Home Features ప్రపంచంలో మరణ శిక్షఅమలులో చైనాయే టాప్, 162 దేశాల్లో ఈ శిక్ష రద్దయింది

ప్రపంచంలో మరణ శిక్షఅమలులో చైనాయే టాప్, 162 దేశాల్లో ఈ శిక్ష రద్దయింది

291
0
నిర్భయ అత్యాచారం కేసులో మరణ శిక్ష ఎదుర్కొంటున్న అక్షయ్ ఠాకూర్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ సుప్రీంలో డిసెంబర్ 17వ తేదీన విచారణకు రానుంది.
ఈ సుప్రీం తోసిపుచ్చితే ఆయనకు ఉరి శిక్ష అమలవుతుంది.
నిర్భయ కేసు ఇతర దోషులయిన పవన్ గుప్తా, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ మరణి శిక్ష రివ్యూ పిటిషన్లను గత ఏడాది జూలై 9న సుప్రీం ఇప్పటికే తోసిపుచ్చింది.
ఈనెల 19వ తేదీన తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య వీరిని ఉరితీసే అవకాశం ఉంది.
నేపథ్యంలో మరణ శిక్ష మరొక సారి దేశంలో చర్చకు వచ్చింది.
భారత దేశంలో ఒక చిత్రమయిన పరిస్థితి ఏర్పడింది. మహిళల మీద అత్యాచారం చేసే వారిని ఉరితీయాలని, ఎన్ కౌంటర్ చేసిచంపాలనే సెంటిమెంట్ బలంగా కనిపిస్తూ ఉంది.అయితే ఇది రూల్ ఆఫ్ లా (Rule of Law)కు వ్యతిరేకమని, ఇలా శిక్షించే అధికారాన్ని పోలీసుకు ఇస్తే రూల్ ఆఫ్ లా ఓడిపోయింనట్లువుతుంది. కొంంతమంది ఎన్ కౌంటర్ లను వ్యతిరేకిస్తున్నారు.
మరికొందరు 21వ శతాబ్దంలో కూడా మరణ శిక్షలేమిటని ఐక్య రాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గ్యుట్రెస్ చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ మరణ శిక్షను వ్యతిరేకిస్తున్నారు.
ప్రపంచ వ్యాపితంగా మరణశిక్ష మీద చర్చ సాగుతూ ఉంది. కొన్నిదేశాలు మరణశిక్షను పూర్తి గా నిషేధించాయి. 142 దేశాలలో మరణ శిక్షను చట్టపరంగానో, అమలుపరంగానో  రద్దు చేశాయి. కేవలం చట్టం ప్రకారమే అయితే 106 దేశాలు మరణ శిక్షను రద్దు చేవాయి.. ఈ దేశాలలో నేరమేదయినా మరణ శిక్ష ఉండదు. అయితే, 50 దేశాలలో మరణ శిక్ష అమలులో ఉంది. ఇందులో భారతదేశంలో పాటుఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా, యుఎస్, ఇరాన్, జపాన్, కువాయిత్, బంగ్లాదేశ్, ఇరాక్, ఇండేనేషియా, యుఎఇలు కూడా ఉన్నాయి.
భారతదేశంలో మరణ శిక్ష అమలు చేయడం చాలా తక్కువ. ఈ మధ్యకొద్ది గా ఎక్కువయిందనాలి. 1991 నుంచి ఇప్పటి వరకు 26 మందిని మాత్రం ఉరి తీశారు. ఇందులో తాజా 2015లొ యాకూబ్ మెమాన్ ను ఉరితీయడం జరిగింది. మెమాన్ 2013 ముంబాయ్ పేలుళ్ల నిందితుడు.
ఇపుడు నిర్భయ అత్యాచారం కేసులోనిందితుడయిన ఠాకూర్ మరణ శిక్ష రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టుకు ముందుకు వస్తున్నది. నిజానికి ఈ కేసుల్ 2017లోనే మరణ శిక్ష విధించారు.
సుప్రీం కోర్టుకు చెందిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం అక్షయ్ పిటిషన్ ను పరిశీలించనుంది. భారతదేశంలో వాతావరణ కాలుష్యం వల్ల ఆయుష్సు తగ్గిపోతున్నపుడు ప్రత్యకంగా ఉరి తీసి చంపాలనుకోవడం ఏమిటని ఆయన లాయర్ ప్రశ్నిస్తున్నారు.
2012లో ఇదే రోజు న అంటే డిసెంబర్ 16-17 రాత్రి నిర్బయ అనే పారామెడిక్ విద్యార్థినిని ఒక బస్సులో రేప్ చేశారు. ఈ నేరంలో ఆరుగురు పాల్గొన్నారు. తర్వాత ఆమె రోడ్డు మీదకు విసిరేసి పోయారు.
ఇపుడు హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దశ అత్యాచారం, హత్య కేసుతో మరొక సారి దేశం కుతకుత లాడింది.
అయతే, నేరమేదయినా సరే మరణ శిక్ష సరైందికాదని మానవ హక్కుల సంఘాలన్నీ చెబుతున్నాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మరణ శిక్షను ‘చివరికి అమానుష, మానవజాతిని దిగజార్చే శిక్ష’ గా వర్ణించింది.
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం భారతదేశంలో మరణ శిక్ష విధించడం ఎక్కువగానే ఉన్నా అమలుచేయడం చాలా తక్కువ.గత ఏడాది దేశంలో 109 మందికి మరణ శిక్ష విధించారు. 2016లో 136 మందికి మరణ శిక్ష పడిందని ‘Death Sentences and Executions 2017′ లో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. 2017 లో 51 మందికి హత్య కేసులలో ఉరి శిక్ష పడింది. 2016లో కంటే ఇది బాగ తక్కువ. మొత్తంగా భారతదేశంలో 2018 నాటికి మరణ శిక్షను ఎదుర్కొంటున్నవా ళ్లు 371 మంది ఉన్నారు.
2018లో 2017లో దాదాపు ఒక లాగే ప్రపంచ దేశాలలో మరణ శిక్షలు అమలు జరిగింది. అమ్నెస్టీ లెక్కల ప్రకారం 2018లో 54 దేశాలలో అమలయిన మరణ శిక్షలు 2531. 2017లో 2591 మరణశిక్షలు అమలయ్యాయని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే Death Penalty Information Centre  అమ్మెస్టీ ని ఉటంకిస్తూ చెప్పింది.
 అయితే, ప్రపంచంలో ఎక్కువగా మరణ శిక్షలు అమలుచేసేదేశం చైనా. 2018లో చైనా 690 మందికి మరణ శిక్ష విధించిందని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ఇది నిజానికి ఇంతకంటే ఎక్కువే మందికి మరణ శిక్షకు గురయి ఉంటారని చెబుతారు. 2018లో చైనాతో పాటు ఇరాన్, సౌదీ అరేబియా, వియత్నాం, ఇరాక్ లలో అత్యధిక సంఖ్యలు మరణ శిక్షలు అమలుజరిగాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది.
ఆమ్నెస్టీ వివరాల ప్రకారం ప్రపంచ వ్యాపితంగా 19,336 మంది మరణశిక్ష ఎదుర్కొంటున్నారు.
అయితే, మరొక బ్యాచ్ దేశాలు బుర్కినా ఫాసో, గినీ, బెనిన్, మడగాస్కర్ లు ఇటీవల మరణ శిక్షను రద్దు చేశాయి.