వచ్చే కాలమంతా ‘స్వర్ణయుగమే’… బంగారే నిజమయిన కరెన్సీ

ప్రపంచమంతా బంగారు కొత్త  కరెన్సీ గా మారిపోతుంది. జనమంతా డాలర్లను వదిలేసి బంగారు కొంటున్నారు. తమ సంపదను డాలర్ల డిపాజిట్ లలో  దాచుకునే రోజులు కావని తెలిసిపోయింది. అందుకే డాలర్లను  వదలుకుని బంగారం కొనేస్తున్నారు. దీనితో డాలర్ పతనమవుతూ ఉంది. ఇప్పటికే డాలర్ బక్కిచిక్కి పోయింది. దానితో అంతర్జాతీయ మారకపు కరెన్సీ హోదానుంచి డాలర్ రిటైరయిపోతుందని గోల్డ్ మాన్ శాక్స్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
అందుకే అంతా బంగారు వైపు పరుగులు తీసుకున్నారు. తెగ కొనేస్తున్నారు.రానున్నది స్వర్ణయుగమే
ఎందుకంటే కరెన్సీ ని ఎపుడూ ఎవరూ డివాల్యూ చేయలేరు. దాని ఎక్చేంజ్ రేటు పడిపోతందన్న భయమూ లేదు. ఫలితంగా గత నెలరోజుల్లొ బంగారు ధర ఏడుశాతం పెరిగింది. అమెరికా డాలర్ ఇండెక్స్ 3.7శాతం టఫీ మనిపడిపోయింది. గురువారం నాడు బంగారు ట్రాయ్ ఔన్స్ ధర అంతర్జాతీయ మార్కెట్ లో 1964.51 డాలర్ల కు చేరుకుంది. గోల్డ్ మన్ శాక్స్ (Goldmand Sachs) బంగారుధర 2,000 డాలర్లనుంచి  నుంచి 2,300 డాలర్ల కు చేరుకుంటుందని చెప్పింది. దీనికి కారణం, అమెరికా వడ్డీ రేట్లు ఇంకా బాగా పడిపోతాయన్నభయమే. దీనితో గోల్డ్ ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది.
అంతర్జాతీయ రిజర్వు కరెన్సీ హోదా నుంచి డాలర్ పడిపోతుందనే భయం సర్వత్రా మొదలయింది. అంటే గ్లోబల్ మార్కెట్ లో డాలర్ పెత్తనం ముగిసే రోజు ఎంతో దూరంలేదని గోల్డ్ మన్ శాక్స్ చెబుతున్నది.  అందుకే ఇక డాలర్ నిల్వలన్నీ ప్రజలు వదిలించుకుంటారు.దీనితో డాలర్ ఇంకా కుప్పకూలిపోతుంది. ఇన్వెస్టర్ల తమ డాలర్లతో గోల్డ్ కొనడం మొదలుపెడతారు.
అమెరికా మీద అప్పుల భారం కూడా విపరీతంగా పెరిగింది. జిడిపిలో అమెరికా అప్పులు 80 శాతం దాటిపోయాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న రాజకీయ అనిశ్చిత పరిస్థితి , మరొక రౌండు కరోనా వైరస్ దాడి చేస్తుందనే భయాలు డాలర్ పతనాన్ని వేగం చేస్తాయని బ్యాంకింగ్ సెక్టర్ నిపుణులు చెబుతున్నారు.
ఇపుడున్న పరిస్థితుల్లో బంగారు వెండి ధరలు ఇంకా పెరుగుతాయని అంతర్జాతీయస్టాక్ బ్రోకర్ పీటర్ స్కిఫ్ కూడా చెబుతున్నారు.  బంగారు , వెండి ధరలు విపరీతంగా పెరుగుతాయని , ఇపుడు చూస్తున్నది కేవలం ఒక కొస  మాత్రమేని ఆయన ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. బంగారు సరికొత్త బిట్ కాయిన్ అయిపోతున్నదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికాడాలర్ కుప్పకూలిపోయే పరిస్థితి  వచ్చింది. ఎపుడు కూలిపోతుందన్నది చెప్పలేం. అయితే, అది జరుగుతూనే బంగారు డాలర్ల జాగాను ఆక్రమిస్తుంది. డాలర్ ఏ రోజైనా కుదేలయిపోవచ్చు. అపుడు బంగారు పైకప్పు చీల్చుకుని దూసుకుపోతుంది. ఇపుడు బంగారు, డాలర్ల మధ్య పరుగ పందెం మొదలయింది. ఆలసించిన ఆశాభంగం, తొందరగా డాలర్లను వదిలించుకోవడం మంచిది,’ అని స్కిఫ్ చెప్పారు.
“The US dollar is about to collapse and when it does, gold is going to take its place. The bottom can drop out of the dollar any day, and gold could go through the roof any day. So, this is real race and you have to get out of the dollar before it’s too late: Schiff

 

 

ప్రపంచ మానెటరీ వ్యవస్థకు బంగారు కేంద్రం కాబోతున్నది.పూర్వ కాలంలో లాగా ప్రపంచ బంగారు ప్రమాణావైపు పరుగు పెడుతున్నది. అదెపుడైనా జరగవచ్చు.వచ్చే ఏడాది కావచ్చు. ఆ పై ఏడాది కావచ్చు.