేకాదు, ఈ రంగంలో ఆయన 15 పుస్తకాలు రాశారు. వీటిని Elsevier, CRC Press, Wiley, Scrivener Publishing వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రచురించాయి. ఈ చిన్న వయసులోనే ఆయనకు  అమెరికన్ కెమికల్ సొసైటీలో, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో సభ్యత్వం వచ్చింది. ఎషియన్ పాలిమర్ అసోసియేషన్ లో జీవిత కాల సభ్యుడు. భారతదేశానికి చెందిన సొసైటీ అప్ మెటీరియల్ కెమిస్ట్రీలో కూడా జీవిత కాల సభ్యుడు. ఆయన బయోడేటా చూస్తే  ఎవరో తలనెరిసిన విశ్వవిఖ్యాత శాస్త్రవేత ఏమో అనిపిస్తుంది. కాని ఆయన వయసింకా  మూడు పదులే.
పాలిమర్స్ అంటే ప్లాస్టిక్ వంటి పదార్ధాలు. ఇవి వాతావారణాన్ని కలుషితం చేస్తున్నాయని,వదిలేస్తు కొన్ని వేల సంవత్సరాలు కుళ్లిపోకుండా ఉండి భూగోళానికి హాని చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల తొందరగా కుళ్లిపోయే ప్లాస్టిక్ తయారు చేస్తే…  ఇదే ఇపుడు డాక్టర్ షకీల్ అహ్మద్ చేస్తున్నది. ఆయన బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ం ను తయారీ మీద పరిశోధనలు చేస్తున్నాడు.
“Polymers that we use at present are mainly synthetic and cause pollution. For example in food packaging, we use conventional polymers. I am developing greet materials which biodegradable,” అని షకీల్ చెప్పాడు.
ఈ పరిశోధనలు చేయడానికి ఖరీదైన పరికరాలున్న ల్యాబ్ లు కావాలి. మామూలు డిగ్రీ కాలేజీ లెక్చరర్ ను యూనివర్శిటీల్లోకి కూడా రానీయరు. అయితే, షకీల్ అహ్మద్ న్యూఢిల్లీలోని జామియా మిలియాలో Biopolymers and Bionanocomposites లో పిహెచ్ డి చేసి, ఆపైన ఢిల్లీ ఐఐటిలో పోస్టు డాక్టోరల్ చేశాడుకాబట్లి,  వాళ్లు ఆయన పరిశోధనలకు అనమతినిచ్చారు. అయినా సరే,  ప్రతిశెలవు రోజున పూంచ్ నుంచి ఢిల్లీ రావడం ఎంతకష్టమో.
అమెరికాలోని పేరుమోసిన యూనివర్శిటీలలో పెద్ద పెద్ద ఉద్యోగాలొస్తే కాదని, మావూర్లో చేయాల్సిన పని చాలా వుందని చెప్పి కాశ్మీర్ తిరిగొచ్చి డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా చేరారు. ఆయన వయసు కేవలం 31 సంవత్సరాలు.ఐఐటి-ఢిల్లీ పోస్టుడాక్టోరల్ చేస్తున్నపుడు ఆయనకు విదేశాలలో లెక్కలేనన్ని ఉద్యోగాలొచ్చాయి. ఆయన వెళ్లాలనుకోలేదు.  ఢిగ్రీకాలేజీ లెక్చరర్ రిక్రూట్మెంట్ పరీక్ష రాసి పాసయి GDCM చేరాడు. ఉద్యోగంలో చేరాక కూడా ఐఐటికి వచ్చి తన పరిశోొధనకొనసాగిస్తున్నారు. శెలవులున్నపుడల్లా మేంధార్ నుంచి ఢిల్లీ వచ్చి పరిశోధనలు చేస్తుంటాడు ఇది ఖర్చుకూడుకున్నపని, అయినా ఆయన ఖాతరు చేయడం లేదు.
‘నేను మాప్రాంతం రుణంతీర్చుకోవాలనుకున్నాను. మాప్రాంతంలో మంచి చదువు దొరకడం చాాలా కష్టం. పుట్టీ పుట్టగానే తండ్రి చనిపోయాడు.స్కాలర్ షిప్ లతో చదువు పూర్తి చేశాను. ఈ కష్టం నాకు తెలుసు కాబట్టి, ఈ వెనక బడిన ప్రాంతంలోనే ఉండి విద్యార్జులకు సాయం చేయాలనుకున్నాను, ఈ విషయంలో మరొక ఆలోచనే లేదు,’ అని ఆయన మీడియాకు చెప్పాడు.
డాక్టర్ అహ్మద్ సాదాసీదా కాలేజీల్లోనే చదవుకున్నారు. రాజౌరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బిఎస్ సి చదివాడు. తర్వాత ఢిల్లీ జామియాలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేశాడు. అక్కడే చకాచకా పిహెచ్ డి 2016లో పూర్తయింది. తర్వాత 2017 ఢిల్లీ ఐఐటిలో పోస్టు డాక్టోరల్ కు చేరారు. ఇంతలోనే ఇంతపేరు… ఆశ్చర్యం గా ఉంది కదూ?
ఆయన కృషిఫలించింది. ఆయన కాలేజీకి వచ్చాక, ప్రతిసంవత్సరం కెమిస్ట్రీ ఇష్టపడే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా బాలికలు కెమిష్ట్రీ తీసుకుంటున్నారు.  కాలేజీకి మంచి ప్రతిష్ట వచ్చింది.
షకీల్ అహ్మద్ భార్య డాక్టర్ అను చౌధరి కూడా మరొక డిగ్రీకాలేజీలో లెక్చరర్. ఆమెతో కలసి ఈ ప్రాంత విద్యార్థుల్లో ఉన్నత విద్య పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఒక NGO ప్రారంభించాలని ఆయన యోచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *