కోవిడ్ కంటే స్కూళ్లను మూసేస్తేనే నష్టమంటున్న నిపుణులు

కరోనా వల్ల పిల్లల్లో మరణాలు చాలా తక్కువ. పదిలక్షల జనాభాలో ఒకరుకూడా ఉండరు. కాని ప్రతిసంవత్సరం  రోడ్డు ప్రమాదాలవల్ల, ఇతర కారణాలవల్ల చనిపోతున్న పిల్లలే  ఎక్కువ. కిడ్నాప్ లు, రోడ్డు ప్రమాదాలు ఉన్నాయని పిల్లలను బయటకు పంపడం  మానేస్తారా? అలాంటపుడు వాటికంటే చాలా తక్కువ మరణాల రేటున్న కరోనాకు భయపడి పాఠశాలలను మూసేయడం ప్రమాదకరమని ఇంగ్లండుకు చెందిన నిపుణు మాల్కోమ్ కేండ్రిక్ వాదిస్తున్నారు.
కరోనా మహమ్మారి మొదలయి  ఆరునెలల దాటడంతో పాఠశాలలను ఎపుడు పున:ప్రారంభించాలనే దాని దేశవ్యాపితంగా ఉత్కంఠ నెలకొంది. పాఠశాలలను తెరవాలా వద్దా, పాఠశాలలను తెరవడం పిల్లలకు, టీచర్లకు సురక్షితమమా అనే దాని మీద ప్రపంచం యావత్తూ  చర్చసాగుతూ ఉంది. పాఠశాలలు తెరవాలని కొన్ని ప్రభుత్వాలు సూచిస్తుంటే, తల్లితండ్రులు మాత్రం తెరిస్తే పిలల్లకు భద్రత ఉంటుందా అనే ఆందోళనతో ఉన్నారు.
కొన్ని  యూరోపియన్ దేశాలు పాఠ శాలలను ప్రారంభించాయి. పాఠ శాలలు ప్రారంభించాక  కరోనా పెరగలేదని ఫ్రాన్స్ ప్రకటించింది.  యూరోప్ బయట ఇజ్రేల్ అనుభవమే కొద్దిగా భిన్నంగా ఉంది.  కొన్ని చోట్ల ఇజ్రేల్ స్కూళ్ల కరోన వ్యాపించడంతో మళ్లీ మూసేందుకు ఉత్తర్వులిచ్చారు.  యూరోప్ మాత్రం పాఠశాలలు తెరిచి ముందుకు దూసుకుపోతున్నది. స్కూలు పంపించడం కంటే పిల్లలను ఇంటి దగ్గిర ఉంచుకోవడే రిస్కి అని ఫ్రాన్స్ ప్రకటిచింది.
లాక్ డౌన్ ఎత్తివేస్తూనే 22 యూరోప్ దేశాలలో మొదట తెరిచింది కిండర్ గార్టెన్, ప్రయిమరీ, సెకండరీ స్కూళ్లనే.
ఈ నేపథ్యంలో  ఇంగ్లండుకు చెందిన ప్రముఖ  నిపుణుడు డాక్టర్ మాల్కోమ్ కేండ్రిక్ (Malcom Kendrick)   కరోనా భయంతో పాఠశాలలను తెరవడం కంటేమూసేస్తేనే పిల్లలకు నష్టమంటున్నారు. పిల్లలకు, టీచర్లకు పాఠశాలలు తెరిస్తే వచ్చే నష్టం చాలా  తక్కువ అనేది మాల్కోమ్ కేండ్రిక్ అభిప్రాయం.
ఆయన బ్లాగ్  ఇక్కడ ఉంది.
ఇంతగా భయపడటం సమంజసమా?
అవసరయిందానికంటే ఎక్కువగా కరోనా గురించి ప్రపంచంభయపడుతూ ఉందా అని  డాక్టర్ కేండ్రిక్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వల్ల ఎవరికి నష్టం? ఇంతవరకు వృద్ధులకు, తీవ్రమయిన కోమార్బిడిటీస్ ఉన్న వారికే కరోనా వల్ల  ప్రమాదం ఉందని తెలిసిందే. ముఖ్యంగా ఇరవై లోపు వయసున్న వారికి కరోనా రిస్క్ బాగా తక్కువ, అమాటకొస్తే లేనేదని కేండ్రిక్ చెబుతున్నారు. కేండ్రిక్ ఇంగ్లండ్ నేషనల్  హెల్త్ సర్వీస్ జనరల్ ప్రాక్టిషనర్ గా ఉంటున్నారు.  Doctoring Data- How to Sort Out Medical Advice from Medical Nonsense అనే పుస్తకం కూడా ఆయన రాశారు.

కరోనా పాండెమిక్ మొదలయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంగ్లండు, వేల్స్ లలో  ఇరవై సంవత్సరాలలోపు కరోనా బారిన పడి చనిపోయిన వారు కేవలం 14 మంది మాత్రమే. గత నెలలో అసలు ఈ వయోబృందంలో ఎవరూ చనిపోలేదు. ఇంకా స్పష్టంగా చెబితే, 20 సంవత్సరాలలో కరోనా బారినపడిన వారిలో మరణాలు మిలియన్ కు ఒక్కరు మాత్ర మే. కుటుంబానికి సబంధించి ఒక్క మరణమయినా విషాదమే.  చిన్నపిల్లలు చనిపోవడం భరించలేనంత బాధాకరమయిందే. ఇది కూడా జీరో ఉంటే బాగుంటుంది. నిజానికి, మిలియన్ జనాభాకు ఒకరు చనిపోయ ప్రమాదం అంటే జీరో మరణాలకిందే లెక్క. ఇదే వయోబృందంలో ప్రతి యేటా ఈతకు పోయిన నదుల్లో మునిగిచనిపోయే వారు, రోడ్డు ప్రమాదాలలో చనిపోయేవారు, ఆత్మహత్య చేసుకునే వారు ఎక్కువ. ఈ వయోబృందంలో కరోనా రిస్క్ దాదాపు జీరో అయినపుడు పాండెమిక్ పేరుతో పాఠశాలలను మూసేయడమేమిటని ఆయన ఆశ్చర్య పోతున్నారు.భయం కరోనానుంచి పిల్లలకు రక్షణ కల్పించలేదని ఆయన అంటున్నారు. నిజానికి విమాన సంస్థలు కూడా ఇంతకంటే ఎక్కువ మరణాలను అంగీకరించే విమానాలను నడపుతాయి. మిలియన్ కు ఒక్కమరణయినా రిస్క్ అనుకుంటే విమానాలు నడపడటమే సాధ్యం కాదుఅని  కేండ్రిక్ చెబుతున్నారు.
Dr Malcom Kendrick
పిల్లల్లాగే టీచర్లకు కూడా రిస్క్ తక్కువ అని ఆయన చెబుతున్నారు.  ఇంగ్లండులో టీచర్ సగటు వయసు నలభై సంవత్సరాల లోపే. కరోనా వల్ల 20 -40 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో మరణాల రిస్క్ కొంచెం  ఎక్కువే అయినా అది కూడా చాలా తక్కువే. ఇంగ్లండు, వేల్స్ లలో కరోనా పాండెమిక్ మొదలయ్యాక ఈ వయోబృందంలో మరణించిన వారి సంఖ్య కేవలం 143 మంది మాత్రమే. గత నెలలో కేవలం   అయిదుగురు మాత్రమే చనిపోయారు. ఇది అరవై వేలలో ఒకరికంటే తక్కువ రేటుతో సమానం. ప్రతి సంవత్సరం ట్రాఫిక్ ప్రమాదాలో ఇంతే మంది చనిపోతున్నారు. ఇదే అమెరికాలో  తీసుకుంటే ఒక ప్రతి 14 వేలకు ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నాడు.
 ఇంగ్లండులో అయిదు లక్షల మంది టీచర్లున్నారు. పైన పేర్కొన్న రిస్క్ ప్రకారం ఆయన ఒక పరిస్థితి అంచనా వేశారు.  అదికూడా  టీచర్లకు, పిల్లలకు ఒకే రకం రిస్క్ ఉందని భావిస్తూ ఈ అంచనా వేశారు.
ఇపుడు ఇంగ్లండులో పాఠశాలలను పున:  ప్రారంభించారనుకుందాం. మళ్లీ కరోనా పాండెమిక్ మొదలయిందనుకుందాం. పై లెక్కల ప్రకారం 8 మంది టీచర్లు కరోనాతో చనిపోవాలి.  దాదాపు పిల్లలు కూడా అంతే మంది చనిపోతారు. ఇదెపుడు?  స్కూళ్లలో ఉన్నవాళ్లంతా కరోనా బారినపడ్డారనుకున్నపుడు. ఇది భయపడాల్సినంత ప్రమాదకరమయిన విషయమా. ఒకరిద్దరుచనిపోయే ప్రమాదం ఉందని స్కూళ్లని మూసేసినపుడు, ప్రమాదాలకు గురవుతున్నారని, ఎక్స్ కర్షన్ లలో చనిపోతున్నారని లేదా కిడ్నాప్ లు జరుగుతున్నాయని పిల్లలను బయటకు పంపకుండా మానేస్తామా?
ప్రతిసంవత్సరం ఎక్కవ మంది పిల్లలను బలిగొంటున్న ప్రమాదాలను, కిడ్నాపులను విస్మరించి,  కోవిడ్ వస్తుందని భయపడి స్కూళ్లకు పంపడం మానేస్తేనే ఎక్కువ ప్రమాదమని కేండ్రిక్ హెచ్చరిస్తున్నారు. స్కూళ్లని  మూసేయడం వల్ల కోవిడ్ కంటే ఎక్కవ ప్రమాదముందనేది  ఆయన ఇస్తున్న సలహా.
ఇంగ్లండులో వారానికొక పిల్లవాడు నిర్లక్ష్యం వల్లనో, డొమెస్టిక్ అబ్యూజ్ వల్లనో చనిపోతున్నాడు. ఇది కోవిడ్/లాక్ డౌన్ మరణాల కంటే నాలుగు రెట్లు ఎక్కువ.
భారతదేశంలో చర్చ
ఈ నేపథ్యంలో భారత్ లో పాఠశాలలను సెప్టెంబర్ –నవంబర్ లలో  దశల వారీగా రీ-ఓపెన్ చేసేందుకు కేంద్రం యోచిస్తూ ఉంది.  మొదటు 10-12 తరగులకు క్లాసులుప్రారంభించింది, తర్వాత 6నుంచి 9వ తరగతలకు తెరిస్తే ఎలా ఉంటుందని కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర హర్షవర్దన్ నాయకత్వంలోని కోవిడ్ మంత్రుల బృందంచర్చలుజరిపింది. రోజువిడిచి రోజు తరగతుల నిర్వహించే విధానం ఇందులో చర్చకు వచ్చింది. ఒక క్లాసులో నాలుగు సెక్షన్లు ఉంటే ఒకరోజు రెండు సెక్షన్లు, మరొక మిగతా రెండు సెక్షన్లు తరగతులకు వచ్చేలా ఏర్పాటు చేసుకొవచ్చని  ఈ బృందంసూచిస్తున్నది. ఉదాహరణకు ఒక పాఠశాలలో 10వ తరగతికి నాలుగు సెక్షన్స్ అన్నాయనుకుంటే  రెండు సెక్షన్లు ఒక రోజు తరగతులు నిర్వహిస్తారు.   మిగతారెండు సెక్షన్లు మరుసటి రోజు నిర్వహిస్తాయి.  ఇలా రోజు విడిచి రోజు సెక్షన్లకు క్లాసులండాలి. తరగతుల సమయాన్ని  కూడా  అయిదారు గంటలు కాకుండా రెండుమూడు గంటలకు తగ్గించాలని కూడా కేంద్రం అభిప్రాయపడుతూ ఉంది. ఇలా తరగతుల సమాయాన్ని తగ్గించడం వల్ల పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులున్న తరగతులకు షిప్ట్ సిస్టమ్ అమలు చేయవచ్చు.
అన్ని పాఠశాలలు షిఫ్టుల పద్దతిలో నడుస్తాయి. ఒక షిఫ్ట్ ఉదయం 8 నుండి 11 వరకు ఉంటే..  మరొకటి మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు ఉంటుంది. ఇక మధ్యలో ఒక గంట శానిటైజేషన్ కోసం ఉంటుంది. బోధనా సిబ్బంది, విద్యార్థులు కలిపి 33 శాతం సామర్ధ్యంతో పాఠశాలలను  నడపాలని సూచించారు.
ఇలాగే ప్రిప్రైమరీ, ప్రైమరీ పాఠశాలలకు తరగతులు ప్రారంభించాల్సిన అవసరం లేదని ఈ బృందం అభిప్రాయపడింది. ఈ నెలాఖరులో గా ఈ విధానం మీద తుది నిర్ణయం తీసుకుని నోటిఫై చేయాలని కేంద్రం భావిస్తున్నది.
రాష్ట్రాలేమంటున్నాయి
పాఠశాలలను పున: ప్రారంభించడం, కరోనా నేపథ్యంలో స్కూళ్లలో తీసుకురావలసిన చర్యలమీద తల్లితండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించి చెప్పాలని ఆ మధ్య కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. దీనికి పలు రాష్ట్రాలు తాము ఎప్పటినుంచి పాఠశాలలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామో తెలియ చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 5 నుంచి తాము పాఠశాలను ప్రారంభించేందు సిద్ధమని కేంద్రానికి తెలియ చేసింది. మితగా రాష్ట్రాలకు సంబంధిం ఢిల్లీ ప్రభుత్వం ఆగస్టు, హర్యానా ఆగస్టు 15,  కర్నాటక  సప్టెంబర్ 1,  రాజస్థాన్ సెప్టెంబర్, కేరళ  ఆగస్టు 31, అస్సాం  సెప్టెంబర్, బీహార్  ఆగస్టు 15, లదాక్  ఆగస్టు 31 తేదీలు సూచించాయి.  మహారాష్ట్ర, బెంగాల్, యుపి  లు ఇంకా తేదీలను ఖరారుచేయలేదు.
తల్లితండ్రులు నిరాసక్తత
పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు తల్లితండ్రులింకా సుముఖంగా లేరు. ఒకవైపు విద్యాసంవత్సరం దెబ్బతింటున్నదనే ఆందోళన వున్నా దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో పిల్లలను పాఠశాలలకు పంపిస్తే ఏమవుతందోనని వారు భయపడుతున్నారు.