Home Features హోమంత్రిని పోలీస్ స్టేషన్లో హత్య చేసి… బయటకొచ్చిన వికాస్ దూబే కథ ఇది…

హోమంత్రిని పోలీస్ స్టేషన్లో హత్య చేసి… బయటకొచ్చిన వికాస్ దూబే కథ ఇది…

61
0
SHARE
మధ్య ప్రదేశ్ లోని  ఉజ్జయిని గుడిలో పోలీసులకు లొంగిపోయాక గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ అవుతాడని అంతా అనుకున్నారు.ఎందుకంటే, ఆయన్నంతవరకుకాపాడుతూ వచ్చిన పలుకుబడి ఉన్న మిత్రులకూ దూబే పోవడమే మేలనిపించినట్లనిపించింది. అతగాడు  ఎక్కువ కాలం బతికితే చాలా విషయం బయటపడే ప్రమాదం ఉంది.రహస్యాలు కొద్ది రోజలే మరుగున ఉంటాయి. సమయమొచ్చినపుడు విత్తనాలు మొలకెత్తినట్లు మోసులెత్తుతాయి. కొంపముంచుతాయి. అంతే, పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తున్నపుడు దేశమంతా జరిగినట్లే, అంతా అనుకున్నట్లే  ఎన్ కౌంటర్ జరిగింది. పక్కనున్న పోలీసు నుంచి రైఫిల్ లాక్కుని పోలీసులను కాల్చేందుకు  దూబే ప్రయత్నించాడు. ఆత్మరక్షణకోసం పోలీసులూ కాల్చారు.దూబే చచ్చాడు.
దూబే 30 సంవత్సరాలు ఎదురు లేని ఖూనీకోర్ గా ఉత్తర ప్రదేశ్ లో తిరిగాడు, ఎన్నిఖూనీలు చేసినా, కిడ్నాపులు చేసినా, దొమ్మీలు చేసినా, రాష్ట్రంలోని మోస్టు వాంటెడ్ లిస్టులో ఆయన పేరెపుడూ ఎక్కలేదు. కనీసం ఆయన సొంతజిల్లా కాన్పూర్ లోని 10 మోస్ట్ వాంటెడ్ లిస్టులో కూడా ఆయన పేరు కనిపించదు, కారణం,ఆయనకున్నపలుకుబడి అలాంటిది.
ఎన్ కౌంటర్ తప్పించుకునేందుకు గుడికంటే గొప్ప సురక్షితమయిన ప్రదేశమరొకటుండదనే వికాస్ దూబే ఉజ్జయిని గుడిలోకి దూరాడు.  ఈ సారి సరెండర్ గతంలో లాగా సుఖాంతకాలేదు.
వికాస్ దూబే కథ దట్టమయిన క్రైమ్ సినిమాయే
వికాస్ దూబే ఉత్తర ప్రదేశ్ లో చాలా పాపులర్ గ్యాంగ స్టర్. కాన్పూర్ క్రిమినల్ ప్రపంచానికి ఆయన రారాజు.  బయటి ప్రపంచానికి ఆయన గురించి తెలిసింది జూలై 3న కాన్పూర్ లో  సొంత ఇంటి ఆవరణలోనే 8 మంది పోలీసులును హత మార్చిన తర్వాతే. పోలీసులు అర్ధరాత్రి దాడికొచ్చినా, అప్పటికే ఆయుధాలతో ఆయన మనుషులు సిద్ధంగా ఉండటం వెనక రహస్యం ఎపుడు బయటపడుతుందో తెలియదు.
వికాస్ దూబ్అల్లాటప్పా రౌడీ కాదు.ఆయనకు   రాజకీయాల్లో అందునా రూలింగ్ పార్టీలో చాలా మంచి  మిత్రులున్నారు. ఇండస్ట్రియలిస్టులలో కూడా బాగా  పలుకుబడి  ఉంది. పోలీసుల హత్య తర్వాత ఆయన్నుంచి పాత మిత్రులంతా దూరంగా జరిగారు.  అందుకే చివరకు  30 సంవత్సరాలకిందట మొదలయిన ఆయన చరిత్ర నిన్నటి ఎన్ కౌంటర్ తో ముగిసింది.
ఎవరీ వికాస్ దూబే
సాధారణ కుటుంబంనుంచే వచ్చాడు. రాజకీయ నేపథ్యం కూడా లేని కుటుంబం. కాన్పూర్ సమీపంలోని బిక్రూ ఆయన సొంతవూరు.ఇపుడు వయసు 50 దాటింది. 1990లో చిన్న వీధిరౌడీగా జీవితం ప్రారంభించాడు. తొలినాళ్లకు ఆయనక అండ చౌబేపూర్ ఎమ్మెల్యే హరిక్రిషన్ శీవాత్సవ.తర్వాత ఆయన కు అండగా మారాడు.ఇద్దరు కలసి తెగ పార్టీలు మారారు. ఒక దశలో బిజెపి లో, కొన్నాళ్లు బిఎస్ పిలో ఉన్నారు. కొన్నాళ్లు సమాజ్ వాది పార్టీలో కూడా ఉన్నారు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు అండనిచ్చేది. ఇలా రాజకీయాల అండతో హోంమంత్రి ని చంపే స్థాయికి వచ్చాడు.
వికాస్ దూబే క్రిమినల్ రికార్డు ఒక హత్యకేసులో 1990లో మొదలయింది. అప్పటినుంచి ఆయన హత్యల చిట్టా పెరుగుతూ పోయింది. 2001లో ఉత్తర ప్రదేశ్ కు చెందిన బిజెపి మంత్రి సంతోష్ శుక్లా హత్య కేసులో కూడా ఆయన ముద్దాయి. శుక్లా హోం మంత్రి. అయినా సరే కాన్పూర్‌లోనే వెంటాడి, వేటాడి, పోలీస్ స్టేషన్లోకి దూరినా అక్కడే  మరీ అందరి ఎదురుగా చంపాడు.
 ఈ కేసులో కూడా ఆరునెలల తర్వాత ఆయన సరెండర్ అయ్యాడు. అపుడెంతో మంది రాజకీయనాయకులు ఆయన వెంబడి పోలీస్ స్టేషన్ కు, కోర్టుకు వచ్చారు. నాలుగేళ్ల  తర్వాత 2005లో కేసునుకొట్టివేశారు. జైలనుంచి బయటపడ్డాడు. కేసులో సాక్షులంతా ఆయనకు అనుకూలంగా చెప్పారు. ఈ సాక్షులెవరనుకుంటున్నారు,  25  మంది పోలీసులు.  హత్యను కళ్లారా చూసిన వాళ్లు.  అంతా హాస్టైల్ అయి ఆయనకు అనుకూలంగా కోర్టులో వాంగ్మూలమిచ్చారు. మరీ ఆశ్చర్యమేమిటంటే హోంమంత్రి హత్య కేసు ఇన్వెస్ట్ గేటింగ్ అధికారి కూడా ఆయనకు అనుకూలంగా మారిపోయాడు. అదీ పోలీసుల మీద దూబేకి ఉన్నపట్టు.
హతుడు బిజెపి  మంత్రి. రాష్ట్రంలో అధికారంలో ఉండింది బిజెపి ప్రభుత్వం. ముఖ్యమంత్రి రాజ్ నాథ్ సింగ్. అయినాసరే, బిజెపి ప్రభుత్వం  కోర్టు హత్య కేసును కొట్టేసినపుడు అప్పీలుకు వెళ్లలేదు.ఆశ్చర్యం కదూ.   ది వైర్ కథనం ప్రకారం  మొదట్లో బిజెపి ప్రభుత్వం, , ఆ పైన 2002 మధ్య నుంచి వచ్చిన బిజెపి- బిఎస్ పి సంకీర్ణ ప్రభుత్వాలలో ఆయనకు బాగా అండ ఉండింది.
ఇపుడు ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వం వచ్చి ఆరేళ్లు పైబడి అవుతున్నా, ఇంతకాలం పోలీసులు దూబే జోలికి వెళ్ల లేకపోయారు. ఇపుడు,  అదీకూడా ఒక మర్డర్ కేసులో బిక్రూ గ్రామంలో తన ఇంటికి వచ్చిన పోలీసులను ఇళ్ల పైనుంచి కాల్చి చంపిన తర్వాతే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కదిలింది.దీని వెనక ఏవో రాజకీయాలున్నయాని చెబుతారు. బిజెపి ప్రభుత్వం రౌడీఇజాన్నిఅణచేస్తున్నదని, అందుకే యోగి ప్రభుత్వం కఠినంగా వ్యవహిరంచిందని బిజెపి ప్రచారం మొదలుపెట్టింది.
అయితే, 2001 నాటి సరేండర్ నాటకమే మళ్లీ ఆడేందుకు దూబే ప్రయత్నించారు. అది ఏ కారణానో బెడిసికొట్టింది. ఎన్ కౌంటర్ గా ఎండ్ అయింది.
దూబేకి పోలీస్ స్టేషన్లు, కేసులు, జైళ్లు  కొత్త కాదు. ఆయన మీద కేసులలా బుక్ అవుతాయి. ఇలా జైలుకు పోతాడు, పోయినట్టే పోయి వచ్చేస్తాడు. ఎన్నికేసులు బుక్ చేసినా అవి నిలువవు.  జైలు నుంచి ఎపుడు విడుదలయివచ్చినా ఆయనకు హీరో స్వాగతమే లభించేంది.
2005 హోంమంత్రి హత్య కేసులో వచ్చినపుడు ఆయన జైలు నుంచి భారీ వూరేగింపుతో SUV వాహనంలో వచ్చాడు . ఈ వాహనాన్ని సమకూర్చింది ఆ ప్రాంతంలోని ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త అని చెబుతారు. ఆయన కూడా దూబేతో సమానంగా అక్కడ పెద్దవాడయ్యాడు.  2017లో  తాను జైలునుంచి బయటకు వచ్చేందుకు సహకరించిన  ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలకు  ఆయన బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారని ది వైర్ రాసింది.
అంతేకాదు, ఉత్తర ప్రదేశ్ లో 25 మోస్ట్ వాంటెడ్ లిస్టులో గాని కాన్పూర్ జిల్లాకు చెందిన 10మోస్ట్ వాంటెడ్ లిస్టులో గాని వికాస్ దూబే పేరులేదని కూడా ది వైర్ రాసింది.
పోలీసు అధికారి దేవేంద్ర మిశ్రా హత్య
2019లో అర్జున్ దేవ్ తివారీ అనే ఐపిఎస్ ఆఫీసర్  ఎస్ పిగా కాన్పూర్ కు వచ్చారు. అంతకుముందు ఆయన ఇదే పదవిలో ముజఫర్ నగర్ లో ఉండేవారు. అక్కడ ఆయన  అత్యధికంగా ఎన్ కౌంటర్ చేసిన కీర్తి దక్కించుకున్నారు. ఆయన వస్తూనే  కాన్పూర్ లో కూడా ఎన్ కౌంటర్ జరుగుతుంది, ఒక వేళ జరగకపోయినా కనీసం వికాస్ దూబే కథ తివారీ చేతిలో ముగుస్తుందని అనుకున్నారు.
అయితే, దూబే వైపు కన్నెత్తి కూడా చూడకుండానే తివారీ టెన్యూర్ పూర్తి చేసుకుని వెళ్లిపోయాడు. అపుడు   దేవేంద్ర మిశ్రా ఒక పోలీసు అధికారి  దూబేకార్యకలాపాల గురించి ఎపుడూ తివారికి చెబుతూ వచ్చేవాడు. ఈ ఫిర్యాదులను తివారీ ఖాతరుచేయనేలేదు. తివారీ మొన్నజూన్ లోబదిలీ అయి వెళ్లిపోయారు.
ఇక లాభం లేదనుకుని తానే దూబే ని పట్టుకోవాలని మిశ్రా నిర్ణయించుకున్నాడు.పోయిన వారం జూలై 2 వ తేద రాత్రి కొందరు పోలీసులను వెంటేసుకుని ఆయన దూబే గ్రామానికి కొచ్చాడు.
అయితే, ఈ విషయం దూబేకి ఎవరో కూపి అందించినట్లు  ఇపుడంతా అనుమానిస్తున్నారు.
ఎందుకంటే, పోలీసుల ఇంట్లోకి ప్రవేశించేందుకు వీల్లేకుండా జెసిబి అడ్డంగా పెట్టారు. వీధి లైట్లు తీసేశారు. అంతా చీకటి. అయినా సరే, పోలీసులు తమ వాహానాలు దిగి నడుచుకుంటూ దూబై ఇంటివైపు నడిచారు. ఇంటి మీద దూబే మనుసులు తుపాకులు పట్టుకుని రెడీగా ఉన్నారు. పోలీసులు సమీపించగానే ఒక్క అన్ని వైపుల నుంచి ఒక్క పెట్టున కాల్పులు జరిపారు.  ఈ కాల్పుల్లో దేవేంద్ర మిశ్రా కూడా చనిపోయాడు. ఆయనతోపాటు మరొక ఏడుగురు పోలీసులు కూడా ప్రాణాలు పొగొట్టుకున్నారు(సోర్స్: ది వైర్).
దూబే నేరాల చిట్టాలో దొమ్మీలు, కిడ్నాపులు, ఖూనీలు,  బెదిరించి డబ్బు వసూలు చేయడం వంటి  నేరాలు లెక్కలేనన్ని కనబడతాయి.
ఇరవైయేళ్లపుడు ఒక  కుల తగాదా వచ్చినపుడు దూబే రెచ్చిపోయి అవతలి వాళ్లను చావ మోదాడు. అది దూబేని పోలీసుస్టేషన్ కీడ్చింది. అయితే, పెద్దలంతా కలసి దూబే మీద కేసు లేకుండా చేశారు. అలా ఆయన తొలిసారి పోలీస్ స్టేషన్ ఏమిటో చూశాడు.అంతేకాదు, కేసుల నుంచి బయటపడటమెలాగో కూడా కనిపెట్టాడు. ఈ జీవితరహస్యంతో దూబే నేర ప్రపంచంలోకి బయటపెట్టాడు. విజయవంతమ్యాడు.
ఆ మరుసటి సంవత్సరం 1991లో  ఐపిసి సెక్షన్ 323, 506 లకింద  ఆయన మీద తొలిసారి కేసులు నమోదయ్యాయి.
1992లో ఎప్ ఐ ఆర్ లనుంచి హత్య కేసుతో స్టేట్   హెడ్ లైన్ ల కెక్కాడు. ఆ యేడాది ఇద్దరు దళితులను హత్యచేసి ఉత్తర ప్రదేశ్ లో సంచలన వార్త అయ్యాడు. ఇది ఆయన మీద నమోదయిన తొలి ఖూనీ కేసు. ఇది కూడా చౌబేపూర్ పోలీస్ స్టేషన్ లోనే నమోదయింది.
తర్వాత ఒక భూవివాదంలో శివాలి టౌన్ లోని తారాచంద్ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్  సిద్ధేశ్వర్ పాండేని కాల్చిచంపాడు.ఆయన కేమీ కాలేదు. ఏ కేసూ నిలవలేదు.
ఆయన భార్య పేరు రీచా దూబే. గురవారం నాడు ఆమెను యూపి స్పెషల్ టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు , ఇంట్లో పనివాడిని కూడా అరెస్టు చేశారు.  కాన్పూర్ బిక్రూ గ్రామం వద్ద జరిగిన ఎనిమిది మంది పోలీసుల హత్య వెనక కుట్రలో రీచా పాత్రకూడా ఉందని పోలీసుల కథనం. గత శనివారండు నాడు ఉత్తర ప్రదేశ్ పోలీసులు బిక్రూలోని వాళ్ల ఇంటిని నేల మట్టం చేశారు.
జైల్లో ఉన్నా కూడా ఆయన ఖూనీలు మానలేదు. సొంత మేనల్లుడు అనురాగ్ ను హత్య చేయించే ప్లాన్ ను జైలు నుంచే వేశాడు. ఒక కేబుల్ ఆపరేటర్ ను చంపించాడు 2002లో విపరీతంగా భూములు దురాక్రమించాడు. కాన్పూర్ సిటితో పాటు శివ్‌రాజ్ పూర్, రిన్యాన్,బిల్హౌర్, చౌబే పూర్ లలో ఆయన తిరుగులేని రౌడీ అయ్యాడు. దీనికంతటికి కారణం ఆయనకు అన్ని పార్టీలలో అయినవాళ్లుండటమే. అందుకే  శివ్‌రాజ్ నగర పంచాయితీకి జైలునుంచే పోటీ చేసి గెలుపొందగలిగాడని ఇండియా టుడే రాసింది.